సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్‌కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు.
ఇప్పటికే ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా.. 8 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు చేరారు. కాంగ్రెస్ గూటికి మరో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ చేరనున్నారు. త్వరలో సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడానికి రెడీ అయినట్లు సమాచారం.
కాగా, కాంగ్రెస్‌లో చేరేందుకు మరో ఎమ్మెల్యే రెడీ అయ్యారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ప్రకాశ్ గౌడ్ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment