వరంగల్ : వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటిగూడెంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలోని ఐదుగరు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.