ABC
-
ఏబీసీ చైర్మన్‌గా రియాద్ మాథ్యూ
న్యూఢిల్లీ: పత్రికల సర్క్యులేషన్‌ను మదింపు చేసి.. ధ్రువీకరించే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ)కి చైర్మన్‌గా మలయాళ మనోరమకు చెందిన రియాద్ మాథ్యూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2024–25 సంవత్సరానికి ఆయన ఏబీసీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. చీఫ్ అసోసియేట్ ఎడిటర్ అయిన మాథ్యూ మలయాళ మనోరమ గ్రూపు డైరెక్టర్ కూడా. మాథ్యూ పీటీఐ వార్తా సంస్థ బోర్డులో కూడా 2009 నుంచి డైరెక్టర్‌గా ఉన్నారు. కరుణేష్ బజాజ్ (ఐటీసీ) డిప్యూటీ ౖచైర్మన్‌గా ఎన్నిక కాగా, మోహిత్ జైన్ కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. యాడ్ ఏజెన్సీల ప్రతినిధి విక్రమ్ సఖుజా కోశాధికారిగా తిరిగి ఎన్నికయ్యారు. 2024–25 సంవత్సరానికి ఏబీసీ మేనేజ్మెంట్ కౌన్సిల్‌లోని సభ్యుల వివరాలు.. పబ్లిషర్స్ ప్రతినిధులు: రియాద్ మాథ్యూ (మలయాళ మనోరమ), ప్రతాప్ జి.పవార్ (సకాల్ పేపర్స్), శైలేష్ గుప్తా (జాగరణ్ ప్రకాశన్ లిమిటెడ్), ప్రవీణ్ సోమేశ్వర్ (హెచ్‌టి మీడియా లిమిటెడ్), మోహిత్ జైన్ (బెన్నెట్, కోల్మన్ అండ్ కంపెనీ లిమిటెడ్), ధ్రువ ముఖర్జీ (ఏబీపీ ప్రైవేట్ లిమిటెడ్), కరణ్ దర్దా (లోక్మత్ మీడియా ప్రై. లిమిటెడ్), గిరీష్ అగర్వాల్ (డీబీ కార్ప్ లిమిటెడ్). ప్రకటనకర్తల ప్రతినిధులు: కరుణేష్ బజాజ్ (ఐటీసీ లిమిటెడ్), అనిరుధ హల్దార్ (టీవీఎస్ మోటర్స్ కంపెనీ లిమిటెడ్), పార్థో బెనర్జీ (మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్). యాడ్ ఏజెన్సీల ప్రతినిధులు: శ్రీనివాసన్ కె.స్వామి (ఆర్కే స్వామి లిమిటెడ్), విక్రమ్ సఖుజా (మాడిసన్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్), ప్రశాంత్ కుమార్ (గ్రూప్ ఎం మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్), వైశాలి వర్మ (ఇనీíÙయేటివ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్), సేజల్ షా (పబ్లిక్స్ మీడియా ఇండియా గ్రూపు). -
ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం..
-
హైకోర్టు సాక్షిగా తేలిపోయిన ‘ఈనాడు’ అసత్య ఆరోపణలు
సాక్షి, అమరావతి: ‘సాక్షి’ దినపత్రిక తన సర్కులేషన్ పెంచుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ‘ఈనాడు’ అడ్డగోలుగా చేస్తూ వచ్చిన ఆరోపణలు అసత్యమని ఢిల్లీ హైకోర్టు సాక్షిగా తేలిపోయాయి. వలంటీర్లు విస్తృత సర్క్యులేషన్ కలిగిన ఏ దినపత్రికనైనా కొనుగోలు చేయవచ్చంటూ ప్రభుత్వం జీవో జారీ చేయగా దీనివల్ల సాక్షి సర్క్యులేషన్ ఆమాంతం పెరిగిపోయిందంటూ ఈనాడు ప్రమాణపూర్వకంగా చెప్పిన మాటలు, శుద్ధ అబద్ధమని ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్కులేషన్ (ఏబీసీ) ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన గణాంకాలు వెల్లడించాయి. ప్రభుత్వ జీవో వల్ల సాక్షి నిజంగానే లబ్ధి పొంది ఉంటే ఆ పత్రిక సర్క్యులేషన్ మిమ్మల్ని దాటిపోయి ఉండాలి కదా? మరి ఏబీసీ గణాంకాలు మరో రకంగా ఉన్నాయి కదా? అంటూ హైకోర్టు ధర్మాసనం సూటిగా సంధించిన ప్రశ్నలకు ఈనాడు వద్ద సమాధానమే లేకుండా పోయింది. సాక్షి సర్క్యులేషన్ విషయంలో తన ఆరోపణల్లో నిజం లేదని తేలడంతో చేసేదేమీ లేక ఈనాడు వెనక్కి తగ్గింది. హైకోర్టు సైతం సాక్షి సర్క్యులేషన్ గణాంకాలను ప్రచురించేందుకు అనుమతినిచ్చింది. దీంతో చేసేదేమీ లేక సాక్షి సర్క్యులేషన్ గణాంకాలను ప్రచురించకుండా ఏబీసీని నిరోధించాలంటూ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాన్ని ఈనాడు ఉపసంహరించుకుంది. విస్తృత సర్క్యులేషన్ ఉన్న ఏ దినపత్రికనైనా కొనుక్కునేందుకు వలంటీర్లకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ ఈనాడు దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యంలో తదుపరి విచారణను ఏప్రిల్ 25కి వాయిదా వేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ మన్మోహన్, న్యాయమూర్తి జస్టిస్ మన్మీత్ ప్రతీమ్ సింగ్ ఆరోరా ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
కోర్టు ఉత్తర్వులకూ తప్పుడు భాష్యం
సాక్షి– అమరావతి : రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా ప్రతీ రోజూ తప్పుడు కథనాలు వండివారుస్తున్న ఈనాడు దినపత్రిక, తాజాగా కోర్టు ఉత్తర్వుల విషయంలోనూ అదే వైఖరిని బయటపెట్టుకుంది. కోర్టు ఇవ్వని ఆదేశాలను ఇచ్చినట్లు ప్రచురించి, ‘సాక్షి’పై తన అక్కసును మరోసారి వెళ్లగక్కింది. ‘సాక్షి’ దినపత్రిక సర్క్యులేషన్ వివరాలను వెల్లడించవద్దంటూ ఆడిట్బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్‌ను (ఏబీసీ) ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్లుగా తప్పుడు కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. వాస్తవానికి సర్క్యులేషన్ వివరాలను తనకు సీల్డ్ కవర్లో సమర్పించాలని ఏబీసీని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు... ఈ నెల 27వరకూ ఏ తెలుగు దినపత్రిక సర్క్యులేషన్ వివరాలనూ వెల్లడి చేయవద్దని స్పష్టంగా తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులు ‘ఈనాడు’తో సహా తెలుగు దినపత్రికలన్నింటికీ వర్తిస్తాయి. కానీ ‘ఈనాడు’ మాత్రం... ఒక్క సాక్షి పత్రిక సర్క్యులేషన్ వివరాలను మాత్రమే వెల్లడించవద్దని ఏబీసీని ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్లుగా కథనాన్ని ప్రచురించటంపై న్యాయ నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీని వివరాలు చూస్తే... విస్తృత సర్కులేషన్ ఉన్న ఏదైనా పత్రికను కొనుగోలు చేసుకోవటానికి గ్రామ, వార్డు వలంటీర్లకు, సచివాలయాలకు నెలకు రూ.200 ఆర్థిక సాయం అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉత్తర్వులిచ్చింది. ఆ మేర బడ్జెట్ కేటాయింపులు కూడా చేసింది. ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో ఎక్కడా కూడా ఏ పత్రికను కొనాలన్నది చెప్పలేదు. విస్తృత సర్క్యులేషన్ ఉన్న ఏ పత్రికనైనా కొనుగోలు చేసుకోవచ్చునని వలంటీర్లకు ఛాయిస్ ఇచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దు చేయాలని కోరుతూ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రై వేట్ లిమిటెడ్ (ఈనాడు) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే వలంటీర్లు, సచివాలయాలు ఒకవేళ ‘సాక్షి’ దినపత్రికను కొనుగోలు చేస్తే ఆ సంఖ్యను పరిగణనలోకి తీసుకోకుండా ఆడిట్ బ్యూరో సర్కులేషన్ను (ఏబీసీ) ఆదేశించడంతో పాటు నిర్ధిష్ట కాలాల్లో సాక్షి పత్రికు ఇచ్చిన సర్కులేషన్ సర్టిఫికేషన్‌ను పునస్సమీక్ష చేయాలని కూడా ఏబీసీని ఆదేశించాలంటూ ఉషోదయ డైరెక్టర్ ఐ.వెంకట్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అంతేకాక ప్రభుత్వ జీవోల అమలును నిలిపేయడంతో పాటు, 2022 జూలై– డిసెంబర్, ఆ తరువాత కాలానికి సాక్షి సర్కులేషన్ను ఆడిట్ చేయకుండా ఏబీసీని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు. సీజే ధర్మాసనం మొదట ఈ అనుబంధ వ్యాజ్యాలపై విచారణ జరిపింది. అటు ఈనాడు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వాదనలు విన్నది. అనంతరం ఉషోదయ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలను కొట్టేసింది. దీనిపై ఉషోదయ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులపై స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై గత ఏడాది ఏప్రిల్ 17న సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉషోదయ దాఖలు చేసిన వ్యాజ్యాలను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఉషోదయ వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు గత ఏడాది జూలై నుంచి విచారణ జరుపుతూ వస్తోంది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. లిఖితపూర్వక వాదనల సమర్పణకు సైతం ఆదేశాలిచ్చింది. అయితే సర్క్యులేషన్ వివరాలను వెల్లడి చేయకుండా ఏబీసీని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని బుధవారం (మార్చి 13) ఉషోదయ మరో పిటిషన్ వేసింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఏబీసీ తరఫు న్యాయవాది ఎవరూ విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో తాజా సర్కులేషన్ వివరాలను సీల్డ్ కవర్లో తమ ముందుంచాలంటూ ఏబీసీకి నోటీసులిచ్చింది. అంతేకాక ఈ నెల 27 వరకూ తెలుగు దినపత్రికలన్నింటి సర్కులేషన్ వివరాలను వెల్లడి చేయవద్దని కూడా ఏబీసీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ మన్మోహన్, న్యాయమూర్తి జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంత స్పష్టంగా ఉంటే, ఈనాడు మాత్రం ఆ ఉత్తర్వులను దురుద్దేశాలతో తప్పుగా ప్రచురించింది. ఢిల్లీ హైకోర్టు ‘సాక్షి’ సర్కులేషన్ వివరాలను, గణాంకాలు ప్రచురించవద్దంటూ ఏబీసీని ఆదేశించినట్లు తప్పుడు కథనాన్ని ప్రచురించి తన నైజాన్ని చాటుకుంది. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ మిరాకిల్ జ్యూస్ తాగితే..!
ప్రస్తుత కాలంలో బరువు తగ్గడం అనేది ఒక పెద్ద టాస్క్. క్రమం తప్పని వ్యాయామం, కొన్ని ఆహార నియమాలు పాటిస్తే ఎలాంటి వారైనా బరువు తగ్గడం ఈజీనే. ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించని పక్షంలో సీనియర్ డైటీషియన్నిగానీ, వైద్యుణినిగానీ సంప్రదించడం ఉత్తమం. అయితే బరువు తగ్గే క్రమంలో ఈ మధ్య కాలంలో బాగా వినిస్తున్న పేరు ఏబీసీ జ్యూస్. వెయిట్ లాస్‌కు ఇది అద్భుతంగా పనిచేస్తుందనేది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే అసలేంటీ ఏబీసీ జ్యూస్. దీని లాభ నష్టాలేంటి ఒకసారి చూద్దాం. ABC జ్యూస్ అంటే ఏమిటి? ఈ అద్భుత పానీయం (సోషల్ మీడియాలో బాగా పాపులర్) నిజానికి మూడింటి రసాల మిశ్రమం. యాపిల్(A) బీట్రూట్(B) క్యారెట్ (C) అలా టోటల్‌గా ఇది ABC జ్యూస్ అయిందన్నట్టు. వీటిని ప్రయోజనాలను విడివిడిగా చూస్తే. యాపిల్స్ అధిక పోషకాలు, యాపిల్స్ చాలా పోషకమైనవి. గుండె జబ్బులు, మధుమేహం , క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే ఫైబర్ యాంటీఆక్సిడెంట్లు వీటిలో అధికంగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. బీట్రూట్ శక్తివంతమైన ,రుచికరమైన వెజిటబుల్. శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించే లక్షణం ఇందులో ఉంది. యాంటీఆక్సిడెంట్లు , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఇన్ఫెక్షన్ల నివారణలో బాగా ఉపయోడపడుతుంది. నైట్రేట్ కంటెంట్ ఎక్కువ. న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, నొప్పిని తగ్గించడానికి, బాడీ మెటబాలిజానికి ఉపయోగ పడుతుంది. క్యారెట్ పలు అధ్యయనాల ప్రకారం క్యారెట్లో బీటా-కెరోటిన్ విటమిన్ A ఎక్కువ లభిస్తుంది. కెరోటినాయిడ్స్, విటమిన్లు , డైటరీ ఫైబర్ పుల్కంగా ఉన్నాయి. క్యారెట్లో యాంటీఆక్సిడెంట్లు , మినరల్స్ కూడా ఉంటాయి. శరీరంలోని విషాన్ని తొలగిస్తుందని కూడా నమ్ముతారు. ABC జ్యూస్ ఆరోగ్యకరమైనదేనా? ఈ జ్యూస్‌లో వాడే పదార్థాలు ఆరోగ్యకరమైనవే అనేది మనకు అర్థం అవుతోంది. అయితే ఈ పండ్లు , కూరగాయల కలయిక ఆరోగ్యకరమైన దేనా అన్నదే ప్రశ్న. ఇందులో అధిక పోషకాలు, విటమిన్లు , యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉన్నాయి అలాగే ఫైబర్ కూడా మెండుగా ఉంది కాబట్టి, ABC డ్రింక్ చాలా ఆరోగ్యకరమైన జ్యూస్ అని న్యూట్రిషన్ అండ్ డైటీషయన్ల అభిప్రాయం. దీనికి తోడు ఇవి సులభంగా, చవకగా అందుబాటులో ఉంటాయంటున్నారు. ABC జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల గుండెకు మేలు చేస్తుంది. అలాగే, కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉన్న ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారంతో పాటు తీసుకుంటే, మరింత ప్రయోజనం ఉంటుంది. ఈ మూడింటిలోని నేచురల్ సుగర్ ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తుంది. అయితే, బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది ఒక్కటే సరిపోతుందా అంటే కాదు. రోజంతా ఇదే పానీయం తీసుకోవడం కాకుండా ABC జ్యూస్‌తో పాటు ఆరోగ్యకరమైన తక్కువ కార్బ్, తక్కువ కొవ్వు, అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ABC జ్యూస్ దుష్ప్రభావాలు పొటాషియం నియంత్రణలో ఉన్న వ్యక్తులు, కిడ్నీ రోగులు లేదా తక్కువ FODMAP డైట్లో ప్రేగు సిండ్రోమ్ ఉన్నవారు ABC జ్యూస్‌కు దూరంగా ఉండాలి. ఎలా చేసుకోవాలి రెండు యాపిల్స్, చిన్న క్యారెట్లు, ఒక బీట్ రూట్ తీసుకోవాలి. వీటిని ముక్కలుగా కట్ చేసుకొని, జ్యూసర్లో బాగా మెత్తగా అయ్యాక, రసం తీసుకోవాలి. దీన్ని వడపోసుకుని తాగవచ్చు. కావాలంటే రుచికి నిమ్మరసం, చిన్న అల్లంముక్కను కూడా యాడ్ చేసుకోవచ్చు. -
ABC చైర్మన్‌గా శ్రీనివాసన్ స్వామి ఎన్నిక
-
మాకు నగదు చెల్లించండి: ఏబీసీ
సిడ్నీ: తమ కంటెంట్‌ను వినియోగించుకున్నందుకు గానూ తమకు నగదు చెల్లింపులు జరపాలని ఆస్ట్రేలియా వార్తా సంస్థలు ఏబీసీ(ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్), ఎస్బీఎస్(స్పెషల్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్) సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, గూగుల్‌ను కోరాయి. ఆన్లైన్ ప్లాట్‌ఫాం ప్రవర్తనా నియమావళి, నిబంధనలు త్వరలో అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ మేరకు చర్చలు జరగాల్పిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డాయి. గూగుల్, ఫేస్బుక్ సెర్చింగ్ ఫలితాల్లో తమ వార్త సంస్థలు, పత్రికల కథనాలను ఉపయోగించుకున్నందుకు డబ్బు చెల్లించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోలో మీడియా సమాచారం వల్ల ఆన్లైన్ ప్లాట్‌ఫాంలకు ప్రకటనల ద్వారా వచ్చే లాభాలలో కొంతమొత్తం వార్తా సంస్థలకు చెల్లించే విధంగా కృషి చేయాలని ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ (ఏసీసీసీ)ను ఆదేశించింది. ఇక ఈ విషయంపై స్పందించిన ఫేస్బుక్.. మీడియా ద్వారా సేకరిస్తున్న సమాచారం వల్ల తమకు వాణిజ్య పరంగా ఎలాంటి ఉపయోగం లేదని.. ఒకవేళ తప్పనిసరిగా డబ్బు చెల్లించాల్సి వస్తే ఆ కంటెంట్‌ను తాము ఉపయోగించబోమని ప్రభుత్వానికి షాకిచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏబీసీ, ఎస్బీఎస్ మరోసారి సోషల్ మీడియా దిగ్గజాలకు ఈ విషయమై విజ్ఞప్తి చేయడం గమనార్హం. దీని గురించి ఎస్బీఎస్ అధికార ప్రతినిధి సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌తో మాట్లాడుతూ.. ‘‘ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫాం ఆపరేటర్లు, మీడియా సంస్థల మధ్య చర్చలు జరగాలి. అప్పుడే వార్తా సంస్థలకు తమ కంటెంట్‌కు తగిన మొత్తం లభిస్తుంది. అదే విధంగా పాఠకులకు తమ సమాచారాన్ని పెద్ద ఎత్తున చేరవేసే అవకాశం లభిస్తుంది’’ అని అన్నారు. కాగా జూలై చివరి నాటికి అమల్లోకి రానున్న నిబంధనల ప్రకారం సోషల్ మీడియా దిగ్గజాలు ఏడాదికి దాదాపు 600 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.(ఆస్ట్రేలియాకు ఫేస్బుక్ షాక్) ఈ విషయంపై ఇది వరకే స్పందించిన గూగుల్.. న్యూస్ కంటెంట్ కారణంగా తమకు వచ్చే ఆదాయం చాలా తక్కువని స్పష్టం చేసింది. తద్వారా తాము సైతం ఫేస్బుక్ బాటలో నడిచే అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. కాగా గత కొంత కాలంగా ఆన్లైన్ ప్రకటనల ద్వారా మీడియా సమాచారాన్ని వాడుకొని ఫేస్బుక్ సంస్థ లాభాలను అర్జిస్తుందని ఇటీవల ఆసీస్ దిగ్గజ మీడియా సంస్థలు రూపెర్ట్ ముర్డోచ్, న్యూస్ కార్ప్ సంస్థలు ఆరోపించిన విషయం తెలిసిందే. కరోనా సంక్షోభంలో పత్రికా రంగాన్ని కాపాడాలంటే సంస్థలకు వాటిల్లుతున్న నష్టాలను అధ్యయనం చేసి, పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇందుకు ఆసీస్ సమాచార శాఖ మంత్రి పాల్ ఫ్లెచర్ సానుకూలంగా స్పందించి.. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా వార్తా మాధ్యమాలను కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. -
ఊహించని వివాదం
హాలీవుడ్ చిత్రాలు, టీవీ సీరియళ్ల కోసం గత రెండున్నరేళ్లుగా విదేశాల్లో ఉంటున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆఖరి నిముషంలో అప్రతిష్టను మూటగట్టుకుని భారత్‌కు బయల్దేరి వస్తున్నారు! అమెరికన్ టెలివిజన్ డ్రామా థ్రిల్లర్ ‘క్వాంటికో’లో సి.ఐ.ఎ ఏజెంటుగా నటిస్తున్న ప్రియాంకను ఆ సీరీస్ తాజా ఎపిసోడ్ ‘ది బ్లడ్ ఆఫ్ రోమియో’లోని ఒక సన్నివేశం ఆమె ఊహించని విధంగా ‘దేశద్రోహి’గా నిలబెట్టింది! న్యూయార్క్‌పై అణ్వాయుధ దాడి చేయబోతున్న ఒక పాకిస్తానీ.. ప్రియాంకకు పట్టుబడినప్పుడు ఆ ఉగ్రవాది మెడలో రుద్రాక్షమాల బయటపడుతుంది! దర్యాప్తులో అతడొక దారితప్పిన భారతీయ ప్రొఫెసర్ అని తేలుతుంది. అయితే ఈ సన్నివేశంలో నటించడం ద్వారా ప్రియాంక.. భారతీయుల మనోభావాలను దెబ్బతీశారని, భారతీయులంటే ఉగ్రవాదుల అన్న భావన ప్రపంచ దేశాల్లో కలగడానికి ఆమె కారణం అయ్యారని జాతీయవాదులు మండిపడుతున్నారు. ‘‘భారతీయుల అభిమానం వల్ల స్టార్‌గా ఎదిగి, ఇప్పుడు భారతీయులనే అవమానిస్తున్నావా ప్రియాంకా..?’’ అని ట్వీట్లు కూడా మొదలయ్యాయి. ఆన్లైన్లో ఈ నిరసనలు, ఆగ్రహ జ్వాలలు ‘క్వాంటికో’ను ప్రసారం చేస్తున్న ఎ.బి.సి.కి (అమెరికన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ) తాకడంతో డిస్నీ నెట్వర్క్ సంస్థ అయిన ఎ.బి.సి. వెంటనే భారతీయులను క్షమాపణ కోరుతూ ‘వాషింగ్టన్ పోస్టు’కు ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ప్రధానంగా ప్రియాంక నిర్దోషి అని చెప్పడానికే ఎ.బి.సి. ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చింది. ‘‘ఆ సన్నివేశానికి మనసు నొచ్చుకున్న మా వీక్షకులకు మా స్టూడియోతో పాటు, ‘క్వాంటికో’ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూజర్లూ క్షమాపణ కోరుతున్నారు. ఆ సన్నివేశాన్ని చిత్రీకరించాలన్న ఆలోచన ప్రియాంకది కాదు. స్క్రిప్టు, డైరెక్షన్ కూడా ఆమెవి కావు. స్టోరీ లైన్లో కానీ, క్యాస్టింగ్‌లో కానీ ఆమె ప్రమేయం లేదు. పూర్తిగా కల్పితం అయిన ఈ సీరీస్‌లోని సన్నివేశంలో అనుకోకుండా ఇలా కొందరి మనసులు గాయపడ్డాయి’’ అని ఎ.బి.సి. క్షమాపణతో పాటు, వివరణ కూడా ఇచ్చింది. లో రేటింగ్స్ రావడంతో ఇటీవల కొంతకాలం ‘క్వాంటికో’ ఆగి, మొదలైంది. త్వరలో ముగియబోతోంది కూడా. దాంతో జూౖలñ లో షూటింగ్ మొదలు కాబోతున్న ‘భరత్’ చిత్రం (సల్మాన్‌ఖాన్ హీరో)లో హీరోయిన్గా నటించడానికి ప్రియాంక ఇండియా బయల్దేరబోతుండగా ఈ వివాదం చుట్టుకుంది. -
హైదరాబాద్‌లో ఏబీసీ కో–వర్కింగ్ స్పేస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోల్‌కతాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ఏపీజే సురేంద్రకు చెందిన కో–వర్కింగ్ స్పేస్ బ్రాండ్ ఏపీజే బిజినెస్ సెంటర్ (ఏబీసీ) హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ది పార్క్ హోటల్లో రెండతస్తుల్లో 475 సీట్లతో కో–వర్కింగ్ స్పేస్‌ను అందుబాటులోకి తెచ్చింది. వచ్చే ఏడాది కాలంలో గచ్చిబౌలిలో 35 వేల చదరపు అడుగుల్లో 400 సీట్లను అందుబాటులోకి తెస్తామని ఏపీజే సురేంద్ర అసిస్టెంట్ డైరెక్టర్ (ఫైనాన్స్), ఏబీసీ డైరెక్టర్ శౌవిక్ మండల్ తెలిపారు. గురువారమిక్కడ ఏబీసీ సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రస్తుతం పుణే, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, ముంబై, గుర్గావ్ నగరాల్లో 12 బిజినెస్ సెంటర్లున్నాయి. వీటి సీటింగ్ సామర్థ్యం 1,500. సెప్టెంబర్ నాటికి మరో వెయ్యి సీట్లను జత చేస్తాం. ప్రతి బిజినెస్ సెంటర్ 10 వేల చ.అ.ల్లో, 200 సీట్లతో విస్తరించి ఉంటుంది. 2020 నాటికి రూ.40 కోట్లతో 25 బిజినెస్ సెంటర్లలో 5,500 సీట్లను అందుబాటులోకి తేవాలని లకి‡్ష్యంచాం’’ అని మండల్ వివరించారు. ఈ ఏడాది రూ.20 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నామని, రెండేళ్లలో రూ.50 కోట్ల టర్నోవర్‌ను టార్గెట్ చేశామని చెప్పారు. నెలకు రూ.8–10 వేలు.. కో–వర్కింగ్ స్పేస్‌లో వర్క్ క్యాబిన్స్, సమావేశ గదులతో పాటూ వై–ఫై, అడ్మినిస్ట్రేషన్ సేవలు, లాకర్, ఐటీ సపోర్ట్, కమర్షియల్ కిచెన్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. వీటి ధరలు నగరాన్ని బట్టి మారుతుంటాయి. హైదరాబాద్‌లో నెలకు ఒక్క సీటుకు రూ.8–10 వేలు, గుర్గావ్లో రూ.25–30 వేలు, కోల్‌కతా, చెన్నైల్లో రూ.12–15 వేల వరకూ ఉన్నట్లు మండల్ తెలిపారు. హైదరాబాద్‌లో ఐబీఎం, లెనొవో.. గత మూడేళ్లుగా దేశంలో కో–వర్కింగ్ స్పేస్‌కు డిమాండ్ పెరుగుతోందని... తమ కస్టమర్లలో 60–70 శాతం కార్పొరేట్ కంపెనీలు, 20 శాతం మిడ్‌సైజ్, 10 శాతం స్టార్టప్స్ ఉన్నట్లు మండల్ తెలిపారు. ‘‘అమెరికన్ ఎక్స్‌ప్రెస్, సిస్కో, టాటా ఏఐజీ, బీఓఐ బీమా విభాగం, అమెజాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మోటరోలా, విస్తారా, అబుదాబి కమర్షియల్ బ్యాంక్, ఫ్యూజీ ఎలక్ట్రిక్, ఓఎల్ఎక్స్ ఇండియా, ఎడిల్‌మెన్, లెనొవో, ఐబీఎం వంటి కార్పొరేట్ సంస్థలూ మా కో–వర్కింగ్ స్పేస్‌లో కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. లెనొవో, ఐబీఎం సంస్థలు హైదరాబాద్‌లోని కో–వర్కింగ్ స్పేస్‌లో కార్యకలాపాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి’’ అని చెప్పారు. -
దూసుకెళ్తున్న ప్రింట్ మీడియా
పదేళ్లలో 2.37 కోట్లు పెరిగిన ప్రతుల సంఖ్య: ఏబీసీ సాక్షి, హైదరాబాద్: భారత్‌లో ప్రింట్ మీడియా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతోందని ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్(ఏబీసీ) వెల్లడించింది. అక్షరాస్యత పెరగడం, పత్రికా పఠనం దైనందిన జీవితంలో ఓ భాగంగా మారడం, పత్రికలు, వాటి ధరలు అందుబాటులో ఉండడంతో ప్రింట్ మీడియాకు ఆదరణ పెరుగుతోందని పేర్కొంది. పదేళ్లలో పత్రికల ప్రతుల సంఖ్యలో ఏకంగా 2.37 కోట్ల పెరుగుదల నమోదైందని, వార్షిక వృద్ధిరేటు 4.87 శాతంగా ఉందని తెలిపింది. 2006లో ప్రతుల సంఖ్య రోజుకు 3.91 కోట్లు ఉండగా.. 2016 నాటికి అది 6.28 కోట్లకు చేరిందని సోమవారం ఒక ప్రకటనలో వివరించింది. అలాగే ప్రచురణ కేంద్రాల సంఖ్య 251 మేర పెరిగినట్లు తెలిపింది. 2006లో 659 ప్రచురణ కేంద్రాలు ఉండగా.. 2016 నాటికి 910కి చేరినట్టు పేర్కొంది. -
ఏబీసీ చైర్మన్‌గా ఐ.వెంకట్
డిప్యూటీ చైర్మన్‌గా దేబబ్రత ముఖర్జీ సాక్షి, హైదరాబాద్: 2016-17 సంవత్సరానికిగాను ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్(ఏబీసీ) చైర్మన్‌గా ఈనాడు డెరైక్టర్ ఐ.వెంకట్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోకాకోలా కంపెనీలో ఇండియా-సౌత్‌వెస్ట్ ఆసియా మార్కెటింగ్, కమర్షియల్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న దేబబ్రత ముఖర్జీ ఏబీసీ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. గతంలో అడ్వర్టైజింగ్ స్టాండర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఏఎస్సీఐ)కి చైర్మన్‌గా పనిచేసిన వెంకట్.. ప్రస్తుతం మీడియా రీసెర్చ్ యూజర్స్ కౌన్సిల్(ఎంఆర్‌యూసీ)కు చైర్మన్‌గా ఉన్నారు. ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్(ఐబీఎఫ్), ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్(ఐఎన్‌ఎంఏ), బ్రాడ్కాస్ట్ ఆడి యన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బీఏఆర్కే)లో బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్)లో కూడా బోర్డు సభ్యుడిగా పనిచేశారు. ఏబీసీ మేనేజ్మెంట్ కౌన్సిల్లో సభ్యులు వీరే.. పబ్లిషర్స్ ప్రతినిధులు ఐ.వెంకట్, (ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్), శైలేష్ గుప్తా(జాగరణ్ ప్రకాశన్ లిమిటెడ్), హర్మూస్జీ ఎన్ కామా(ద బాంబే సమాచార్ ప్రైవేట్ లిమిటెడ్), దేవేంద్ర వి దర్దా(లోక్మత్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్), బినయ్ రాయ్‌చౌధురి(హెచ్‌టీ మీడియా లిమిటెడ్), చందన్ మంజుందార్(ఏబీపీ ప్రైవేట్ లిమిటెడ్), రాజ్‌కుమార్ జైన్(బెనెట్, కోల్మన్ అండ్ కంపెనీ లిమిటెడ్), ప్రతాప్ జి పవార్(సకల్ పేపర్స్ ప్రైవేట్ లిమిటెడ్) అడ్వర్టైజర్స్ ప్రతినిధులు దేబబ్రత ముఖర్జీ, (కోకాకోలా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్), హేమంత్ మాలిక్(ఐటీసీ లిమిటెడ్), సందీప్ తర్కాస్(ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్), మయాంక్ పరీక్(టాటా మోటార్స్ లిమిటెడ్) అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ప్రతినిధులు మధుకర్ కామత్(డీడీబీ ముద్ర ప్రైవేట్ లిమిటెడ్), శశిధర్ సిన్హా(ఐపీజీ మీడియాబ్రాండ్స్, ఇండియా), శ్రీనివాసన్ కె స్వామి(ఆర్కే స్వామి బీబీడీవో ప్రైవేట్ లిమిటెడ్), సీవీఎల్ శ్రీనివాస్(గ్రూప్ ఎం మీడియా ప్రైవేట్ లిమిటెడ్) సెక్రటేరియట్ హర్ముజ్ మసానీ(సెక్రటరీ జనరల్) -
టాప్-10 ఫిన్ టెక్ కంపెనీల్లో ఐ-లెండ్
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న పీర్-టు-పీర్ (పీ2పీ) మార్కెట్ ప్లేస్ ‘డబ్ల్యూడబ్ల్యూడ బ్ల్యూ.ఐ-లెండ్.ఇన్’ను ఆసియాలో అత్యుత్తమ పది ప్రత్యామ్నాయ ఫైనాన్స్/ఫిన్‌టెక్ కంపెనీల్లో ఒకటిగా ఆసియన్ బ్యాంకర్స్ కాన్ఫరెన్స్ (ఏబీసీ) ఎంపిక చేసింది. భారత్ నుంచి కేవలం ఐ-లెండ్కు మాత్రమే వియత్నాంలోని హనోయిలో మే 11 నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఏబీసీ సమిట్‌లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. ‘ఈ ఎంపిక ఐ-లెండ్ పొందిన అంతర్జాతీయ గుర్తింపునకు ప్రతీక. దేశంలో అగ్రశ్రేణి ఫిన్‌టెక్ కంపెనీగా ఐ-లెండ్ ఎదిగింది. సదస్సులో భారత దేశపు పీ2పీ రంగ సామర్థ్యాన్ని అంతర్జాతీయ ఇన్వెస్టింగ్ కమ్యూనిటీలకు వివరిస్తాం’ అని ఐ-లెండ్ డెరైక్టర్ శంకర్ వద్దాడి తెలిపారు. పీ2పీ కంపెనీలు.. ఆయా వ్యక్తులు పరస్పరం ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా రుణం ఇవ్వడాన్ని/ తీసుకోవడాన్ని అనుమతిస్తాయి. -
నా పేరు ABCDEFGH... XYZ
ఇదేంటి.. పేరు చెప్పమంటే ఏబీసీడీలు చెబుతోందనుకుంటున్నారా? ఈమె పేరు అదే. ఆంగ్ల వర్ణమాలలోని 26 అక్షరాలనూ వరుసగా తన పేరుగా పెట్టేసుకుంది. కంబోడియాకు చెందిన ఈ మహిళ ఒకప్పటి పేరు లేడీ జుంగా సైబోర్గ్. పేరు విషయంలో ఈ అమ్మడికి కాస్త పట్టింపు ఎక్కువ. తన పేరు ఎవరికీ ఉండకూడదన్నది ఈమె సిద్ధాంతం. అందుకే గతంలో కూడా పలుమార్లు పేరు మార్చుకుంది. కానీ ఆ పేరు ఎక్కడో మరొకరికి ఉందని తెలిసేసరికి మళ్లీ మార్చుకునేది. ఇక లాభం లేదనుకుని 2012లో ‘'ABCDEFG HIJKLMN OPQRST UVWXYZ'’ అని తనకు నామకరణం చేసుకుంది. ఈ మేరకు గుర్తింపు కార్డు జారీచేయాలని కంబోడియా అధికారులకు దరఖాస్తు కూడా చేసింది. కానీ ఇలాంటి పేరుతో కార్డు ఇవ్వలేమని వారు తేల్చిచెప్పడంతో ప్రభుత్వంపై పోరాటానికి దిగింది. ఏడాదిపాటు వారిని ముప్పుతిప్పలు పెట్టడంతో.. ఎందుకొచ్చిన తలనొప్పి అని భావించిన అధికార యంత్రాంగం 2013లో గుర్తింపు కార్డు జారీ చేసింది.