మగావా.. డ్యూటీలో చాలా సిన్సియర్. రోజూ ఫీల్డ్‌లోకి దిగి ల్యాండ్‌మైన్‌లను పసిగట్టడం. వందల మంది ప్రాణాలు రక్షించడం. ఇదంతా ఇన్ ది స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్. ఇట్ ఈజ్ నాట్ ట్రాక్ రికార్డ్.. ఇట్ ఈజ్ ఆల్ టైం రికార్డ్!!.
సూపర్ హీరోకి అర్హతలేంటని అడిగితే.. ఏవేవో చెప్తుంటారు కొందరు. కానీ, ఆ అర్హతలేవీ లేకుంటే?.. ఆ సూపర్ హీరో అసలు మనిషి కాకుంటే!! యస్.. మాగావా మనిషి కాదు. ఓ ఎలుక. సాధారణమైంది మాత్రం కాదు. ల్యాండ్ మైన్‌లను గుర్తించడంలో కఠోర శిక్షణ తీసుకుంది. తన విధి నిర్వహణలో నిబ్ధదత ప్రదర్శించిన ఈ ఎలుక.. ఈమధ్యే కన్నుమూసింది. అందుకే సోషల్ మీడియాలో అంత ఎమోషనల్ అవుతున్నారు.
టాంజానియా బ్రీడ్‌కు చెందిన మగావాను కంబోడియా తీసుకొచ్చి.. ల్యాండ్‌మైన్లను గుర్తించడంలో శిక్షణ ఇచ్చారు. ఐదేళ్ల కాలంలో వందకి పైగా ల్యాండ్ మైన్‌లను గుర్తించింది. తద్వారా ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు ఈ చిట్టి హీరో.
2020లో మాగ్వా యూకేకి చెందిన ఓ ఆర్గనైజేషన్ నుంచి గోల్డ్ మెడల్ కూడా అందుకుంది మగావా. కిందటి ఏడాది జూన్‌లో విధుల నుంచి రిటైర్ అయిన ఈ ఎలుక.. చివరికి ఎనిమిదేళ్ల వయసులో ఈమధ్యే కన్నుమూసింది. ఈ విషయాన్ని దానికి శిక్షణ ఇచ్చిన APOPO అనే బెల్జియం ఎన్జీవో ప్రకటించింది.
అంతర్యుద్ధంతో దశాబ్దాలపాటు నలిగిపోయిన కంబోడియా.. ల్యాండ్‌మైన్‌ల గనిగా ఒక పేరు దక్కించుకుంది. వీటి ధాటికి వందల మంది ఏటా ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. అందుకే రిస్క్ లేకుండా ఎలుకలకు ల్యాండ్‌మైన్‌లను గుర్తించే శిక్షణ ఇప్పిస్తున్నారు. కొన్ని ఆఫ్రికా దేశాల్లో ల్యాండ్‌మైన్‌లతో పాటు టీబీ రోగి శాంపిల్స్ గుర్తించేందుకు ఎలుకలను ఉపయోగిస్తున్నారు. విశేషం ఏంటంటే.. చాలా సందర్భాల్లో ఇవి విజయవంతంగా ఆపరేషన్‌ను పూర్తి చేస్తున్నాయి కూడా. అందుకే ఆ ర్యాట్‌హీరోలకు ఓ సలాం కొడుతూ.. RIP Magawa.
Comments
Please login to add a commentAdd a comment