బట్టలు ఇస్త్రీ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతిచెందాడు.
వేములపల్లి (నల్లగొండ) : బట్టలు ఇస్త్రీ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో శుక్రవారం జరిగింది.
గ్రామానికి చెందిన గణేష్(37) ఊరికి వెళ్లడానికి బట్టలు ఇస్త్రీ చేసుకుంటుండగా.. ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.