Iron box
-
పాత ఇల్లు కూలుస్తుండగా బయటపడ్డ భోషాణం.. అందులో ఏముంది?
సాక్షి, కర్నూలు జిల్లా: దేవనకొండలో ఓ ఇనుప భోషాణం కలకలం రేపుతోంది. ఓ పురాతన ఇంటిని కూల్చుతున్నప్పుడు భోషాణం బయటపడింది. భోషాణంలో నిధులు, నిక్షేపాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే వ్యక్తికి చెందిన పాత ఇంటిని నరసింహుడు అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. కొత్త ఇల్లు నిర్మించేందుకు నరసింహుడు జేసీబీ సాయంతో పాత ఇంటిని కూల్చివేసి మట్టిని తరలించారు. ఈ క్రమంలోనే ఇనుప భోషాణం బయటపడింది. తీవ్ర ఉత్కంఠ రేపిన భోషాణాన్ని అధికారులు పగలగొట్టించారు. అయితే, భోషాణంలో నిధులు, నిక్షేపాలు ఉంటాయని భావించిన గ్రామస్తులకు నిరాశే ఎదురైంది. భోషాణంలో పాత కాగితాలు, మట్టి, చెత్తా చెదారం, పాత డాక్యుమెంట్స్ తప్ప ఇంకేమీ లేవు. చదవండి: 2023-24 ఏపీ సంక్షేమ పథకాల క్యాలెండర్.. షెడ్యూల్ ఇదే.. -
గృహోపకరణాల విభాగంలోకి ఫినోలెక్స్ కేబుల్స్
హైదరాబాద్: చిన్నపాటి గృహోపకరణాల విభాగంలోకి ఫినోలెక్స్ కేబుల్స్ అడుగు పెట్టింది. ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్ కేబుల్స్‌లో ప్రముఖ సంస్థగా ఉన్న ఫినోలెక్స్.. క్రీజ్ ఫ్రీ ఐరన్ శ్రేణిని (ఇస్త్రీ పెట్టె) విడుదల చేసింది. 750 వాట్ నుంచి 1600వాట్ సామర్థ్యంతో డ్రై, స్టీమ్ ఐరన్ బాక్స్‌లను తీసుకొచ్చింది. అందుబాటు ధరకే, దీర్ఘకాలం పాటు మన్నే ఉత్పత్తులను కస్టమర్లకు అందించాలన్న లక్ష్యంలో భాగమే నూతన శ్రేణి ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశించడమని సంస్థ తెలిపింది. 25వేలకు పైగా అవుట్లెట్లలో ఇవి లభిస్తాయని, వచ్చే ఏడాది కాలంలో లక్ష స్టోర్లలో దేశవ్యాప్తంగా విక్రయానికి అందుబాటులో ఉంచుతామని ఫినోలెక్స్ కేబుల్స్ ప్రకటించింది. చదవండి భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపు, అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్‌కు భారీ షాక్! -
ఇస్త్రీపెట్టె కొత్తదానిలా మెరవాలంటే ఇలా! ఈ విషయం మాత్రం అస్సలు మర్చిపోవద్దు
సులువైన, ఉపయోగకరమైన వంటింటి చిట్కాలు మీకోసం.. ఇస్త్రీ పెట్టె క్లీనింగ్ ఇలా.. నీళ్లలో కొద్దిగా బేకింగ్ సోడా, వెనిగర్ వేసి కలపాలి. ఈ మిశ్రమంలో ఇయర్ బడ్స్‌ను ముంచి ఇస్త్రీ పెట్టె అడుగు భాగంలో ఉన్న రంధ్రాలను తుడిస్తే లోపల పేరుకున్న దుమ్ముధూళీ పోతాయి. పెట్టె అడుగుభాగాన్ని కూడా ఈ నీటిలో ముంచి వస్త్రంతో తుడిచి, తరువాత పొడి వస్త్రంతో తుడవాలి. ఇలా చేయడం వల్ల ఇస్త్రీపెట్టె అడుగు భాగంలో నలుపు మొత్తం పోయి కొత్తదానిలా మెరుస్తుంది. అయితే ఇలా తుడిచేటప్పుడు ఇస్త్రీపెట్టె ప్లగ్‌ను స్విచ్‌బోర్డు నుంచి తీసేయాలి. లెన్స్ క్లీన్ చేసే లిక్విడ్ అందుబాటులో లేనప్పుడు.. కళ్లజోడు రోజూ వాడడం వల్ల అద్దాల మీద చిన్నచిన్న గీతలు, దుమ్ము ధూళి పడుతుంటాయి. లెన్స్ క్లీన్ చేసే లిక్విడ్ అందుబాటులో లేనప్పుడు.. అద్దాల మీద కొద్దిగా వెనిగర్ రాయాలి. రెండు నిమిషాలు ఆగిన తరువాత మెత్తటి వస్త్రంతో తుడిస్తే గీతలు, దుమ్ము ధూళి పోతాయి. టేప్ వేస్తే.. ట్యాబ్లెట్స్, సిరప్ డబ్బాల మీద ఉన్న ఎక్స్పైరీ డేట్లు ఒక్కోసారి తడితగిలి చెరిగిపోతుంటాయి. డేట్ తెలియకపోతే ఆ మందును వాడడం కష్టం. ఇలా జరగకుండా ఉండాలంటే ట్యాబ్లెట్గానీ, సిరప్‌ను గాని తీసుకొచ్చిన వెంటనే ఎప్పటి నుంచి ఎప్పటివరకు వాడవచ్చో తెలిపే డేట్స్ మీద ట్రాన్స్పరెంట్ టేప్‌ను అతికించాలి. ఈ టేప్ ఉండడంవల్ల మందు అయిపోయేంత వరకు డేట్ చెరిగిపోకుండా ఉంటుంది. మూత బిగుసుకు పోకుండా నెయిల్ పెయింట్ తీసి వేసుకునేటప్పుడు మూత అంచుల మీద కారి గాలికి గట్టిపడిపోతుంది. దీంతో .. తీసిన వెంటనే రాకుండా మూత స్ట్రక్ అయిపోతుంది. మూత పెట్టేముందు పెయింట్ సీసా మూతి చుట్టూ ఉన్న పెయింట్‌ను శుభ్రంగా తుడిచి, ఇయర్ బడ్‌తో కొద్దిగా నెయ్యి లేదా నూనెను రాసి మూతపెట్టాలి. అప్పుడు మూత బిగుసుకు పోకుండా చక్కగా వస్తుంది. రబ్బర్ బ్యాండ్ మూటకట్టి వాషింగ్ మెషిన్లో పెద్దవాళ్ల బట్టలతోపాటు, సాక్సులు, కర్చీఫ్‌లు, చిన్న చిన్న బట్టలు వేయాలనుకున్నప్పుడు.. కూరగాయలు, పండ్లకు ఇచ్చే నెట్ బ్యాగ్‌లో చిన్నచిన్న బట్టలను వేసి రబ్బర్ బ్యాండ్ మూటకట్టి వాషింగ్ మెషిన్లో వేయాలి. అప్పుడు చక్కగా క్లీన్ అవ్వడంతోపాటు, మిగతా బట్టల్లో కలిసిపోకుండా ఉంటాయి. తాజాగా ఉండేందుకు టొమాటో తొడిమ తీసిన ప్రాంతంలో రెండు చుక్కలు నూనె రాసి రిఫ్రిజిరేటర్లో నిల్వచేస్తే ఎక్కువ రోజులపాటు రంగు మారకుండా తాజాగా ఉంటాయి. చదవండి: ఉల్లిపాయ రసంలో బాదం నూనె కలిపి జుట్టుకు పట్టిస్తున్నారా? కొబ్బరి నూనెలో ఆవాలు వేయించి ముఖానికి రాస్తే! Korrala Idli- Millet Halwa: ‘సిరి’ ధాన్యాలు.. నోటికి రుచించేలా.. కొర్రల ఇడ్లీ, మిల్లెట్ హల్వా తయారీ ఇలా.. -
పది కోట్ల ప్రైజ్‌మనీ రేసులో మన బిడ్డ
మా వీధి చివర ఒక అంకుల్ రోజూ ఇస్త్రీ బండి మీద బరువైన ఐరన్‌బాక్స్‌తో కష్టపడడం చూశా. రీయూజబుల్ ఎనర్జీతో తయారు చేయడం వల్ల ఆయనలాంటి వాళ్లకు ఈజీగా ఉంటుందనుకున్నా. మనదేశంలో సూర్యుడు దాదాపు 250కిపైగా రోజులు ఉంటాడు. అందుకే ఈ సైకిల్ కార్ట్‌ని తయారుచేశా. పైగా నా ఇన్నొవేషన్ ‘ఇస్త్రీవాలాలకు’లకు ఖర్చు తగ్గించడమే కాదు పర్యావరణానికి సాయం చేస్తుంది కూడా.. అంటోంది స్మార్ట్ ఐరన్ కార్ట్ రూపకర్త వినీషా ఉమాశంకర్. ప్రతిష్టాత్మక యూకే పురస్కార ప్రైజ్‌మనీ రేసులో నిలిచి.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది ఈ అమ్మాయి. పొల్యూషన్‌ని తగ్గించే ఇన్నోవేషన్స్‌కి ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో యువ ఆవిష్కరణకర్తలకు అవకాశం కల్పిస్తూ.. 1 మిలియన్ పౌండ్స్ (మనకరెన్సీలో పది కోట్లకు పైనే). ప్రిన్స్ విలియమ్ ‘ఎర్త్‌షాట్ ప్రైజ్’ అందించబోతున్నారు. ఇందుకుగానూ శుక్రవారం స్వయంగా 15 మంది పేర్లను ప్రకటించారు ప్రిన్స్ విలియమ్. ఈ లిస్ట్‌లో 14 ఏళ్ల తమిళనాడు అమ్మాయి, చిల్డ్రన్స్ క్లైమేట్ ప్రైజ్ విన్నర్ వినీషా కూడా ఉంది. వాతావరణాన్ని కలుషితం చేయని ఇస్త్రీపెట్టె బండిని తయారు చేసింది వినీషా, సోలార్ ఎనర్జీతో పనిచేసే ఇస్త్రీపెట్టె బండిని డిజైన్ చేసింది తిరువణ్ణామలైకి చెందిన వినీషా ఉమాశంకర్. విశేషం ఏంటంటే.. లాక్డౌన్ టైంలో చిన్నారి సోలోగా ఆరునెలలు కష్టపడి మరీ ఈ బండిని డెవలప్ చేయడం. ఈ ఇన్నొవేషన్‌ని పరిశీలించిన నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్.. పేటెంట్ హక్కుల విషయంలో ఆమెకి సాయం చేసింది కూడా. అయితే ఈ ఆలోచన బాగుండడంతో స్వీడన్‌కి చెందిన చిల్ట్రన్స్ క్లైమేట్ ఫౌండేషన్ రీసెంట్గా క్లీన్ ఎయిర్ కేటగిరిలో వినీషాకి ‘చిల్డ్రన్స్ క్లైమేట్ ప్రైజ్’ అందించింది. అంతేకాదు స్వీడన్ ఎనర్జీ కంపెనీ ఈ ఐడియాను గ్రౌండ్ లెవల్లోకి తీసుకొచ్చేందుకు 11 వేల డాలర్ల సాయాన్ని వినీషాకి అందించింది. ఖర్చుకి తగ్గ ఫలితం ఇళ్లలో కరెంట్‌తో పని చేసే ఐరెన్ బాక్స్‌లు ఉన్నప్పటికీ.. ఇస్త్రీ చేసేవాళ్లు మాత్రం ఇప్పటికీ ఐదుకేజీల బరువున్న ఇస్త్రీ పెట్టెలు.. వాటిలోకి కర్ర బొగ్గునే వాడుతున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం.. మనదేశంలో ఇస్త్రీవాలాల సంఖ్య కోటికి పైనే. వీళ్లంతా యావరేజ్‌గా రోజుకి ఐదు కేజీల చార్కోల్(బొగ్గు) ఉపయోగిస్తున్నారు. వీటివల్ల పర్యావరణానికి డ్యామేజ్ జరుగుతోంది. పైగా ఆ పొల్యూషన్ వల్ల వాళ్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. ఇది గమనించిన వినీష ఈ సోలార్ ఐరన్ బండిని డిజైన్ చేసింది. ఈ చక్రాల బండి పైకప్పు మీద సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. వాటికి బ్యాటరీలు ఉంటాయి. సన్‌లైట్‌లో ఐదు గంటలపాటు ఉంటే చాలు ఈ బండి ఛార్జ్ అవుతుంది. ప్యానెల్‌కి ఉన్న ఒక్కో బ్యాటరీ ఆరు గంటలు పని చేస్తుంది. వాటి సాయంతో ఐరన్ బాక్స్ పని చేస్తుంది. అంతేకాదు ఈ బండికి యూఎస్బీ పోర్ట్ ఫెసిటిటీస్ కూడా ఏర్పాటు చేసింది వినీష. అవసరం అనుకుంటే ఈ బండికి జనరేటర్‌ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ ఐరన్ కార్ట్ ధర రూ. 40 వేలు. అయితే ఇస్త్రీవాలాలు కర్రబొగ్గు మీద చేసే ఖర్చుని ఈ సోలార్ ఇస్త్రీ బండి మాగ్జిమమ్ తగ్గించేస్తుందని చెబుతోంది వినీష. ప్రిన్స్ విలియమ్ కిందటి ఏడాది అక్టోబర్‌లో ఈ ఎర్త్‌షాట్ ప్రైజ్ అనౌన్స్ చేశారు. ఈ పదిహేనులో(ఒక నగరం కూడా ఉంది).. ఐదుగురికి ప్రైజ్ మనీ పంచుతారు. అక్టోబర్ 17న లండన్ అలెగ్జాండ్రా ప్యాలెస్‌లో విజేతలకు ప్రైజ్ మనీ అందిస్తారు. -
బ్రహ్మం..బ్రహ్మాండం
యాప్రాల్ : కృషి, పట్టుదల ఉంటే సామాన్యుడు సైతం అద్భుతాలు సృష్టిస్తాడు. అందుకు ఉదహరణే బాలాజి నగర్ నివాసి కొదురుపాక లింగబ్రహ్మం. ఇతను ఓ ఇంజనీరు అనుకుంటే పొరపాటే. చదివింది మూడో తరగతే. వరంగల్ జిల్లాలో ఓ మారుమూల గ్రామం ఎల్లాయిగూడెంలోని ఓ నిరుపేద కుటుంబంలో జన్మించి కంసాలి పని చేసుకుంటూ ఉండేవాడు. కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి బాలాజినగర్లో నివాసముంటున్నాడు. ఏదో ఒకటి చేయాలనే తపన ఎప్పటి నుంచో బ్రహ్మం మనసులో పడింది. బొగ్గు, విద్యుత్‌తో పని చేసే ఇస్త్రీ పెట్టెల వల్ల ఖర్చు ఎక్కువగా అవుతుందని భావించి గ్యాస్‌తో పని చేసే ఇస్త్రీ పెట్టెను తయారు చేయాలనుకున్నాడు. స్నేహితులు, బంధువులు నిరుత్సాహపరిచినా పట్టు వీడలేదు. కుల వృత్తిని నిర్లక్ష్యం చేయడంతో ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. అయినా అదే పనిగా 2004 సంవత్సరం నుండి 2005 సంవత్సరం వరకు సంవత్సరం పాటు కష్టపడి గ్యాస్‌తో పని చేసే ఇస్త్రీ పెట్టెను తయారు చేసి తన లక్ష్యాన్ని సాధించాడు. ఇతను రూపొందించిన ఇస్త్రీ పెట్టె ఎల్పీజీ గ్యాస్‌తో పని చేస్తూ రెండు నిమిషాలలోనే వేడెక్కుతుంది. గ్యాస్ ఖర్చు రోజంతా ఇస్త్రీ చేస్తే 8 నుండి 10 రూపాయల వరకు అవుతుందని బ్రహ్మం తెలిపారు. ఇతని ప్రతిభను గుర్తించి అహ్మదాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్నోవేషంట్ ఫౌండేషన్ వారు గుర్తింపు పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం ప్రొత్సహిస్తే బ్యాంక్ నుంచి రుణాలు ఇప్పిస్తే గ్యాస్‌తో కూడిన ఇస్త్రీ పెట్టెల తయారి కర్మాగారాన్ని నిర్మిస్తానని బ్రహ్మం తెలిపారు. -
ఇస్త్రీ పెట్టె, ట్రక్కు గుర్తులను రద్దు చేయండి: కేసీఆర్
న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నిర్వచన్ సదన్‌లో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరాతో సమావేశమయ్యారు. ఇస్త్రీ పెట్టె, ట్రక్కు వంటి కారు గుర్తును పోలిన గుర్తులను రద్దు చేయాలని ఈ సందర్భంగా అరోరాని కేసీఆర్ కోరారు. తెలంగాణలో ఓట్ల తొలగింపు వల్ల టీఆర్ఎస్కు నష్టం జరిగిందని, తొలగించిన ఓట్లను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. లోక్ సభ ఎన్నికలకు ముందే సవరణలు చేయాలని కోరారు. ఎంపీలు వినోద్ కుమార్, బండ ప్రకాశ్‌లు కేసీఆర్ వెంట ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ బుధవారం ప్రధాని మోదీని కలిసి పలు కీలక అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో ట్రక్కు గుర్తుతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు నష్టం జరిగిందని ఎంపీ వినోద్ అన్నారు. 'ట్రక్కు, కెమెరా, ఇస్త్రీ పెట్టె, హ్యాట్ గుర్తులపై సునీల్ అరోరాతో కేసీఆర్ చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో కారు గుర్తును పోలిన ట్రక్కుతో ఓటర్లు గందరగోళానికి గురయ్యారు. 15 మంది అభ్యర్థులకు వెయ్యి నుంచి 15 వేల ఓట్ల నష్టం జరిగింది. వెయ్యి ఓట్ల వరకు చాలా నియోజక వర్గాల్లో నష్టం జరిగింది. అందువల్ల ట్రక్కు సింబల్ ఇకపై ఇవ్వొద్దని, ఎవరికీ కేటాయించవద్దని కేసీఆర్ సునీల్ అరోరాను కోరారు. ప్రజా స్వామ్యంలో ఓటర్లకు అనువుగా గుర్తులు ఉండాలి. ఓటర్లను గందరగోళానికి గురి చేసేలా గుర్తులు ఉండకూడదని సీఎం కోరారు. ఎన్నికల ముందే ఈ అంశంపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఎంపీలందరం ఫిర్యాదు చేశాము. కానీ, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఏమి చేయలేమని అన్నారు. మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కారును పోలిన గుర్తులను కేటాయించవద్దని, కారు గుర్తు సైతం పలుచని రంగులో ఉన్నందున ఆ రంగును పెంచాలని సీఎం కేసీఆర్ కోరారు. త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం భేటి అయి నిర్ణయం తీసుకుంటామని సునిల్ అరోరా కేసీఆర్‌కు తెలిపారు. తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా సాగినందుకు కేసీఆర్ కృతజ్ఙతలు తెలిపారు' అని ఎంపీ వినోద్ తెలిపారు. (కారుకు ట్రక్కు బ్రేకులు!) -
ఇస్త్రీ చేస్తుండగా కరెంట్ షాక్
వేములపల్లి (నల్లగొండ) : బట్టలు ఇస్త్రీ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన గణేష్(37) ఊరికి వెళ్లడానికి బట్టలు ఇస్త్రీ చేసుకుంటుండగా.. ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉత్కంఠ రేకెత్తించింది.. ఉత్త రేకులే
‘పెట్టె లోపల ఏముందో? బంగారమే ఉందో? వజ్రైవె ఢూర్యాలే ఉన్నాయో?’.. గత నెల 17 నుంచీ కుతూహలంతో ఎదురు చూసిన లక్షలాదిమంది చివరికి ‘ఓస్ ఇంతేనా!’ అనుకోవలసి వచ్చింది. పాడుబడ్డ ఇంటిని తొలగిస్తుండగా బయటపడ్డ భారీ ఇనప్పెట్టెను శుక్రవారం తెరిచి చూడగా దాని అరల్లో కొన్ని పాత ఇనుపరేకులు మాత్రమే ఉన్నాయి. ⇒ నరేంద్రపురంలో నెలక్రితం పాత ఇంటిలో బయల్పడ్డ ఇనప్పెట్టె ⇒నిధులు ఉన్నాయన్న ప్రచారంతో జనంలో విపరీతమైన ఆసక్తి ⇒పోలీసుల సంరక్షణలో ఉన్న పెట్టెను శుక్రవారం తెరచిన అధికారులు ⇒తుప్పు పట్టిన ఇనుప రేకులే ఉండడంతో తుస్సుమన్న కుతూహలం నరేంద్రపురం (పి.గన్నవరం): నరేంద్రపురం శివాలయం వీధిలో పాడుబడ్డ ఇంటిలో విషసర్పాలు సంచరిస్తుండటంతో యజమాని అంగీకారంతో ఇంటిని తొలగిస్తుండగా గత నెల 17న ఇనుపపెట్టె బయటపడింది. తాళం వేసి ఉన్న ఆ పెట్టెలో నిధి, నిక్షేపాలు ఉంటాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ఇంటి యజమాని భూస్వామి కావడంతో ఆ ప్రచారానికి బలం చేకూరింది. పెట్టె గురించి పత్రికల్లో వచ్చిన కథనాలతో నరేంద్రపురం, పరిసర గ్రామాల్లోనే కాక ఇతర ప్రాంతాల్లోనూ, చివరికి విదేశాల్లో ఉంటున్న ఈ ప్రాంతానికి చెందిన వారిలోనూ ఆసక్తి పెరిగింది. పెట్టెలో ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తితో దాన్ని తెరిచే రోజు కోసం ఎదురు చూశారు. ఇప్పటి వరకూ పోలీసుల సంరక్షణలో ఉన్న ఆ పెట్టెను శుక్రవారం కలెక్టర్ అనుమతితో తహశీల్దార్ ఎల్.జోసెఫ్, ఎస్సై జి.హరీష్‌కుమార్‌లు ఇంటి యజమాని వారసుడు ఈమని రామ జగన్నాథశాస్త్రి, గ్రామస్తుల సమక్షంలో కట్టర్ సాయంతో తెరిపించారు. లోపల ఉన్న సీక్రెట్ లాకర్లను తీయగా కొన్ని పాత ఇనుపరేకులు మాత్రమే కనిపించాయి. పెట్టెను తెరవనున్న విషయం తెలిసి వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు. వారిని పోలీసులు నియంత్రించ వలసి వచ్చింది. పెట్టెను తెరుస్తుండగా చూడాలన్న ఆరాటంతో కొందరు చేరువలోని బాత్రూమ్ పైకి ఎక్కారు. పెట్టె తెరుస్తున్న దృశ్యాలను పలువురు సెల్ ఫోన్లు, కెమేరాల్లో చిత్రీకరించారు. చివరికి ఇనుపరేకులే దర్శనమివ్వడంతో వారి ఉత్కంఠపై నీళ్లు జల్లినట్టయింది. కాగా తెరిచిన పెట్టెను పోలీస్ స్టేషన్‌కు తరలిస్తామని తహశీల్దార్ జోసెఫ్ విలేకరులకు చెప్పారు. కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాక దానిని యజమానికి తిరిగి అప్పగిస్తామన్నారు. డిప్యూటీ తహశీల్దార్ దేవళ్ళ శ్రీనివాస్, ఆర్ఐ బొరుసు లక్ష్మణరావు, ఏఎస్సై ఎన్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఈ పెట్టెలో పెన్నిధి ఉందా?
నరేంద్రపురం (పి.గన్నవరం) : మండలంలోని నరేంద్రపురంలో పాడుబడ్డ ఓ గృహం ఇప్పుడు ఆ ఊళ్లోనే కాక పరిసర గ్రామాల్లోనూ ఊహాగానాలకు కేంద్రబిందువైంది. శిథిలమైన ఆ ఇంటిని తొలగిస్తుం డగా సోమవారం బయటపడ్డ ఓ ఇనుపపెట్టె అందుకు కారణం. ‘ఆ పెట్టెలో ఏముంది? మేలిమి బంగారమా? నవరత్నాలు పొదిగిన నగలా?’ అన్న కుతూహలం ప్రతి వారి మదిలో చెలరేగుతోంది. అది తేలాలంటే మంగళవారం వరకూ ఆగాల్సిందే. స్థానిక శివాలయం వీధిలో భూస్వామి ఈమని రామగోపాలానికి చెందిన పెంకుటింటిలో సుమారు 40 ఏళ్ల నుంచి ఎవరూ నివసించడం లేదు. పిల్లలు లేని రామగోపాలం, అచ్యుతమ్మ దంపతులు పశ్చిమ గోదావరి జిల్లాలోని కవిటం వెళ్లిపోయి బంధువుల కుమారుడు వెంకట జగన్నాథశాస్త్రిని దత్తత తీసుకున్నారు. 25 ఏళ్ల క్రితం అచ్యుతమ్మ, 20 ఏళ్ల క్రితం రామగోపాలం మరణించారు. ఇన్నేళ్లలో ఆ ఇల్లు పాడుబడి, శిథిలమై పాములకు నెలవుగా మారింది. దీంతో ఆందోళన చెందిన స్థానికులు ఇంటిని తొలగించాలని శాస్త్రిని కోరారు. ఆదివారం వచ్చిన ఆయన కొబ్బరికాయ కొట్టి తొలగింపు పనులకు శ్రీకారం చుట్టి వెళ్లిపోయారు. సోమవారం జేసీబీతో ఇంటి శిథిలాలను తొలగిస్తుండగా తాళం వేసి ఉన్న పెద్ద ఇనుప పెట్టె బయటపడింది. దాంతో ఆ ఇంట్లో గుప్తనిధులు బయటపడ్డాయని, లంకెబిందెలు లభించాయని క్షణాల్లో ఊరంతా ప్రచారం జరిగింది. ఇంటి యజమానులు భూస్వాములు కావడం ఆ ప్రచారానికి ఊతమిచ్చింది. విషయం తెలిసిన పోలీసులు, రెవెన్యూ అధికారులు రాత్రి 8.30 గంటలకు గ్రామానికి చేరుకుని ఇనుప పెట్టెను స్వాధీనం చేసుకున్నారు. పి.గన్నవరం ఏఎస్సై ఎన్.సత్యనారాయణ, ఆర్ఐ బొరుసు లక్ష్మణరావు, వీఆర్వో తటవర్తి కృష్ణ పెట్టెను పరిశీలించారు. శాస్త్రి వచ్చాక ఆయన సమక్షంలో మంగళవారం పెట్టెను తెరవాలని నిర్ణయించారు. అంతవరకూ పోలీసులకు కాపలాగా ఉంచారు. అంటే.. పెట్టె తెరిచే వరకూ పట్టరాని కుతూహలం తప్పదన్న మాట. -
ఇలా చేయండి..బిల్లు తగ్గించండి
ప్రతి ఇంటా విద్యుత్ వినియోగం తప్పనిసరి. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు కరెంటు వాడకం ఎంతో అవసరం. దీంతో రోజురోజుకూ ధరలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి పైసాను పొదుపు చేస్తే సంపాదించినట్లే. ఈ విషయం విద్యుత్‌కు కూడా వర్తిస్తుంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎంతో విద్యుత్ ఆదా అవుతుంది. తద్వారా బిల్లుల భారంకూడా తగ్గుతుంది. - సాక్షి, ఆదిలాబాద్ ఫ్యాన్ వినియోగంలో .. {బాండెడ్ కంపెనీల ఫ్యాన్లనే వాడాలి. గదిలో ఎవరూ లేనప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేయాలి. ఫ్యాన్ తిరిగేటప్పుడు శబ్దం ఎక్కువగా వస్తే బేరింగులు దెబ్బతిన్నట్లు గమనించాలి. వెంటనే రిపేర్ చేయించాలి. చౌక ధరలకు దొరికే ఫ్యాన్లను వాడకూడదు. కిటికిటీలు, తలుపులు తెరిచి ఉంచితే ఫ్యాన్ల అవసరం అంతగా ఉందడు. ఐరన్ బాక్స్ వాడకంలో.. టీవీ చూస్తూ, కబుర్లు చెపుతూ ఇస్త్రీ చేస్తే బిల్లు అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఐరన్ బాక్స్ కొనేటప్పుడు తక్కువ బరువు, ఆటోమెటిక్‌గా పని చేసే వాటిని ఎంపిక చేసుకోవాలి. ఇస్త్రీ మధ్యలో ఆపి చేయటం వల్ల వేడి వృథా అవుతుంది. ఎలక్ట్రిక్ కుక్కర్ వంట చేసేటప్పుడు వార్మ్లో పడగానే స్విచ్ ఆపేసిన అన్నం ఉడుకుతుంది. విద్యుత్ కుక్కర్ కంటే గ్యాస్ స్టౌవ్‌పై అన్నం వండితే ఖర్చు తగ్గుతుంది. కుక్కర్ మూత పగిలితే చాలా మంది ప్లేట్లు వాడతారు. ఆవిరి నష్టం ఎక్కువై కరెంటు వినియోగం అధికమవుతుంది. తద్వారా బిల్లు భారం అవుతుంది. వాషింగ్ మిషన్ వాడకంలో.. {yయ్యర్ సౌకర్యాన్ని వాడకుండా బట్టలను బయట ఆరవేస్తే విద్యుత్ ఆదా అవుతుంది. లోడ్‌కు సరిపడ బట్టలున్నప్పుడే వాషింగ్ మిషన్‌ను వాడాలి. ఇంట్లో వాడే పరికరాలన్ని ఐఎస్ఐ మార్క్ కల్గి ఉండాలి. లైట్ల వాడకంలో... ట్యూబ్‌లైట్లు, కంపాక్ట్ ఫ్లూరోసెంట్ బలుబులే వాడాలి, పగలు వీలైనంత వరకు లైట్లను వినియోగించరాదు. కిటికీలు తలుపులు తీసి ఉంచితే వెలుతురు వస్తుంది. లైట్లను నెలకొక సారి తడిగుడ్డతో తుడిస్తే కాంతివంతంగా వెలుగుతాయి. 40 వాట్ల ఫిలమెంట్ బల్బు ఇచ్చే వెలుతురును 15 వాట్ల కంపాక్ట్ బల్బులు ఇస్తాయి. గీజ ర్ వాడకంలో.. గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే కరెంటు వినియోగం తగ్గుతుంది. గీజర్ కంటే సోలార్ వాటర్ హీటర్ వాడితే విద్యుత్ ఆదా చేసుకోవ చ్చు. అందరు వెనువెంటనే స్నానం చేస్తే గీజ ర్ను ఎక్కువ సేపు ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు. కరెంటు వినియోగం తగ్గుతుంది. ఫ్రిజ్ వాడకంలో డోర్‌ను సాధ్యమైనంత వరకు తక్కువ సార్లు తీయాలి. ఒక్కసారి డోర్ తెరిస్తే అరగంట కూలింగ్ పోతుంది. {ఫిజ్ పై ఎండ పడకుండా చూసుకోవాలి. {ఫిజ్ వెనక భాగానా గాలి తగిలేలా చూసుకోవాలి. గది చల్లబరచడానికి కొందరు ఫ్రిజ్ డోర్ తీస్తారు. ఇది సరైంది కాదు.