
డిజైన్ అదిరింది
ఇదేదో నేలమీద వేసిన డిజైన్ అనుకుంటున్నారా...కాదండి...గంగపుత్రులు సాగర గర్భంలో వేటాడి వెలికితీసిన మత్స్య సంపద ఇది. వారు సేకరించిన చేపలను వరుస క్రమంలో పేర్చి ఇలా ఎండబెట్టారు. కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం ఒర్లగొందితిప్పలో కనిపించిన ఈ దృశ్యం సరికొత్త డిజైన్ను నేలపై ఆవిష్కరించినట్లుంది కదూ.