కంభం: వేగంగా వెళ్తున్న కారు ముందు టైరు పేలిపోవడంతో.. అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కంభం మండలం ఎర్రపాలెం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపైనే పల్టీలు కొట్టడంతో.. అందులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా.. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.