ఏబీసీ చైర్మన్‌గా ఐ.వెంకట్ | i venkat elected as ABC chairman | Sakshi
Sakshi News home page

ఏబీసీ చైర్మన్‌గా ఐ.వెంకట్

Published Sat, Sep 24 2016 4:05 AM | Last Updated on Tue, Oct 9 2018 6:36 PM

i venkat elected as ABC chairman

డిప్యూటీ చైర్మన్‌గా దేబబ్రత ముఖర్జీ
సాక్షి, హైదరాబాద్: 2016-17 సంవత్సరానికిగాను ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్(ఏబీసీ) చైర్మన్‌గా ఈనాడు డెరైక్టర్ ఐ.వెంకట్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోకాకోలా కంపెనీలో ఇండియా-సౌత్‌వెస్ట్ ఆసియా మార్కెటింగ్, కమర్షియల్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న దేబబ్రత ముఖర్జీ ఏబీసీ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. గతంలో అడ్వర్‌టైజింగ్ స్టాండర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఏఎస్‌సీఐ)కి చైర్మన్‌గా పనిచేసిన వెంకట్.. ప్రస్తుతం మీడియా రీసెర్చ్ యూజర్స్ కౌన్సిల్(ఎంఆర్‌యూసీ)కు చైర్మన్‌గా ఉన్నారు.

ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్(ఐబీఎఫ్), ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్(ఐఎన్‌ఎంఏ), బ్రాడ్‌కాస్ట్ ఆడి యన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బీఏఆర్‌కే)లో బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్‌ఎస్)లో కూడా బోర్డు సభ్యుడిగా పనిచేశారు. ఏబీసీ మేనేజ్‌మెంట్ కౌన్సిల్‌లో సభ్యులు వీరే..
 
పబ్లిషర్స్ ప్రతినిధులు
 ఐ.వెంకట్, (ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్), శైలేష్ గుప్తా(జాగరణ్ ప్రకాశన్ లిమిటెడ్), హర్‌మూస్‌జీ ఎన్ కామా(ద బాంబే సమాచార్ ప్రైవేట్ లిమిటెడ్), దేవేంద్ర వి దర్దా(లోక్‌మత్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్), బినయ్ రాయ్‌చౌధురి(హెచ్‌టీ మీడియా లిమిటెడ్), చందన్ మంజుందార్(ఏబీపీ ప్రైవేట్ లిమిటెడ్), రాజ్‌కుమార్ జైన్(బెనెట్, కోల్‌మన్ అండ్ కంపెనీ లిమిటెడ్), ప్రతాప్ జి పవార్(సకల్ పేపర్స్ ప్రైవేట్ లిమిటెడ్)


 అడ్వర్‌టైజర్స్ ప్రతినిధులు
 దేబబ్రత ముఖర్జీ, (కోకాకోలా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్), హేమంత్ మాలిక్(ఐటీసీ లిమిటెడ్), సందీప్ తర్కాస్(ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్), మయాంక్ పరీక్(టాటా మోటార్స్ లిమిటెడ్)
 

అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీస్ ప్రతినిధులు
 మధుకర్ కామత్(డీడీబీ ముద్ర ప్రైవేట్ లిమిటెడ్), శశిధర్ సిన్హా(ఐపీజీ మీడియాబ్రాండ్స్, ఇండియా), శ్రీనివాసన్ కె స్వామి(ఆర్‌కే స్వామి బీబీడీవో ప్రైవేట్ లిమిటెడ్), సీవీఎల్ శ్రీనివాస్(గ్రూప్ ఎం మీడియా ప్రైవేట్ లిమిటెడ్)
 సెక్రటేరియట్  హర్‌ముజ్ మసానీ(సెక్రటరీ జనరల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement