నర్సాపూర్(మెదక్): బస్సు పల్టీకొట్టిన ఘటనలో పదిమంది గాయాల పాలయ్యారు. శనివారం సాయంత్రం నర్సాపూర్-తుప్రాన్ రహదారిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సంగారెడ్డికి వెళుతుండగా.. హన్మంతాపూర్ సమీపంలో బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 20 మందిలో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనంలో నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బస్సుబోల్తా...పది మందికి గాయాలు
Published Sat, Jun 25 2016 4:30 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement