బోల్తాకొట్టిన ఆటో
జోగిపేట: అందోలు గురుకుల పాఠశాల వద్ద రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఆటోను కర్ణాటక రాష్ట్రానికి చెందిన కేఏ 25డీ 3930 నంబరు గల టూరిస్టు బస్సు ఢీకొనడంతో అందులో కూర్చున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. జోగిపేట వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న టూరిస్టు సుల్తా¯ŒSపూర్‌కు వెళుతున్న ఆటోను వెనకవైపు నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటోను ఢీకొనగా ఆటో బోల్తాపడింది. బస్సు అదుపుతప్పి రోడ్డు కిందకు వెళ్లిపోయింది. ఆటోలో ఉన్న ఉప్పరిగూడెంకు చెందిన యాదమ్మ అనే వృద్ధురాలి తలకు గాయం కాగా యాదగిరి అనే వ్యక్తి నడుముకు గాయమైంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వారికి చికిత్సలు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.