సాక్షి, కర్నూలు జిల్లా: దేవనకొండలో ఓ ఇనుప భోషాణం కలకలం రేపుతోంది. ఓ పురాతన ఇంటిని కూల్చుతున్నప్పుడు భోషాణం బయటపడింది. భోషాణంలో నిధులు, నిక్షేపాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే వ్యక్తికి చెందిన పాత ఇంటిని నరసింహుడు అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. కొత్త ఇల్లు నిర్మించేందుకు నరసింహుడు జేసీబీ సాయంతో పాత ఇంటిని కూల్చివేసి మట్టిని తరలించారు. ఈ క్రమంలోనే ఇనుప భోషాణం బయటపడింది.
తీవ్ర ఉత్కంఠ రేపిన భోషాణాన్ని అధికారులు పగలగొట్టించారు. అయితే, భోషాణంలో నిధులు, నిక్షేపాలు ఉంటాయని భావించిన గ్రామస్తులకు నిరాశే ఎదురైంది. భోషాణంలో పాత కాగితాలు, మట్టి, చెత్తా చెదారం, పాత డాక్యుమెంట్స్ తప్ప ఇంకేమీ లేవు.
చదవండి: 2023-24 ఏపీ సంక్షేమ పథకాల క్యాలెండర్.. షెడ్యూల్ ఇదే..
Comments
Please login to add a commentAdd a comment