చేపల వేటకు వెళ్లి మృత్యుఒడిలోకి
Published Sun, Oct 2 2016 2:18 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
భీమడోలు: కొల్లేరులో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు మృత్యువాత పడ్డాడు. చెట్టున్నపాడు గ్రామానికి చెందిన మత్స్యకారుడు కరణం వెంకన్న (43) అక్కడిక్కడే మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. చెట్టున్నపాడు గ్రామంలో కరణం వెంకన్న రోజూ రాత్రి వేళల్లో కొల్లేరులో చేపల వేటకు దోనెపై వెళుతుంటాడు. ఈ క్రమం లో శుక్రవారం రాత్రి కొల్లేరులో వేటకు బయలుదేరాడు. చేపలు వేటాడుతుండగా ఈదురుగాలులకు ఒక్కసారిగా దోనె బోల్తా కొట్టింది. దీంతో నీటిలో మునిగిపోయాడు. ఉదయమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు కొల్లేరులో గాలించగా మృతదేహం కనిపిం చింది. కుటుంబానికి ఆధారమైన వెంకన్న మృతిచెందడంతో వారు కన్నీ రు మున్నీరుగా విలపించారు. భీమడోలు ఎసై బి.వెంకటేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తుల సహకారంతో మృతదేహాన్ని బయటకు తీయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement