fisher man
-
గంగపుత్రులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
-
చేపల వేటపై 2 నెలలు నిషేధం.. మత్స్యకారులకు అండగా ఏపీ ప్రభుత్వం
చీరాల టౌన్: రెండున్నర నెలల పాటు సముద్ర తీర ప్రాంతాల్లో హైలెస్సా.. హైలెస్సా అనే మాటలు వినపడవు. తీరం ఒడ్డున మత్స్యకారుల సందడి కనిపించదు. సముద్రంలో మత్య్సకారుల బోట్లు కనిపించవు. సముద్రం బోసిగా దర్శనమివ్వబోతోంది. ప్రభుత్వం వేటపై నిషేధాజ్ఞలు జారీ చేసింది. కానీ వేట తప్ప మరో పని తెలియని మత్స్యకారుల పరిస్థితి ఈ సంధికాలంలో సుడిగండంలో ఉన్న మత్య్సకారులకు అండగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిలవనున్నారు. మే 15 కల్లా గంగపుత్రులకు మత్య్సకార భరోసా కింద ఒక్కో మత్య్సకార కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు అందించేలా రూ.10 వేలు ఇవ్వను న్నారు. ఈనెల 15 నుంచి జూన్ 15 తేదీ వరకు సముద్రంలో చేపల వేట నిలుపుదల చేస్తున్నట్లు మత్స్యశాఖ అధికారులు ప్రకటించారు. ప్రతిఏటా ఈ సమయంలో చేపలు పునరుత్పత్తి సమ యం సందర్భంగా సముద్రంలో మరబోట్లు, యాంత్రీకరణ తెప్పలకు నిషేధ సమయంలో పూర్తిగా వేటను నిలుపుదల చేయాలని ఆదేశాలిచ్చారు. నిషేధ సమయంలో మత్స్యకారులకు వైఎస్సార్ సీపీ సర్కారు ఒక్కో కుటుంబానికి ఆర్థిక సాయం అందించనుంది. బాపట్ల జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాలు ఉండగా రేపల్లె, బాపట్ల, చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లోని ఏడు మండలాల్లో 9600 మత్య్సకార కుటుంబాలు ఉన్నాయి. బాపట్ల జిల్లాలో 50 వేల మత్య్సకారులు ఉండగా 25000 మంది మత్య్సకారులు వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఒక్కో బోటుకు ఆరుగురు మత్య్సకారులు ఉంటారు. బాపట్ల జిల్లాలో ఉన్న ఏడు తీరప్రాంత మండలాల్లో 76 కిలో మీటర్లు ఉన్న సముద్రతీర ప్రాంతంలో 50,000 మంది మత్య్సకార జనాభా, 9600 మత్య్సకార కుటుంబాలు ఉన్నాయి. జిల్లాలో మోటారు, మెకనైజ్డ్ బోట్లు 2924 పైచిలుకు బోట్లు ఉన్నాయి. జిల్లాలోని రేపల్లె, నిజాంపట్నం, బాపట్ల, చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల్లో సముద్ర తీరప్రాంతం ఉంది. సముద్రతీర ప్రాంతం జిల్లాలోని రేపల్లెలోని లంకెనవాలిపల్లి దిబ్బ నుంచి చినగంజాం మండలం ఏటిమొగ వరకు తీరప్రాంతం విస్తరించి ఉంది. ఈ మండలాల్లోని మత్య్సకారులు సముద్రంలో వేట చేసి మత్స సంపదను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధం విధించడంతో మత్య్సకారుల వేట సామగ్రిని, బోట్లను ఒడ్డుకు తీసుకువచ్చి నిలుపుదల చేశారు. కుటుంబ పోషణకు అండగా మత్య్సకార భరోసా.. సాధారణంగా వాడరేవు మత్స్యకారులు కృష్ణా జిల్లా మచిలీపట్నం, నెల్లూరు జిల్లా రామాయపట్నం వరకు వేటకు వెళ్లి గురకా, పాములు, బొంత, కూనాము, వంజరం, పండుగప్పలు లాంటి చేపలను పట్టుకొస్తుంటారు. నిషేధ కాలం రెండున్నర నెలలు ఉండటంతో మత్య్సకారులు ఇబ్బందులు ఇబ్బందులకు తొలగించేందుకు ప్రభుత్వం మత్య్సకార భరోసా అందిస్తూ అండగా నిలుస్తోంది. బోట్లతో వేట సాగిస్తే చర్యలు సముద్రంలో చేపల సంతానోత్పత్తి పెరిగే కారణంగా శనివారం నుంచి జూన్ 14 వరకు వేట నిషేఽ దం అమలు చేస్తున్నాం. సంప్రదాయ తెప్పలు వేట సాగించుకోవచ్చనని, మెకనైజ్డ్ ఇంజిన్ బోట్లతో సముద్రంలో వేట సాగిస్తే చర్యలు తీసుకుంటాం. మత్య్సకారులు కేంద్రం ప్రభుత్వ ఆదేశాలు విధిగా పాటించాలి. మత్య్సకార భరో సా కింద బోట్లు పరిశీలన చేసి దరఖా స్తులను ఆన్లైన్ నిక్షిప్తం చేస్తాం. విచారణ చేసి మే 1న భరోసా తుది జాబితా ప్రకటిస్తాం. మేలో సీఎం జగన్ మత్య్సకారులకు భరోసా సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. – ఎ.సురేష్, మత్య్సశాఖ జిల్లా అధికారి, బాపట్ల -
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం
-
షార్క్ చేపతో ముఖాముఖి షూటింగ్: షాకింగ్ వైరల్ వీడియో!!
షార్క్ చేపలు ఎంత ప్రమాదకరమైనవో తెలిసిందే. అయితే ఈ షార్క్ చేపలను వీడియో తీసేటప్పుడూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. నిజానికి వాటికి తెలియకుండానే వీడియో తీస్తారు గానీ నేరుగా తీసే ధైర్యం మాత్రం చేయరు. అలాంటిది ఈ వ్యక్తి ఏకంగా షార్క్ చేపను నేరుగా కొన్ని నిమిషాల పాటు వీడియో తీశాడు. అసలు విషయంలోకెళ్లితే...డేవిడ్ షెర్రర్ అనే చేపల పట్టే వ్యక్తి నార్త్ కరోలినా సముద్రపు ఒడ్డున డైవింగ్ చేస్తూ ఒక అద్భుతమైన తెల్ల షార్క్ చేప ఫుటేజ్‌ని తీశాడు. అయితే అతను ఆ షార్క్ చేపను చాలా దగ్గర నుంచి(ముఖాముఖి) వీడియో తీశాడు. ఒకనొక దశలో ఆ చేప అతనికి దగ్గరగా సమీపించడమే కాక చేతిలో ఉన్న గన్ని చూసి తనను తాను రక్షించుకునే నిమిత్తం వెనుదిరుగుతుంది కూడా. ఎంతోమంది ఈ షార్క్ చేపలను వీడియో తీశారు గానీ ఇలా షార్క్ చేపకు అతి చేరువలో నేరుగా వీడియో చిత్రీకరించలేదు. అతని అదృష్టమో ఏమో గానీ అతనిపై మాత్రం దాడిచేయలేదు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింత తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా వీక్షించండి. -
పత్తి ఏరాల్సిన చోట.. చేనులో చేపల వేట
ఇటీవల కురిసిన వర్షాలకు మంచిర్యాల జిల్లాలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండడంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న పంట చేలలోకి వరద నీరు చేరింది. గోదావరి నదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో బుధవారం చేపల వేటకు అధికారులు అనుమతించలేదు. అయితే కొందరు మత్య్సకారులు నీరు నిలిచిన పొలాల్లో చేపల వేట కొనసాగించడం ఆసక్తికరంగా మారింది. పరివాహక ప్రాంతంలోని పంట చేలలో వరద నీటిపై తెప్పలు వేసుకుని వెళ్లి మత్య్సకారులు చేపలు పట్టారు. తమ రెక్కల కష్టం వరద పాలైందని రైతులు వాపోతున్నారు. పంట నష్టం జరిగిన పొలాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. పత్తి ఏరాల్సిన చోట చేపలు పట్టడం వింతగా ఉంది. - సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల -
విషాదం: కూడు పెట్టిన వల.. కాటికి పంపింది
సాక్షి, భైంసా(నిర్మల్): గోదావరి నదిలో చేపలు పడుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న తొందూర్ నాగేశ్(45) చేపల కోసం తాను కట్టిన వలకే ప్రమాదవశాత్తు చిక్కుకొని మృతి చెందిన సంఘటన బాసరలో శనివారం జరిగింది. ఎస్సై ప్రేమ్‌దీప్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తొందూర్ నాగేశ్ బాసర వద్ద నదిలో చేపలు పడుతూ జీవనం సాగిస్తుంటాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నది నీటి ప్రవాహం విపరీతంగా పెరిగింది. దీంతో చేపలు లభిస్తాయన్న ఆశతో శుక్రవారం నదిలో చేపల కోసం వలవేశాడు. తిరిగి శనివారం చేపల కోసం నాటుపడవపై వెళ్లి తాను వేసిన వలలోనే అనుకోకుండా చిక్కుకున్నాడు. నీటిలో మునిగిపోతున్న నాగేశ్‌ను ఒడ్డుపై ఉన్న తోటి జాలర్లు గమనించి కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. వారు నాగేశ్ ఉన్న చోటికి చేరేలోపే ప్రాణాలు కోల్పోయాడు. ఎందరివో ప్రాణాలు కాపాడి.. తొందూర్ నాగేశ్ బాసర వాసులకు, ఆలయ అధికారులకు, గోదావరి నది వద్ద విధులు నిర్వహించే సిబ్బందికి సుపరిచితుడే. బాసర ఆలయానికి వచ్చి వెళ్లేవారిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ నీటమునగబోయే ఎంతో మంది భక్తులను నాగేశ్ కాపాడాడు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యలు చేసుకోవాలని గోదావరి నదిలో దూకిన పలువురిని ప్రాణాలతో ఒడ్డుకు చేర్చాడు. అలాంటిది నాగేశ్ చివరికి తానే వేసిన చేపల వలలో చిక్కి ప్రాణాలు వదిలాడు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఫోన్లో బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటన వివరాలను తెలుసుకున్నారు. మృతుడికి భార్యతోపాటు కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. చదవండి: దారుణం: 16రోజులు... నాలుగు హత్యలు -
ఘర్షణ: సముద్రంలో ఛేజింగ్!
సాక్షి, ఒంగోలు: సముద్రంలో చేపలు, రొయ్యల విషయంలో చీరాల మండలంలోని పలు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో రెండు గ్రూపులుగా విడిపోయిన పలు గ్రామాల మత్స్యకారులు సముద్రంలో పలుమార్లు చేపల వేట చేసుకుంటూనే గొడవలకు దిగుతూ వచ్చారు. అది కాస్తా చిలికి చిలికి గాలివానలా మారి ఒక గ్రామం మత్స్యకారుల వలలను, బోట్లను మరో గ్రామానికి చెందిన మత్స్యకారులు తీసుకెళ్లడంతో ఘర్షణలు తారస్థాయికి చేరాయి. ఆ తరువాత తీసుకెళ్లిన బోట్లు, వలలకు చెందిన గ్రామస్తులు ఇతర గ్రామాలకు చెందిన బోట్లను, వలలను తీసుకెళ్లడంతో మత్స్యకారుల మధ్య గొడవ కాస్తా గ్రామాల మధ్య గొడవగా మారింది. దీంతో గ్రామాల వారీగా ఒకరిపై ఒకరు చీరాల, ఈపూరుపాలెం పోలీస్స్టేషన్లలో కేసులు పెట్టుకునే స్థాయికి చేరుకుంది. దీంతో గ్రామాల మధ్య నెలకొన్న ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో ఆ గ్రామాల మధ్య పంచాయతీ జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. దీంతో బుధవారం ఒంగోలులోని మత్స్యశాఖ జేడీ కార్యాలయంలో ఓడరేవు గ్రామానికి చెందిన మత్స్యకారులను, రెండవ వర్గానికి చెందిన కఠారివారిపాలెం, రామచంద్రపురం, పొట్టిసుబ్బయపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారులతో మత్స్యశాఖ అధికారులు, పోలీసులు సంప్రదింపులు జరిపారు. ఒక గ్రామానికి చెందిన పడవలు, వలలు మరో గ్రామానికి చెందిన వారు తీసుకెళ్లడం, మరో గ్రామాలకు చెందిన పడవలు, వలలను ఇంకొక గ్రామానికి చెందిన మత్స్యకారులు తీసుకెళ్లడం మానుకోవాలని అధికారులు ఆయా గ్రామాల మత్స్యకారులకు సూచించారు. ఘర్షణ వాతావరణం లేకుండా సయోధ్యగా ఉండాలని కూడా ఆయా గ్రామాల మత్స్యకారులకు నచ్చజెప్పారు. అర అంగుళం సైజు కంటే తక్కువ కన్ను ఉన్న వలలను వాడటంతో సముద్రంలో ఉన్న గుడ్లుతో సహా వలల్లో వస్తున్నాయని దీంతో మత్స్యసంపద నశించిపోతుందన్న ఉద్దేశంతో ఘర్షణ వాతావరణం నెలకొందనే ఉద్దేశమని అధికారులు నిర్ధారణకొచ్చారు. దీనిపై మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ ఆవుల చంద్రశేఖరరెడ్డి ఆయా గ్రామాల్లో వాడుతున్న వలలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఈలోగా గొడవలు లేకుండమత్స్యకారులు కలిసిమెలిసి ఉండాలని ఆయన సూచించారు. -
గతేడాది ఆత్మహత్య.. రూ.100 కోట్లు ఇప్పించండి
తిరువనంతపురం: కేరళకు చెందిన ప్రిజిన్ అనే ఓ యువకుడు గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం అతడి కుటుంబం ఇటలీ నుంచి రూ. 100 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేస్తోంది. కేరళ యువకుడికి.. ఇటలీకి సంబంధం ఏంటనుకుంటున్నారా.. అయితే చదవండి. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం అంటే 2012లో కేరళ తీరం వెంబడి చేపల వేటకు వెళ్ళిన జాలర్లను సముద్ర దొంగలుగా భావిస్తూ ఇటలీ ఓడ ‘ఎన్రికా లెక్సి’పై ఉన్న ఇటలీ మెరైన్లు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు చనిపోయారు. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు ప్రిజిన్ అక్కడే ఉన్నాడు. అప్పుడు అతడి వయసు 14 సంవత్సరాలు. ఆ తర్వాత ఈ కేసు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంతర్జాతీయ ట్రిబ్యునల్‌కి చేరింది. ఈ క్రమంలో తాజాగా జాలర్ల మరణానికి సంబంధించి ప్రాణ నష్టానికి బదులుగా పరిహారం పొందేందుకు భారత్ అర్హత సాధించిందని ట్రిబ్యునల్ తెలిపింది. ఈ నేపథ్యంలో నాటి ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన ప్రిజిన్ కుటుంబం ఇటలీ నుంచి రూ.100 కోట్ల నష్ట పరిహారం ఇప్పించాల్సిందిగా కేంద్రాన్ని కోరుతుంది. ఈ సందర్భంగా ప్రిజిన్ కుటుంబ సభ్యులు ఈ నెల 6న కేంద్రానికి లేఖ రాశారు. దానిలో ‘‘ఎన్రికా లెక్సి’ సంఘటన 2012 ఫిబ్రవరి 15న జరిగింది. అప్పుడు ప్రిజిన్ అక్కడే ఉన్నాడు. నాటి ఘటనలో ప్రిజిన్ స్నేహితులు అజీష్ షింక్, మరోక మత్య్సకారుడు జెలాస్టిన్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటనతో అతడు షాక్‌కు గురయ్యాడు. తనకు కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలాయి’ అని తెలిపారు. (ఇటాలియన్ మెరైన్స్ కేసు: కీలక పరిణామం) అంతేకాక ‘ఈ దారుణానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ప్రిజిన్కు అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇవ్వాల్సిన రక్షణ ఇవ్వలేదు. ఈ ఘటన తర్వాత అతడు డిప్రెషన్లోకి వెళ్లాడు. ప్రభుత్వం అతడికి సరైన వైద్య చికిత్స కూడా అందించలేదు. ఈ బాధతోనే అతడు గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నాడు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ప్రిజిన్ నాటి ఘటనలో బాధితుడే. అతడికి ఇటలీ ప్రభుత్వం రూ.100 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలిందిగా కేంద్రం డిమాండ్ చేయాలి’ అని ప్రిజిన్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
విజయ్ రూపానీకి సీఎం జగన్ ఫోన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి గుజరాత్ సీఎం విజయ్ రూపానీతో ఫోన్లో మాట్లాడారు. గుజరాత్లో చిక్కుకుపోయిన ఏపీకి మత్స్యకారులను సముద్ర మార్గం ద్వారా తరలించాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు ఆయన గురువారం గుజరాత్ ముఖ్యమంత్రికి ఫోన్ చేశారు. అలాగే మత్స్యకారులను తరలించేందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కాగా పొట్టకూటి కోసం వలస వెళ్లి గుజరాత్లో చిక్కుకుపోయిన మత్స్యకారులను ఆదుకోవాలని, వారికి వసతి, భోజన సదుపాయం కల్పించాలని సీఎం జగన్ ఈ నెల 21న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. సీఎం జగన్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన విజయ్ రూపానీ తెలుగువారిని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు. మత్స్యకారులుని రాష్ట్రానికి రప్పిస్తాం విజయవాడ: గుజరాత్లో చిక్కుకున్న మత్స్యకారులను రాష్ట్రానికి రప్పిస్తామని మత్స్యకార శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ఆయన గురువారం విజయవాడలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక కృషితో ఇది సాధ్యమైందన్నారు. గుజరాత్లో ఉన్న 5000 మంది మత్స్యకారులను ప్రత్యేక బోటులలో రప్పిస్తున్నట్లు చెప్పారు. సముద్ర మార్గం ద్వారా ఏపీకి తరలించడానికి గుజరాత్ ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు. -
కడలే ఆధారం.. తీరమే ఆవాసం
కడలి అలల పైన.. వలల మాటున పొట్టకూటి కోసం నిత్యం తిప్పలు తప్పని జీవితాలు. బతుకు తీరం దాటేందుకు తీరం నుంచి సుదూరం వెళ్లాల్సిందే.. ఇంతచేసినా బతుకు ఒడ్డున పడుతుందన్న నమ్మకం, బతికి ఒడ్డున పడతాం అన్న నమ్మకం ఉండదు.. మరు గడియలో ఏం జరుగుతుందో ఒక పట్టాన అంతు పట్టని రోజుల తరబడి ప్రయాణం.. అయినా భగవంతుడిపై భారం వేసి, సముద్రంపై నమ్మకం ఉంచి, బతుకుపోరు సాగిస్తారు మత్స్యకారులు.. సముద్రం ఉట్టి చేతులతో పంపదు.. అన్న నానుడిని మననం చేసుకుంటూ, వలలు భుజాన వేసుకుని, ఎన్ని రోజులకు వస్తారో వారికే తెలీని పయనానికి సిద్ధమవుతారు మత్స్యకారులు.. రేపు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం సాక్షి, నాగాయలంక(అవనిగడ్డ): తీరప్రాంతంలో అందునా కృష్ణానది బంగాళాఖాతంలో సంగమించే సాగర సంగమ ముఖద్వారం చెంత.. అటు సాగర అలల ఘోష, ఇటు నదీపాయల హొయల నడుమ నిత్యం బతుకు సమరం సాగించే మత్స్యకారుల జీవనశైలికి అద్దం పట్టే దృశ్యాలు మనకెన్నో కనిపిస్తాయి. వలల మాటున వారు నిత్యం ఎదుర్కొనే సమస్యలు కూడా అలాగే స్పృశిస్తుంటాయి. నాగాయలంక సాగరతీరం, కృష్ణానదీ పాయలు, ప్రతి ఆదివారం గ్రామంలో జరిగే వారపుసంతలోనూ ఇలాంటి బతుకు చిత్రాలు జీవిత పరమార్ధాన్ని గుర్తుచేస్తునే ఉంటాయి. సాగరంలో లభించే మత్స్య సంపద , నాగాయలంకలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉప్పు చేపల వారపు సంత 15 వేల కుటుంబాలకు ఆధారం.. దివిసీమలోని నాగాయలంక, కోడూరు మండలాలలో సంగమేశ్వరం నుంచి నాలి, సొర్లగొంది, దీనదయాళపురం, పర్రచివర, ఏటిమొగ, గుల్లలమోద, ఎదురుమొండి దీవుల్లోని ఈలచెట్లదిబ్బ, నాచుగుంట, ఎదురుమొండి, నాగాయలంక, పాలకాయతిప్ప, బసవవానిపాలెం, హంసలదీవి తదితర గ్రామాలలో బంగాళాఖాతం, కృష్ణానదిలో అత్యధిక మత్స్యకార కుటుంబాలు నిత్యం చేపలవేట సాగిస్తున్నాయి. దివిసీమలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 15వేల కుటుంబాలు మత్స్య పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ‘సన్ డ్రై’ ఫిష్.. నాగాయలంకలో దశాబ్దాల కాలంగా ప్రతి ఆదివారం జరిగే వారపుసంతలో డ్రై ఫిష్ అమ్మకాలు మత్స్యకారులు, ముఖ్యంగా మత్స్యకార మహిళల బతుకు చిత్రాలను ప్రతిబింభిస్తుంటాయి. గత యాభై ఏళ్లుగా కేవలం ఆదివారం మాత్రమే కొనసాగుతూ వస్తున్న ఆదివారం డ్రై ఫిష్ మార్కెట్ కొద్ది సంవత్సరాలుగా సంతాశీల పాటదారుల నిరంకుశత్వం కారణంగా ఎక్కువ శాతం శనివారమే ముగించేస్తున్నారు. మీన ప్రియలకు జిహ్వచాపల్యం చూపించే ఉప్పు చేపల్లో (డ్రై ఫిష్)లలో పండుగప్ప, మాగ, మాతగురక వంటి భారీచేపలు, రొయ్యపప్పు, చప్పిడి మెత్తళ్లు లాంటి వాటికి డ్రై ఫిష్ మార్కెట్ తరతరాలుగా ప్రసిద్ధి. శని, ఆదివారాలు నాగాయలంక సంతలో ఉప్పుచేపలు (డ్రై ఫిష్)అమ్మకాలు ఇప్పటికీ కొనసాగుతునే ఉన్నాయి. నవరత్నాలతో కొత్త వెలుగులు.. రాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలు తీరప్రాంత మత్స్యకారుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాయి. నాగాయలంక, కోడూరు మండలాలలో 842 మోటరైజ్డ్ నావలకు గతంతో లీటరుకు రూ.6.03 సబ్సిడీ ఇవ్వగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు తొమ్మిది రూపాయల సబ్సిడీతో నెలకు 300లీటర్లు ఇస్తున్నారు. ఆమేర సబ్సిడీ వరకు తగ్గించి ఎంపికచేసిన పెట్రోలు బంకుల్లో నేరుగా ఆయిల్ తీసుకోవచ్చు. రెండవది చేపలవేట నిషేధకాలంలో ఇప్పటివరకు రూ.4వేలు ఉన్న భృతిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకంగా రూ.10వేలకు పెంచారు. దీనికోసం 4500 మంది లబ్ధిదారులను మత్స్యశాఖ గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపింది. అలాగే వేటసమయంలో ప్రమాదవశాత్తూ ఎవరైనా చనిపోతే ప్రమాద బీమాను రూ.10లక్షలకు, అంగవైకల్యం సంభవిస్తే రూ.5లక్షలకు పభుత్వం పెంచింది. ప్రజాసంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విద్యుత్‌చార్జీలు, ఆయిల్ సబ్సిడీ లాంటి రాయితీలను అధికారంలోకి రాగానే అమలులోకి తేవడంతో అటు ఆక్వారైతులకు ఇటు తీరప్రాంత మత్స్యకారుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఈసందర్భంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్విహించాలని మత్స్యకారులు, మత్స్యకార సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
చేప...వలలో కాదు.. నోట్లో పడింది
సాక్షి, బొబ్బిలి: గొంతులో పచ్చివెలక్కాయ పడిన చందాన ఓ జాలరి గొంతులో చేప పడింది. ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో చోటుచేసుకుంది. పక్కి గ్రామానికి చెందిన సత్తివరపు పకీరు.. గురువారం స్థానిక కాలువలో చేపలు పడుతున్నాడు. ఈ క్రమంలో ఒక చేప అతని గొంతులోకి పడింది. దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా గొంతు లోపలికి వెళ్లిపోయింది. దీనిని గమనించిన తోటిజాలర్లు... పకీరును బొబ్బిలిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ ఆర్నిపల్లి గోపీనాథ్.. పకీరు గొంతులోని చేపను కొంత మేర కత్తిరించి ఎలాంటి ప్రమాదం జరగకుండా బయటకు తీశారు. అనంతరం డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ.. సకాలంలో పకీరును ఆస్పత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని లేదంటే చేప పూర్తిగా గొంతులోకి దిగిపోయి ఉంటే శస్త్రచికిత్స చేయాల్సి వచ్చేదని చెప్పారు. పకీరు గొంతులో పడిన చేప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జాలరి పకీరు -
ప్రాణం తీసిన ఈత సరదా
సాక్షి, నేరడిగొండ(బోథ్): ఈత సరదా బాలుడి ప్రాణం తీసింది. కుమురం భీం జిల్లా వాంకిడి మండలం నవేదిరిలో చెరువులో మునిగి విద్యార్థి మృతిచెందిన సంఘటన మరువక ముందే నేరడిగొండ మండలంలో మరో ఘటన చోటు చేసుకుంది. నేరడిగొండ మండలం చిన్నబుగ్గారం గ్రామానికి చెందిన చౌహాన్ దశరథ్(9), విజయ్, మహిపాల్, పవన్ స్నేహితులు. అదే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుకుంటున్నారు. గురువారం ఒంటిపూట బడి అనంతరం వెంకటాపూర్ సమీపంలో గల కడెం వాగులో ఈత కోసం వెళ్లారు. ఈ నలుగురు విద్యార్థులు ఒడ్డుపై బట్టలు విడిచి వాగులోకి దిగారు. అదే సమయంలో దూరం నుంచి వీరిని గమనించిన మత్సకారుడు బట్ట ఆశన్న కేకలు వేస్తూ వెంటనే అక్కడకు చేరుకున్నాడు. కాని అప్పటికే నీటిలో మునిగిన దశరథ్ ఊపిరాడక మృతిచెందాడు. మిగతా వారిని కాపాడిన మత్స్యకారుడు.. విద్యార్థులు వాగులోకి దిగుతుండడాన్ని గమనించిన మత్స్యకారుడు బట్ట ఆశన్న కేకలు వేస్తూ వారిని హెచ్చరించాడు. నీటిలోకి దిగొద్దని అరిచాడు. కాని ఆశన్న అక్కడకు వచ్చే లోపే విద్యార్థులు నీటిలోకి దిగారు. ఆశన్న వెంటనే నీటిలోకి దిగి విజయ్, మహిపాల్, పవన్‌ను కాపాడాడు. ఊపిరాడక కొట్టుకుంటున్న దశరథ్ను పైకి లాగినా ఫలితం లేకుండా పోయింది. మత్స్యకారుడు బట్ట ఆశన్న గ్రామంలో విషాదం.. చిన్నబుగ్గారం గ్రామానికి చెందిన చౌహాన్ వందన– సంజుకు ఇద్దరు కుమారులు, కుమా ర్తె ఉన్నారు. వీరిద్దరు గ్రామంలో పాలేరుగా పనిచేస్తున్నారు. మొదటి సంతానం దశరథ్ చురుకుగా ఉండేవాడు. ప్రస్తుతం ఒంటిపూట బడులు నడుస్తుండడంతో మధ్యాహ్నం స్నేహితులతో కలిసి ఈత కోసం వాగుకు వెళ్లి ఇలా విగతజీవిగా తిరిగిరావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తులు కంటతడి పెట్టారు. ఘటన స్థలానికి ఎస్సై భరత్‌సుమన్ చేరుకుని పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
పోరు గాలి.. వేట ఖాళీ
సాక్షి, వాకాడు: సముద్రంపై ప్రతికూల వాతావరణం కారణంగా 25 రోజులుగా పోరు గాలి వీస్తుండడంతో వేట సజావుగా సాగడం లేదు. సాధారణంగా మార్చిలో మత్స్యసంపద ఎక్కువగా దొరుకుతుందని గంగపుత్రులకు ఎంతో కాలం వస్తున్న నమ్మకం. అలాంటిది ఈ సారి మార్చి ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా పోరుగాలి తగ్గకపోవడంతో మత్స్యకారులు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు సముద్రంలో వలేసి గాలించినా ఒక్క చేపైనా దొరకపోగా శ్రమతోపాటు, డీజిల్, కూలీలు ఖర్చులు పెరిగిపోతున్నాయి. దీంతో వేట తప్ప మరేపని తెలియని మత్స్యకారులు పూట గడవక ఆకలితో అలమటిస్తున్నారు. వేటే జీవనాధారంగా చేసుకుని తెల్లవారు జామునే వల బుజాన వేసుకుని సముద్రాన్ని గాలించి మంచి మత్స్యసంపదతో సంతోషంగా కనిపించే సాగర పుత్రులు తీరంలో దిగాలు చెందుతున్నారు. ఒడ్డుకు పరిమితమైన బోట్లు ఇటీవల పలు జిల్లాలో వచ్చిన వరుస తుపాన్లు, ప్రతికూల వాతావరణం వెరసి వేట నిలిచిపోయి బోట్లు ఒడ్డుకు పరిమితమయ్యాయి. ఇంతకు ముందు మాదిరిగా సముద్రంలో మత్స్య సంపద విరివిగా దొరకడంలేదు. ఎందుకంటే దాదాపు నెల రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని సముద్రంపై పోరు గాలి నెలకుని బోట్లు తిరగబడుతున్నాయి. దీంతో డీజిల్ ఖర్చులు వృథా చేసుకుని మత్స్యకారులు పోయిన దారినే వెనుతిరిగి వచ్చేస్తున్నారు. దానికితోడు తీరంలో నెలకొని ఉన్న పలు పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలు కండలేరు క్రీక్‌లోకి వదిలి, క్రీక్ నుంచి సముద్రంలో కలవడంతో వాకాడు, కోట, చిల్లకూరు, మండలాల తీర ప్రాంతాల్లో మత్స్య సంపద పూర్తిగా నసించిపోయి మత్స్యకారులు జీవనం కోల్పోతున్నారు. రోజంతా సముద్రంపై గాలించినా మత్స్యకారులకు శ్రమ తప్ప ఫలితం దక్కడంలేదు. దీంతో వేట కొరకు తెచ్చిన పెట్టుబడుల రుణాలకు వడ్డీలు కట్టలేకున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2,650 మంది వేటకెళ్లే మత్స్యకారులు నియోజకవర్గం పరిధిలోని వాకాడు, కోట, చిల్లకూరు మండలాల్లో 24 మత్స్యకార గ్రామాల్లో 2,650 మంది వేట చేసే మత్స్యకారులు, 1,920 బోట్లు ఉన్నాయి. ఒక్కో బోటుపై యజమానులతోపాటు కూలీలతో కలిపి దాదాపు మూడు నుంచి ఐదు కుటుంబాల వరకు మత్స్య సంపదపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వేట లేకపోవడంతో బోట్లు ఒడ్డుకు చేర్చి లంగరు వేసి ఉన్నాయి. ప్రస్తుతం మత్స్యకార కుటుంబాలు అప్పులు చేసి పూట గడుపుతున్నా, మరికొందరు పస్తులుంటున్నారు. ఈ పరిస్థితి అన్ని మండలాల మత్స్యకార గ్రామాల్లో నెలకొని ఉంది. వేటనే నమ్ముకుని కుటుంబాన్ని పోషించే కొందరు మత్స్యకారులు ఎంచేయాలో దిక్కుతోచక వివిధ పనుల్లో దినసరి కూలీలుగా మారుతున్నారు. ఇది ఇలా ఉంటే గత ఏడాది విధించిన వేట విరామం డబ్బులు ఇంతవరకు సక్రమంగా అందకపోవడం, వచ్చిన డబ్బుల్లో కూడా మధ్యవర్తులు దండుకోవడం కనిపిస్తోంది. కొందరు మత్స్యకారులు సముద్రంలో చేపలవేట లేక, చేతిలో పనిలేక కాలక్షేపం కోసం కొన్ని వ్యసనాలకు బానిసలవుతున్నారు. తమను అన్ని విధాలా ఆదుకుంటున్నామని పదే పదే చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మత్స్యకారులు వాపోతున్నారు. తమ బాధలు గుర్తించి వెంటనే సాయం అందించాలని మత్సకారులు కోరుతున్నారు. రోజంతా గాలించినా చేపలు దొరకడంలేదు నెల రోజులుగా సముద్రంపై పోరుగాలి కొడుతుండడంతో రోజంతా గాలించినా ఒక్క చేప కూడా దొరకడంలేదు. దీంతో పూట గడవక మా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వారం నుంచి కూలికి వెళ్లి జీవనం సాగిస్తున్నాం. – సోమయ్య మత్స్యకారుడు, తూపిలిపాళెం -
ఇద్దరిని మింగిన గంగ
వేర్వేరు ప్రమాదాల్లో నీళ్లలో పడి ఒకరు గల్లంతు కాగా.. ఇద్దరు మృతి చెందిన సంఘటనలు ఉమ్మడి జిల్లాల్లో సోమవారం చోటు చేసుకున్నాయి. వైరా రిజర్వాయర్‌లో చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుడు గల్లంతుకాగా.. చింతకాని మండలంలోని రామకృష్ణాపురంలో మరొక మత్స్యకారుడు చెరువులో పడి మృత్యువాత పడ్డాడు. టేకులపల్లి మండలంలోని మొక్కంపాడులో పెదవాగు దాటుతూ దాని ఉధృతికి ఓ రైతు బలయ్యాడు. పెదవాగులో పడి.. టేకులపల్లి : ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటుతూ.. ఓ రైతు కొట్టుకుపోయి మృతి చెందిన సంఘటన సోమవారం మొక్కంపాడులో చోటు చేసుకుంది. బోడు ఎస్సై భూక్య శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో మొక్కంపాడు కు చెందిన ఈసం సమ్మయ్య (50) మేతకు వెళ్లిన పశువులను ఇంటికి తోలుకొచ్చేందుకు అడవి వైపునకు వెళ్లాడు. పశువులు పెద్దవాగు అవతల ఉన్నా యి. అప్పటికే వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినా సమ్మయ్య లెక్క చేయకుండా పశువుల కోసం వాగులో దిగాడు. వాగు ఉధృతి తీవ్రంగా ఉండటంతో కొంత దూరం కొట్టుకుని పోయాడు. గమనించిన స్థానికులు వెళ్లేసరికి.. అప్పటికే ఊపిరాడక సమ్మయ్య మృతి చెందాడు. అతి కష్టం మీద మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకుని వచ్చారు. బోడు ఎస్సై భూక్య శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మత్స్యకారుడు గల్లంతు.. వైరా : వైరా రిజర్వాయర్‌లో మత్స్యకారుడు గల్లంతైన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. రిజర్వాయర్ అలుగుపోస్తున్న నేపథ్యంలో స్థానిక హనుమాన్ బజార్‌కు చెందిన వేముల నర్సింహారావు (41) అనే మత్స్యకారుడు చేపలవేటకు వెళ్లాడు. అలుగు వద్ద వల విసురుతుండగా.. ప్రమాదవశాత్తు జారి రిజర్వాయర్‌లో పడి నీటి ఉధృతికి కొట్టుకు వెళ్లాడు. స్థానికులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూ కీ లభించలేదు. నర్సింహారావు కోసం గజ ఈతగాళ్లు సైతం గాలింపు చర్యలు చేపడుతున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది. యువకుడికి గాయాలు.. మత్స్యకారుడు నర్సింహారావు గల్లంతైన విషయం తెలిసుకొని అదే ప్రాంతానికి చెందిన ఇర్లపూడి హరిష్ అలుగు వద్ద నడుచుకుంటూ వెళుతుండ గా.. కాలుజారి అతడి నీటిలో పడ్డాడు. నీటి ఉధృ తికి కొంతదూరం కొట్టుకు వెళ్లాడు. స్నేహితు లు కాపాడి స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికి త్స చేయిస్తున్నారు. ఈ ప్రమాదంలో హరిష్‌కు స్వల్పగాయాలయ్యాయి. వలలు ఏర్పాటు చేస్తుండగా.. చింతకాని : మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన మత్స్యకారుడు బొమ్మకంటి ఆదినారాయణ (52) ప్రమాదవశాత్తు చెరువులో పడి సోమవారం మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు స్థానిక చెరువులోకి భారీగా వరద నీరు చేరి చెరువు అలుగు పడింది. దీంతో చెరువులోని చేపలు వరదకు పోకుండా ఉండేందుకు అలుగు వద్ద వలలను ఏర్పాటు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆదినారాయణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
సముద్రంలో ఏడు బోట్లు బోల్తా
శ్రీకాకుళం : తీరంలో మరోమారు ‘అల’జడి రేగింది. ఇటీవల సోంపేట తీరంలో చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తాపడిన ఘటనలో ఒకరు చనిపోవడం.. ఏడుగురు గాయపడిన ఘటన జిల్లావాసులు కళ్లముందు ఇంకా కదలాడుతూనే ఉంది. అలాంటి పరిస్థితే సోమవారం గార మండలంలో చోటు చేసుకుంది. అలల ఉద్ధృతికి ఏడు బోట్లు బోల్తా పడిపోయాయి. ఈ ఘోరంలో మైలపల్లి లక్ష్మణ, గంగట్ల లక్ష్మణ తీవ్రంగా...మరో పది మంది స్వల్పంగా గాయపడ్డారు. బోట్లు బోల్తాపడిన సమాచారంతో తీర ప్రాంత గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. చేపల వేట కోసం వెళ్లిన తమవారు ఎలా ఉన్నారోనని భీతిల్లిపోయారు. అదృష్టవశాత్తు అంతా క్షేమంగా ఉన్నారని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.గార: వాతావరణంలో మార్పుల నేపథ్యంలో కొద్ది రోజులుగా మత్స్యకారులు ఎవరూ చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లడం లేదు. అయితే రోజుల తరబడి వేటకు వెళ్లకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను జలపుత్రులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే సోమవారం కొంతమంది ధైర్యం చేసి బోట్లపై వేటకు బయలు దేరారు. అయితే అలల హోరులో వారి సాహసం పని చేయలేదు. దీంతో తీరానికి వచ్చేయాలనే తాపత్రయంలో ప్రమాదంలో చిక్కుకున్నారు. అందరినీ అందోళనకు గురి చేశారు. వివరాల్లోకి వెళితే.. బందరువానిపేట, మొగదాలపాడు గ్రామాల్లో 174 ఇంజిన్ బోట్లు ఉన్నాయి. మత్స్యకార పెద్దలకు తెలియకుండా ఈ రెండు గ్రామాలకు చెందిన సుమారు 56 మంది 11 బోట్లపై సోమవారం వేకువజామున సముద్రంలోకి వేటకు వెళ్లారు. అప్పటికే సముద్రంలో గాలుల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో వేట సురక్షితం కాదని భావించి తీరానికి తిరుగుముఖం పట్టారు. ఈ ప్రయత్నంలోనే బందరువానిపేట తీరానికి చెందిన ఐదు, మొగదాలపాడు గ్రామానికి చెందిన రెండు పడవలు సముద్రంలో బోల్తాపడిపోయాయి. అయితే మత్స్యకారులంతా వాటిని గట్టిగా పట్టుకొని ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఈ సంఘటనలో ఇద్దరు తీవ్రంగా.. మరో పది మంది స్వల్పంగా గాయపడ్డారు. అలాగే మరో నాలుగు పడవుల్లో ఉన్నవారంతా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాయి. గాలి హోరు.. అలల ఉద్ధృతి కారణంగా బందరువానిపేట తీరం నుంచి ఉదయం 7 గంటల సమయంలో బోట్లపై నుంచి వెనక్కి వస్తున్న గంగట్ల లక్ష్మణ బోటు ఒడ్డుకు చేరుకునే ప్రయత్నంలో పెద్ద ఎత్తున పైకెగిసిన అలకు బోల్తా కొట్టింది. దీంతో లక్ష్మణరావుతో పాటు అందులో ఉన్న మైలపల్లి లకు‡్ష్మయ్యకు గాయాలయ్యాయి. వీరిని అదే బోటులో మిగిలిన మత్స్యకారులు అత్యంత కష్టంపై ఒడ్డుకు చేర్చారు. అనంతరం శ్రీకాకుళంలోని ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. ఇదే సమయంలో పడవ బోల్తా పడిన సంఘటన 5 వేలు జనాభా కలిగిన బందరువానిపేట గ్రామంలో దావానంలో వ్యాపించడంతో కలకలం రేగింది. ఏఏ బోట్లు సముద్రంలోకి వెళ్లాయి. ఎంతమంది వెళ్లారన్న సంగతి వారి కటుంబ సభ్యులు తీరానికి వచ్చేంతవరకు తెలియని పరిస్థితితో అందరిలో ఆందోళన రేగింది. 9 గంటల సమయం నుంచి సముద్రంలో గాలుల తీవ్రతతో పాటు అలల ఉద్ధతి కొంత తగ్గడంతో మిగిలిన బోట్లలో ఉన్నవాంతా ఒడ్డుకు వచ్చేందుకు ప్రయత్నించారు. బందరువానిపేటకు చెందిన శివకోటి లక్ష్మణరావు, కొమర తాతారావు, మురమంద చిన్నారావు, దుమ్ము కృష్ణలకు చెందిన నాలుగు పడవులు ఒకదాని తర్వాత ఒక్కక్కటి ఒడ్డుకు వచ్చే ప్రయత్నంలో మళ్లీ అలలు ఉద్ధృతి పెరగడంతో బోల్తా పడ్డాయి. మరో నాలుగు పడవులు అలకి అలకి మధ్య ఉన్న తక్కువ క్షణాల వ్యవధిలో సురక్షితంగా మత్స్యకారులు ఒడ్డుకు చేరుకున్నారు. బోల్తా పడిన పడవుల్లో ఉన్న ఇద్దరు మత్స్యకారులు గాయాలపాలవ్వడం, మరో 10 మంది శ్వాస సంబంధిత ఇబ్బందులు కలగడంతో వారిని చికిత్స కోసం స్థానిక వైద్యాధికారి సుమన్ 108 వాహనంలో శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రికి పంపించారు. ఈ ఘటనలో నాలుగు ఇంజిన్లు పాడవ్వగా, 5 వలలు, రెండు జామితాళ్లు గల్లంతాయ్యాయి. మత్స్యశాఖ అధికారి శాంతారావు సంఘటన స్థలానికి వచ్చి బాధితుల వివరాలను సేకరించారు. జరిగిన నష్టాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. మొగదాలపాడు నుంచి బందరువానిపేట తీరానికి.. మొగదాలపాడు గ్రామానికి చెందిన చీకటి శ్రీరాములు, చీకటి సూర్యనారాయణ పడవుల్లో 8 మంది వేటకు బయలుదేరారు. ఆ పడవులు రెండు సముద్రంలో ఉన్న విండ్‌తో బందరువానిపేట తీరం వరకు వచ్చేశారు. 11 గంటల సమయంలో బందరువానిపేట పడవులు ఒడ్డుకు వెళ్లే ప్రయత్నం గమనించిన మొగదాలపాడు మత్స్యకారులు కూడా ఒడ్డుకు వచ్చే ప్రయత్నంలో వారి పడవలు కూడా బోల్తా పడ్డాయి. అయితే వీటిలో ఉన్నవాంతా సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
రానున్న ఎన్నికల్లో బాబుకు తగిన బుద్ధి చెప్తాం
-
చేపల వలలో పంచలోహ విగ్రహం
సాక్షి, అన్నానగర్(చెన్నై): మూడేళ్ల క్రితం చోరీకి గురైన 45 కిలోల పంచలోహ విగ్రహం జాలర్ల వలకు చిక్కింది. ఈ ఘటన తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు..తిరువణ్ణామలై జిల్లా బోలూర్ అల్లినగర్కి చెందిన ముత్తుకుమరన్(32) జాలరి. ఇతను శుక్రవారం బోలైఊర్ కూల్ నదిలో చేపలు పట్టేందుకు నదిలో వల వేశాడు. అప్పుడు వల బరువుగా ఉండడంతో కష్టంగా పైకి లాగాడు. ఆ వలలో ఓ మూట వచ్చింది. మృతదేహం ఉందేమోనని భయపడి వెంటనే బోలూర్ పోలీసుస్టేషన్‌కి సమాచారం అందించాడు. ఇన్స్పెక్టర్ సురేష్‌బాబు, పోలీసులు అక్కడికి వచ్చి మూటను తెరచి చూశారు. అందులో 45 కిలోల బరువైన అమ్మవారి పంచలోహ విగ్రహం ఉంది. పోలీసులు ఆ విగ్రహాన్ని బోలూర్ తహసీల్దార్‌కు అప్పగించారు. ఈ విగ్రహం మూడేళ్ల క్రితం వసూర్ గ్రామంలోని చెల్లియమ్మన్ ఆలయం నుంచి చోరీ చేశారని పోలీసుల విచారణలో తెలిసింది. -
శ్రీలంక కాల్పుల్లో భారత మత్స్యకారుడి మృతి
చెన్నై: చేపల వేటకు వెళ్లిన తమిళనాడు మత్స్యకారుడిని శ్రీలంక సైన్యం పొట్టన పెట్టుకుంది. శ్రీలంక సైనికులు జరిపిన కాల్పుల్లో రామేశ్వరానికి చెందిన బ్రిడ్గో (22) అనే యువకుడు మృతి చెందాడు. కచ్చతీపు ద్వీపాల్లో మరికొందరితో కలిసి మెకనైజ్డ్ బోటులో వేటకు వెళ్లిన బ్రిడ్గో తదితరులపై శ్రీలంక నేవీ కాల్పులు జరినట్లు మత్స్యకారులు ఆరోపించారు. వారు కాల్చిన తూటా సరిగ్గా బ్రిడ్గో మెడపై తగలడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. మత్స్యకారులకు కేంద్ర ప్రభుత్వం తగిన న్యాయం చేసేవరకు బ్రిడ్గో మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని అతడి కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. సుమారు వెయ్యిమందికి పైగా స్థానికులు మృతుడి ఇంటి వద్ద చేరి.. ఆందోళనలు చేపట్టారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను డిమాండ్ చేశారు. మరోవైపు ఈ అంశంపై తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఎంకే స్టాలిన్ కూడా స్పందించారు. కేంద్రం ఈ అంశంపై మౌన ప్రేక్షక పాత్ర పోషించకూడదని, ఇప్పటికైనా ఈ సమస్యను గట్టిగా పట్టించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఆక్వాపార్క్‌కు రక్ష.. మత్స్యకారులకు ఎందుకీ శిక్ష..?
– మా జీవనోపాధికి భంగం కలిగిస్తే సహించం – వంశపారంపర్యంగా వస్తున్న వలకట్లను నాశనం చేస్తే ఊరుకోం – అవసరమైతే న్యాయ పోరాటాలకూ వెనుకాడం – మత్స్యకారుల హెచ్చరిక ‘ఆక్వా పార్క్ పెద్దలకు రక్షగా నిలుస్తోంది. సామాన్య ప్రజలపై కక్ష సాధిస్తోంది. మాపై వివక్ష చూపుతోంది. మా జీవనోపాధికి గండికొట్టి.. మా పొట్టకొట్టేందుకు యత్నిస్తోంది. ఇదేం సర్కారు’ గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్ బాధిత గ్రామాల ప్రజల ఆక్రందన ఇది. భీమవరం మండలం తుందుర్రు పరిసర గ్రామాలతోపాటు నరసాపురం, మొగల్తూరు, వీరవాసరం మండలాల్లోని ప్రజలు వ్యతిరేకిస్తున్నా.. ఆక్వా పార్క్ యాజమాన్యం ఎదుట మోకరిల్లిన సర్కారు జనంపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ.. పోలీసులను మోహరించి దాషీ్టకానికి దిగడం విమర్శల పాలవుతోంది. సర్కారు తీరును నిరసిస్తూ.. తమ జీవనంతో ముడిపడిన ఉన్న గొంతేరు కాలువను కాలుష్య కాసారంగా మార్చే ఆక్వా పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా మత్స్యకారులు పోరుబాట పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘తరతరాలుగా గొంతేరు కాలువపై ఆధారపడి బతుకుతున్నాం. మా జీవనోపాధిపై వేటు వేయకండి. కాలువలో మేం వేసుకున్న వలకట్లకు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చింది. వేలాది కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న గొంతేరును కొందరి స్వార్థం కోసం కాలుష్యసాగరంగా మారిస్తే ఊరుకోం’ అని నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని గొంతేరు సరిహద్దు గ్రామాల్లోని మత్స్యకార కుటుంబాలు వేడుకుంటున్నాయి. ఆ రెండు మండలాల్లోని ఆక్వాపార్క్ ప్రభావిత గ్రామాల్లో ‘సాక్షి’ బందం పర్యటించగా.. అక్కడి మత్స్యకారులు తమ ఆవేదనను వెళ్లగక్కారు. గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ ద్వారా 500 మందికి ఉపాధి కల్పిస్తామంటూ.. 50 వేల కుటుంబాలను రోడ్డున పడవేయడం భావ్యం కాదని వాపోయారు. సంప్రదాయ చేపల వేట సాగించే మత్స్యకారులకు జీవనోపాధి కల్పించడంతోపాటు ఇక్కడి ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తున్న గొంతేరు కాలువను కాలుష్యం బారినుంచి కాపాడుకునేందుకు అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని మత్స్యకార కుటుంబాలు తేల్చిచెప్పాయి. తమపైకి పోలీసుల్ని ఉసిగొల్పినా.. ఎన్నిరకాలుగా వేధించినా పోరాటం నుంచి వెనక్కి తగ్గేది లేదని పలువురు స్పష్టం చేశారు. జీవనోపాధి పోయాక తాము చేయగలిగిందేమీ ఉండదని.. అందుకే, ముందుగానే ఆక్వా పార్క్ నిర్మాణాన్ని అడ్డుకోవాలన్నది తమ అభిమతమని మత్స్యకారులు తెలిపారు. తమ జీవనోపాధికి భంగం కలిగిస్తే సహించబోమని, వంశపారంపర్యంగా వస్తున్న వలకట్లను నాశనం ఊరుకునేది లేదని, అవసరమైతే న్యాయ పోరాటాలకు సిద్ధమవుతామని ముక్తకంఠంతో చెప్పారు. వందలాది వలకట్లు.. అవే ఉపాధి మెట్లు నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని గొంతేరు కాలువ పరిధిలో 31 పెద్ద వలకట్లు, మరో 200 వరకూ చిన్న వలకట్లు ఉన్నాయి. వీటి నిమిత్తం మత్స్యకారులు ఏటా ప్రభుత్వానికి పన్ను చెల్లించి లైసెన్స్ పునరుద్ధరించుకుంటారు. వీటికి ప్రభుత్వం జిరాయితీ తరహాలో పట్టాలు ఇస్తుంది. వీటిని వంశపారంపర్యంగా అనుభవించవచ్చు. లేకపోతే వేరే వారికి రిజిస్టర్ చేసే అవకాశం ఉంటుంది. వేట నిషేధం సమయంలో వీరి జీవనోపాధి నిమిత్తం బియ్యం, ఇతర సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ హక్కు కొన్ని తరాలుగా వస్తోంది. ఆక్వా పార్క్ నిర్మాణం పూర్తయి, గొంతేరు కాలువ కలుషితమైతే తమ భవిష్యత్ అంధకారమవుతుందని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆక్వా పార్క్ ప్రభావిత గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల్లో వరితోపాటు, ఆక్వా కల్చర్ కూడా సాగుతోంది. వీటికి గొంతేరు కాలువ నీరే ఆధారం. అందుకే అక్కడి వారంతా ఆక్వాపార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. పరిశ్రమ నిర్మాణానికి మద్దతు ప్రకటించిన నరసాపురం, భీమవరం ఎమ్మెల్యేలపై పూర్తి ఆగ్రహంతో ఉన్నారు. ఆయా గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు కూడా పూర్తిగా ముందుండి ఉద్యమాన్ని నడుపుతున్నారు. పైప్‌లైన్ వేస్తారా.. చూస్తాం తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పైపులైన్ వేస్తామని చెబుతున్నారు. 16 కిలోమీటర్ల మేర ఎవరి భూముల్లోంచి దీనిని వేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ‘పైపులైన్ వేయడం కోసం భూసేకరణ నోటిఫికేషన ఇవ్వనివ్వండి అప్పుడు చూద్దాం’ అని వారు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే మొగల్తూరు మండల శివార్లలో అనంద గ్రూప్ ఏర్పాటు చేసిన రొయ్య తలల ప్రాసెసింగ్ యూనిట్ వల్ల ఆ ప్రాంతంలోని గొంతేరులో దొరికే పీతలు, బొమ్మిడాయిలు వంటి మత్స్యసంపద అంతరించిపోయిందని వారు చెబుతున్నారు. గొంతేరుపై మత్స్యపురి వద్ద ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే నీటినే మంచినీటి చెరువుకు మళ్లించి, వాటిని శుద్ధి చేసుకుని తాగునీటి కోసం ఉపయోగిస్తున్నామని మొగల్తూరు మండలం కొత్తపాలెం గ్రామస్తులు చెబుతున్నారు. మా బతుకే ఈ కాలువ మా తాతల కాలం నుంచి గొంతేరు కాలువలో చేపల్ని వేటాడి బతుకుతున్నాం. తరతరాలుగా మా వత్తి ఇదే. ఈ కాలువ లేకపోతే మా బతుకు లేదు. తుందుర్రులో రొయ్యల ఫ్యాక్టరీలోని మురుగంతా ఈ కాలువలో కలిస్తే మాకు చేపలు దొరకవు. ఎలా బతికేది. –కొల్లాటి నాగరాజు, చింతరేవు, మొగల్తూరు మండలం బ్రిటీసోళ్లే నయమనిపించారు మా ఆయన, కొడుకు గొంతేరు కాలువలో చేపలు, రొయ్యిలు వేటాడుకొస్తారు. వాటిని నేను గంపలో పెట్టుకుని పట్టణానికెళ్లి వీధుల్లో అమ్ముకుని వస్తాను. ఇలాగే ఎన్నో ఏళ్లుగా బతుకుతున్నాం. మాకు గొంతేరులో వేటాడుకుని బతకమని బ్రిటీసోళ్లు లైసెన్స్‌లు ఇచ్చారు. దీన్ని కాలుష్యం చేసి ఇప్పుడు వీళ్లు మా కడుపులు కొట్టాలని చూస్తున్నారు. ఈళ్లకంటే బ్రిటీసోళ్లే నయమనిపించారు. –కొల్లాటి ముత్యామ్మ, చింతరేవు, మొగల్తూరు మండలం ఫ్యాక్టరీ కట్టనివ్వం ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళననలు చేయొద్దని పోలీసులొచ్చి బెదిరిస్తున్నారు. జైల్లో పెడతామంటున్నారు. మా బతుకే పోతున్నప్పుడు మమ్మల్ని జైల్లో పెడితే ఏంటి.. ఉరితీస్తే ఏంటి. ఫ్యాక్టరీ మాత్రం మాకొద్దు. మేం కట్టనివ్వం. వేట లేకపోతే మా బతకులే లేవు. – వైదాని మహాలక్ష్మి, చింతరేవు, మొగల్తూరు మండలం మాకే నష్టం ఎక్కువ తుందుర్రులో ఫ్యాక్టరీ కడుతున్నామని అంటున్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు తుందుర్రు వారితోనే మాట్లాడుతున్నారు. గొంతేరు కాలువ అంతా మొగల్తూరు, నరసాపురం మండలాల్లోనే ఉంది. ఇక్కడ మత్స్యకారులు నష్టపోతారు. మా పొలాలు పండవు. నష్టం అంతా మాకే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాక్టరీ కట్టనివ్వం. – రేవు రాంబాబు, ముత్యాలపల్లి , మొగల్తూరు మండలం మాకు ఇది జీవనది గొంతేరును డ్రెయిన్ అంటారు. కానీ మా కొత్తపాలెం, శేరేపాలెం చుట్టుపక్కల వాళ్లంతా గొంతేరును జీవనదిగా పిలుచుకుంటాం. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కాస్త ఉప్పునీరు ఉంటుంది. మిగతా రోజుల్లో ఈ నీటినే వాడకం నీటిగా వినియోగిస్తాం. స్నానాలు చేస్తాం, పశువులకు పట్టిస్తాం. అవసరమైనప్పుడు కాచి వడగట్టుకుని ఈ నీటినే మేమూ తాగుతాం. తుందుర్రులో రొయ్యల ఫ్యాక్టరీ కడితే ఇక అంతేసంగతులు. – – లోకం చంద్రశేఖర్, రైతు, కొత్తపాలెం, మొగల్తూరు మండలం టీడీపీ అధ్యక్షుడిగా బాధపడుతున్నా చక్కగా రెండు పంటలు పండే పొలాలు మావి. తుందుర్రులో రొయ్యల కంపెనీ కట్టి, ఆ వ్యర్థాలను గొంతేరులో వదిలితే మా పొలాలు బీడుగా మారతాయి. మేమంతా బికారులగా మిగిలిపోతాం. నేను గ్రామ టీడీపీ అధ్యక్షుడిని. ఫ్యాక్టరీ వద్దని భీమవరం ఎమ్మెల్యేకు చెప్పా. నరసాపురం ఎమ్మెల్యేకూ చెప్పా. మమ్మల్ని ఎవరో చెచ్చగొడుతున్నారని అంటున్నారు. మాకు తెలియదా, రెచ్చగొడితే రెచ్చిపోతామా. చెప్పుకోవడానికి ఏమీలేదు. బాధగా ఉంది. – కొత్తపల్లి రాంబాబు, కొత్తపాలెం, మొగల్తూరు మండలం -
మత్స్యకారుల అభివృద్ధికి ప్రణాళికలు
వేములపల్లి : మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందించిందని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు తెలిపారు. బుధవారం వేములపల్లి చిన్నచెరువు, పెద్ద చెరువులో చేప పిల్లలను విడిచిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. దళారులు, కాంట్రాక్టర్ల ఆదిపత్యం వల్ల సొసైటీ సభ్యులు ఆర్థికంగా ఎదగలేకపోతున్నారనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచితంగా చేప పిల్లలను సరఫరా చేయాలని నిర్ణయించారని పేర్కొన్నారు. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 485 చెరువులను ఎంపిక చేసి 5కోట్ల 85 లక్షల చేప పిల్లలను సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. ఆయా చెరువుల్లో వదలడానికి చేప పిల్లలను సంబంధిత సొసైటీ సభ్యులకు అందజేస్తున్నట్లు తెలిపారు. మత్స్యకార సొసైటీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నామిరెడ్డి రవీణా కరుణాకర్ రెడ్డి, జెడ్పీటీసీ ఇరుగుదిండ్ల పద్మ, రావుయల్లారెడ్డి, సర్పంచ్ జడరాములు యాదవ్, ఎంపీటీసీ పుట్టల సత్యవతి భాస్కర్, సొసైటీ అధ్యక్షుడు పందిరి శ్రీనివాస్, మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాధా రోహిణి, ఎఫ్డీఓ అంజయ్య, నాయకులు చిర్రమల్లయ్య యాదవ్, పాలుట్ల బాబయ్య, పందిరి ప్రతాప్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
చేపల వేటకు వెళ్లి మృత్యుఒడిలోకి
భీమడోలు: కొల్లేరులో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు మృత్యువాత పడ్డాడు. చెట్టున్నపాడు గ్రామానికి చెందిన మత్స్యకారుడు కరణం వెంకన్న (43) అక్కడిక్కడే మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. చెట్టున్నపాడు గ్రామంలో కరణం వెంకన్న రోజూ రాత్రి వేళల్లో కొల్లేరులో చేపల వేటకు దోనెపై వెళుతుంటాడు. ఈ క్రమం లో శుక్రవారం రాత్రి కొల్లేరులో వేటకు బయలుదేరాడు. చేపలు వేటాడుతుండగా ఈదురుగాలులకు ఒక్కసారిగా దోనె బోల్తా కొట్టింది. దీంతో నీటిలో మునిగిపోయాడు. ఉదయమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు కొల్లేరులో గాలించగా మృతదేహం కనిపిం చింది. కుటుంబానికి ఆధారమైన వెంకన్న మృతిచెందడంతో వారు కన్నీ రు మున్నీరుగా విలపించారు. భీమడోలు ఎసై బి.వెంకటేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తుల సహకారంతో మృతదేహాన్ని బయటకు తీయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చేపల వేటకు వెళ్లి విగతజీవిగా..
..కనిపించిన మత్స్యకారుడు * ఏరు కాలువలో పడి మృతి రేపల్లె : వేటకు వెళ్ళి మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన మండలంలోని మోళ్ళగుంట గ్రామంలో చోటు చేసుకుంది. బంధువుల కథనం ప్రకారం మోళ్ళగుంట గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ శ్రీరాములు(60) ఎప్పటి మాదిరిగానే ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో సముద్రంకు వెళ్లే దారిలోని పెద ఏరు కాలువకు వేటకు వెళ్లాడని, రాత్రి ఈదురుగాలులు వీస్తున్న సమయంలో శ్రీరాములు ప్రమాదవశాత్తు కాల్వలో పడి మృతి చెందాడు. సోమవారం ఉదయం 9 గంటలకు మృతదేహం పెద ఏరు కాల్వలో తేలుతూ కనిపించినట్టు గమనించి స్థానికులు సమాచారం అందించారని, దీంతో మృత దేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్టు చోడాయిపాలెం ఏఎస్ఐ ఇస్మాయిల్ చెప్పారు. మృతుడికి ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ తెలిపారు. -
ఉప్పుటేరులో వ్యక్తి గల్లంతు
చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ఉప్పుటేరులో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి పంచాయతి పరిధిలోని చింతరేవులో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బంగార్రాజు(45) శనివారం ఉదయం చేపల వేట కోసం వెళ్లాడు. అయితే.. వేటాడే సమయంలో ప్రమాద వశాత్తు ఉప్పుటేరులో పడిపోయాడు. ఇది గమనించిన తోటి జాలర్లు స్థానికులకు సమాచారం ఇచ్చారు. బంగార్రాజు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
గంగపుత్రులకు జగన్ భరోసా
-
మత్స్యకారుల తరపున పోరాడతాం: వైఎస్ జగన్
-
మత్స్యకారుల తరపున పోరాడతాం: వైఎస్ జగన్
విశాఖ : హదూద్ తుఫానులో నష్టపోయిన మత్స్యకారుల తరపున గట్టిగా పోరాడతామని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం ఫిషింగ్ హార్బర్‌ను పరిశీలించారు. బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ దాదాపు 400 మరబోట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని మత్స్యకారులు చెబుతున్నారని, ఆ నష్టపరిహారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఫిషింగ్ హార్బర్‌పై 20వేల కుటుంబాలు బతుకుతున్నాయని, ప్రతి ఇంటి పైకప్పులతో పాటు శ్లాబులు కూడా ఎగిరిపోయాని వైఎస్ జగన్ అన్నారు. అయితే నష్టాన్ని అంచనా వేయడానికి ఎవరూ ఇంతవరకూ రాలేదని మత్స్యకారులు చెబుతున్నారని, వెంటనే అధికారులు వచ్చి నష్టాన్ని అంచనా వేయాలన్నారు. తక్షణమే ఒక్కో ఇంటికి రూ.5వేలు సాయాన్ని అందించాలన్నారు. అలాగే, చేపల వేటకు వెళ్లే బోటు ఒక్కొక్కటి ఎనిమిది మందిని పోషిస్తుందని, అవన్నీ బాగా పాడైపోయినందున బోటు మరమ్మతుల కోసం కుటుంబానికి రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం అందించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. మత్స్యకారులకు నాలుగు రోజుల్లో ఒక్కపూటే పులిహోర పొట్లాలు అందాయన్నారు. -
డిజైన్ అదిరింది
ఇదేదో నేలమీద వేసిన డిజైన్ అనుకుంటున్నారా...కాదండి...గంగపుత్రులు సాగర గర్భంలో వేటాడి వెలికితీసిన మత్స్య సంపద ఇది. వారు సేకరించిన చేపలను వరుస క్రమంలో పేర్చి ఇలా ఎండబెట్టారు. కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం ఒర్లగొందితిప్పలో కనిపించిన ఈ దృశ్యం సరికొత్త డిజైన్‌ను నేలపై ఆవిష్కరించినట్లుంది కదూ. -
పండగ ముందు విషాదం
కోరుకొండ, న్యూస్‌లైన్ : పండగ జరుపుకోవాల్సిన ఆ ఇంట విషాదం అలుముకుంది. చేపల సొమ్ము తీసుకొస్తానంటూ బావమరిది తో కలిసి బైక్‌పై బయలుదేరిన మత్స్య కారుడు రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడు. కోరుకొండ విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో ఆది వారం ఉదయం మోటార్ బైక్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో కోరుకొండ పంచాయతీ వార్డు సభ్యుడు, మత్స్యకారుడు దొమాడ రమణ (36) అక్కడికక్కడే మరణించాడు. మరో మత్స్యకారుడు. అతడి బావమరిది మల్లి రాంబాబు తీవ్ర గాయాలతో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎస్సై బి.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోరుకొండలోని వడ్డీలపేటకు చెందిన మత్స్యకారులు రమణ, మల్లి రాంబాబు బావ, బావమరుదులు. ఆదివారం ఉదయం కోరుకొండ నుంచి మోటార్ బైక్‌పై వీరు గోకవరం వైపు వెళుతున్నారు. గోకవరం నుంచి కోరుకొండ వైపు వస్తున్న కారు వీరి బైక్‌ను ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ రమణ అక్కడికక్కడే చనిపోగా, రాంబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. రమణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రమణ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. వడ్డీలపేటలో విషాదం మత్స్యకారులైన రమణ మరణించడం, రాంబాబు తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు కావడంతో కోరుకొండలోని వడ్డీలపేట శోకసంద్రంగా మారింది. స్నా నం చేయడానికి వేడి నీళ్లు పెట్టాలని, వెంటనే తిరిగి వస్తానని చెప్పి వెళ్లిన రమణ తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడంటూ అతడి భార్య పార్వతి విలపిం చింది. పిల్లలను అల్లారుముద్దుగా చూ సుకునేవాడని, ఇప్పుడు ఏవరు చూస్తారంటూ ఆమె రోదిం చింది. చేపల డబ్బు కోసం గోకవరం వెళ్తున్నానంటూ బయలుదేరిన కొడుకు విగత జీవుడయ్యాడంటూ రమణ తల్లి నాగమణి విలపించింది. -
ఐఓబీ కొత్త రుణ పథకాలు
కొత్తపేట, న్యూస్‌లైన్ : మత్స్యకారులు, రైతులకు సాగరలక్ష్మి, భూలక్ష్మి పథకాల్లో పెద్ద మొత్తంలో రుణసౌకర్యం కల్పిస్తున్నట్టు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఏడీఎం చావలి తెలిపారు. మందపల్లి ఐఓబీ బ్రాంచిని ఏనుగులమహల్ వంతెన వద్ద నూతనభవనంలోకి మార్చారు. ఆ శాఖను ఈడీ చావలి దీపారాధన చేసి శుక్రవారం ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ బ్యాంక్ దేశవ్యాప్తంగా 3090 శాఖల ద్వారా రూ.3.86 లక్షల కోట్ల టర్నోవర్‌తో నడుస్తోందన్నారు. విదేశాలకు కూడా తమ సేవలను విస్తరించామన్నారు. మత్యకారులకు సాగర లక్ష్మి పథకంలో రూ. లక్ష వరకూ, రైతులకు భూలక్ష్మి పథకంలో రూ. 10 లక్షల వరకూ రుణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఐఓబీ విశాఖపట్నం రీజియన్ పరిధిలోని శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరిజిల్లా వరకూ 4 జిల్లాల్లో 59 శాఖలు, 54 ఏటీఎంలు ఉన్నాయన్నారు. త్వరలో జిల్లాలో యానాం, రాజోలులో నూతన శాఖలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ రీజియన్‌లో సుమారు రూ. 3700 కోట్ల డిపాజిట్లు ఉన్నాయన్నారు. వ్యవసాయ రంగానికి సుమారు రూ. 850 కోట్లు, చిన్న,సూక్ష్మ తరహా వ్యాపారులకు రూ. 374 కోట్లు రుణాలుగా అందజేసినట్టు చావలి తెలిపారు. విశాఖ సీఆర్ఎం కె. జగ్గారావు, మందపల్లి బ్రాంచ్ మేనేజర్ రాయుడు సూర్యప్రకాశరావు, ఐఓబీ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీరామకృష్ణ, మందపల్లి సర్పంచ్ కొల్లి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. -
పిచుకల్లంక వద్ద గోదావరిలో మునిగిన పడవ
బొబ్బర్లంక(ఆత్రేయపురం), న్యూస్‌లైన్ : తెల్లవారగానే ఆ మత్స్యకారుడు వల చేతపట్టుకుని.. పడవపై గోదావరిలో చేపల వేటకు వెళ్తాడు. సాయంత్రం వరకు వలతో వేటాడిన చేపలే అతడి సంపాదన. కుటుంబానికి జీవనాధారమైన ఆ వలే తుదకు అతడిని పొట్టనబెట్టుకుంది. గోదావరిలో సహచరులతో కలిసి చేపలను వేటాడేందుకు వెళ్లిన అతడు పడవ మునిగిన సంఘటనలో మరణించాడు. ఇంతకాలం అతడి కడుపు నింపిన వలే.. చేతికి చిక్కుకోవడంతో గోదారిలోనే అతడి బతుకు తెల్లారిపోయింది. మండలంలోని బొబ్బర్లంక గ్రామానికి చెందిన మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లి.. గోదావరిలో పడవ మునగడంతో మరణించాడు. గురువారం ఉదయం పిచ్చుకలంక వద్ద గోదావరిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. బొబ్బర్లంకలోని జల్లి వారి పేటకు చెందిన చిట్టా సత్యనారాయణ(45) గోదావరిలో చేపల వేట చేస్తుంటాడు. ఎప్పటిలాగే గురువారం ఉదయం చిట్టా సత్యనారాయణతో పాటు అతడి తమ్ముడు చిట్టా జాన్, మరో వ్యక్తి వీరవల్లి సత్యనారాయణ పడవలో చేపల వేటకు వెళ్లారు. బొబ్బర్లంక శివారు పిచ్చుకలంక వద్దకు చేరుకునే సరికి పడవలో నీరు చేరి మునిగిపోయింది. అపాయాన్ని గమనించిన చిట్టా జాన్, వీరవల్లి సత్యనారాయణ గోదావరిలోకి దూకి, ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. పడవ నుంచి దూకే సమయంలో చిట్టా సత్యనారాయణ చేతికి వల చిక్కుకుంది. దానిని విడిపించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే పడవ మునిగిపోవడంతో, అందులోనే చిట్టా సత్యనారాయణ జల సమాధి అయ్యాడు. ప్రాణాలతో బయటపడ్డ జాన్, సత్యనారాయణ వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని వలలు విసిరి చిట్టా సత్యనారాయణ మృతదేహాన్ని పట్టుకుని, ఒడ్డుకు చేర్చారు. సంఘటన స్థలానికి చేరుకున ్న మృతుడి భార్య దీవెన, బంధువులు రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. ఎస్సై కేవీఎస్ సత్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. మృతుడు సత్యనారాయణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబానికి జీవనాధారమైన సత్యనారాయణ మృతిచెందడంతో తమకు దిక్కెవరంటూ భార్య విలపించింది. అందరితో కలివిడిగా ఉండే సత్యనారాయణ మృతితో జల్లివారిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని వాయవ్య ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల్లో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడే అవకాశముందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. తాజాగా ఏర్పడిన అల్పపీడనం మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం కావడంవల్ల కోస్తాంధ్రపై ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావం కారణంగా రానున్న 24గంటల్లో ప్రధానంగా కోస్తాంధ్రలో ఉత్తర దిశగా విస్తారంగా వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. అదే సమయంలో కోస్తాలో దక్షిణ దిశగా, కొన్నిచోట్ల వాయవ్య దిశగా గంటకు 45నుంచి 50కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని, వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తం కావాలని హెచ్చరించారు.