roll over
-
పెళ్లింట విషాదం.. ముగ్గురు మృతి
కామారెడ్డి : బిచ్కుంద మండలం చిన్న దేవాడలో గురువారం తెల్లవారుజామున పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. పెళ్లి సందర్భంగా దగ్గరలోని వాగువద్ద నీళ్లు తెచ్చేందుకని ట్యాంకర్ తీసుకొని వెళ్లారు. వాగులో నీళ్లు తీసుకొని వస్తున్న సమయంలో ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా,మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన ఇద్దరిని బాన్సువాడ ఆసుపత్రికి తరలించగా.. మృతి చెందిన వారిని తుకారం, సాయిలు, శంకర్లుగా గుర్తించారు. కాగా డ్రైవర్ ట్రాక్టర్‌ను నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని.. అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.తెల్లవారితే పెళ్లి జరగాల్సిన ఇంట్లో ముగ్గురు మృత్యువాత పడడంతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. -
ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు.. ఆటో బోల్తా
బంజారాహిల్స్: ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా వారి నుంచి తప్పించుకునే క్రమంలో వేగంగా వేగంగా వెళుతున్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో ముగ్గురు ప్రయాణికులతో పాటు ఆటోనే ఆపేందుకు యత్నించిన ట్రాఫిక్ హోంగార్డుకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారకుడైన ఆటో డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత హోంగార్డు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... కార్మికనగర్, బ్రహ్మశంకర్ నగర్‌కు చెందిన సయ్యద్ ముజీబ్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం ఆటోలో ముగ్గురు ప్రయాణికులను ఎక్కించుకుని ఫిలింనగర్ వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు వెళుతుండగా జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 సమీపంలోని కళాంజలి మలుపు వద్ద జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఎస్ఐ లఖన్‌రాజ్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేస్తున్నారు. దీనిని గుర్తించిన ముజీబ్ వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆటో వేగం పెంచాడు. ఆటోను ఆపేందుకు ప్రయత్నించి హోంగార్డు ఫణీందర్‌ను ఢీకొట్టి ముందుకు వెళ్లగానే ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ముజీబ్‌తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న డి.చందు అనే ప్రయాణికుడికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆటోకు సంబందిన పత్రాలను తనిఖీ చేయగా 17 పెండింగ్ చలానాలు ఉన్నట్లు తేలింది. చలానాల విషయం బయటపడుతుందనే భయంతో ముజీబ్ పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడని ఈ క్రమంలోనే తనకు, ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలయ్యాయని హోంగార్డు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొనిదర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఆటోను సీజ్ చేశారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా.. సమాధులే కాపాడాయి..
అనంతపురం,శింగనమల/గార్లదిన్నె: గార్లదిన్నె సమీపం లో 44వ జాతీయ రహదారిపై కర్పూరం ఫ్యాక్టరీ వద్ద గురువారం ఆర్టీసీ అద్దె బస్సు బోల్తా పడి ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గుంతకల్లు డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు ఉదయం 11.20 గంటల సమయంలో 53 మంది ప్రయాణికులతో అనంతపురం బయలుదేరింది. బస్సు కర్పూరం ఫ్యాక్టరీ వద్దకు రాగానే హైవే పెట్రోలింగ్ పోలీస్ వాహనం యూ టర్న్ తీసుకుని గార్లదిన్నె వైపునకు మళ్లింది. అయితే అటువైపు మరో వాహనం రావడంతో ఒక్కసారిగా వెనక్కువచ్చింది. బస్సు డ్రైవర్ రాఘవ గమనించి గందరగోళంలో సడన్ బ్రేక్ వేసి ఎడమ వైపునకు యూటర్న్ చేశాడు. దీంతో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలోకి బోల్తా పడింది. వెంటనే బస్సు డ్రైవర్ సంఘటన స్థలం నుంచి పారిపోయాడు. వెంటనే అప్రమత్తమైన కండక్టర్ ఎస్ఎస్ వలి,బస్సు అద్దాలు పగులగొట్టి క్షతగాత్రులను బయటకు తీశారు. బుక్కరాయసముద్రం మండలం రోటరీపురానికి చెందిన రత్నమ్మ, సుధీర్, గుత్తికి చెందిన పద్మావతి, కృష్ణ, హార్టికల్చర్ ఆఫీసర్ శైలజతోపాటు మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గార్లదిన్నె ఎస్ఐ ఆంజనేయులు, పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలం వద్దకు చేరుకొని, మరికొంత మంది క్షతగాత్రులను మరో 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. సమాధులతో దక్కిన ప్రాణాలు ఆర్టీసీ బస్సు గుంతలోకి బోల్తా పడినప్పుడు అక్కడున్న రెండు సమాధులను ఢీకొంది. దీంతో బస్సు మరోసారి పల్టీ కొట్టకుండా ఆగిపోయింది. సమాధులు లేకుంటే ప్రమాద తీవ్రత పెరిగి ప్రాణాలకు ముప్పు వాటిల్లి ఉండేదని స్థానికులు, ప్రయాణికులు చర్చించుకోవడం కనిపించింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ సమాచారం అందుకున్న అనంతపురం డీఎస్పీ పీఎన్ బాబు సంఘటన స్థలం పరిశీలించి ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. -
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
శ్రీకాకుళం , టెక్కలి/టెక్కలి రూరల్: మండలంలోని పరశురాంపురం జంక్షన్ సమీప జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా ఎనిమిది మంది విద్యార్థులు స్వల్ప గాయాలతోనూ మిగిలిన వారు సురక్షితంగానూ బయట పడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే... కళాశాల నుంచి పాతపట్నం వైపు వెళ్లేందుకు విద్యార్థులతో సాయంత్రం 4 గంటలకు బస్సు బయలు దేరింది. పరశురాంపురం జంక్షన్ రోడ్డులో మళ్లించే క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి మెల్లగా రోడ్డుకు ఒక భాగంలోని కంకర మీదుగా వెళ్లి బోల్తా పడింది. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న మెళియాపుట్టి ఎస్ఐ రాజేష్ హుటాహుటిన చేరుకుని స్థానికుల సాయంతో గాయాలపాలైన విద్యార్థులను, బస్సు సిబ్బందిని రక్షించే ప్రయత్నాలు చేశారు. అనంతరం టెక్కలి పోలీసులకు సమాచారం అందజేశారు. హైవే అంబులెన్స్, 108 వాహనం సాయంతో గాయపడిన విద్యార్థులను టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ డీ లక్ష్మణరావుతోపాటు విద్యార్థులు ఎస్ సోనియా, ఆర్ తనూషా, కే గంగాధర్, పీ జయకృష్ణ, బీ లక్ష్మణరావు, ఎల్ సాయి, ఎస్ ప్రేమ, ఏ శివానీ తదితరులు స్వల్పంగా గాయపడ్డారు. వీరిలో సోనియాను మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించే చర్యలు చేపట్టారు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది అత్యుత్సాహంపై ఆగ్రహం ఈ సంఘటనను చూసిన స్థానికులు కొంతమంది తమ వాహనాలను పార్కింగ్ చేసి సహాయక చర్యలు చేపడుతుండగా, హైవే పెట్రోలింగ్ పోలీస్ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. స్థానికుల వాహనాలకు చెందిన ప్లగ్‌లు తొలగించడంతో వారంతా ఎదురుతిరిగారు. తామంతా సహాయ చర్యలు చేపడుతుండగా, హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఇలా వ్యవహరించడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రమాదంలో పసిమొగ్గలు
సాక్షి, గుంటూరు: ‘జిల్లాలో అన్ని బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు దాదాపుగా ముగిశాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాం. తేడా అనిపిస్తే యాజమాన్యానికి నోటీసులిస్తాం. నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేస్తాం. అప్పటికి దారికి రాకపోతే స్కూల్ అనుమతి రద్దుకు సిఫార్సు చేస్తాం’... ఇవి నిత్యం రవాణాశాఖ అధికారుల నోట వినిపించే మాటలు కానీ అచరణలో మాత్రం ఫలితాలు కన్పించడం లేదు. జిల్లాలో నిత్యం పాఠశాల బస్సులకు జరుగుతున్న ప్రమాదాలు చూస్తుంటే వీరి మాటలన్నీ నీటి మూటలేనని స్పష్టమవుతోంది. ♦ మాచర్ల పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ బస్సు మండలంలోని మాచర్ల–మండాది మధ్యలోని శ్రీశైలం రహదారిలో కానవాగు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 32 మంది గాయపడగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెల్దుర్తి మండలం ఉప్పలపాడు, మండాదిలో విద్యార్థులను ఎక్కించుకుని కానవాగు వద్ద బస్సు స్టీరింగ్ రాడ్ ఊడిపోవటంతో బస్సు వంతెన పైనుంచి వాగులోకి బోల్తా కొట్టింది. ఈ ఘటనతో పిల్లలను ప్రైవేట్ స్కూల్ బస్సులు, ఆటోల్లో పంపించే తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు. పరిమితికి మించి పిల్లలను ఎక్కిస్తున్న వైనం జిల్లాలో రెండు వేలకుపైగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బస్సులు, ఆటోల్లో పిల్లలను తరలిస్తున్నాయి. వీటిలో చాలా వరకూ వాహనాలు పరిమితికి మించి విద్యార్థులను ఎక్కిస్తున్నాయి. తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు పిల్లల భద్రతను గాలికి వదిలేస్తున్నాయి. ఇదంతా తెలిసినా ప్రభుత్వం మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. నిబంధనల ప్రకారం బస్సులో 57 మంది విద్యార్థులను ఎక్కించాలి. కానీ మందాడి వద్ద ప్రమాదం జరిగిన బస్సుల్లో 80 మంది విద్యార్థులను తరలిస్తున్నారు. అంతులేని నిర్లక్ష్యం నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాల తన బస్సు, ఆటోల వెహికల్ ఇన్స్పెక్షన్ రిపోర్టును, డ్రైవర్ హెల్త్ కండీషన్‌ను తల్లిదండ్రుల సమావేశంలో ఉంచాలి. అధికారుల పర్యవేక్షణ లోపంతో పేరెంట్ మీటింగ్ జరుగుతున్న దాఖలాలు లేవు. అడపాదడపా తనిఖీలు జరిగినా జరిమానాలతో సరి పెడుతున్నాయి. దీంతో చాలా ప్రైవేటు పాఠశాలల బస్సుల్లో కనీసం ఫస్ట్ ఎయిడ్ కిట్లు, రేడియం స్టిక్కర్లు లేవు.రవాణా అధికారులు కాసుల కక్కుర్తితో ఏజెంట్ల ద్వారా వచ్చే బస్సులకు ఎటువంటి తనిఖీలు లేకుండా సర్టిఫికెట్ ఇస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. సత్తెనపల్లి, మాచర్ల, బాపట్ల, తెనాలి, పిడుగురాళ్ల, పొన్నూరు, మంగళగిరి సహా జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలలు క్లీనర్లచే బస్సులు నడుపుతున్నాయి. తనిఖీలు నిర్వహిస్తున్నాం.. నిబంధనల విరుద్ధంగా విద్యార్థులను తరలిస్తున్న వాహనాలపై కేసులు రాస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా జిల్లాలో మొదటిసారి సీటు బెల్టు విధానాన్ని ప్రవేశ పెట్టాం. వచ్చే విద్యా సంవ్సరంలో అన్ని పాఠశాల బస్సులకు ఈ విధానాన్ని అమలు చేసేలా చూస్తున్నాం. పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.– రాజారత్నం, డీటీసీ గుంటూరు తల్లిదండ్రులారా.. ఆరా తీయండి 18 సీట్లలోపు స్కూల్ బస్ నడిపే డ్రైవర్‌కు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్‌తోపాటు బ్యాడ్జి నంబర్ ఉండాలి. అంతకు మించిన సామర్థ్యం ఉన్న పెద్ద బస్సుల డ్రైవర్లకు హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్‌తోపాటు బ్యాడ్జి నెంబర్ ఉండాలి. బస్సు కెపాసిటీని బట్టి డ్రైవర్‌ను ఎంపిక చేసుకోవాలి. డ్రైవర్లు మారుతున్నప్పుడు వారి లైసెన్సు వివరాలను తెలుసుకోవాలి. రవాణా శాఖ వెబ్‌సైట్‌ను పరిశీలిస్తే పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మోటారు వాహనాల చట్టం 1989, రూల్ 185 సవరణ తుది నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల బస్సుల భధ్రతకు సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికేషన్‌తోపాటు తీసుకోవాల్సిన 32 ఆంశాలపై జీవోలో పొందు పరిచారు. వీటిలో ఏ ఒక్కటి పాటిచకపోయినా నిలదీయొచ్చు. జిల్లాలో స్కూల్ బస్సు, ఆటో ప్రమాదాలు ఇలా.. ♦ 2015 ఫిబ్రవరిలో మంగళగిరి మండలం నూతక్కి దగ్గర ఓ ప్రైవేటు బస్సు కాల్వలో బోల్తా పడి రెండో తరగతి విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. పది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ♦ 2016 ఏప్రిల్‌లో పొన్నూరు మండలం జూపూడి వద్ద స్కూల్ బస్ నుంచి రెండో తరగతి విద్యార్థి జారి పడి మృత్యువాత పడింది. ఇదే సంవత్సరం మార్చిలో చెరుకుపల్లి మండలం కామినేనిపాలెం వద్ద ఓ ప్రైవేట్ స్కూల్ బస్సుకు బ్రేక్ ఫెయిలై బోల్తా పడింది. ♦ 2018 అక్టోబర్ 31న దాచేపల్లి మండలం అలుగుపల్లిపాడు వద్ద ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడి ఎనిమిది మంది విద్యార్థులు గాయపడ్డారు. ♦ 2018 ఆగస్టులో యడ్లపాడు, సొలస గ్రామాల్లో స్వల్ప రోజుల వ్యవధిలోనే రెండు ప్రైవేట్ స్కూల్ బస్సులు ప్రమాదానికి గురై విద్యార్థులు గాయాలపాలయ్యారు. విద్యార్థులకు డీఈవో పరామర్శ నరసరావుపేట రూరల్: బస్సు ప్రమాదంలో గాయపడి పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను డీఈవో ఆర్ఎస్ గంగాభవాని, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ జీహైమావతిలు సోమవారం రాత్రి పరామర్శించారు. గాయపడిన ముగ్గురు విద్యార్థులకు ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. వారి వెంట ఎంఈవో జ్యోతికిరణ్, బాలుర హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రతినిధి పీ పద్మలత తదితరులు ఉన్నారు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌ను మూసేయాలి గుంటూరు ఎడ్యుకేషన్: కండీషన్లో లేని బస్సులో విద్యార్థులను తరలిస్తూ ప్రమాదానికి కారణమైన కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌ను మూసేయాలని గిరిజన విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు కేతావత్ పాండునాయక్ సోమవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వలనే ప్రమాదం చోటు చేసుకుందని మండిపడ్డారు. తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయల ఫీజులను వసూలు చేస్తున్న యాజమాన్యాలు కాలం చెల్లిన బస్సులతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని పేర్కొన్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు
కృష్ణాజిల్లా, నూజివీడు : ట్రాక్టర్‌ను ఢీకొని అదుపుతప్పి ఆర్టీసీ బస్సు ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన నూజివీడు పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. వివరాలిలా ఉన్నాయి. విజయవాడ గవర్నర్‌పేట–2 డిపోకు చెందిన సీఎన్జీ 308 సర్వీసు బస్సు విస్సన్నపేటలో 11.50కి విజయవాడ వెళ్లేందుకు బయలుదేరింది. నూజివీడులోని విస్సన్నపేట రోడ్డులో ఉన్న పంట కాల్వ సమీపంలోకి వచ్చేసరికి లారీని ఓవర్టేక్ చేస్తుండగా అదే సమయంలో విస్సన్నపేట వెళ్లే ట్రాక్టర్ ఎదురైంది. దీంతో బస్సు డ్రైవర్ వీ మాధవరావు ట్రాక్టర్ ఇంజిన్‌ను తప్పించినప్పటికీ దాని ట్రక్కును బస్సు ఢీకొట్టి ఒక్కసారిగా అదుపుతప్పి వేగంగా ఎడమ వైపునకు వెళ్లి బోడబళ్ల నాగేశ్వరరావు ఇంటిని ఢీకొని ఆగింది. ట్రక్కును ఢీకొనడంతో దాని చింతకాయ (లింక్) తప్పుకుని ఇంజిన్ నుంచి ఊడిపోయి చొక్కాకుల వెంకటేశ్వరరావు ఇంటి వరాండాలోకి వెళ్లింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 21మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. డ్రైవర్‌కు మాత్రం చెయ్యి విరిగింది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ మార్గంలో పెద్ద ప్రమాదం జరిగి, ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బస్సు కుడివైపు భాగం బాగా దెబ్బతింది. స్థానికులు 108 కు ఫోన్ చేయడంతో అంబులెన్స్ వచ్చి బస్సు డ్రైవర్‌ను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించింది. రోడ్డు వెడల్పు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఓవర్టేక్ చేయడానికి డ్రైవర్ ప్రయత్నించడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ రెండు ఇళ్ల వరండాలలో ఎవరో ఒకరు కూర్చుని ఉండేవారని, ఈ రోజూ ఎవరూ లేరని, ఉండి ఉంటే వారి ప్రాణాలు గాలిలో కలిసి ఉండేవని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే సీఐ మేదర రామ్‌కుమార్, పట్టణ ఎస్ఐ రంజిత్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ స్తంభించకుండా చర్యలు తీసుకున్నారు. డ్రైవర్ వీ మాధవరావు, కండక్టర్ కన్నా శ్రీనివాసరావు నుంచే కాకుండా, స్థానికులు, ప్రయాణీకుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సెప్టిక్ ట్యాంక్‌లో ట్రాక్టర్ బోల్తా
-
బతుకుజీవుడా
పొట్టకూటి కోసం 9 మంది మత్స్యకారులు ఎప్పటిలానే సముద్రంలో వేటకు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఒకరు వేరే బోటులో వెళ్లిపోగా మిగిలిన ఎనిమిది మంది సోనాబోటులో గమ్యానికి బయలుదేరారు. ఇంతలో వాతావరణంలో మార్పులతో కడలి కల్లోలంగా మారింది. దీంతో వారు వస్తున్న బోటు ప్రమాదానికి గురైంది. అర్ధరాత్రి.. నడిసంద్రంలో ఎటు వెళుతున్నారో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉండగా.. ముగ్గురు మత్స్యకారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దూకేసి గుప్పెడుపేట తీరానికి చేరుకున్నారు. మరో నలుగురు బోటులోనే ఉండిపోయారు. ఈ బోటు అలల ఉద్ధృతికి గుప్పెడుపేట–ఉమిలాడ గ్రామాల్లోని తీరానికి కొట్టుకొచ్చింది. స్థానికులు ఆరు గంటల పాటు తీవ్రంగా శ్రమించి వీరిని ప్రాణాలతో రక్షించారు. పోలాకి: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన మత్స్యకారులు బర్రి తాతయ్య, వాసుపల్లి నరసింహ, మైలపల్లి శ్రీను, బర్రి అమ్మోరు, బర్రి ఎర్రయ్య, గనగళ్ల తాతయ్య, బర్రి మసేను, గోవింద అప్పన్న ఈనెల 9వ తేదీ సోమవారం విశాఖపట్నం నుం చి సోనాబోటులో సముద్రంలో వేటకు బయలుదేరారు. అక్కడి నుంచి బారువా తీరం వరకు వచ్చి 20వ తేదీ శుక్రవారం ఉదయాన్నే విశాఖకు తిరుగు పయనమయ్యారు. వీరిలో ఒకరు అదే ప్రాంతానికి చెందిన వేరే బోటులో వెళ్లిపోయారు. మిగిలిన 8 మంది సోనాబోటులో ప్రయాణిస్తున్నారు. వారిలోని బర్రి తాతయ్య, వాసుపల్లి నరసింహ, బర్రి మసేను, గోవింద అప్పన్న, మైలపల్లి శ్రీను విశ్రాంతి తీసుకోవడానికి బోటులోని గదిలోకి వెళ్లిపోయారు. బర్రి అమ్మోరు, బర్రి ఎర్రయ్య, గనగళ్ల తాతయ్య బోటుపైనే ఉండిపోయారు. శుక్రవారం సాయంత్రం జీపీఎస్ పని చేయకపోవటంతో బోటు గతి తప్పింది. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల సమయంలో పోలాకి మండలంలోని గుప్పెడుపేట గ్రామం వైపు వస్తుండగా అలల ఉద్ధృతికి బోటు బోల్తాపడింది. బోటుపై ఉన్న బర్రి అమ్మోరు, బర్రి యర్రయ్య, గనగళ్ల తాతయ్య సముద్రంలోకి దూకి ఈదుకుంటూ గుప్పెడుపేట ఒడ్డుకు శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో చేరుకున్నారు. అక్కడకు 2 కిలోమీటర్ల దూరంలోని సంతబొమ్మాళి మండలంలోని ఉమిలాడ తీరానికి.. ప్రమాదానికి గురైన సోనాబోటు ఉదయం 6 గంటలకు కొట్టుకొచ్చి ంది. బర్రి తాతయ్య, మైలపల్లి శ్రీను, వాసుపల్లి నర్సింహ, బర్రి మసీను, గోవింద అప్పన్న లోపలే చిక్కుకున్నారు. దీనిని గుర్తించిన స్థానికులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. 35 టన్నుల బరువైన బోటును సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు పెద్ద క్రేన్ అవసరం ఉన్నా.. అలాంటి ఏర్పాటు జరగలేదు. స్థానికులే చొరవతీసుకుని దాదాపు 6 గంటల పాటు శ్రమించి యంత్రాల సాయంతో బోటును కట్ చేసి నలు గురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చే ర్చారు. బోటులోని మైలపల్లి శ్రీను(22) అనే ఒక మత్య్సకారుడి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. అధికారుల మధ్య సమన్వయలోపం అత్యవసర పరిస్థితిలో అధికారుల మధ్య సమన్వయ లోపంతో సహాయక చర్యలు డీలా పడ్డాయి. ఫైర్ సిబ్బంది గానీ అత్యవసర సేవా విభాగాలకు చెందిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గానీ హాజరుకాలేదు. ఇక పోలీసులు, మెరైన్, మత్స్యశాఖ, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకున్నా అక్కడి పరిస్థితులను బట్టి చేసేదిలేక చేతులెత్తేశారు. గుప్పెడుపేట వైద్యాధికారి బలగ మురళి క్షతగాత్రులకు ప్రథమచికిత్స అందించి 108లో రిమ్స్‌కు తరలించారు. మత్స్యశాఖ డీడీ కృష్ణమూర్తి, టెక్కలి ఆర్డీవో వెంకటేశ్వరరావు, భావనపాడు మెరైన్సీఐ సాయిసత్యారావు, టెక్కలి సీఐ శ్రీనివాసరావు, పోలాకి తహసీల్దార్ జె.రామారావు, తదితరులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. హడావుడే తప్ప అధికారులు చేసిందేం లేదు సంఘటనా స్థలంలో అధికారులు హడావుడే తప్ప చేసిందేం లేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్రేన్ తెప్పించలేకపోయారు. ఇక్కడి యువకులు సాహసం చేయకపోతే నిండు ప్రాణాలు నీటిలో కలిసిపోయేవి. బాధిత మత్స్యకారులను, బోటు యజమానిని ప్రభుత్వం ఆదుకోవాలి. – లండ యర్రయ్య, మత్స్యకారసంఘ నాయకుడు, గుప్పెడుపేట గంగమ్మ తల్లే కాపాడింది రాత్రి బోటు పల్టీ కొట్టిన తర్వాత ఎవరికి వారు నడిసముద్రంలో విడిపోయాం. ఆ గంగమ్మ తల్లే మమ్మల్ని కాపాడింది. ఈ ప్రాంత వాసులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. నేను ముందు ఒడ్డుకు వచ్చాను. అదే బోటులో మా నాన్న బర్రి తాతయ్య కూడా ఉన్నారు. ఇద్దరం క్షేమంగా బయటపడ్డాం. – బర్రి యర్రయ్య, మత్స్యకారుడు, చింతపల్లి -
కాజా టోల్గేట్ వద్ద సల్ఫర్ ట్యాంకర్ బోల్తా
-
హైదరాబాద్‌లో మరో కారు ప్రమాదం
-
టూరిస్టు బస్సు బోల్తా
స్థానిక అక్కివరం కూడలి వద్ద శనివారం ఉదయం ప్రమాదవశాత్తు టూరిస్టు బస్సు బోల్తా పడింది. బస్సులో 45మంది పెద్దలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. వివరాల్లోకి వెళ్తే...వైఎస్సార్ జిల్లా (కడప), ప్రొద్దుటూరు నుంచి ఏపీ04 టీడబ్ల్యూ 3413 టూరిస్టు బస్సు కాశీయాత్రకు భక్తుల్ని తీసుకు వెళ్లింది. యాత్రను పూర్తి చేసుకుని తిరిగి బయలుదేరింది. శనివారం ఉదయం పూసపాటిరేగ వద్ద యాత్రికులు టీ తాగి బయలుదేరారు. అక్కివరం కూడలి వద్దకు వచ్చేసరికి అండర్ పాస్ పనులు జరుగుతున్న చోట ఎదురుగా మతిస్థిమితం లేని వ్యక్తి ఆకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చేశాడు. అతన్ని తప్పించబోయిన డ్రైవరు బ్రహ్మయ్య బస్సును రోడ్డు పక్కన ఉన్న సిమెంటు దిమ్మలతో ఏర్పాటు చేసిన స్టాపర్లను ఢీకొట్టింది. రోడ్డు పక్కకు బస్ నిలపడంతో, వంతెన నిర్మాణానికి రోడ్డు తవ్వేసి ఉండడంతో గోతులోకి రోడ్డు పెళ్ళలు విరిగి పడ్డాయి. దీంతో బస్సు గోతిలోకి ఒరిగి పోయింది. బస్సు పూర్తిగా కింద పడకుండా సిమ్మెంటు దిమ్మలు అడ్డు పడడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న వారు పిల్లలతో సహా సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ తారకేశ్వరరావు సిబ్బందితో సంఘటనా స్థలం వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఉన్న వారిని ఎ.రావివలస పంచాయతీ కార్యాలయానికి తరలించారు. -
శ్రీశైలం ఘాట్‌లో రోడ్డు ప్రమాదం
పెద్దదోర్నాల: శ్రీశైలం ఘాట్‌లో టిప్పర్ రోడ్డుకు అడ్డంగా బోల్తా పడటంతో 2 గంటల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన మండల పరిధి చింతల గిరిజన గూడెం సమీపంలో శుక్రవారం జరిగింది. శ్రీశైలం ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో సంఘటన స్థలానికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అందిన వివరాల ప్రకారం.. మండల కేంద్రం నుంచి శ్రీశైలానికి కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ టైర్.. మండల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలోని చింతల వద్ద బరస్టయింది. టిప్పర్ రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. డ్రైవర్, క్లీనర్లకు గాయాలయ్యాయి. వారి వివరాలు తెలియలేదు. రోడ్డు పక్కన కొంత మేర ఖాళీ ఉండటంతో చిన్న వాహనాలు మాత్రం ట్రాఫిక్ నుంచి బయట పడ్డాయి. రోడ్డుకు ఇరువైపులా ఆర్టీసీ బస్సులు, టూరిస్ట్ బస్సులు, టారీలు టిప్పర్ల రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. కొందరు ఆర్టీసీ, టిప్పర్ల సిబ్బంది రోడ్డుకు అడ్డంగా ఉన్న టిప్పర్‌ను తొలగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎస్ఐ రామకోటయ్య, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న టిప్పర్‌ను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. సుమారు 2 గంటల తర్వాత ట్రాఫిక్‌ను పునరుద్ధరించడంతో ప్రయాణాకులు బతుకు జీవుడా..అంటూ బయటపడ్డారు. ప్రయాణికుల అవస్థలు ట్రాపిక్కు అంతరాయం ఏర్పడటంతో రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచి పోయాయి. సుమారు 43 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య నట్టనడివిలో వాహనాలు నిలిచి పోవడంతో ఆయా వాహనాల్లో ప్రయాణించే యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ అంతరాయం తొలగే వరకూ తీవ్ర ఉక్కపోత నడుమే ప్రయాణికులు తమ తమ వాహనాల్లో ఇబ్బందులు పడ్డారు. కొందరు ప్రయాణికులు వాహనాల్లో ఉండలేక సమీపంలో ఉన్న చెట్ల నీడన సేదతీరినా భానుడి ప్రచండ వీక్షణాలకు తట్టుకోలేక అల్లాడిపోయారు. ప్రయాణికుల నీటి ఇబ్బందులను ముందే గ్రహించిన ఎస్ఐ రామకోటయ్య తన వాహనంలో కూల్ కంటైనర్‌తో నీరు తెప్పించి ప్రయాణికుల దాహార్తి తీర్చారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా
కాశినాయన : కలసపాడు మండలంలోని పిడుగుపల్లె ఎస్సీ కాలనీ వద్ద మలుపులో బుధవారం ఉదయం 6 గంటలకు ఆర్టీసీ బస్సు బోల్తాపడటంతో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ప్రకాశం జిల్లా గిద్దలూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ29 జెడ్ 5393 నెంబరు గల ఆర్టీసీ బస్సును బ్రహ్మంగారిమఠం ఆరాధన మహోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా నడుపుతున్నారు. బస్సులో 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. మలుపు వద్ద బస్సు అదుపు తప్పడంతో బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కలసపాడు ఎస్ఐ వెంకటరమణ సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఇద్దరికి గాయాలయ్యాయి. సింగిల్ డ్రైవరే రాత్రింబవళ్లు బస్సు నడుపుతుండటంతో ప్రమాదం జరిగిందని సమాచారం. ఆర్టీసీ వారు మరో బస్సును ఏర్పాటు చేసి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. ఈ విషయమై కలసపాడు ఎస్ఐ వెంకటరమణను వివరణ కోరగా డ్రైవర్ శ్రీనివాసులుపై కేసు నమోదు చేశామని తెలిపారు. -
బోయిన్‌పల్లిలో తప్పిన పెనుప్రమాదం
-
పెళ్లింట విషాదం
ఆ ఇంట్లో పెళ్లి బాజా సందడి చేసింది ... వధూవరులు దంపతులుగా మారారు ... వివాహ వేడుకల నుంచి బయటపడి పెండ్లికుమారుడి ఇంటి వద్ద ‘పెద్దల భోజనం’ పేరుతో ప్రత్యేకవిందు ఏర్పాటు చేశారు. ఆ విందు ఆరగించి వధూవరులను ఆశీర్వదించి ట్రాక్టర్లో ఇంటికి తిరుగు పయనమయ్యారు.ఆ ట్రాక్టర్ అదుపు తప్పి పల్టీ కొట్టడంతో ఆర్తనాదాలు...పలువురికి గాయాలు...ఒకరి పరిస్థితి విషమంగా మారడంతో పలు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. పిఠాపురం:ఆ ఇంట్లో రెండు రోజుల క్రితమే పెళ్లయ్యింది. పెద్దలందరూ కలిసి పెళ్లికుమారుడి ఇంటికి భోజనాలకు వెళ్లి వధూవరులను ఆశీర్వదించి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే వారు ప్రయాణిస్తున్న వాహనం తిరగబడి.. వాహనంలో ఉన్నవారు క్షతగాత్రులుగా మారిన సంఘటన ఇది.గొల్లప్రోలు మండలం తాటిపర్తి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రాక్టరు తిరగబడి 34 మందికి గాయాలుకాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపల్లి మండలం శ్రీరాంపురానికి చెందిన కె.నాగేశ్వరరావు కుమార్తెకు గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామానికి చెందిన వ్యక్తితో రెండు రోజుల క్రితం వివాహమైంది. మగ పెళ్లివారు పెళ్లి రోజున శ్రీరాంపురంలో భోజనాలు చేయగా ఆడపెళ్లివారు మగ పెళ్లివారింట విందు భోజనాలు చేయడానికి ఆదివారం సాయంత్రం కొడవలి వెళ్లారు. మగ వారందరూ వివిధ వాహనాలపై వెళ్లగా మహిళలు ట్రాక్టరుపై వెళ్లారు. విందు భోజనాలు పూర్తి చేసుకుని నవవధూవరులను ఆశీర్వదించి రాత్రి 12 గంటల ప్రాంతంలో ట్రాక్టరుపై సుమారు 38 మంది మహిళలు శ్రీరాంపురం బయల్దేరారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తి సమీపంలోకి రాగానే ట్రాక్టరు అదుపుతప్పి వేగంగా దూసుకుపోయి ఒక్కసారిగా ట్రక్కు పైకి లేచి పోవడంతో ట్రక్కులో ఉన్న మహిళలు కిందకు పడిపోయారు. వీరిలో మడికి అప్పయ్యమ్మ, నాగళ్ల లక్ష్మి, ఎం.సుబ్బలక్ష్మి, నాగళ్ల లోవలక్ష్మి, పిర్ల రమణమ్మ, రాయుడు అప్పలకొండ, కె.సత్యవతి, టి. సుబ్బయ్యమ్మ, టి.లక్ష్మి, యాదాల గంగ, యాదాల సుబ్బలక్ష్మి, మడికి నాగమణి, యాదాల సత్యవతిలతో పాటు 34 మందికి గాయాలయ్యాయి. వీరిలో పిర్ల లక్ష్మి, మడికి వీర రాఘవ, యాదాల అప్పలకొండ, నాగళ్ల ముసలమ్మ తీవ్రంగా గాయపడ్డారు. పిర్ల లక్ష్మి అనే వివాహిత తలకు బలమైన గాయమై పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె కాకినాడలో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న గొల్లప్రోలు ఎస్సై శివకృష్ణ తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 ఇతర వాహనాలపై ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతున్నారు. గొల్లప్రోలు ఎస్సై కేసు నమోదు చేసి దార్యప్తు చేస్తున్నారు. ట్రాక్టరు డ్రైవరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ట్రాక్టరు ప్రమాదవశాత్తూ ట్రక్కు పైకిలేచి ఉండిపోయిందని, అదే బోల్తా కొట్టి ఉంటే దానికింద పడి చాలామంది ప్రాణాలు కోల్పోయి ఉండేవారని బాధితులు వాపోయారు. వెంటిలేటర్ లేక ప్రైవేటు ఆసుపత్రికి.. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో వెంటిలేటర్ ఖాళీగా లేదని వైద్య సిబ్బంది చెప్పడంతో పిర్ల లక్ష్మి అనే బాధితురాలిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టు బాధిత బంధువులు తెలిపారు. క్షతగాత్రులను పరామర్శించిన పెండెం సర్పవరం (కాకినాడ సిటీ): వన్నెపూడి ట్రాక్టర్ బోల్తా ప్రమాదంలో గాయపడి కాకినాడ ప్రభుత్వసామాన్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ పిఠాపురం కో–ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్‌తో మాట్లాడారు. పరామర్శించిన వారిలో వైఎస్సార్ సీపీ జిల్లా జాయింట్ సెక్రటరీ కర్రి దుర్గాప్రసాద్, నాయకులు రావి రమేష్, కడారి సతీష్ తదితరులున్నారు. -
బొలేరో బోల్తా.. 15 మంది కూలీలకు గాయాలు
కారేపల్లి: మిర్చి తోట ఏరుటకు వచ్చిన కూలీలతో ఉన్న బొలేరో మ్యాక్స్ వాహనం అదుపు తప్పి బోల్తా పడిన ఘటన మండల పరిధిలోని గుడితండా–చీమలపాడు రహదారి మధ్యలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం టేకులపల్లి మండలం తడికలపుడికి చెందిన 15 మంది మహిళా కూలీలు సోమవారం కారేపల్లి మండలంలోని గుడితండా గ్రామంలో మిర్చి ఏరుటకు వచ్చారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో గుడితండా–చీమలపాడు బీటీ రోడ్డు మధ్యలో ఉన్న మూలమలుపు వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మరో వాహనంలో ఇల్లందు ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. -
బేగం పేట ఫ్లైఓవర్‌పై కారు బోల్తా
-
ప్రైవేటు బస్సు బోల్తా
-
విషాదం
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం - మరో ఇద్దరికి గాయాలు - విందు చేసుకుని వస్తుండగా ప్రమాదం - మద్యం సేవించారని పోలీసుల అనుమానం గోనెగండ్ల/కల్లూరు: కర్నూలు - బళ్లారి రహదారిపై ఎస్. లింగందిన్నె గ్రామ స్టేజీ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కల్లూరుకు చెందిన శ్రీనివాసులు ఇటీవల కొత్త ఇన్నోవా వాహనం కొనుగోలు చేశారు. మంగళవారం ఉదయం అతనితోపాటు ముగ్గురు మిత్రులు, డ్రైవర్ దేవనకొండ వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. తిరిగి వచ్చే సమయంలో గోనెగొండ్ల మండలం లింగందిన్నె స్టేజీ వద్ద వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కల్లూరు ఎస్టేట్‌కు చెందిన మల్లికార్జున(42), దూపాడుకు చెందిన వాహన డ్రైవర్ మోహన్(27 ) అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీనివాసులు, నాగిరెడ్డి, ఆల నాగిరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో కర్నూలుకు తరలించారు. పెద్దటేకూరు గ్రామానికి చెందిన ఆల నాగిరెడ్డి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆల నాగిరెడ్డి, మృతునికి భార్య మంజుల, కుమారులు సాయిచరణ్, గౌరు చరణ్, కుమార్తె ప్రవళ్లిక సంతానం. ప్రమాద వార్త తెలుసుకున్న పాణ్యం నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్ ఏరాసు ప్రతాప్ రెడ్డి, మండల నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలివచ్చారు. ఘటన స్థలాన్ని ఎస్ఐ కృష్ణమూర్తి పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నలుగురు స్నేహితులతో పాటు డ్రైవర్ ఈదులదేవరబండ వద్ద విందు చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతిగా మద్యం సేవించి వాహనం నడపడటంతోనే వాహనం అదుపు తప్పి బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఫ్రీగా వస్తే..
చాపాడు: ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగుతారు అంటూ కొందరిని ఉద్దేశించి అంటుంటాం.. అవును అలాంటి సంఘటనే ఇది.. డీజిల్ ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్.. క్లీనర్ ఆసుపత్రి పాలైతే.. అయ్యో..పాపం అంటూ సానుభూతి చూపాల్సింది పోయి.. మీరేమైపోతే మాకేం.. అంటూ కొందరు కక్కుర్తిపరులు బోల్తాపడిన డీజిల్ ట్యాంకర్ నుంచి డీజిల్‌ను ఎత్తుకుపోవడం మొదలుపెట్టారు. ఒకరిని చూసి మరొకరు.. ఇలా డీజిల్ తీసుకెళ్లే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగింది. ఈ దృశ్యాన్ని చూసి ఆ దారిన వెళ్లేవారు సైతం మేమేం తక్కువ తిన్నామా అంటూ వారికి అందుబాటులో ఉన్న క్యాన్లు, బాటిళ్లలో డీజిల్‌ను తీసుకుని వెళ్లారు. కొందరు లీటరు బాటిల్ తెచ్చుకుంటే మరికొందరు ఐదులీటర్లు.. ఇంకొందరు ఏకంగా 20 లీటర్ల క్యాన్లు.. ప్లాస్టిక్ బిందెలు తీసుకొచ్చి డీజిల్ తీసుకెళ్లారు. శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో చాపాడు మండలం నాగులపల్లె వద్ద డీజిల్ ట్యాంకర్ బోల్తాపడిన సంఘటనలో డ్రైవర్, క్లీనర్ ఆసుపత్రి పాలు కాగా, ఇలా కొందరు డీజిల్ ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న ఎస్ఐ శివశంకర్ అక్కడ పోలీసులను నియమించడంతో డీజిల్ ఎత్తుకెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. -
విహారయాత్రలో అపశ్రుతి
కర్నూలు జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తా 15 మంది విద్యార్థులు, టీచర్లకు గాయాలు సంఘటన స్థలం నుంచి పరారైన బస్సు డ్రైవర్ ఉద్దేహాళ్ పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్ జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల ఉపాధ్యాయులు విహారయాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలోని బెలుం గుహలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులను ఒప్పించి విహారయాత్రకు పేర్లు నమోదు చేసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున ప్రధానోపాధ్యాయులు ఈశ్వర్‌గౌడ్ ఆధ్వర్యంలో ఉరవకొండకు చెందిన ప్రైవేట్ బస్సులో బయల్దేరారు. వీరిలో ఆరుగురు ఉపాధ్యాయులు, 66 మంది తొమ్మిదో తరగతి విద్యార్థులు ఉన్నారు. ఉద్దేహాళ్ నుంచి బయలు దేరిన బస్సు ఉరవకొండ, గుంతకల్లు, గుత్తి, బనగానపల్లి , నంద్యాల మీదుగా మీదుగా వెళుతోంది. విద్యార్థులు సరదాగా జోకులు వేసుకుంటూ ఆనంద డోలికల్లో మునిగిపోయారు. ఉదయం 8.30 గంటల సమయంలో కర్నూలు జిల్లా సంజామల మండలం రెడ్డిపల్లి వద్దకు రాగానే మలుపు వద్ద బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ హఠాత్పరిణామంతో విద్యార్థులు హాహాకారాలు చేశారు. ప్రాణాలు అరచేత పట్టుకుని బస్సు నుంచి ఒకరి తర్వాత ఒకరు బయట పడ్డారు. ఎవరికీ ప్రాణహాని లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అతివేగం వల్లనే బస్సు అదుపు తప్పి, ప్రమాదం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. సంఘటన జరిగిన తర్వాత బస్సు డ్రైవర్ పరారయ్యాడు. 15 మందికి గాయాలు బస్సు బోల్తాపడడంతో 15 మంది గాయపడ్డారు. వీరిలో విద్యార్థులు సుధ (లింగదహాళ్), సహానా (ఉద్దేహాళ్), ఆశా (లింగదహాళ్), తెలుగు పండిట్ ప్రశాంతి, హిందీ పండిట్ రాజేశ్వరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానిక అధికారులు బాధిత విద్యార్థులను సమీపంలోని పాఠశాలకు ఆశ్రయం కల్పించి.. కాసేపటి తర్వాత స్వగ్రామానికి పంపే ఏర్పాట్లు చేశారు. పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన ప్రమాద ఘటనను తెలుసుకున్న గౌనూరు, లింగదహాళ్ , ఉద్దేహాళ్ విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. తమ పిల్లలకు జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సులో తీసుకెళ్లకుండా తక్కవ అద్దెకు దొరుకుతుందని, ఇన్సూరెన్స్ కూడా లేని ప్రైవేట్ బస్సులో తీసుకెళ్లడంలో ఆంతర్యమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. విహారయాత్ర వద్దు, ఏమీ వద్దు.. తమ పిల్లలను వెంటనే వెనక్కి పిలుచుకురావాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను వెనక్కు తీసుకొస్తాం ‘అనుకోకుండా ప్రమాదం సంభవించింది. కంగారు పడవద్దు. చిన్నపాటి గాయాలు తప్ప ఎవరికీ ప్రాణహాని జరగలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, విద్యార్థులను వెనక్కి రప్పిస్తాం’ అని ఎంఈఓ భీమప్ప విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. -
తిరుమలలో సుమో బోల్తా : తీవ్ర గాయాలు
-
సూర్యాపేటలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా
-
ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి
నర్సింహులుపేట(వరంగల్): వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు కూలీలు మృతిచెందారు. వరంగల్ జిల్లా నర్సింహులుపేట మండలం ఆగపేట శివారులోని దుబ్బతండా వద్ద ఆదివారం ఉదయం ట్రాక్టర్ బోల్తా కొట్టింది. దీంతో ట్రాక్టర్లో వెళ్తున్న తండాకు చెందిన ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
పెళ్లి డీసీఎం బోల్తా, 18 మందికి గాయాలు
భువనగిరి అర్బన్: పట్టణ శివారులో ఉన్న బైపాస్ రోడ్డులో పెద్దకందుకూరు నుంచి నాగోల్‌కు వెళ్తున్న పెళ్లి డీసీఎం ప్రమాదవశాత్తు బోల్తా పడిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందుకూరు చెందిన జనకల నర్సయ్య, నర్సమ్మల కుమార్తెకు నాగోల్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన తమ బందువుల అబ్బాయితో వివాహం ఆదివారం గ్రామంలోనే జరిగింది. సోమవారం రాత్రి సరూర్‌నగర్‌లో విందు ఉండటంతో అమ్మాయి తరుపు బంధువులు యాదగిరిగుట్టకు చెందిన సుడుగు Mýృష్ణారెడ్డి డీసీఎంలో Ðð ళ్తున్నారు. ఈ క్రమంలో భువనగిరి పట్టణ శివారులో బైపాస్ రోడ్డులో ఉన్న వివేరా హోటల్ దాటిన తర్వాత వీరు ప్రయాణిస్తున్న డీసీఎంను ఒక గుర్తు తెలియని కారు వచ్చి ఢికోట్టి వెళ్లి పోయింది. దీంతో డీసీఎం డ్రైవర్ స్టిరింగ్‌ను పక్కకు టార్నింగ్ చేసే ప్రయత్నం చేయగా స్టిరింగ్ రాడ్ విరిగంతోపాటు బ్రేక్ పైపులు పగిలి పోయాయి. దీంతో డీసీఎం రోడ్డు కిందకు దుసుకుపోయి బోల్తా పడింది. డీసీఎంలో ఉన్న 40 నుంచి 50 మంది వరకు ఉన్నారు. ఇందులో 18 మంది గాయపడ్డారు. పెళ్లి కుమార్తె తల్లి నర్సయ్య, బంధువులు సునిల్, మధు, మహేష్, సాయికుమార్, చందు, రాకేష్, రమేష్, స్వామి, కిష్టయ్య, నర్సయ్య, హరిMýృష్ణ, యాదగిరి, ఎల్లమ్మతో పాలు మారో ముగ్గురికి తలకు, కాలుకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది, హైవే అంబులెన్స్ ద్వారా బాధితులను ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
అదుపుతప్పి దూసుకువెళ్లిన కారు
ఉల్లిపాలెం(కోడూరు): పుష్కర స్నానం చేసి తిరిగి వెళ్తున్న భక్తుల అంబాసిడర్ కారు అదుపు తప్పింది. కల్వర్టుపై కూర్చున్న వారిపైకి దూసుకువెళ్లింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన దాసరి వెంకటరమణయ్య(60), కోట ముక్తేశ్వరరావు, పుప్పాల కోటేశ్వరరావు కల్వర్టుపై కూర్చున్నారు. కారు అదుపుతప్పి వారిని ఢీకొట్టింది. ఘటనలో వెంకటరమణయ్య పక్కనే డ్రెయిన్‌లో పడి మృతి చెందాడు. ముకేశ్వరరావుకి ఒక కాలు విరిగిపోయింది. కోటేశ్వరరావు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కారులో మొవ్వ గ్రామానికి చెందిన పోలిశెట్టి సుధారాణి, కుటుంబసభ్యులు విజయనాగదుర్గ, తరుణి, గుంటూరుకు చెందిన గనిపిశెట్టి రమాదేవి, మరో ఇద్దరు ఉన్నట్లు గుర్తించారు. బాధితులకు అండగా రమేష్‌బాబు.. మృతుడు వెంకటరమణయ్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు శనివారం రాత్రి రాస్తారోకోకు దిగారు. రమణయ్య మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో అవనిగడ్డ సీఐ మూర్తి మృతదేహాన్ని రోడ్డుపై నుంచి తొలగించాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసిన తరువాత మృతదేహాన్ని తీస్తాం.. అంటూ ఆందోళకారులు చెప్పారు. సీఐ మూర్తి ఎంపీపీ మాచర్ల భీమయ్య, డీసీ మాజీ అధ్యక్షుడు గుడిసేవ సూర్యనారాయణకు వారికి నచ్చజెప్పాలని కోరారు. వారు నిరాకరించడంతో సీఐ గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించారు. వారు పుష్కర విధుల్లోని 150మంది పోలీసులను పంపారు. పోలీసులు గ్రామస్తులను చెల్లాచెదురు చేసి విచక్షణరహితంగా కొట్టారు. బాధితులకు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు అండగా నిలిచారు. సీఐ సరిగ్గా సమాధానం చెప్పడంతోఅసహనం వ్యక్తం చేశారు. న్యాయం జరిగేలా పోరాడతానని హామీ ఇచ్చారు. -
బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో..
ధర్మసాగర్(వరంగల్): వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా కొట్టిన ఘటనలో పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం సోమదేవరపల్లి వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో.. అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
కారు బోల్తా.. ఇద్దరికి గాయాలు
కంభం: వేగంగా వెళ్తున్న కారు ముందు టైరు పేలిపోవడంతో.. అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కంభం మండలం ఎర్రపాలెం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపైనే పల్టీలు కొట్టడంతో.. అందులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా.. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
ట్రాక్టర్ బోల్తా.. నలుగురు మృతి
దండేపల్లి: ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామం వద్ద బుధవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభాల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడటంతో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మృతిచెందారు. మృతులు కౌతాళం గ్రామానికి చెందినవారని తెలుస్తోంది. ప్రమాదస్థలంలో ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విశాఖ శివారులో గ్యాస్ ట్యాంకర్ బోల్తా
-
టిప్పర్ బోల్తా .. ముగ్గురికి గాయాలు
రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం యమ్నంపేట ఔటర్ రింగ్ రోడ్డు అండర్ బ్రిడ్జి వద్ద సోమవారం సాయంత్రం ఓ టిప్పర్ బోల్తా పడడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఘట్కేసర్ నుంచి ఈసీఐఎల్ వైపు వెళుతున్న టిప్పర్ బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి వెనక ట్రక్ పైకి లేచింది. అది బ్రిడ్జిని తాకడంతో బోల్తాపడింది. టిప్పర్ డ్రైవర్‌తోపాటు అందులో ఉన్న మరో ఇద్దరికి గాయాలు కాగా, వారిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
ట్యాంకర్ బోల్తా.. ఒకరు మృతి
శంషాబాద్ రూరల్(రంగారెడ్డి జిల్లా): లారీ, ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో ఓ క్లీనర్ మృతి చెందగా ట్యాంకర్‌లోని పెట్రోల్, డీజిల్ రోడ్డుపాలైంది. ఈ సంఘటన మండల పరిధిలోని పాల్మాకుల సమీపంలో బెంగళూరు జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ అహ్మద్ పాషా తెలిపిన వివరాల ప్రకారం.. చర్లపల్లి నుంచి ఓ ట్యాంకర్ పెట్రోలు, డీజిల్ తీసుకుని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని మిడ్జిల్‌కు వె ళ్తోంది. శనివారం రాత్రి ఒంటి గంట సమయంలో పాల్మాకుల వద్ద ముందు వెళ్తున్న సిమెంట్ లారీని ట్యాంకర్ డ్రై వర్ ఓవర్టేక్ చేయబోయాడు. ఈ సమయంలో లారీ వెనకభాగాన్ని ట్యాంకర్ ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ట్యాంకరు క్యాబిన్లో ఎడమవైపు కూర్చున్న క్లీనర్, మహబూబ్‌నగర్ జిల్లా దామరగిద్ద మండలం లక్ష్మీపల్లి నివాసి అయిన కడ్తాల వెంకటేష్(19)కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ శివకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్షతగాత్రుడు వెంకటేష్‌ను చికిత్స కోసం తరలిస్తుండగా మృతి చెందాడు. ట్యాంకర్ డ్రైవర్ ఎండీ.దావూద్ హుస్సేన్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ట్యాంకర్లో 4 వేల లీటర్ల పెట్రోలు, 8 వేల లీటర్ల డీజిల్ ఉండగా మొత్తం రోడ్డుపాలైంది. రోడ్డుపై ట్యాంకరు బోల్తాపడడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. క్రేన్ సాయంతో పోలీసులు ట్యాంకర్‌ను రహదారి పైనుంచి పక్కకు తొలగించారు. -
గ్యాస్ ట్యాంకర్ బోల్తా డ్రైవర్ మృతి
విశాఖపట్టణం: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ)కు చెందిన గ్యాస్ ట్యాంకర్ గాజువాక సమీపంలో జాతీయరహదారిపై బోల్తా పడింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ గ్యాస్ ట్యాంకర్ డ్రైవర్ని ఆసుపత్రి తరలిస్తుండగా మరిణించాడు. నాపయ్యపాలెంలో ట్రాన్స్‌పోర్టు ఆఫీస్ ముందు ఆగి ఉన్న లారీని సోమవారం తెల్లవారుజామున ట్యాంకర్ ఢీ కొట్టింది. దీంతో పూల్ గ్యాస్ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్ బోల్తా పడింది. విషయం తెలిసిన ఐఓసీ అగ్నిమాపక సిబ్బంది, జాతీయ రహదారుల భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ట్యాంకర్‌ను పరిశీలించారు. రోడ్డుపై అడ్డంగా పడటంతో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. హైవే పెట్రోలింగ్ పోలీసులు వాహనాన్ని రోడ్డుపై నుంచి తరలించారు. -
స్కూల్ బస్సు బోల్తా
త్రిపురాంతకం : ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడటంతో ఓ విద్యార్థి చేయి సగానికి తెగగా మిగిలిన విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటన మండలంలోని గణపవరం సమీపాన కేజీ రోడ్డుపై సోమవారం జరిగింది. వివరాలు.. త్రిపురాంతకంలోని విజ్ఞాన్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ బస్సు మండలంలోని అన్నసముద్రం వెళ్లి 20 మంది విద్యార్థులతో తిరిగి బయల్దేరింది. మార్గమధ్యంలోని గణపవరం సమీపాన కేజీ రోడ్డుపై బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో అన్నసముద్రానికి చెందిన ఒకటో తరగతి విద్యార్థి పోట్ల అజయకుమార్ చేయి తెగింది. మరో ఇద్దరు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఏడుస్తున్న ఓ బాలికను తల్లిదండ్రులు డ్రైవర్ వద్ద కూర్చోబెట్టారు. బాలిక బస్సు స్టీరింగ్‌ను గట్టిగా లాగడంతో బోల్తా కొట్టిందని డ్రైవర్ చెబుతున్నాడు. బస్సు బోల్తా కొట్టిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. బస్సులో చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీశారు. చేయి విరిగిన బాలుడు మినహా అంతా సురక్షితంగా బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు. బాలుడికి స్థానిక వైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం గుంటూరు తీసుకెళ్లారు. ఎస్సై నాగరాజు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. -
వోల్వో బస్సు బోల్తా!
మెదక్: సంగారెడ్డి మండలం మామిడిపల్లి చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. బైకును తప్పించబోయి వోల్వో బస్సు బోల్తాపడింది. కర్ణాటకకు చెందిన ఈ బస్సు హైదరాబాద్ నుంచి ముంబై వెళుతోంది. గాయపడినవారిని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. విషమంగా ఉన్నవారిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ** -
తప్పిన పెనుముప్పు
పొందూరు, న్యూస్‌లైన్: సాయంత్రం ఆరుగంటలు... పాలకొండ పారిస్ సుగర్ ఫ్యాక్టరీకి చెందిన ట్యాంకర్ లారీ స్పిరిట్‌తో రాజాం మీదుగా చిలకపాలెం వైపు వస్తూ లోలుగు సమీపానికి చేరుకుంది. ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించేందుకు డ్రైవర్ బ్రేక్ వేసినా ఫలితం లేదు... ప్రమాదం తప్పదని గమనించినా ఏమీ చేయలేని నిస్సహాయత... వెంటనే తోటి క్లీనర్‌ను కిందకు తోసేశాడు... ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే ప్రయత్నంలోనే ఓ లారీను, దానివెనుకనే వస్తున్న ఆటోను, కారును ఢీకొట్టాడు. దీంతో ట్యాంకర్ లారీ కూడా బోల్తా పడడంతో పది వేల లీటర్ల స్పిరిట్‌తో పరిసరాలు నిండిపోయాయి. అందరూ భయంతో పరుగులు తీశారు. కాసేపటికే తేరుకున్న లోలుగు గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్యాంకర్ క్యాబిన్లో చిక్కుకుని ఆర్తనాదాలు చేస్తున్న కరీంనగర్‌కు చెందిన డ్రైవర్ ఎస్.కె.ఫిరోజ్‌ఖాన్‌ను రక్షించారు. ఆయనతో పాటు గాయపడిన మరో ముగ్గురిని 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. విశాఖపట్నంలోని ఓ ఫ్యాక్టరీకి స్పిరిట్ తీసుకెళ్తున్న ట్యాంకర్ లారీ పొందూరు-చిలకపాలెం ప్రధాన రోడ్డుకు అడ్డంగా బోల్తా పడడంతోరాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సాహసించిన లోలుగు గ్రామస్తులు ఓ వైపు స్పిరిట్‌తో నిండిన పరిసరాలు... మరో వైపు ట్యాంకర్ లారీ క్యాబిన్లో చిక్కుకుని రక్షించండంటూ డ్రైవర్ ఆర్తనాదాలు... ప్రమాదం పొంచి ఉన్నా...లోలుగు గ్రామస్తులు సాహసించారు. కొందరు యువకులు పరుగున వెళ్లి డ్రైవర్‌ను రక్షించేందుకు ప్రయత్నించారు. గునపాలు, తాళ్ల సహాయంతో క్యాబిన్‌ను తొలగించారు. చివరకు జేసీబీను తెప్పించి డ్రైవర్‌ను ప్రమాదం నుంచి రక్షించారు. తప్పిన పెను ప్రమాదం స్పిరిట్ పడే ప్రాంతంలో ఏ మాత్రం నిప్పు రవ్వలు రగిలినా పెను ప్రమా దం జరిగేది. స్పిరిట్‌కు నిప్పంటుకుంటే పదుల సంఖ్యలో మృతిచెందేవారు. పొందూరు అగ్నిమాపక సిబ్బంది కూడా సకాలంలో చేరుకుని పరిసరాలను నీటితో తడిపారు. అగ్నిప్రమాదానికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నారు. అయితే, డ్రైవర్‌ను రక్షించే సమయంలో ఓ వ్యక్తి సిగెరెట్ తాగుతూ ట్యాంకర్ దగ్గర రావడంతో ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ట్యాంకర్ దగ్గర ఉన్న పోలీసులు, స్థానికులు ఆ వ్యక్తిని దూరంగా నెట్టేశారు. అదే సిగరెట్ పొరపాటున స్పిరిట్‌కు అంటుకొని ఉంటే ట్యాంకర్ పేలిపోయి పెనుప్రవూదం సంభవించేది. ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. తెగిన విద్యుత్ వైర్లు ట్యాంకర్ విద్యుత్ స్తంభాన్ని సైతం భూమిలో నుంచి లాగేయండంతో వైర్తు తెగిపోయి రోడ్డుమీద పడిపోయాయి. ఆ సమయంలో విద్యుత్ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. నువ్వైనా బతుకు... బ్రేక్ ఫెయిల్ కావడంతో అడ్డదిడ్డంగా ప్రయాణిస్తున్న ట్యాంకర్ లారీ, ఆటోను ఢీకొట్టబోతుందని తెలిసిన డ్రైవర్ ఎంతో ఉదారంగా వ్యవహిరించాడు. లారీని కొన్ని సెకన్లతో ఢీకొడుతుందనే సమయానికి నువ్వైనా బతుకురా అంటూ క్లీనర్ కృష్ణను డ్రైవర్ ఫిరోజ్‌ఖాన్ బయటకు తోసేశాడని స్థానికులు చెబుతున్నారు. తన ప్రాణాలు పోతాయని తెలిసినా తన క్లీనర్‌ను రక్షించుకోవడం ఎంతో గొప్ప విషయం. బయటకు నెట్టేయడంతో క్లీనర్ చిన్నచిన్న గాయాలతో బయటపడ్డాడు. పొందూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో ట్యాంకర్‌ను రోడ్డు పక్కకు మళ్లించారు. కేసు నమోదుచేశారు. -
స్కూల్ బస్సు బోల్తా
చేవెళ్ల రూరల్, న్యూస్‌లైన్: వేలకువేలు ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల భద్రతపై దృష్టి సారించడం లేదు. బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను తరలించడం, సరిపడు బస్సులు నడపకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వేగంగా వెళ్తున్న పాఠశాల బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. అదృష్టవశాత్తు స్వల్పగాయాలతో విద్యార్థులు బయటపడ్డారు. యాజమాన్యం తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. ఈ సంఘటన చేవెళ్ల మండలం కుమ్మెర శివారులో సోమవారం చోటుచేసుకుంది. విద్యార్థులు, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. చేవెళ్ల మండల కేంద్రంలో శ్రీసత్య సాయి గ్రామర్ స్కూల్ ఉంది. సోమవారం ఉదయం పాఠశాలకు చెందిన బస్సు మండలంలోని గొల్లగూడ, కమ్మెట, గొల్లపల్లి, ధర్మాసాగర్ గ్రామాల్లోంచి దాదాపు 30 మంది విద్యార్థులను ఎక్కించుకొని అదే రూటులో ఉన్న కుమ్మెర, ముడిమ్యాల గ్రామాలకు వెళ్తోంది. బస్సు వేగంగా ఉండడం, డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సు కుమ్మెర శివారులో బోల్తాపడింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థులు హాహాకారాలు చేశారు. పక్క పొలాల్లో పనిచేస్తున్న రాజు, యాదగిరి గమనించి ఘటనా స్థలానికి వచ్చారు. బస్సు అద్దాలను పగులగొట్టి పిల్లలను సురక్షితంగా బయటకు రప్పించారు. ప్రమాదంలో కొందరు పిల్లలు స్వల్పగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులను రక్షించాల్సిన డ్రైవర్ శ్రీనివాస్ బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు పాఠశాల ఎదుట ఆందోళన.. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఒకానొకదశలో ప్రిన్సిపాల్ ఏరని పాఠశాల ఆఫీసులో, తరగతి గదుల్లో వెతికారు. అనంతరం విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ ప్రభాకర్ అక్కడికి వచ్చారు. విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకుంటామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన బస్సు డ్రైవర్‌ను తొలగిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వారంరోజుల్లో బస్సుల సంఖ్య పెంచుతామని చెప్పడంతో ఆందోళనకారులు శాంతించి వెళ్లిపోయారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపుతాం.. బస్సు బోల్తా విషయం తెలుసుకున్న జిల్లా విద్యాధికారులు చేవెళ్ల మండల విద్యాధికారి శ్రీశైలంను వివరణ కోరారు. దీంతో ఎంఈఓ పాఠశాలకు సందర్శించి వివరాలు సేకరించారు. విద్యార్థులకు సరిపడు బస్సులు లేవని, దీంతో రెండు ట్రిప్పుల కోసం బస్సు వేగంగా వస్తుండగా ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని చెప్పారు.