పెళ్లి డీసీఎం బోల్తా, 18 మందికి గాయాలు
పెళ్లి డీసీఎం బోల్తా, 18 మందికి గాయాలు
Published Mon, Aug 22 2016 11:40 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
భువనగిరి అర్బన్:
పట్టణ శివారులో ఉన్న బైపాస్ రోడ్డులో పెద్దకందుకూరు నుంచి నాగోల్‌కు వెళ్తున్న పెళ్లి డీసీఎం ప్రమాదవశాత్తు బోల్తా పడిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందుకూరు చెందిన జనకల నర్సయ్య, నర్సమ్మల కుమార్తెకు నాగోల్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన తమ బందువుల అబ్బాయితో వివాహం ఆదివారం గ్రామంలోనే జరిగింది. సోమవారం రాత్రి సరూర్‌నగర్‌లో విందు ఉండటంతో అమ్మాయి తరుపు బంధువులు యాదగిరిగుట్టకు చెందిన సుడుగు Mýృష్ణారెడ్డి డీసీఎంలో Ðð ళ్తున్నారు. ఈ క్రమంలో భువనగిరి పట్టణ శివారులో బైపాస్ రోడ్డులో ఉన్న వివేరా హోటల్ దాటిన తర్వాత వీరు ప్రయాణిస్తున్న డీసీఎంను ఒక గుర్తు తెలియని కారు వచ్చి ఢికోట్టి వెళ్లి పోయింది. దీంతో డీసీఎం డ్రైవర్ స్టిరింగ్‌ను పక్కకు టార్నింగ్ చేసే ప్రయత్నం చేయగా స్టిరింగ్ రాడ్ విరిగంతోపాటు బ్రేక్ పైపులు పగిలి పోయాయి. దీంతో డీసీఎం రోడ్డు కిందకు దుసుకుపోయి బోల్తా పడింది. డీసీఎంలో ఉన్న 40 నుంచి 50 మంది వరకు ఉన్నారు. ఇందులో 18 మంది గాయపడ్డారు. పెళ్లి కుమార్తె తల్లి నర్సయ్య, బంధువులు సునిల్, మధు, మహేష్, సాయికుమార్, చందు, రాకేష్, రమేష్, స్వామి, కిష్టయ్య, నర్సయ్య, హరిMýృష్ణ, యాదగిరి, ఎల్లమ్మతో పాలు మారో ముగ్గురికి తలకు, కాలుకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది, హైవే అంబులెన్స్ ద్వారా బాధితులను ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement