buddhist monks
-
షాకింగ్: 150మంది సాధువులకు కరోనా
ధర్మశాల: హిమాచల్ ప్రదేశ్ కంగ్రా జిల్లా జోన్‌గ్యూటో బౌద్ధ ఆశ్రమంలో 150 మంది సాధువులకు కరోనా సోకింది. ఫిబ్రవరి 18వ తేదీన టిబెటన్ కొత్త సంవత్సరం సందర్భంగా బౌద్ధ ఆశ్రమంలో వేడుకలు జరిగాయి. ఈ క్రమంలో బౌద్ధ ఆశ్రమంలో 20 మందికి కరోనా సోకడంతో అప్రమత్తమైన వైద్యాధికారులు 330 మంది సాధువులకు కరోనా పరీక్షలు చేశారు. వారిలో 154 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 8 రోజుల్లోనే 154 మందికి కరోనా సోకడంతో గ్యూటో ఆశ్రమాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఈ ఆశ్రమానికి కర్ణాటక, ఢిల్లీ ప్రాంతాల నుంచి ఫిబ్రవరి 23వ తేదీన 15 మంది బౌద్ధ భిక్షువులు వచ్చారు. కరోనా వచ్చిన సాధువుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని, ప్రయాణాలు చేసి వచ్చిన వారిని ఆశ్రమంలోనే క్వారంటైన్ చేశామని కంగ్రా జిల్లా కలెక్టరు రాకేష్ ప్రజాపతి చెప్పారు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే బయట ప్రాంతాల నుంచి వచ్చిన సాధువులకు కరోనా నెగిటివ్ అని తేలింది. కానీ ఇందులో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనని తాండ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించామని కలెక్టర్ వివరించారు. ధర్మశాలలోని కరోనా ప్రబలిన బౌధ్ధ ఆశ్రమానికి సీలు వేశామని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ చెప్పారు. బౌద్ధ ఆశ్రమంలో 60 ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకాలు వేశామని అధికారులు చెప్పారు. చదవండి: కరోనాతో కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత -
రోబో శరణం గచ్ఛామి..
ఈ రోబో ఏంటి.. దాని ముందు ఆ బౌద్ధమత సన్యాసులు అలా మోకరిల్లడమేమిటి? విషయం అర్థం కాలేదు కదూ.. చెబుతా వినండి మరి.. జపాన్‌లోని క్యోటోలో 400 ఏళ్లనాటి పురాతన బౌద్ధారామం ఒకటి ఉంది. పేరు.. కొడాయ్జి.. ఇప్పటి తరం.. ముఖ్యంగా యువతరానికి బౌద్ధమతం గొప్పతనాన్ని తెలియజేయడం ఎలా.. వారిని ఆకర్షించడం ఎలా.. అని ఆ మధ్య అక్కడి మత గురువులు బాగా ఆలోచించారు. పలు చర్చల అనంతరం టెక్నాలజీ సాయం తీసుకోవాలని నిర్ణయించారు. వెంటనే ఒసాకా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఇషిగురోను కలిశారు. అప్పుడు రెడీ అయింది .. ఈ రోబో సన్యాసి.. దీనికి దయకు ప్రతిరూపమైన దేవత ‘కెనాన్’పేరు పెట్టారు. ఈ ఏఐ (కృత్రిమ మేథ) రోబో పనేమిమంటే.. బోధనలు చేయడమే.. తద్వారా యువతను ఆకర్షించడమే. 7 అడుగుల పొడవు.. 60 కిలోల బరువున్న ఈ రోబోకు అయిన ఖర్చు రూ.6.4 కోట్లు. రోబో బోధనలు ప్రస్తుత తరాన్ని ఆకర్షిస్తాయని.. వారి మనసుల్లోకి అవి చొచ్చుకుపోతాయని.. తద్వారా బౌద్ధమతం గొప్పదనాన్ని వారు తెలుసుకుంటారని మత గురువులు బలంగా నమ్ముతున్నారు. తాజాగా కెనాన్ చేసిన బోధనలకు వీరిలా ఫిదా అయిపోయారు. ప్రీ ప్రోగ్రామ్స్ సాయంతో జపనీస్‌తోపాటు చైనీస్, ఆంగ్ల భాషలోనూ అనర్గళంగా ఉపన్యసిస్తుందట. మార్చి నుంచి యువతతోపాటు వివిధ దేశాలనుంచి వచ్చే పర్యాటకులు లక్ష్యంగా కెనాన్ బోధనలుంటాయట. -
శ్రీలంకలో అల్లర్లకు కారణాలేమిటీ?
కొలంబో : శ్రీలంకలో ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లలో పదుల సంఖ్యలో వ్యాపార సంస్థలు, ముఖ్యంగా ముస్లింల హోటళ్లు, 24 మసీదులు ధ్వంసమయ్యాయి. 41 ఏళ్ల ఓ బుద్ధిస్టు సింహళీయుడు అనే డ్రైవర్‌ను కొంత మంది ముస్లిం అతివాదులు హత్య చేయడంతో ఈ అల్లర్లు మొదలయ్యాయి. హత్యకు గురైన సింహళీయుడి భౌతికకాయాన్ని అప్పగించేందుకు శ్రీలంక పోలీసులు నిరాకరించడంతో అగ్రహోదగ్రులైన సింహళీయులు, ముస్లింలకు వ్యతిరేకంగా దాడులకు దిగారు. ఇలాంటి అల్లర్లకు ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కతిక కారణాలు ఉంటాయని తెల్సిందే. వాటికి తోడు శ్రీలంకలో ముస్లింల వ్యతిరేకత పెరగడానికి కొన్ని అపోహలు తోడ్పడ్డాయి. సింహళీయుల్లో సంతానం పెరగకుండా నియంత్రించేందుకు వారు నిర్వహిస్తున్న హోటళ్లలో సంతానోత్పత్తిని తగ్గించే మాత్రలను కలుపుతున్నారన్నది అలాంటి అపోహే. నలుగురు మహిళలను పెళ్లిచేసుకునే అవకాశం ఉన్న ముస్లింలు కుటుంబ నియంత్రణను సక్రమంగా పాటించకుండా ఎక్కువ సంతానాన్ని కంటున్నారు. ఇటు సింహళీయుల్లో సంతానాన్ని నియంత్రించడం, అటువైపు ముస్లింల జనాభాను పెంచుకొని శ్రీలంకను ఇస్లాం రాజ్యం చేయడం ముస్లింల లక్ష్యమని స్థానిక సింహళీయులు భావిస్తున్నారు. ఇక ముస్లింలు కూడా మొహమ్మద్ ఐబిన్ అబ్దుల్ వాహెద్ అతివాద దక్పధాన్ని ఎక్కువ ఆచరిస్తున్నారు. ముస్లిం గురువుల సమాధులను కూల్చివేయడం, బారుడు గడ్డాలు పెంచడం, ఇస్లాం సిద్ధాంతాలను కఠినంగా పాటించడం అబ్దుల్ వాహెద్ అతివాదం. ఈ వాదం నుంచే అల్‌ఖైదా, బోకో హరామ్ లాంటి టెర్రరిస్టు సంస్థలు పుట్టుకొచ్చాయి. సౌదీ అరేబియా నిధులతో ఏర్పాటైన కొన్ని సంస్థలు ఇక్కడ ఈ అతివాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి. సింహళీయుల ఆదిపత్యానికి వ్యతిరేకంగా తమిళులు విముక్తి పోరాటం జరిపిన 1980, 1990 దశకంలో సింహళీయులు, ముస్లింలు బాగా కలిసిపోయారు. అప్పుడే సామాజికంగా, ఆర్థికంగా ముస్లింలు అభివద్ధి చెందారు. అప్పుడే వారు హోటల్, ఇతర వ్యాపారాల్లో రాణించారు. శ్రీలంకలో చిన్నప్పటి నుంచే పిల్లల మధ్య మత బీజాలు బలంగా నాటుకోవడానికి కారణం ముస్లింలకు, సింహళీయులకు, తమిళులకు ప్రత్యేక భాషా పాఠశాలలు ఉండడమే. కామన్ పాఠశాలు, కామన్ భాష ఉన్నప్పుడే వారి మధ్య సామాజిక బంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. -
వెలకట్టలేని బౌద్ధ పాత్ర
* నల్లగొండ జిల్లా ఫణిగిరిలో లభ్యం * ప్రధాన బౌద్ధ సన్యాసి వాడినట్లు నిర్ధారణ * మూడో శతాబ్దంనాటి బౌద్ధస్తూపం వద్ద గుర్తింపు * క్షేత్రపారాజు ముఖచిత్రం గల అరుదైన నాణేలు కూడా లభ్యం సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని బౌద్ధ క్షేత్రం ఫణిగిరిలో క్రీస్తు శకం మూడో శతాబ్దంనాటి మహాస్తూపం వద్ద వెలకట్టలేని బౌద్ధధాతు పాత్ర లభించింది. బుద్ధుడు లేదా బౌద్ధ సన్యాసుల్లోని ముఖ్యుడు ఈ మహాస్తూపం వద్ద ప్రార్థనలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ పురావస్తు శాఖ కొన్నేళ్లుగా 16 ఎకరాల్లో బౌద్ధస్తూప పరిరక్షణ, పునరుద్ధరణకు చర్యలు చేపడుతోంది. 1942 నుంచే ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి. అప్పుడే ఇక్కడి మహాస్తూపాన్ని గుర్తించారు. తాజాగా ఇక్కడ విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఫణిగిరిలోని స్తూపం తూర్పుభాగంలో మంగళవారం చేపట్టిన పనుల్లో బౌద్ధధాతు పేటిక లభ్యమైంది. ఎరుపు రంగులోని మట్టిపాత్రలో వెండి పూతతో పాటు మూడు పలుచని వెండి పుష్ప రేకులు ఉన్నాయి. దీన్ని బౌద్ధుల్లోని ముఖ్య సన్యాసి వినియోగించి ఉంటారని, దీన్ని బట్టి ఇక్కడి స్తూపాన్ని పారిభోగిక స్తూపంగా పరిగణించవచ్చని ఆర్కియాలజీ విభాగం అధికారులు పేర్కొన్నారు. బౌద్ధ స్తూపాలు మూడు రకాలుగా ఉంటాయని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య వివరించారు. వాటిని పారిభోగిక (బౌద్ధ సన్యాసులు వాడిన వస్తువులు కలది), శారీరక(బుద్ధుని శరీర అవశేషం ఉంచినది), ఉద్దేశిక(బౌద్ధ మత ప్రచారం కోసం ఉద్దేశించినది) స్తూపాలుగా పిలుస్తారని చెప్పారు. అలాగే ఇక్కడ రాగి, సీసంతో తయారైన నాణెం కూడా లభించిందని, ఇది వృత్తాకారంలో 1.3 గ్రాముల బరువుందని పేర్కొన్నారు. దీనికి ఒకవైపు మహాక్షేత్రపా మహరాజు బొమ్మ, రెండోవైపు పడవ ముద్ర ఉంది. -
బౌద్ధభిక్షువుల వద్ద డ్రగ్స్, కండోమ్స్!!
కాంబోడియాలో ఇద్దరు బౌద్ధభిక్షువుల వద్ద డ్రగ్స్, కండోమ్స్ దొరకడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారు నివసిస్తున్న పగోడాలో పోలీసులు సోదాలు చేయగా అక్కడ క్రిస్టల్ మెతాంఫెటమైన్ పైపు, ఇతర వస్తువులు దొరికాయి. పుర్ లాంగా పగోడాకు చెందిన ఈ బౌద్ధ భిక్షువులను సియెమె రీప్ నగరంలో అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు భిక్షువుల్లో ఒకరు సీనియర్. పిచ్ డేవిడ్ (36) అనే ఇతగాడు తనను తాను గురువుగా చెప్పుకొంటూ.. బౌద్ధ నియమాలను కూడా పాటించరని ఓ పోలీసు అధికారి తెలిపారు. తాము అక్కడకు వెళ్లేసరికి అక్కడ మద్యం, కొన్ని కండోమ్‌లు ఉన్నాయని, అలాగే 'ఐస్' అనే తరహా డ్రగ్ సేవించడానికి కావల్సిన పైప్ కూడా ఉందని అన్నారు. వీరిద్దరిమీద కోర్టులో కేసు నమోదైంది. దాంతో ఈ ఇద్దరినీ ఆశ్రమం నుంచి తరిమేశారు. వారి బౌద్ధ భిక్షువు హోదాను కూడా తప్పించారు. పిచ్ డేవిడ్‌కు ఇలా జరగడం ఇది రెండోసారి. తొలిసారి దుష్ప్ర్రవర్తన కారణంగా అతడిని 2012లో బహిష్కరించినా, మళ్లీ తాను నియమాలకు కట్టుబడి ఉంటానని వేడుకోవడంతో 2013లో చేర్చుకున్నారు. ఇంతకుముందు కండల్ రాష్ట్రంలో పోలీసులతో కలిసి మద్యం సేవించినందుకు పగోడాలో ప్రధాన బౌద్ధభిక్షువు ఒకరిని ఆశ్రమం నుంచి తప్పించారు. బౌద్ధ నియమాల ప్రకారం భిక్షువులు తప్పనిసరిగా మద్యం, డ్రగ్స్, సెక్స్ లాంటివాటికి దూరంగా ఉండాలి.