ఆ నటికి నిజంగానే దెయ్యం పట్టిందా? | Cambodian Actress Possessed Ghost Video Viral | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 3 2018 10:11 AM | Last Updated on Wed, Apr 3 2019 8:58 PM

Cambodian Actress Possessed Ghost Video Viral - Sakshi

నోమ్‌ పెన్‌ : సోషల్‌ మీడియాలో ఓ వీడియో వణుకు పుట్టిస్తోంది. కంబోడియన్‌ నటి ఒకరికి సెట్‌లోనే దెయ్యం పట్టినట్లు ప్రచారం జరుగుతూ ఆ వీడియో వైరల్‌ అవుతోంది. 

వివరాల్లోకి వెళ్లితే... ఓ హర్రర్‌ చిత్రంలో సదరు నటి దెయ్యం పాత్ర పోషిస్తోంది. అయితే ఏం జరిగిందో తెలీదుగానీ ఆమె వింతగా ప్రవర్తించటం మొదలుపెట్టింది. తోటి నటితోపాటు వ్యక్తిగత సిబ్బందిపైనా దాడి చేసింది. గదిలో గోడకు దెయ్యం పట్టినట్లు కదలకుండా కూర్చోవటంతో అంతా వణికిపోయారు. ఆమెను చూసి వణికిపోయిన చిత్ర యూనిట్‌ ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకున్నారు. అప్పటికే కొందరిపై దాడి చేయటంతో దగ్గరికి వెళ్లేందుకు ఎవరూ సాహసించలేకపోయారు.

మరికొందరు ఆమెకు నిజంగానే దెయ్యం పట్టిందంటూ బయటకు పరుగులు తీసి ప్రచారం చేశారు. సహ నటి మాత్రం ఏడుస్తూ బయట కూర్చుండి పోయింది. అయితే ఇది నిజంగానే జరిగిందా? లేక సరదా కోసం(ఫ్రాంక్‌ వీడియో) చేసిందా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. 

ఘటన ఎప్పుడు జరిగిందన్నది స్పష్టత లేకపోయినప్పటికీ.. గత నాలుగు రోజులుగా ఫేస్‌ బుక్‌ ఈ వీడియో హల్‌ చల్‌ చేస్తోంది. దాదాపు 16 మిలియన్‌ వ్యూవ్స్‌ దీనికి రాగా.. 7 వేలకు పైగా షేర్లు వచ్చాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement