కాంబోడియాలో ఇద్దరు బౌద్ధభిక్షువుల వద్ద డ్రగ్స్, కండోమ్స్ దొరకడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారు నివసిస్తున్న పగోడాలో పోలీసులు సోదాలు చేయగా అక్కడ క్రిస్టల్ మెతాంఫెటమైన్ పైపు, ఇతర వస్తువులు దొరికాయి. పుర్ లాంగా పగోడాకు చెందిన ఈ బౌద్ధ భిక్షువులను సియెమె రీప్ నగరంలో అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు భిక్షువుల్లో ఒకరు సీనియర్. పిచ్ డేవిడ్ (36) అనే ఇతగాడు తనను తాను గురువుగా చెప్పుకొంటూ.. బౌద్ధ నియమాలను కూడా పాటించరని ఓ పోలీసు అధికారి తెలిపారు.
తాము అక్కడకు వెళ్లేసరికి అక్కడ మద్యం, కొన్ని కండోమ్లు ఉన్నాయని, అలాగే 'ఐస్' అనే తరహా డ్రగ్ సేవించడానికి కావల్సిన పైప్ కూడా ఉందని అన్నారు. వీరిద్దరిమీద కోర్టులో కేసు నమోదైంది. దాంతో ఈ ఇద్దరినీ ఆశ్రమం నుంచి తరిమేశారు. వారి బౌద్ధ భిక్షువు హోదాను కూడా తప్పించారు.
పిచ్ డేవిడ్కు ఇలా జరగడం ఇది రెండోసారి. తొలిసారి దుష్ప్ర్రవర్తన కారణంగా అతడిని 2012లో బహిష్కరించినా, మళ్లీ తాను నియమాలకు కట్టుబడి ఉంటానని వేడుకోవడంతో 2013లో చేర్చుకున్నారు. ఇంతకుముందు కండల్ రాష్ట్రంలో పోలీసులతో కలిసి మద్యం సేవించినందుకు పగోడాలో ప్రధాన బౌద్ధభిక్షువు ఒకరిని ఆశ్రమం నుంచి తప్పించారు. బౌద్ధ నియమాల ప్రకారం భిక్షువులు తప్పనిసరిగా మద్యం, డ్రగ్స్, సెక్స్ లాంటివాటికి దూరంగా ఉండాలి.
బౌద్ధభిక్షువుల వద్ద డ్రగ్స్, కండోమ్స్!!
Published Mon, Sep 22 2014 2:36 PM | Last Updated on Fri, May 25 2018 2:29 PM
Advertisement