శ్రీలంకలో అల్లర్లకు కారణాలేమిటీ? | What Are The Reasons Behind Riots In Sri Lanka | Sakshi
Sakshi News home page

శ్రీలంకలో అల్లర్లకు కారణాలేమిటీ?

Published Sat, Mar 10 2018 6:36 PM | Last Updated on Sat, Mar 10 2018 6:36 PM

What Are The Reasons Behind Riots In Sri Lanka - Sakshi

కొలంబో : శ్రీలంకలో ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లలో పదుల సంఖ్యలో వ్యాపార సంస్థలు, ముఖ్యంగా ముస్లింల హోటళ్లు, 24 మసీదులు ధ్వంసమయ్యాయి. 41 ఏళ్ల ఓ బుద్ధిస్టు సింహళీయుడు అనే డ్రైవర్‌ను కొంత మంది ముస్లిం అతివాదులు హత్య చేయడంతో ఈ అల్లర్లు మొదలయ్యాయి. హత్యకు గురైన సింహళీయుడి భౌతికకాయాన్ని అప్పగించేందుకు శ్రీలంక పోలీసులు నిరాకరించడంతో అగ్రహోదగ్రులైన సింహళీయులు, ముస్లింలకు వ్యతిరేకంగా దాడులకు దిగారు.

ఇలాంటి అల్లర్లకు ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కతిక కారణాలు ఉంటాయని తెల్సిందే. వాటికి తోడు శ్రీలంకలో ముస్లింల వ్యతిరేకత పెరగడానికి కొన్ని అపోహలు తోడ్పడ్డాయి. సింహళీయుల్లో సంతానం పెరగకుండా నియంత్రించేందుకు వారు నిర్వహిస్తున్న హోటళ్లలో సంతానోత్పత్తిని తగ్గించే మాత్రలను కలుపుతున్నారన్నది అలాంటి అపోహే. నలుగురు మహిళలను పెళ్లిచేసుకునే అవకాశం ఉన్న ముస్లింలు కుటుంబ నియంత్రణను సక్రమంగా పాటించకుండా ఎక్కువ సంతానాన్ని కంటున్నారు. ఇటు సింహళీయుల్లో సంతానాన్ని నియంత్రించడం, అటువైపు ముస్లింల జనాభాను పెంచుకొని శ్రీలంకను ఇస్లాం రాజ్యం చేయడం ముస్లింల లక్ష్యమని స్థానిక సింహళీయులు భావిస్తున్నారు.

ఇక ముస్లింలు కూడా మొహమ్మద్‌ ఐబిన్‌ అబ్దుల్‌ వాహెద్‌ అతివాద దక్పధాన్ని ఎక్కువ ఆచరిస్తున్నారు. ముస్లిం గురువుల సమాధులను కూల్చివేయడం, బారుడు గడ్డాలు పెంచడం, ఇస్లాం సిద్ధాంతాలను కఠినంగా పాటించడం అబ్దుల్‌ వాహెద్‌ అతివాదం. ఈ వాదం నుంచే అల్‌ఖైదా, బోకో హరామ్‌ లాంటి టెర్రరిస్టు సంస్థలు పుట్టుకొచ్చాయి. సౌదీ అరేబియా నిధులతో ఏర్పాటైన కొన్ని సంస్థలు ఇక్కడ ఈ అతివాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి. సింహళీయుల ఆదిపత్యానికి వ్యతిరేకంగా తమిళులు విముక్తి పోరాటం జరిపిన 1980, 1990 దశకంలో సింహళీయులు, ముస్లింలు బాగా కలిసిపోయారు. అప్పుడే సామాజికంగా, ఆర్థికంగా ముస్లింలు అభివద్ధి చెందారు. అప్పుడే వారు హోటల్, ఇతర వ్యాపారాల్లో రాణించారు.

శ్రీలంకలో చిన్నప్పటి నుంచే పిల్లల మధ్య మత బీజాలు బలంగా నాటుకోవడానికి కారణం ముస్లింలకు, సింహళీయులకు, తమిళులకు ప్రత్యేక భాషా పాఠశాలలు ఉండడమే. కామన్‌ పాఠశాలు, కామన్‌ భాష ఉన్నప్పుడే వారి మధ్య సామాజిక బంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement