ప్రతీకాత్మక చిత్రం
చీరాల టౌన్: రెండున్నర నెలల పాటు సముద్ర తీర ప్రాంతాల్లో హైలెస్సా.. హైలెస్సా అనే మాటలు వినపడవు. తీరం ఒడ్డున మత్స్యకారుల సందడి కనిపించదు. సముద్రంలో మత్య్సకారుల బోట్లు కనిపించవు. సముద్రం బోసిగా దర్శనమివ్వబోతోంది. ప్రభుత్వం వేటపై నిషేధాజ్ఞలు జారీ చేసింది. కానీ వేట తప్ప మరో పని తెలియని మత్స్యకారుల పరిస్థితి ఈ సంధికాలంలో సుడిగండంలో ఉన్న మత్య్సకారులకు అండగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిలవనున్నారు.
మే 15 కల్లా గంగపుత్రులకు మత్య్సకార భరోసా కింద ఒక్కో మత్య్సకార కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు అందించేలా రూ.10 వేలు ఇవ్వను న్నారు. ఈనెల 15 నుంచి జూన్ 15 తేదీ వరకు సముద్రంలో చేపల వేట నిలుపుదల చేస్తున్నట్లు మత్స్యశాఖ అధికారులు ప్రకటించారు. ప్రతిఏటా ఈ సమయంలో చేపలు పునరుత్పత్తి సమ యం సందర్భంగా సముద్రంలో మరబోట్లు, యాంత్రీకరణ తెప్పలకు నిషేధ సమయంలో పూర్తిగా వేటను నిలుపుదల చేయాలని ఆదేశాలిచ్చారు. నిషేధ సమయంలో మత్స్యకారులకు వైఎస్సార్ సీపీ సర్కారు ఒక్కో కుటుంబానికి ఆర్థిక సాయం అందించనుంది. బాపట్ల జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాలు ఉండగా రేపల్లె, బాపట్ల, చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లోని ఏడు మండలాల్లో 9600 మత్య్సకార కుటుంబాలు ఉన్నాయి.
బాపట్ల జిల్లాలో 50 వేల మత్య్సకారులు ఉండగా 25000 మంది మత్య్సకారులు వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఒక్కో బోటుకు ఆరుగురు మత్య్సకారులు ఉంటారు. బాపట్ల జిల్లాలో ఉన్న ఏడు తీరప్రాంత మండలాల్లో 76 కిలో మీటర్లు ఉన్న సముద్రతీర ప్రాంతంలో 50,000 మంది మత్య్సకార జనాభా, 9600 మత్య్సకార కుటుంబాలు ఉన్నాయి. జిల్లాలో మోటారు, మెకనైజ్డ్ బోట్లు 2924 పైచిలుకు బోట్లు ఉన్నాయి. జిల్లాలోని రేపల్లె, నిజాంపట్నం, బాపట్ల, చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల్లో సముద్ర తీరప్రాంతం ఉంది. సముద్రతీర ప్రాంతం జిల్లాలోని రేపల్లెలోని లంకెనవాలిపల్లి దిబ్బ నుంచి చినగంజాం మండలం ఏటిమొగ వరకు తీరప్రాంతం విస్తరించి ఉంది. ఈ మండలాల్లోని మత్య్సకారులు సముద్రంలో వేట చేసి మత్స సంపదను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధం విధించడంతో మత్య్సకారుల వేట సామగ్రిని, బోట్లను ఒడ్డుకు తీసుకువచ్చి నిలుపుదల చేశారు.
కుటుంబ పోషణకు అండగా మత్య్సకార భరోసా..
సాధారణంగా వాడరేవు మత్స్యకారులు కృష్ణా జిల్లా మచిలీపట్నం, నెల్లూరు జిల్లా రామాయపట్నం వరకు వేటకు వెళ్లి గురకా, పాములు, బొంత, కూనాము, వంజరం, పండుగప్పలు లాంటి చేపలను పట్టుకొస్తుంటారు. నిషేధ కాలం రెండున్నర నెలలు ఉండటంతో మత్య్సకారులు ఇబ్బందులు ఇబ్బందులకు తొలగించేందుకు ప్రభుత్వం మత్య్సకార భరోసా అందిస్తూ అండగా నిలుస్తోంది.
బోట్లతో వేట సాగిస్తే చర్యలు
సముద్రంలో చేపల సంతానోత్పత్తి పెరిగే కారణంగా శనివారం నుంచి జూన్ 14 వరకు వేట నిషేఽ దం అమలు చేస్తున్నాం. సంప్రదాయ తెప్పలు వేట సాగించుకోవచ్చనని, మెకనైజ్డ్ ఇంజిన్ బోట్లతో సముద్రంలో వేట సాగిస్తే చర్యలు తీసుకుంటాం. మత్య్సకారులు కేంద్రం ప్రభుత్వ ఆదేశాలు విధిగా పాటించాలి. మత్య్సకార భరో సా కింద బోట్లు పరిశీలన చేసి దరఖా స్తులను ఆన్‌లైన్ నిక్షిప్తం చేస్తాం. విచారణ చేసి మే 1న భరోసా తుది జాబితా ప్రకటిస్తాం. మేలో సీఎం జగన్ మత్య్సకారులకు భరోసా సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
– ఎ.సురేష్, మత్య్సశాఖ జిల్లా అధికారి, బాపట్ల
Comments
Please login to add a commentAdd a comment