కార్పొరేట్లకు మద్దతిస్తున్న బీజేపీ
కార్పొరేట్లకు మద్దతిస్తున్న బీజేపీ
Published Thu, Sep 15 2016 10:41 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
వేములపల్లి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతతత్వ, కార్పొరేట్ శక్తులకు ఊతమిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి అన్నారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. లౌకిక, ప్రజాస్వామ్య దేశంలో మతతత్త్వ శక్తులను ప్రేరేపిస్తూ మనుధర్మ శాస్త్రం ప్రకారం పాలన కొనసాగించాలనే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యానికి అనుగుణంగానే మోదీ ముందుకు సాగుతున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు రూ.80లక్షల కోట్లు అప్పులు తీసుకున్న కార్పొరేట్ శక్తులకు రుణమాఫీ చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని.. సామాన్య ప్రజానీకాన్ని పట్టించుకోవడం లేదని∙పేర్కొన్నారు. బీజేపీ సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 17న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించే సాయుధ పోరాట యోధుల విజయోత్సవ సభను విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి జిల్లా యాదగిరి, వి.లెనిన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement