చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ఉప్పుటేరులో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి పంచాయతి పరిధిలోని చింతరేవులో శనివారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బంగార్రాజు(45) శనివారం ఉదయం చేపల వేట కోసం వెళ్లాడు. అయితే.. వేటాడే సమయంలో ప్రమాద వశాత్తు ఉప్పుటేరులో పడిపోయాడు. ఇది గమనించిన తోటి జాలర్లు స్థానికులకు సమాచారం ఇచ్చారు. బంగార్రాజు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.