సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి గుజరాత్ సీఎం విజయ్ రూపానీతో ఫోన్‌లో మాట్లాడారు. గుజరాత్‌లో చిక్కుకుపోయిన ఏపీకి మత్స్యకారులను సముద్ర మార్గం ద్వారా తరలించాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు ఆయన గురువారం గుజరాత్ ముఖ్యమంత్రికి ఫోన్ చేశారు. అలాగే మత్స్యకారులను తరలించేందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
కాగా పొట్టకూటి కోసం వలస వెళ్లి గుజరాత్‌లో చిక్కుకుపోయిన మత్స్యకారులను ఆదుకోవాలని, వారికి వసతి, భోజన సదుపాయం కల్పించాలని సీఎం జగన్ ఈ నెల 21న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఫోన్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే. సీఎం జగన్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన విజయ్ రూపానీ తెలుగువారిని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు.
మత్స్యకారులుని రాష్ట్రానికి రప్పిస్తాం
విజయవాడ: గుజరాత్‌లో చిక్కుకున్న మత‍్స్యకారులను రాష్ట్రానికి రప్పిస్తామని మత్స్యకార శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ఆయన గురువారం విజయవాడలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక కృషితో ఇది సాధ్యమైందన్నారు. గుజరాత్‌లో ఉన్న 5000 మంది మత్స్యకారులను ప్రత్యేక బోటులలో రప్పిస్తున్నట్లు చెప్పారు. సముద్ర మార్గం ద్వారా ఏపీకి తరలించడానికి గుజరాత్ ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment