చేప...వలలో కాదు.. నోట్లో పడింది | Fish Stuck in Fisher man Throat at Bobbili | Sakshi
Sakshi News home page

చేప...వలలో కాదు.. నోట్లో పడింది

Published Fri, Oct 4 2019 9:27 AM | Last Updated on Fri, Oct 4 2019 9:36 AM

Fish Stuck in Fisher man Throat at Bobbili - Sakshi

పకీరు గొంతులో పడిన చేప, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జాలరి పకీరు

సాక్షి, బొబ్బిలి: గొంతులో పచ్చివెలక్కాయ పడిన చందాన ఓ జాలరి గొంతులో చేప పడింది. ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో చోటుచేసుకుంది. పక్కి గ్రామానికి చెందిన సత్తివరపు పకీరు.. గురువారం స్థానిక కాలువలో చేపలు పడుతున్నాడు. ఈ క్రమంలో ఒక చేప అతని గొంతులోకి పడింది. దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా గొంతు లోపలికి వెళ్లిపోయింది. దీనిని గమనించిన తోటిజాలర్లు... పకీరును బొబ్బిలిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

 డాక్టర్‌ ఆర్నిపల్లి గోపీనాథ్‌.. పకీరు గొంతులోని చేపను కొంత మేర కత్తిరించి ఎలాంటి ప్రమాదం జరగకుండా బయటకు తీశారు. అనంతరం డాక్టర్‌ గోపీనాథ్‌ మాట్లాడుతూ.. సకాలంలో పకీరును ఆస్పత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని లేదంటే చేప పూర్తిగా గొంతులోకి దిగిపోయి ఉంటే శస్త్రచికిత్స చేయాల్సి వచ్చేదని చెప్పారు.


 పకీరు గొంతులో పడిన చేప 

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జాలరి పకీరు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement