planing
-
అనివార్య ఖర్చులు, సరదా ఖర్చులు, పొదుపు
ట్రెండ్స్ స్థిరంగా ఉండనట్లే ఆలోచనలు, అభిప్రాయాలు కూడా స్థిరంగా ఉండవు. జెన్ జెడ్, మిలీనియల్స్ కొత్త ప్రయాణం కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? యోలో(వైవోఎల్వో–యూ వోన్లీ లివ్ వన్స్) సెగ్మెంట్లో ఉన్న యువతరం అవసరానికి మించి ఖర్చు చేయడానికి తప్ప‘ఆర్థిక భద్రత’కు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేది కాదు. అయితే ఈ ధోరణిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. ‘యోలో’ నుంచి 50–30–20 కాన్సెప్ట్ వైపు ప్రయాణించడానికి యువతరం ఆసక్తి చూపుతున్నారు... సినిమాల గురించి తప్ప మరో లోకంతో సంబంధం లేనట్లుగా ఉండే మిలీనియల్స్, జెన్ జెడ్ ఇప్పుడు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ నుంచి పబ్లిక్ప్రావిడెంట్ ఫండ్ వరకు ఎన్నో విషయాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) అనేది మ్యూచువల్ ఫండ్స్‌లో నిర్ణీత మొత్తాన్ని నెలవారీ లేదా త్రైమాసికం చొప్పున పెట్టుబడిగా పెట్టే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. పబ్లిక్ప్రావిడెంట్ ఫండ్(పిపిఎఫ్) అనేది ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, ట్యాక్స్ బెనిఫిట్స్‌ను అందించే దీర్ఘకాలిక పొదుపు పథకం. పదిహేను సంవత్సరాల లాక్–ఇన్ వ్యవధిని కలిగి ఉన్న ప్రభుత్వ పథకం ఇది.‘హెల్త్ ఇన్సూరెన్స్’ అనే మాట వినబడగానే ‘ఇది నాకు సంబంధించిన విషయం కాదు’ అన్నట్లుగా పట్టించుకునే వారు కాదు చాలా మంది. ‘హెల్త్ ఇన్సూరెన్స్’ అనేది వయసు మళ్లిన వారికి సంబంధించిన విషయం అన్నట్లుగా ఉండేవారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఎర్లీ ఏజ్‌లోనే హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తగిన అవగాహనతో ఉన్నారు. అన్ ఎక్స్పెక్టెడ్ మెడికల్ సిచ్యువేషన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక బడ్జెట్ కేటాయించుకుంటున్నారు. యాన్యువల్ హెల్త్బడ్జెట్ను ప్లాన్‌చేసుకుంటున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ‘పర్సనల్ యాక్సిడెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్’పై ఆసక్తి చూపుతున్నారు. ‘సరైన ఆరోగ్య బీమా పథకాన్ని ఎంపిక చేసుకోవడం అనేది జీవన ప్రయాణానికి దిక్సూచి లాంటిది’ అనే మాటను దృష్టిలో పెట్టుకొని హడావిడిగా కాకుండా ఆచి తూచి సరిౖయెన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకుంటున్నారు. ‘ఫైనాన్షియల్ ప్లాన్’ అనే మాట వినబడగానే ఒకప్పుడు యువతరం నోటి నుంచే వచ్చే మాటలు... ‘అబ్బే! అంత టైమ్ లేదు’ ‘ఫైనాన్షియల్ విషయాలు నాకు బొత్తిగా తెలియవు’ ఇప్పుడు మాత్రం ‘బొత్తిగా తెలియదు’ అనుకునే విషయాలపై టైమ్ చేసుకొని మరీ ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో మిలీనియల్స్, జెన్ జెడ్‌ను బాగా ఆకట్టుకున్న కాన్సెప్ట్ 50–30–20 ‘50–30–20’ కాన్సెప్ట్ ప్రకారం సం΄ాదించే జీతంలో అనివార్య ఖర్చులకు 50 శాతం ఖర్చుచేయాలి. ఇంటి అద్దె నుంచి భోజన ఖర్చు వరకు ఇందులో ఉంటాయి. వ్యక్తిగత అవసరాలు, సరదాల కోసం 30 శాతం ఖర్చు చేయాలి. ట్రెండీ దుస్తులు కొనుక్కోవడం నుంచి సినిమాలు చూడడం వరకు ఇందులో వస్తాయి. 20 శాతం మాత్రం తప్పనిసరిగా పొదుపు చేయాలి. ‘మిలీనియల్స్‌లో చాలామంది ఇన్సూరెన్స్‌ల గురించి పట్టించుకోవడం లేదు. అనారోగ్యం లేదా ప్రమాదం జరిగిన సందర్భాల్లో మన ఖజానా అంతా ఖాళీ అవుతుంది. దిక్కు తోచని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే లైఫ్, హెల్త్, ఆటో ఇన్సూరెన్స్‌పై మిలీనియల్స్ తప్పనిసరిగా దృష్టి పెట్టాలి’ అంటున్నాడు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ శరద్ కోహ్లీ. శరద్ సలహా చదివి మారిన వారిలో తేజస్విని ఒకరు. దిల్లీకి చెందిన తేజస్వినికి ఇన్సూరెన్స్ పాలసీల గురించి ఆసక్తి, అవగాహన లేదు. ఇప్పుడు మాత్రం రకరకాల పాలసీల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఉద్యోగాలు చేస్తున్న మిలీనియల్స్, జెన్ జెడ్ దగ్గర ‘ఇన్వెస్ట్మెంట్ ఫర్ రిటైర్మెంట్’ ప్రస్తావన తెస్తే పెద్దగా నవ్వుతారు లేదా ‘రిటైర్మెంట్ గురించి ఇప్పటి నుంచే ఆలోచించడం ఎందుకు!’ అన్నట్లుగా మాట్లాడుతారు. అయితే ఈ ధోరణిలో కూడా మెల్లగా మార్పు వస్తుంది. ‘రిటైర్మెంట్ లేదా భవిష్యత్ కోసం దాచుకున్న డబ్బు అత్యవసర సమయాల్లోనే కాదు విదేశీ ప్రయాణం చేయాలి లాంటి చిరకాల కలలను నిజం చేసుకోవడానికి ఉపయోగపడవచ్చు. ప్రతి ఉద్యోగి ఏదో ఒకరోజు రిటైర్ కావాల్సిందే. కొన్ని సమయాల్లో ముందస్తు పదవీ విరమణ తప్పనిసరి కావచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ ఫర్ రిటైర్మెంట్ను తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి’ అంటున్నాడు శరద్ కోహ్లీ. స్టాక్ మార్కెట్ నుంచి మనీ మేనేజ్మెంట్ వరకు సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్కు మాత్రమే యువతప్రాధాన్యత ఇస్తుంది. స్టాక్‌మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లాంటి మాటలు వినబడితే దూరంగా పారిపోయే వారిని కూడా తన మాటలతో, రాతలతో ఆకట్టుకొని నాలుగు మంచి విషయాలు చెబుతుంది నేహా నగార్. ఎంబీయే చేసిన నేహా స్టార్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లూయెన్సర్గా యువతలో ఎంతోమంది ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చింది. స్టాక్‌మార్కెట్, క్రిప్టోకరెన్సీ, ట్యాక్స్యేషన్, ట్రేడింగ్ నుంచి మనీ మేనేజ్మెంట్ వరకు ఎన్నో విషయాలను సులభంగా అర్థం అయ్యేలా చెబుతుంది. ‘మనం ఎలా చెబుతున్నాం అనేదానిపై అవతలి వారి ఆసక్తి ఆధారపడి ఉంటుంది. ఆకట్టుకునేలా, సులభంగా అర్థమయ్యేలా చెప్పగలితే వారు మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు’ అంటుంది నేహా నాగర్. -నేహా నాగర్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ -
ప్రణాళికతోనే కెరీర్ బంగారం
మనీష్ అరోరా (46) ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త. ఆయనకు 18 ఏళ్ల కుమార్తె ‘ఆద్య’ ఉంది. ఆమెను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాలన్నది అరోరా కల. కుమార్తెకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. దీంతో ఆద్య రెండు నెలల క్రితమే యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్(చికాగో)లో సైకాలజీలో అండర్‌గ్రాడ్యుయేషన్ సీటు సంపాదించింది. అందుకు కావాల్సిన వ్యయాలను అరోరా ముందు చూపుతో సమకూర్చుకున్నారు. ఆద్య చదివే కోర్స్ వ్యయం భారీగా ఉన్న ప్పటికీ, ముందస్తు స్పష్టత అరోరాకు మార్గాన్ని చూపించింది. తమ పిల్లలకు వీలైనంతలో అత్యుత్తమ విద్యను అందించాలని అధిక శాతం మంది తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ, ఆచరణలో అంత సులభం కాదు. ప్రణాళికతోనే ఇది సాధ్యం. కెరీర్ ఆప్షన్లు, చేయాల్సిన కోర్స్‌లు, అయ్యే వ్యయం, కాల వ్యవధి ఇలా పలు అంశాలపై స్పష్టత, ప్రణాళికతోనే విజయం సాధించగలరు. దీనిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించే కథనమే ఇది. బోలెడు ఆప్షన్లు గతంతో పోలిస్తే ఉన్నత విద్యలో ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్ కోర్సులు చదవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు భిన్నమైన కోర్సులు ఎంపిక చేసుకుంటుంటే, విదేశీ విద్య కోసం వెళ్లే వారి సంఖ్య కూడా ఏటేటా పెరుగుతూ పోతోంది. ముఖ్యంగా నూతన తరం కోర్సులకు సంబంధించి కెరీర్ ఆప్షన్లు భారీగా అందుబాటులోకి వస్తున్నాయి. ఫైనాన్స్, డేటా అనలైటిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, కాగ్నిటివ్ సైన్స్, మెరైన్, సైకాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్ ఇవన్నీ ఆకర్షణీయమైన కెరీర్ ఆప్షన్లుగా మారుతున్నాయి. ‘‘గేమ్ డిజైనింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్)కు ఆదరణ పెరుగుతోంది. ఎక్కువ శాతం కెరీర్ ఆప్షన్లు సోషల్ మీడియా నుంచి ఉంటున్నాయి. వీడియో ఎడిటింగ్‌కు సైతం డిమాండ్ పెరుగుతోంది’’అని మ్నెమోనిక్ ఎడ్యుకేషన్ అండ్ ఓవర్సీస్ అడ్మిషన్స్ సంస్థ అధినేత శిరీష్ గుప్తా తెలిపారు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, డేటా సైన్స్, రెన్యువబుల్ ఎనర్జీ, కంటెంట్ తయారీ వంటివన్నీ బంగారం వంటి అవకాశాలను తెచ్చి పెడుతున్నాయి. ‘‘వచ్చే పదేళ్ల కాలానికి సంబంధించి 85 శాతం ఉద్యోగాలు ఇంకా ఆవిష్కృతం కావాల్సి ఉంది. సంప్రదాయ ఉద్యోగాల నుంచి నిరంతరం మారాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. టెక్నాలజీతో సంబంధం లేని ఉద్యోగం దాదాపు ఉండకపోవచ్చు. అది రిటైల్ అయినా లేక ఈ కామర్స్ అయినా కృత్రిమ మేథ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తుంది’’అని టీమ్‌లీజ్ ఎడ్యుటెక్ సహ వ్యవస్థాపకురాలు నీతి శర్మ తెలిపారు. అంటే సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగై పోతాయని అనుకోవద్దు. అస్థిరతలు వద్దనుకునే వారు ఇంజనీరింగ్, మెడిసిన్ వైపు వెళుతుండడాన్ని గమనించొచ్చు. ఇంజనీర్లు, డాక్టర్లు, పరిశోధకులు, చరిత్రకారుల అవసరం భవిష్యత్తులోనూ ఉంటుంది. కానీ, ఆటోమేషన్, ఏఐ కొన్ని రకాల ఉద్యోగాలకు ముప్పుగా మారడం ఖాయం. లోగో, గ్రాఫిక్ డిజైనింగ్ పనులు ఆటోమేషన్‌కు మారుతున్నాయి. ట్రాన్స్‌లేటర్లు, టెలీ మార్కెటర్ల ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తోంది. యంత్రాలు అంత సులభంగా చేయలేని నైపుణ్యాలు, కోర్సులను చేసే దిశగా పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని గుప్తా సూచించారు. విద్య, ఉపాధిలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడం, తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం సాయంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైతే మెరుగైన విద్యా అవకాశాల కోసం విదేశాలకు పంపించడాన్ని కూడా పరిశీలించాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొదటి పుట్టిన రోజు నుంచే.. పిల్లల ఉన్నత విద్యకు కావాల్సినంత సమకూర్చుకునేందుకు ఉన్న సులభ మార్గం వారి మొదటి పుట్టిన రోజు నుంచి ఆరంభించడమే. దీనివల్ల పెట్టుబడులు వృద్ధి చెందడానికి తగినంత సమయం మిగిలి ఉంటుంది. నెలవారీ పరిమిత మొత్తంతో పెద్ద నిధిని సమకూర్చుకోగలరు. ఇందుకు గాను ఫైనాన్షియల్ అడ్వైజర్, ఎడ్యుకేషన్ కన్సల్టెంట్‌ను ముందే సంప్రదించి తమకు అనుకూలమైన (తగిన) ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. కేవలం ఉన్నత విద్య అనే కాకుండా వారి వివాహాలకు సంబంధించి కూడా విడిగా ప్రణాళిక అవసరం. భారీ ఖర్చులకు సంబంధించి ముందు నుంచే ఇన్వెస్ట్ చేయడం వల్ల నెలవారీ బడ్జెట్‌పై పెద్ద భారం పడదు. పెట్టుబడుల్లో అధిక శాతాన్ని ఈక్విటీలకు కేటాయించుకోవాలి. 10–15 ఏళ్ల కాలంలో ఈక్విటీలు మెరుగైన రాబడులను ఇవ్వగలవు. కొంత మొత్తాన్ని హైబ్రిడ్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన (కుమార్తెలకు) వంటి సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవాలి. పిల్లల ఉన్నత విద్యకు మిగిలి ఉన్న కాల వ్యవధి, ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలి, ఎంత రాబడులు అనే అంశాల ఆధారంగా నిపుణులు వివిధ సాధనాలను సూచిస్తుంటారు. తమకు ఏదైనా జరగరానిది జరిగితే పిల్లల విద్య ఆగిపోకూడదు. అందుకని మెరుగైన కవరేజీతో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలాగే, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో పిల్లలను కూడా భాగం చేయడం, లేదంటే వారి పేరిట ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం ఎంతో అవసరం. స్కాలర్ షిప్/విద్యారుణం దేశ, విదేశీ యూనివర్సిటీలు చాలా వరకు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఆఫర్ చేస్తున్నాయి. యూనివర్సిటీ వెబ్సైట్లను సందర్శించి ఇందుకు సంబంధించి వివరాలు తెలుసుకోవచ్చు. విదేశాల్లోనూ చాలా యూనివర్సిటీలు స్కాలర్షిప్లు, ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. పేరొందిన ట్రస్ట్‌లు కూడా విద్యార్థులకు స్కాలర్షిప్లను ఆఫర్ చేస్తున్నాయి. ఒకవైపు తమ వంతు ఇన్వెస్ట్ చేస్తూనే, మరోవైపు స్కాలర్‌షిప్‌లకు సంబంధించి ఉన్న మార్గాలను తెలుసుకుని ఉండడం మంచిది. కొన్ని యూనివర్సిటీలు ప్రొఫెషనల్ డిగ్రీలకు అనుబంధంగా అప్రెంటిషిప్ అవకాశం కలి్పస్తున్నాయి. దీనివల్ల ప్రత్యక్ష అనుభవంతోపాటు కొంత ఆర్థిక మద్దతు లభించినట్టు అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు యూనివర్సిటీ కోర్సులకు అప్రెంటిషిప్ ప్రోగ్రామ్‌లు అనుబంధంగా ఉన్నాయి. ఉన్నత విద్యా కోర్సులకు సరిపడా సమకూర్చుకోలేని వారు విద్యా రుణాన్ని కూడా పరిశీలించొచ్చు. చిన్న మొత్తం అయితే ఎలాంటి ష్యూరిటీ అవసరం పడదు. పెద్ద మొత్తంలో రుణం తీసుకునేట్టు అయితే ఆస్తుల తనఖా, గ్యారంటీలను బ్యాంకులు కోరొచ్చు. ఇందుకు కూడా ముందుగానే సిద్ధమవ్వాలి. విద్యా రుణాలపై వడ్డీ రేటు 9–15 శాతం మధ్య ఉంది. పిల్లల విద్య పూర్తయి, ఉద్యోగంలో చేరిన తర్వాత చెల్లింపులు చేసే ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. చాలా బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు కోర్సు ఫీజులో 80–90 శాతం వరకు రుణంగా ఇస్తున్నాయి. పిల్లలు చదువుకుంటూనే పార్ట్‌టైమ్ అవకాశాలను వినియోగించుకోవడం మరొక మార్గం. పెరిగిపోతున్న వ్యయాలు అధిక ద్రవ్యోల్బణం, ప్రత్యేకమైన కోర్సులకు డిమాండ్, ఇందుకు మెరుగైన వసతుల కల్పన కారణంగా దేశ, విదేశాల్లో కోర్సుల వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు రూ.50వేలకే పూర్తయ్యే ఎంబీఏ కోర్స్ నేడు రూ.5 లక్షలకు చేరడం ఇందుకు ఓ నిదర్శనం. ఐఐఎంలలో ఫీజులు రూ.17 లక్షల నుంచి రూ.24 లక్షల మధ్య ఉన్నాయి. గతంలో ఇవి రూ.6 లక్షల స్థాయిలోనే ఉండేవి. ఐఐటీలోనూ కోర్సు ఫీజు రూ.6–10 లక్షలకు చేరింది. గతంతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐఎం, ఐఐటీల్లో ఫీజుల పెరుగుదల 100 శాతానికి పైనే ఉంటోంది. విదేశాల్లోనూ ఫీజుల పెరుగుదల ఇదే మాదిరిగా ఉంటోంది. మరీ ముఖ్యంగా డాలర్ మారకం రేటు అధికంగా ఉండడం ఈ భారాన్ని మరింత పెంచుతోంది. ‘‘దశాబ్దం క్రితం విదేశాల్లో ఏడాది విద్యా వ్యయాలు రూ.25–30 లక్షల మధ్య ఉండేవి. ఇప్పుడు రూ.50 లక్షలకు చేరాయి’’అని గుప్తా తెలిపారు. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఫీజు దశాబ్దం క్రితం రూ.కోటి స్థాయిలో ఉంటే, ఇప్పుడు అది రెట్టింపైంది. కేవలం ట్యూషన్ ఫీజుల వల్లే కాకుండా, జీవన వ్యయాలు కూడా పెరిగిపోవడం ఈ భారాన్ని మరింత పెంచుతోంది. కాకపోతే విదేశీ విద్యకు సంబంధించి నూరు శాతం స్కాలర్షిప్ పొందే అవకాశం కాస్త ఊరటనిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ అవకాశం సొంతం చేసుకోవాలంటే విదేశీ విద్యా ప్రవేశానికి మూడేళ్ల ముందు నుంచే తమ ప్రొఫైల్‌పై పని చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ‘‘నూతనతరం కోర్సులు అయితే సాధారణంగా ఏటా రూ.5–10 లక్షల మధ్య ఫీజు ఉంటుంది. ఢిల్లీలోని పెర్ల్ అకాడమీలో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ యూఐ/యూఎక్స్ (యూజర్ ఇంటర్ఫేజ్/యూజర్ ఎక్స్‌పీరియెన్స్) కు ఏటా రూ.7 లక్షల ఫీజు ఉంది’’అని గుప్తా వెల్లడించారు. కోర్సుకు సంబంధించి ట్యూషన్ ఫీజు కేవలం ఒక భాగమే. పిల్లల వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాల పెంపు కోసం తల్లిదండ్రులు అదనంగా ఖర్చు చేయక తప్పదు. కాలం చెల్లిన కరిక్యులమ్ నేపథ్యంలో, పిల్లలకు సమాంతరంగా నైపుణ్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాస అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉంటుందని గుప్తా అంటున్నారు. తల్లిదండ్రులు ఉంటున్న ప్రదేశానికి దూరంగా, ప్రముఖ విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తే అప్పుడు వారి జీవనం కోసం మరింత వ్యయం చేయాల్సి వస్తుంది. ఇక విదేశాలకు పంపించే వారిపై ఈ భారం మరింత పెరుగుతుంది. వసతి, ఆహారం, లాండ్రీ, ఇంటర్నెట్, మొబైల్, వస్త్రాలు వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. జీవనం, రవాణా వ్యయాలు, యుటిలిటీలు (విద్యుత్, టెలిఫోన్), ఆరోగ్య సంరక్షణ, ఇతర అవసరాల కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాల్సి వస్తుందని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అరిజిత్ సేన్ పేర్కొన్నారు. భయపెట్టే అంచనాలు చారిత్రకంగా చూస్తే గడిచిన దశాబ్ద కాలంలో కోర్సుల ఫీజులు నూరు శాతానికి పైగా పెరిగాయి. భవిష్యత్తులోనూ ఇదే తరహా పెరుగుదల ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ‘‘కోర్సుల ఫీజుల పెరుగుదల వచ్చే దశాబ్దం పాటు ఇదే మాదిరిగా ఉంటుంది. జీడీపీ 6 శాతం చొప్పున వృద్ధి చెందుతూ వెళితే, దీనికి అనుగుణంగా సగటున పెరిగే కుటుంబాల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే, విద్యా వ్యయం 10 శాతం చొప్పున పెరుగుతూ వెళ్లినా.. ఫీజులు, విద్యా రుణాలు భారంగా మారతాయి’’అని నీతి శర్మ పేర్కొన్నారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ వంటి ప్రత్యామ్నాయాల రూపంలో రవాణా, జీవన వ్యయాల వంటివి ఆదా చేసుకునే అవకాశం ఉందని శర్మ వివరించారు. ‘‘ప్రతిష్టాత్మక కాలేజీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ చేసేందుకు ఇప్పుడు ఏటా రూ.12–15 లక్షల వరకు ఖర్చవుతోంది. విద్యా ద్రవ్యోల్బణం 10–12 శాతం ఉంటుందన్న అంచనా ఆధారంగా వచ్చే పదేళ్లలో ఇది రూ.40 లక్షలకు చేరొచ్చు. ప్రైవేటు కాలేజీలో ఎంబీబీఎస్ డిగ్రీకి నేడు రూ.కోటి అవుతుంటే పదేళ్ల తర్వాత రూ.3 కోట్లు వ్యయం చేయాల్సి రావచ్చు’’అని అరిజిత్ సేన్ తెలిపారు. అనుసరణీయ మార్గాలు.. ఖరీదుగా మారుతున్న ఉన్నత విద్య కోసం తల్లిదండ్రులు ముందు నుంచే ప్రణాళికాయుతంగా వ్యవహరించడం ఎంతో అవసరం. కాలేజీ ప్రవేశానికి రెండేళ్ల ముందు నుంచే పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయతి్నంచాలి. విదేశాలకు పంపించేట్టు అయితే అక్కడి జీవన పరిస్థితులు, సంస్కృతి, దరఖాస్తు ప్రక్రియ, ఎదురయ్యే సవాళ్లపై అవగాహన తెచ్చుకోవాలి. కనుక ఈ విషయంలో నిపుణుల సాయం తప్పనిసరి. ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ చదువులకు సంబంధించి ప్రస్తుత వ్యయాలు. తమ పిల్లల ఉన్నత విద్యకు ఇంకా ఎన్నేళ్ల కాల వ్యవధి మిగిలి ఉంది? ఎలాంటి విద్యా సంస్థల్లో ప్రవేశాలు తీసుకోవాలి, అక్కడి ప్రస్తుత ఫీజులు, తమ పిల్లలు కాలేజీ ప్రవేశం పొందే నాటికి ఎంత మేర పెరగొచ్చనే విషయాలపై స్పష్టత అవసరం. దీనికి సంబంధించి ఎన్నో సంస్థలు సేవలు అందిస్తున్నాయి. కోర్స్ వ్యయం, ట్యూషన్ ఫీజు, జీవన వ్యయాలు, రవాణా వ్యయాలు, స్కాలర్షిప్ ఉన్న అవకాశాలు, మెరుగైన విద్యా సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే వివరాలను వారి నుంచి తెలుసుకోవచ్చు. మరీ ముఖ్యంగా పిల్లలు కాలేజీకి వచ్చే నాటికి వారి ఆసక్తులు ఎలా ఉంటాయన్నది ముందే గుర్తించడం అసాధ్యం. కనుక భవిష్యత్‌లో వారు ఏ కోర్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తారన్నది ముందుగా తెలియదు. అందుకని ఖరీదైన కోర్స్‌కు సంబంధించి సన్నద్ధం కావడం మంచిది. -
ప్రణాళికతోనే ప్రశాంతత
భాగస్వామితో జీవితాన్ని పంచుకుంటాం.. కానీ జీవితంలో భాగమైన ముఖ్య ఆర్థిక విషయాలకు దూరంగా ఉంచుతాం. అందరి విషయంలోనూ ఇదే వాస్తవం కాకపోయినా.. అత్యధిక దంపతుల్లో జరుగుతున్నది ఇదే. కుటుంబానికి తగినంత రక్షణ కోసం జీవిత బీమా, భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాల కోసం చేస్తున్న పెట్టుబడులు, అవసరంలో ఆదుకునే వైద్య బీమా.. ఇలా ప్రతీ ఒక్క ఆర్థిక విషయాన్ని జీవిత భాగస్వామితో పంచుకోవడం అవసరమే కాదు.. ఎంతో ప్రయోజనం కూడా. భవిష్యత్తులో ఎవరికైనా ఊహించని పరిస్థితి ఎదురైతే అప్పుడు అయోమయానికి గురి కాకుండా సరైన దిశగా అడుగులు వేసేందుకు వీలు కలుగుతుంది. ఇందుకోసం తప్పకుండా ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలి. పెట్టుబడుల విషయాలను తప్పకుండా చర్చించి నిర్ణయించాలి. డాక్యుమెంట్లు ఎక్కడ పెడుతున్నది, ముఖ్యమైన బ్యాంకు ఖాతాలు, వాటి నామినీ వివరాలు, బీమా పాలసీలు ఇవన్నీ దంపతుల్లో ఇద్దరికీ తెలిసి ఉండాలి. ఆ అవసరాన్ని ఇక్కడి ఉదాహరణలు మనకు తెలియజేస్తున్నాయి... అనురాగ్ వయసు 40 ఏళ్లే. ఎప్పుడూ చలాకీగా ఉంటాడు. ఎదుటివారిని నవ్వుతూ విష్ చేస్తాడు. తన కెరీర్ పరంగా ఎంతో పని భారం మోస్తున్నా కానీ ఎప్పుడూ అది ముఖంపై కనిపించదు. ఎప్పుడూ నవ్వుతూ, తన చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ, అవసరంలో ఉన్న వారికి సాయం చేసే తత్వం. కానీ, దురదృష్టం.. ఒకరోజు గుండెపోటుతో అకస్మాత్తుగా తన వారందరినీ విడిచి పెట్టి వెళ్లిపోయాడు. అనురాగ్‌పై ఆధారపడిన తల్లిదండ్రులు, భార్య, 11 ఏళ్లు, 7 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబం అంతటికీ అతడొక్కడే ఏకైక ఆధారం. అనురాగ్ భార్య అవంతిక బాగా చదువుకున్న మహిళ. పూర్తి స్థాయి ఉద్యోగానికి వెళ్లాలా లేక పార్ట్ టైమ్ ఉద్యోగం ఎంచుకోవాలా? అన్న సంశయంతో, ఆఖరుకు పార్ట్‌టైమ్ ఎంచుకుంది. తన పిల్లల కోసం కొంత సమయం వెచ్చించాలన్నది ఆమె కోరిక. తానే వారిని స్కూల్‌కు తీసుకెళ్లి, తీసుకురావాలని, వారి ఎదుగుదలను కళ్లారా చూడాలని, అందులో ఉన్న ఆనందాన్ని కోల్పోకూడదన్నది ఆమె అభిప్రాయం. అప్పటికే అనురాగ్ తన కష్టార్జితంతో కుటుంబాన్ని కాస్త మంచి స్థితిలో ఉంచిపోవడంతో, అవంతిక ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు సులభంగా జరిగాయి. వైద్యనాథన్ (44) ఓ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్. ఎప్పుడూ చాలా బిజీగా ఉంటాడు. దీంతో ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడుల కోసం వెచ్చించే తీరిక కూడా లేదు అతనికి. దీంతో పెట్టుబడులను పరిశీలిస్తే అంతా అస్తవ్యస్తంగానే కనిపిస్తుంది. తన సన్నిహితుల సలహాలపై ఆధారపడతాడు. అందు వల్లే వైద్యనాథన్ పొదుపులో అధిక భాగం బ్యాంకు సేవింగ్స్ ఖాతాలోనే ఉంటుంది. వాటిపై రాబడులు 3.5 శాతమే. పైగా పలు ఎండోమెంట్ పాలసీలను కూడా తీసుకున్నాడు. వీటిపైనా దీర్ఘకాలంలో రాబడులు 5–6 శాతం మించవు. కాకపోతే పదేళ్ల క్రితం చేసిన రియల్ ఎస్టేట్ పెట్టుబడి మాత్రం అతడికి బాగా కలిసొచ్చింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో రుణం తీసుకుని రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడి పెట్టాడు. కానీ, ముందు చూసిన ఫలితం అతడికి రెండో పెట్టుబడిలో కనిపించలేదు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడం, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చట్టం (రెరా)ను తీసుకురావడంతో నల్లధన లావాదేవీలు తగ్గిపోయాయి. ఫలితంగా రియల్ ఎస్టేట్‌లో డిమాండ్ తగ్గి ధరలపై ప్రభావం పడింది. కాకపోతే తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో వైద్యనాథన్‌కు ఓ ఇల్లు, మరో చోట ఇంకొక ఇల్లుతోపాటు ప్లాట్ కూడా ఉన్నాయి. మరోవైపు ఈక్విటీల్లో పెట్టుబడులు నేరుగా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు. అవన్నీ గతంలో మంచి పనితీరు చూపించినవి. కానీ, క్రితం ఐదేళ్లలో వాటి పనితీరు చెప్పుకోతగ్గంత లేదు. అనురాగ్ మాదిరే ఉన్నట్టుండి వైద్యనాథన్ కూడా ఆకస్మిక మరణానికి గురయ్యాడు. కానీ, ఇక్కడ పరిస్థితి భిన్నం. ఆస్తుల వివరాలు... వైద్య నాథన్ భార్య శ్రీనిధి ముందున్న పెద్ద టాస్క్.. అసలు ఆస్తులు ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడంతోపాటు వాటి డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో గుర్తించాల్సి వచ్చింది. ఎందుకంటే కుటుంబ ఆర్థిక విషయాల గురించి ఆమెకు పెద్దగా తెలియదు. వైద్యనాథన్ తనంతట తానే నిర్ణయాలను అమలు చేసేవాడు. పలు సందర్భాల్లో తన భార్యకు తెలియజేసేందుకు వైద్యనాథన్ ప్రయత్నించినా ఎందుకోగానీ అది వాయిదా పడింది. కుటుంబానికి ఉన్న ఆస్తుల వివరాలు, ఫిజికల్ లేదా డిజిటల్ డాక్యుమెంట్లను ఎక్కడ భద్రపరిచినదీ శ్రీనిధికి తెలియదు. దీంతో అయోమయ పరిస్థితిని ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. మొత్తానికి వివరాలను తెలుసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. వైద్యనాథన్ బ్యాంకు ఖాతాలో నమోదై ఉన్న ఈ మెయిల్ ఐడీ, పాస్వర్డ్ వివరాలు ఆమెకు తెలియవు. ఇంట్లో డాక్యుమెంట్లను గుర్తించే పనిలో పడింది. బ్యాంకు శాఖకు చెందిన రిలేషన్షిప్ మేనేజర్, భర్త స్నేహితులను సంప్రదించడం ద్వారా కొన్ని వివరాలు తెలిశాయి. కానీ, అప్పటికీ పూర్తి వివరాలపై స్పష్టత లేదు. ఒక ప్రభుత్వరంగ బ్యాంకులో, ఒక ప్రైవేటు బ్యాంకులో భర్తకు ఖాతా ఉంది. ప్రైవేటు బ్యాంకు ఖాతాకు నామినీగా భార్య శ్రీనిధి పేరే రిజిస్టర్ అయి ఉంది. కానీ, ప్రభుత్వరంగ బ్యాంకు ఖాతాలో ఆమె పేరును నామినీగా నమోదు చేసి లేదు. ఎందుకంటే ఆ ఖాతా తెరిచి చాలా కాలం అయింది. పైగా వైద్యనాథన్ ఎటువంటి విల్లు రాయలేదు. దీంతో ఖాతాలోని బ్యాలన్స్ సరైన లబ్ధిదారునకు చేరేలా చూసేందుకు ప్రభుత్వరంగ బ్యాంకు మరిన్ని డాక్యుమెంట్లను అడిగింది. వైద్యనాథన్ తన వివాహానికి పూర్వమే రూ.50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఒక మంచి పని చేశాడు. అప్పట్లో ఇది పెద్ద మొత్తమే అయినప్పటికీ, చాలా ఏళ్లు గడిచిపోవడంతో ద్రవ్యోల్బణం ఈ విలువను తగ్గించి వేసింది. పాలసీ తీసుకున్న సమయంలో నామినీగా తండ్రి పేరును చేర్చాడు. వివాహం అయిన తర్వాత ఆ స్థానంలో భార్య పేరును రిజిస్టర్ చేయడాన్ని నిర్లక్ష్యం చేశాడు. దీంతో ఆమె అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకుని, తన మామయ్యను వెంట పెట్టుకుని ఎన్నో సార్లు బీమా కార్యాలయం చుట్టూ క్లెయిమ్ కోసం తిరగాల్సి వచ్చింది. ఇక పనిచేస్తున్న సంస్థ తరఫున వైద్యనాథన్ కుటుంబానికి మంచి వైద్య బీమా కవరేజీ ఉండేది. అది కాకుండా విడిగా ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోవాలని వైద్యనాథన్ అనుకున్నా కానీ ఆ పని చేయలేదు. దాంతో వైద్యనాథన్ మరణం వల్ల ఇప్పుడు కుటుంబానికి వైద్యబీమా కవరేజీ లేకుండా పోయింది. కంపెనీ నుంచి ఉన్న పాలసీని మరో బీమా సంస్థకు పోర్ట్ పెట్టుకునేందుకు శ్రీనిధి ప్రయత్నాలు ఆరంభించింది. ఇక ఈపీఎఫ్ సభ్యుడు కావడంతో వైద్యనాథన్‌కు ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ కవరేజీ కూడా ఉంది. కంపెనీని సంప్రదించడంతో ఈపీఎఫ్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకునే విషయంలో శ్రీనిధికి సహకారం లభించింది. కానీ, వైద్యనాథన్ మరణించే నాటికి అతని ఈపీఎఫ్ ఖాతాలో రూ.9 లక్షలు బ్యాలన్స్ ఉంది. అదే సమయంలో నామినీగా శ్రీనిధి పేరు అప్డేట్ అయి లేదు. బ్యాలన్స్ రూ.లక్ష మించి ఉండడంతో తన హక్కులను నిరూపించుకునేందుకు గాను శ్రీనిధి వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వడం తప్పనిసరి అయింది. కానీ, దీనికి చాలా సమయంతోపాటు, శ్రమ కూడా అవసరమే. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు వైద్యనాథన్ రియల్ ఎస్టేట్‌లో తొలి ప్రయత్నం ఇచ్చిన విజయంతో ఐదేళ్ల క్రితం మరిన్ని పెట్టుబడులు పెట్టాడు. వాటి విలువ పెరగకపోగా, 20% తగ్గిపోయింది. ప్లాట్ ఒకటి ఉండడంతో కబ్జా భయంతో వెంటనే దాన్ని విక్రయించాలన్నది శ్రీనిధి ఆలోచన. మరో పట్టణంలో రెండో ఇంటిని కొనుగోలు చేయగా, దానిపై అద్దె ఆదాయం చాలా తక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో మంచి కిరాయిదారులు రావడం కష్టంగా మారడంతో ఏడాదిలో రెండు నెలలు ఖాళీగా ఉంటోంది. కిరాయి కూడా ఆస్తి విలువలో 2–3% మించి ఉండడం లేదు. దీంతో ఆ ఇంటిని కూడా వెంటనే విక్రయించేసి వచ్చే డబ్బులను లిక్విడ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంది. ఆర్థిక, భావోద్వేగ పరంగా ఎంతో మద్దతుగా నిలిచి, కుటుంబం కోసం ఎంతో శ్రద్ధ చూపించిన భర్త ఆమెకు లేకపోవడంతో గత కొన్ని నెలలుగా ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకవేళ భర్తతో కలసి సమష్టిగా ఆర్థిక విషయాలు చర్చించి ప్రణాళికలను అమలు చేసి ఉంటే నేడు శ్రీనిధి ఇన్ని ఇబ్బందులు, సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చేది కాదు. సమగ్రమైన జీవిత బీమాతోపాటు, కంపెనీకి వెలుపల సొంతంగా ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ పాలసీ తీసుకుని ఉంటే ఆ ప్రయోజనాలు కొనసాగి ఉండేవి. అలాగే, సమయానికి లిక్విడిటీ అందుబాటులో ఉండని రియల్ ఎస్టేట్‌పైనా ఎక్స్పోజర్ తగ్గించుకుని ఉండాల్సింది. అలాగే, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా స్టాక్స్‌లోనూ వైవిధ్యానికి అవకాశం ఉండేది. అలాగే, జాయింట్ అకౌంట్లు, బ్యాంకు ఖాతాలకు తప్పనిసరిగా నామీని రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే శ్రీనిధి పని మరింత సులభం అయ్యేది. ఆస్తులు కూడా ఆమె పేరిట సులభంగా బదిలీ అయ్యేవి. -
ప్లాన్ ఏంటి?
మహేంద్ర, మమత కులకర్ణిలను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ నూతనదర్శకుడు బి.ఎల్.ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం ‘ప్లానింగ్’. అలీషా ప్రత్యేక పాత్రలో నటించారు. సాయి గణేష్ మూవీస్ పతాకంపై టి.వి. రంగసాయి నిర్మించిన ఈ సినిమాకి ఉదయ్ కిరణ్ సంగీతం అందించారు. ఈ చిత్రం పాటలను నిర్మాత సి. కళ్యాణ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘విజువల్స్, పాటలు బాగున్నాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే వ్యత్యాసం లేకుండా ప్రస్తుతం మంచి సినిమాలు తీస్తున్నారు. మహేంద్ర చక్కగా నటించారు. రంగసాయి కళాతృష్ణతో సినిమాలు తీస్తున్నారు. ఆయన మరిన్ని చిత్రాలు చేయాలి’’ అన్నారు. ‘‘దర్శక–నిర్మాతలు ఎంతో చక్కని ప్లానింగ్‌తో చేసిన సినిమా ఇది’’ అన్నారు కొరియోగ్రాఫర్, హీరో మహేంద్ర. ‘‘ఐటమ్ సాంగ్‌తో కెరీర్ ప్రారంభించిన నేను కథానాయిక అయ్యాను. దక్షిణ భారతదేశంలో అన్ని భాషల్లో సినిమాలు చేశాను’’ అన్నారు మమత కులకర్ణి. ‘‘మాకు వెన్నుదన్నుగా నిలిచిన కళ్యాణ్‌గారు, స్నేహితులందరికీ ధన్యవాదాలు. ప్రతి సన్నివేశాన్ని ఎంతో క్షుణ్ణంగా చెక్ చేసుకుని స్క్రిప్టును ఫైనలైజ్ చేసి, సినిమా తీశాం’’ అన్నారు రంగసాయి. ఈ వేడుకలో నిర్మాతలు రామ సత్యనారాయణ, సాయి వెంకట్, దర్శకుడు భాను కిరణ్, సంగీత దర్శకుడు ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: బి. ధనుంజయ్, బి. దేవి, నిర్వహణ: బి.భూలక్ష్మి. -
ప్రేమానురాగాల సమ్మేళనం
మహేంద్ర, కులకర్ణి మమతా జంటగా రూపొందుతున్న చిత్రం ‘ప్లానింగ్’. బి.ఎల్. ప్రసాద్ దర్శకత్వంలో ఆర్.ఎస్. తిరివీధి నిర్మిస్తున్నారు. కన్నడ నటి అలీషా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. కర్ణాటక పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘చక్కని కుటుంబ కథా చిత్రమిది. ప్రేమానురాగాల సమ్మేళనానికి సందేశాన్ని జోడించి తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రంలో 5 పాటలు, 3 ఫైట్లు ఉన్నాయి’’ అన్నారు దర్శకుడు ప్రసాద్. ‘‘రాజీ పడకుండా నిర్మిస్తున్నా. దర్శకుడు విజువల్ వండర్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలీషా పాత్ర, ఆమె పై ఉండే సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా ఉంటాయి. ఉదయ్ కిరణ్ మంచి సంగీతం అందిస్తున్నారు’’ అన్నారు నిర్మాత. రంగసాయి, ఉరుకుందప్ప, సంతోష్, అతిథి, చైతన్య తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడు: ఏడు కొండలు. -
వైద్య విద్యార్థికి ప్రణాళిక ముఖ్యం
–లక్ష్యాలను నిర్దేశించుకోవాలి - గ్లోబల్ డాక్టర్లుగా ఎదగాలి - ఫ్రెషర్స్ డే వేడుకల్లో డీఐజీ రమణకుమార్ కర్నూలు(హాస్పిటల్): వైద్య విద్యార్థులకు ప్రణాళిక ఎంతో ముఖ్యమని కర్నూలు రేంజ్ డీఐజి బీవీ రమణకుమార్ అన్నారు. శుక్రవారం కర్నూలు మెడికల్ కాలేజిలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ ఐఏఎస్ కంటే డాక్టర్ కావడమే కష్టమని, అది సాధించిన వైద్యవిద్యార్థులందరూ అభినందనీయులన్నారు. ఎంసెట్‌లో ర్యాంకు సాధించిన తర్వాత రిలాక్స్ అవుతున్నారని, అంతటితో ఆగకుండా నిత్యం లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని సా«ధించుకుంటూ ముందుకు సాగాలన్నారు. ధర్మరక్షక్ వంటి గొప్ప వైద్యులను ఆదర్శంగా తీసుకుని చిన్న చిన్న లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చిన్న డాక్టర్‌గా మిగిలిపోకుండా గ్లోబల్ డాక్టర్‌గా అయ్యేందుకు కృషి చేయాలన్నారు. కర్నూలు మెడికల్ కాలేజిలో చదివిన వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన విషయం మరువకూడదన్నారు. నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ధర్మరక్షక్ మాట్లాడుతూ తాను 44 ఏళ్ల క్రితం ఇదే కళాశాలలో విద్యాబుద్ధులు నేర్చుకున్నానని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, సామాజిక, వృత్తిపరమైన క్రమశిక్షణను అలవరచుకోవాలని సూచించారు. సీనియర్లను గౌరవించాలని, వారి నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయాలన్నారు. అలాగే పేదలకు సేవ చేయాలన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి మాట్లాడుతూ..వైద్యవృత్తిని ప్రేమించాలన్నారు. నిరంతరం జ్ఞానసముపార్జన చేసుకుంటూ ఉంటేనే వైద్యునిగా సమాజంలో రాణిస్తారని చెప్పారు. కళాశాలలోని అత్యాధునిక సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ప్రాంతీయ ప్రభుత్వ కంటి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ వై. భాస్కర్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, మెడిసిన్ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకారుల అభివృద్ధికి ప్రణాళికలు
వేములపల్లి : మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందించిందని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు తెలిపారు. బుధవారం వేములపల్లి చిన్నచెరువు, పెద్ద చెరువులో చేప పిల్లలను విడిచిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. దళారులు, కాంట్రాక్టర్ల ఆదిపత్యం వల్ల సొసైటీ సభ్యులు ఆర్థికంగా ఎదగలేకపోతున్నారనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచితంగా చేప పిల్లలను సరఫరా చేయాలని నిర్ణయించారని పేర్కొన్నారు. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 485 చెరువులను ఎంపిక చేసి 5కోట్ల 85 లక్షల చేప పిల్లలను సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. ఆయా చెరువుల్లో వదలడానికి చేప పిల్లలను సంబంధిత సొసైటీ సభ్యులకు అందజేస్తున్నట్లు తెలిపారు. మత్స్యకార సొసైటీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నామిరెడ్డి రవీణా కరుణాకర్ రెడ్డి, జెడ్పీటీసీ ఇరుగుదిండ్ల పద్మ, రావుయల్లారెడ్డి, సర్పంచ్ జడరాములు యాదవ్, ఎంపీటీసీ పుట్టల సత్యవతి భాస్కర్, సొసైటీ అధ్యక్షుడు పందిరి శ్రీనివాస్, మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాధా రోహిణి, ఎఫ్డీఓ అంజయ్య, నాయకులు చిర్రమల్లయ్య యాదవ్, పాలుట్ల బాబయ్య, పందిరి ప్రతాప్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
చారకొండ మండల ఏర్పాటుపై కసరత్తు
–సౌకర్యాల కోసం పీడీ అధ్యయనం వంగూరు : మం డల పరిధిలోని చారకొండ గ్రామాన్ని మండల కేం ద్రం చేసేందుకు అధికారుల కసరత్తు ప్రారంభమయింది. శుక్రవారం మెప్మా పీడీ లింగ్యానాయక్ వంగూరు, చారకొం డ గ్రామాల్లో పర్యటించారు. వంగూరు రెవెన్యూ కార్యాలయంలో మండలానికి సంబంధించిన మ్యాపు, గ్రామాల మధ్య ఉన్న దూరాన్ని పరి శీలించారు. అనంతరం చారకొండ గ్రామానికి వెళ్లి అక్కడ ఉన్న ప్రభుత్వ భూమి, భౌగోళిక పరిస్థితులు, ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలను పరిశీలించారు. అయితే గ్రామంలోని అతిథిగృహం, గ్రామపంచాయతీ కార్యాలయంతోపాటు ఇతర భవనాలను అఖిలపక్ష నాయకులు చూపించారు. ఇక్కడ ఉన్న అన్ని పరిస్థితులపై కలెక్టర్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
పుష్కర ప్రణాళిక రూపొందించండి
అధికారులకు పుష్కరాల ప్రత్యేక అధికారి రాజశేఖర్ ఆదేశాలు విజయవాడ : పుష్కర ఘాట్లను 150 నుంచి 200 మీటర్ల వరకూ ఒక సెక్టార్‌గా విభజించి, ప్రతి సెక్టార్లో ఉంచాల్సిన పరికరాలు, అధికారులకు సంబంధించిన మైక్రో లెవల్ ప్లానింగ్‌ను ప్రతి శాఖ రూపొందించాలని పుష్కరాల ప్రత్యేక అధికారి బి.రాజశేఖర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రతి సెక్టార్‌కు ఒక సబ్ కలెక్టర్ స్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమిస్తున్నట్లు చెప్పారు. పోలీస్, ఇరిగేషన్, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్.. తమ శాఖ అధికారులను ఆయా సెక్టార్లలో నియమించాలని సూచించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకూ రెండో షిఫ్టు, రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల వరకూ మూడో షిఫ్టు నిర్వహించాలని సూచించారు. మూడు షిప్టులకు నియమించే ఉద్యోగుల పేర్లు, ఆధార్, మొబైల్ నంబర్ల నివేదిక జిల్లా యంత్రాంగానికి ఆదివారంలోపు అందించాలని ప్రత్యేక అధికారి రాజశేఖర్ సూచించారు. మహిళా సంఘాల స్టాల్స్.. కలెక్టర్ బాబు.ఏ మాట్లాడుతూ ప్రతి ఘాట్లోనూ పిండప్రదానం ప్లాట్‌ఫాంను ఆనుకుని, పూజా ద్రవ్యాలు అమ్మే మహిళా సంఘాల స్టాళ్లు ఏర్పాటుచేయాలని డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. డీఆర్డీఏ తరఫున మహిళా సంఘాల ఉత్పత్తుల అమ్మకాల స్టాళ్లను ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 150, పవిత్రసంగమం వద్ద 50, ప్రకాశం బ్యారేజీ దిగువన అప్రాన్ వద్ద 50 ఏర్పాటు చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల మహిళా సంఘాలకూ చోటు కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ జి.సృజన, డీఆర్వో సీహెచ్ రంగయ్య, ఆర్అండ్బీ ఎస్ఈ శేషుకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సమష్టి ప్రణాళికతో ముందుకెళ్దాం
– విధుల్లో అలసత్వం వద్దు – 8వ తేదీ నుంచే విధులకు హాజరు కావాలి – భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించొద్దు – కలెక్టర్ విజయమోహన్ సాక్షి, కర్నూలు: శ్రీశైలం, సంగమేశ్వరంలో మృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు అందరూ సమష్టి ప్రణాళికతో ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కష్ణా పుష్కరాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చూడాలని సూచించారు. పుష్కర విధుల్లో ఉన్న అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి 25వ తేదీ వరకు పుష్కర విధుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో పుష్కర విధులు నిర్వహించే అధికారులందరూ సాధారణ విధులను కిందిస్థాయి సిబ్బందికి అప్పగించాలని సూచించారు. శ్రీశైల క్షేత్రానికి ఈవో నారాయణ భరత్‌గుప్తా, సంగమేశ్వర క్షేత్రానికి జాయింట్ కలెక్టర్ హరికిరణ్ ఇన్చార్జ్ అధికారులుగా వ్యవహరిస్తారన్నారు. వారి పర్యవేక్షణలో పుష్కర, ఏరియా అధికారులు విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఆగస్టు మొదటివారంలో చెక్‌లిస్ట్ ప్రకారం నిర్వహించాల్సి విధులపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అలాగే 8వ తేదీన కేటాయించిన ప్రదేశాలకు చేరుకుని 11వ తేదీ వరకు విధులు ఎలా చేపట్టాలన్న దానిపై ట్రై ల్ రన్ చేసుకోవాలని ఆదేశించారు. 12వ తేదీకి పకడ్బందీగా విధులకు హాజరుకావాలన్నారు. పాతాళాగంగ, సంగమేశ్వర ఘాట్ల లోతు ఎక్కువగా ఉంటుందని 4 అడుగుల మేర నీరు నిల్వ ఉండే ల్యాండింగ్ ఏరియాలలోనే స్నాలు చేసేందుకు అనుమతించాలన్నారు. ప్రతి రోజు సమీక్ష: ఒక రోజు శ్రీశైలం, ఒకరోజు సంగమేశ్వరంలో పర్యటించి ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు కో–ఆర్డినేషన్ అధికారులతో సమావేశం నిర్వహించి ఏరోజుకారోజు ప్రణాళికలను సరిదిద్దుకొంటూ భక్తులకు అనువైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కంట్రోలు రూములో 18 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన పుష్కర విధుల అధికారులు 24 గంటలపాటు విధులు నిర్వహిస్తూ సంబంధిత ఏరియా, సిబ్బంది విధుల నిర్వహణపై పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇన్చార్జ్ అధికారి, పుష్కర అధికారులు భక్తుల సౌకర్యార్థం సొంత నిర్ణయాలు తీసుకొని తనకు తెలియజేయాలని తెలిపారు. అన్నదాన కార్యక్రమాలు చేపట్టే స్వచ్ఛంద సేవాసంస్థలను గుర్తించాలని, అలాగే వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. వారు కోరిన విధంగా ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించేందుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ఆగస్టు 4వ తేదీన సంగమేశ్వరంలో మరోసారి పుష్కర ఏర్పాట్లపై సమీక్షిస్తానని చెప్పారు. భక్తుల భద్రతపై పోలీసు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీ హరికిరణ్, డీఆర్వో గంగాధర్‌గౌడ్, ఏఎస్పీ చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మెుక్కలు నాటుదాం..హరితవనంలా చేద్దాం
జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ మేడిపెల్లి: ఇంటింటికి మొక్కలు నాటి గ్రామాలను హరితవనంలా తయారు చేద్దామని జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ కోరారు. హరితాహారంలో భాగంగా గురువారం మేడిపెల్లితోపాటు కొండాపూర్, భీమారం గ్రామాల్లో మెుక్కలు నాటారు. తుల ఉమ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ ఇంటితోపాటు ఖాళీ స్థలాల్లో మెుక్కలు నాటి సంరక్షించాలన్నారు. జెడ్పీ సీఈవో సూరజ్‌కుమార్, ఎంపీపీ పల్లి జమున, జెడ్పీటీసీ నెల్లుట్ల పూర్ణిమ, మండల ప్రత్యేకాధికారి మంజుల, తహసీల్దార్ కె.వసంత, ఎంపీడీవో హరికిషన్, ఎంఈవో గౌతంకృష్ణారావు, ఏఈ గోపాల్, ఏపీఎం అశోక్, ఏపీవో గంగలక్ష్మణ్, ఆర్ఐ భూమయ్య, సింగిల్‌విండో చైర్మన్ వొద్దినేని హరిచరణ్‌రావు, సర్పంచులు బొంగోని రాజాగౌడ్, ముస్కెం మంజుల, ఉత్కం లక్ష్మి, అడ్లగట్ట లక్ష్మీనారాయణ, అంగడి ఆనందం, రాజరెడ్డి, నర్సయ్య, ఎంపీటీసీలు దాసరి శంకర్, శ్రీనివాస్‌తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఆపత్కాలంలో బీమా భరోసా
మన ఆర్థిక అవసరాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. హఠాత్పరిణామాల వల్ల ఆదాయ మార్గాలు మూసుకుపోయినప్పుడు కుటుంబం కుదేలయ్యే ఘటనలు ప్రాంతాలకు అతీతంగా నగరాల్లోనూ, గ్రామాల్లోనూ కనిపిస్తూనే ఉంటాయి. అయితే, ఇలాంటి రిస్కులు ఉన్నాయని తెలిసినా సరే.. చాలా మంది వాటిని ధైర్యంగా ఎదుర్కొనే సాధనాలను సమకూర్చుకోరు. వీటిని ఎదుర్కొనడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే, ఇందుకోసం కొంత ప్లానింగ్, కొన్ని క్రియాశీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, మరికొంత క్రమశిక్షణ అవసర మవుతాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నంత కాలం ఇంట్లో ఎవరికి ఆర్థిక కష్టాలు వచ్చినా కుటుంబసభ్యులు బాసటగా నిల్చేవారు. ప్రస్తుతం న్యూక్లియర్ కుటుంబాలు పెరుగుతున్న కొద్దీ అటువంటి పరిస్థితి ఉండటం లేదు. ఈ నేపథ్యంలో.. ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి భరోసా కల్పించేది జీవిత బీమా. ఇది కూడా ఒక్కరి కష్టాన్ని అందరూ కలిసి పంచుకునేవంటిదే. అందుకే, ప్రస్తుతం బీమా కవరేజి ప్రాముఖ్యత పెరుగుతోంది. జీవిత బీమా, వైద్య బీమాతో పాటు రిటైర్మెంట్ తర్వాత అవసరాలకు ప్లానింగ్ ప్రాధాన్యం కూడా పెరుగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొంగొత్త పొదుపు సాధనాలు వస్తున్నప్పటికీ .. భారతీయులకు వీటిపై అంతగా అవగాహన ఉండటం లేదు. బ్యాంక్ డిపాజిట్లు, స్థిరాస్తుల్లో పెట్టుబడులకే ఇప్పటికీ ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. ప్రైవేట్ ఆర్థిక సంస్థలపై అపనమ్మకం ఇందుకు కారణం కావొచ్చు. ఇలాంటి అపోహల వల్లే వారు ఇన్వెస్ట్మెంట్ పరంగాను, భద్రతపరంగా ధీమానిచ్చే బీమా వంటి సరైన సాధనాలను ఎంపిక చేసుకోలేకపోతున్నారు. నిజానికి జీవిత బీమా కవరేజిలో రెండిందాల ప్రయోజనాలు ఉంటాయి. ఒకవేళ కుటుంబ పెద్దకి అనుకోనిది ఏమైనా జరిగినా.. కుటుంబ సభ్యుల అవసరాలకు కావాల్సిన నిధి అందేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ అలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా, అంతా సవ్యంగానే సాగితే కనీసం రిటైర్మెంట్ అవసరాలకైనా బీమా సొమ్ము ఉపయోగపడగలదు. అందుకే దీర్ఘకాలంలో ఇటు క్రమం తప్పకుండా పొదుపు, అటు చక్రవడ్డీ తరహా రాబడిలనుసాధనాల్లో బీమా ఒకటని చెప్పవచ్చు. ఇక, చివరిగా.. పాలసీలు తీసుకున్న వారిలో చాలా మంది.. తాము వీటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెబుతుంటారు. ఇది మంచిదే. కానీ ఏదో ఒక పాలసీ..ఎంతో కొంతకు తీసుకోవడం సరికాదు. జీవితంలో వివిధ దశలకు అనుగుణంగా సరిపడినంత కవరేజి ఉండేలా తీసుకుంటేనే పాలసీ ప్రయోజనాలు పొందగలమని గుర్తుంచుకోవాలి.