వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి
Published Thu, Sep 19 2013 1:43 AM | Last Updated on Thu, Apr 4 2019 5:24 PM
రావులపెంట(వేములపల్లి), న్యూస్‌లైన్ :మండలంలోని రావులపెంటలో ఓ యువకుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. గ్రామస్తుల కథనం మేరకు.. రావులపెంటకు చెందిన తరి నాగయ్య(26) గ్రామ సమీపంలో గల శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో పూ జారిగా ఉంటున్నాడు. బుధవారం గుడిపై ఉన్న విగ్రహాలను శుభ్రం చేసేందుకు ఎక్కాడు. విగ్రహాలను శుభ్రం చేస్తుండగా గుడి మీదుగా వెళ్లిన 33 కేవీ విద్యుత్ తీగలు తగలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నా రు. నాగయ్య మృతదేహాన్ని ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సందర్శించి సంతాపం తెలిపారు. బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారిలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మాలి పురుషోత్తంరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, సర్పంచ్ శీలం సైదమ్మశ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
చౌటుప్పల్‌లో ఒడిషా వాసి...
చౌటుప్పల్: మండలంలోని లింగోజిగూడెం శివారులోని సూ ర్యోదయ స్పిన్నింగ్ మిల్లులో ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృ తి చెందాడు. ఒడిషాలోని బలిమెర గ్రామానికి చెందిన అన్నదమ్ములు సంతోష్‌కుమార్‌నాయక్(26), బ్రహ్మానందనాయక్‌లు రెండేళ్ల కిత్రం ఉపాధి నిమిత్తం చౌటుప్పల్ పట్టణానికి వచ్చా రు. ఇక్కడ సూర్యోదయ స్పిన్నింగ్ మిల్లులో పని చేస్తూ కంపెనీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. క్వార్టర్స్ పైకప్పు సిమెంట్ రేకులు కావడంతో పగిలిపోయి వర్షానికి కురుస్తున్నాయి. సంతోష్‌కుమార్‌నాయక్ మరో కార్మికుడు వీరయ్యతో కలిసి రేకులకు ప్యాచ్ వర్క్ చేసేందుకు క్వార్టర్స్ పెకైక్కారు. సంతోష్‌కుమార్ ప్రమాదవశాత్తు క్వార్టర్స్ మీదుగా ఉన్న కరెంట్ తీగలకు తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
డ్రెయినేజీలో పడి బాలుడు...
మిర్యాలగూడ క్రైం: ప్రమాదవశాత్తు ఓ బాలుడు డ్రెయినేజీలో పడి మృతి చెందిన సంఘటన పట్టణంలోని సుందర్‌నగర్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు.. పట్టణానికి చెందిన కొ మ్మినేని సైదులు సుందర్‌నగర్‌లోని శాంతినికేతన్ డిగ్రీ కళాశాలలో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి కళాశాలలోనే ఓ గదిలో నివాసం ఉంటున్నాడు. బుధవారం సైదులు తన కుమారుడు మోక్షిత్(3)ను తీసుకొని బజారుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి కుమారున్ని వదిలి పని ఉందని చె ప్పి మళ్లీ బయటకు వెళ్లాడు. తల్లి ఇంట్లో వంట చేస్తుండగా బాలుడు కళాశాల బయట ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అక్క డే ఉన్న డ్రెయినేజీలో పడిపోయాడు. కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఇంటి పరిసరాల్లో వెతికారు. అయినా ఆచూకీ తెలి యకపోవడంతో డ్రెయినేజీలో చూడగా ఓ చెట్టుకు చిక్కుకొని కనిపించాడు. వెంటనే బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆర్డీఓ, ఎమ్మెల్యే, కమిషనర్ల పరామర్శ
బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే రంగారెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ క మిషనర్ సురేందర్‌లు పరామర్శించారు. బాలుని మృతికి గల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పురుగు మందు తాగి...
బీబిగూడెం(చివ్వెంల):మండలంలోని బీబిగూడెం ఆవాసం జామ్లాతండా చెంది న ధరావత్ శంకర్(40) ఇంట్లో గత మూడు రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రా త్రి కూడా భార్యాభర్తలు ఘర్షణ పడ్డారు. దీంతో శంకర్ మనస్థాపం చెంది పొలం కోసం తెచ్చిన పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న శంకర్‌ను కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు గమనించి చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం తీసుకెళ్లారు. అక్కడ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
ఆర్థిక ఇబ్బందులు తాళలేక...
మర్రిగూడ: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ మహిళా సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని మేటిచందాపురంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుర్ర మంగమ్మ (36) ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్‌గా గెలుపొందింది. కుటుం బంలో ఆర్థిక సమస్యలు అధికం కావడంతో మానసికంగా కుంగిపోయి బుధవారం ఉదయం ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాలిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి జంగిటి జంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై దీవంతరావు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మంగమ్మ భర్త బుర్ర అంజయ్య సీపీఐ మండల కార్యదర్శిగా ఉన్నారు. మృతదేహాన్ని మునుగోడు ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, మాజీ ఎమ్మెల్యే పల్ల వెంకట్‌రెడ్డి తదితరులు సందర్శించి నివాళులర్పించారు.
Advertisement
Advertisement