మొగాదిషు: సోమాలియాలో అల్ షబాబ్ సంస్థకు ఉగ్రవాదులు చేసిన బాంబుల దాడిలో తొమ్మిది మంది పౌరులు మృతిచెందారు. 12 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ముందస్తు వ్యూహం ప్రకారం ప్రభుత్వ పాలనా కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు బాయిడోవా అనే నగరంలో వివిధ చోట్ల బాంబులు పేల్చారు. ముఖ్యంగా బాయిడోవా ప్రెసిడెంట్ షరీఫ్ హసన్ షేక్ అదాన్ను లక్ష్యంగా చేసుకుని ఆయన నివాసానికి సమీపంలో బాంబులు పేల్చారు. ఈ బాంబులు పేలిన ప్రాంతాల్లో ఆఫ్రికన్ యూనియన్, యూనైటెడ్ నేషన్స్ కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఈ బాంబుల వల్ల గాయపడినవారిలో సైనికులు కూడా ఉన్నారు.