కాంట్రాక్టుల కోసమే పార్టీ మారారు
కాంట్రాక్టుల కోసమే పార్టీ మారారు
Published Sat, Oct 1 2016 8:37 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
వేములపల్లి : అధికార పార్టీ నేతల ప్రలోభాలకు లొంగిన కొందరు నాయకులు కాంట్రాక్టుల కోసమే పార్టీ మారి కన్నతల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచారని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. నాయకులు పార్టీ వీడినంత మాత్రాన కార్యకర్తలు అధైర్యపడవద్దన్నారు. కాంగ్రెస్‌పార్టీకి కార్యకర్తలే నైతిక బలమని, 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టడం తథ్యమన్నారు. వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 20వేల చొప్పున నష్టపరిహారాన్ని అందించాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నార్కట్‌పల్లి జెడ్పీటీసీ సత్తయ్య యాదవ్, డీసీసీ ఉపాధ్యక్షుడు పందిరి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం వేణుగోపాల్ రెడ్డి, గుమ్మల మోహన్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దామిడి గోపాల్‌రెడ్డి, పుట్టల శ్రీనివాస్, కల్లు శ్రీను, ఇరుగు వెంకటయ్య, ఎండీ.ఆరీఫ్, సత్తయ్యగౌడ్, బొంగర్ల గిరి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గ్నొరు.
Advertisement