నా పేరు ABCDEFGH... XYZ
ఇదేంటి.. పేరు చెప్పమంటే ఏబీసీడీలు చెబుతోందనుకుంటున్నారా? ఈమె పేరు అదే. ఆంగ్ల వర్ణమాలలోని 26 అక్షరాలనూ వరుసగా తన పేరుగా పెట్టేసుకుంది. కంబోడియాకు చెందిన ఈ మహిళ ఒకప్పటి పేరు లేడీ జుంగా సైబోర్గ్. పేరు విషయంలో ఈ అమ్మడికి కాస్త పట్టింపు ఎక్కువ. తన పేరు ఎవరికీ ఉండకూడదన్నది ఈమె సిద్ధాంతం. అందుకే గతంలో కూడా పలుమార్లు పేరు మార్చుకుంది. కానీ ఆ పేరు ఎక్కడో మరొకరికి ఉందని తెలిసేసరికి మళ్లీ మార్చుకునేది.
ఇక లాభం లేదనుకుని 2012లో ‘'ABCDEFG HIJKLMN OPQRST UVWXYZ'’ అని తనకు నామకరణం చేసుకుంది. ఈ మేరకు గుర్తింపు కార్డు జారీచేయాలని కంబోడియా అధికారులకు దరఖాస్తు కూడా చేసింది. కానీ ఇలాంటి పేరుతో కార్డు ఇవ్వలేమని వారు తేల్చిచెప్పడంతో ప్రభుత్వంపై పోరాటానికి దిగింది. ఏడాదిపాటు వారిని ముప్పుతిప్పలు పెట్టడంతో.. ఎందుకొచ్చిన తలనొప్పి అని భావించిన అధికార యంత్రాంగం 2013లో గుర్తింపు కార్డు జారీ చేసింది.