సులువైన, ఉపయోగకరమైన వంటింటి చిట్కాలు మీకోసం..
ఇస్త్రీ పెట్టె క్లీనింగ్ ఇలా..
నీళ్లలో కొద్దిగా బేకింగ్ సోడా, వెనిగర్ వేసి కలపాలి.
ఈ మిశ్రమంలో ఇయర్ బడ్స్‌ను ముంచి ఇస్త్రీ పెట్టె అడుగు భాగంలో ఉన్న రంధ్రాలను తుడిస్తే లోపల పేరుకున్న దుమ్ముధూళీ పోతాయి.
పెట్టె అడుగుభాగాన్ని కూడా ఈ నీటిలో ముంచి వస్త్రంతో తుడిచి, తరువాత పొడి వస్త్రంతో తుడవాలి.
ఇలా చేయడం వల్ల ఇస్త్రీపెట్టె అడుగు భాగంలో నలుపు మొత్తం పోయి కొత్తదానిలా మెరుస్తుంది.
అయితే ఇలా తుడిచేటప్పుడు ఇస్త్రీపెట్టె ప్లగ్‌ను స్విచ్‌బోర్డు నుంచి తీసేయాలి.
లెన్స్ క్లీన్ చేసే లిక్విడ్ అందుబాటులో లేనప్పుడు..
కళ్లజోడు రోజూ వాడడం వల్ల అద్దాల మీద చిన్నచిన్న గీతలు, దుమ్ము ధూళి పడుతుంటాయి.
లెన్స్ క్లీన్ చేసే లిక్విడ్ అందుబాటులో లేనప్పుడు.. అద్దాల మీద కొద్దిగా వెనిగర్ రాయాలి.
రెండు నిమిషాలు ఆగిన తరువాత మెత్తటి వస్త్రంతో తుడిస్తే గీతలు, దుమ్ము ధూళి పోతాయి.
టేప్ వేస్తే..
ట్యాబ్లెట్స్, సిరప్ డబ్బాల మీద ఉన్న ఎక్స్‌పైరీ డేట్‌లు ఒక్కోసారి తడితగిలి చెరిగిపోతుంటాయి. డేట్ తెలియకపోతే ఆ మందును వాడడం కష్టం.
ఇలా జరగకుండా ఉండాలంటే ట్యాబ్లెట్‌గానీ, సిరప్‌ను గాని తీసుకొచ్చిన వెంటనే ఎప్పటి నుంచి ఎప్పటివరకు వాడవచ్చో తెలిపే డేట్స్ మీద ట్రాన్స్‌పరెంట్ టేప్‌ను అతికించాలి.
ఈ టేప్ ఉండడంవల్ల మందు అయిపోయేంత వరకు డేట్ చెరిగిపోకుండా ఉంటుంది.
మూత బిగుసుకు పోకుండా
నెయిల్ పెయింట్ తీసి వేసుకునేటప్పుడు మూత అంచుల మీద కారి గాలికి గట్టిపడిపోతుంది. దీంతో .. తీసిన వెంటనే రాకుండా మూత స్ట్రక్ అయిపోతుంది.
మూత పెట్టేముందు పెయింట్ సీసా మూతి చుట్టూ ఉన్న పెయింట్‌ను శుభ్రంగా తుడిచి, ఇయర్ బడ్‌తో కొద్దిగా నెయ్యి లేదా నూనెను రాసి మూతపెట్టాలి.
అప్పుడు మూత బిగుసుకు పోకుండా చక్కగా వస్తుంది.
రబ్బర్ బ్యాండ్ మూటకట్టి
వాషింగ్ మెషిన్‌లో పెద్దవాళ్ల బట్టలతోపాటు, సాక్సులు, కర్చీఫ్‌లు, చిన్న చిన్న బట్టలు వేయాలనుకున్నప్పుడు.. కూరగాయలు, పండ్లకు ఇచ్చే నెట్ బ్యాగ్‌లో చిన్నచిన్న బట్టలను వేసి రబ్బర్ బ్యాండ్ మూటకట్టి వాషింగ్ మెషిన్‌లో వేయాలి.
అప్పుడు చక్కగా క్లీన్ అవ్వడంతోపాటు, మిగతా బట్టల్లో కలిసిపోకుండా ఉంటాయి.
తాజాగా ఉండేందుకు
టొమాటో తొడిమ తీసిన ప్రాంతంలో రెండు చుక్కలు నూనె రాసి రిఫ్రిజిరేటర్‌లో నిల్వచేస్తే ఎక్కువ రోజులపాటు రంగు మారకుండా తాజాగా ఉంటాయి.
చదవండి: ఉల్లిపాయ రసంలో బాదం నూనె కలిపి జుట్టుకు పట్టిస్తున్నారా? కొబ్బరి నూనెలో ఆవాలు వేయించి ముఖానికి రాస్తే!
Korrala Idli- Millet Halwa: ‘సిరి’ ధాన్యాలు.. నోటికి రుచించేలా.. కొర్రల ఇడ్లీ, మిల్లెట్ హల్వా తయారీ ఇలా..
Comments
Please login to add a commentAdd a comment