
కామారెడ్డి : బిచ్కుంద మండలం చిన్న దేవాడలో గురువారం తెల్లవారుజామున పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. పెళ్లి సందర్భంగా దగ్గరలోని వాగువద్ద నీళ్లు తెచ్చేందుకని ట్యాంకర్ తీసుకొని వెళ్లారు. వాగులో నీళ్లు తీసుకొని వస్తున్న సమయంలో ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా,మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన ఇద్దరిని బాన్సువాడ ఆసుపత్రికి తరలించగా.. మృతి చెందిన వారిని తుకారం, సాయిలు, శంకర్‌లుగా గుర్తించారు. కాగా డ్రైవర్ ట్రాక్టర్‌ను నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని.. అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.తెల్లవారితే పెళ్లి జరగాల్సిన ఇంట్లో ముగ్గురు మృత్యువాత పడడంతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment