టాప్-10 ఫిన్ టెక్ కంపెనీల్లో ఐ-లెండ్ | P2P lenders chalk out aggressive expansion plan post RBI | Sakshi
Sakshi News home page

టాప్-10 ఫిన్ టెక్ కంపెనీల్లో ఐ-లెండ్

Published Wed, May 4 2016 1:17 AM | Last Updated on Tue, Oct 2 2018 6:32 PM

టాప్-10 ఫిన్ టెక్ కంపెనీల్లో ఐ-లెండ్ - Sakshi

టాప్-10 ఫిన్ టెక్ కంపెనీల్లో ఐ-లెండ్

హైదరాబాద్:  హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న పీర్-టు-పీర్ (పీ2పీ) మార్కెట్ ప్లేస్ ‘డబ్ల్యూడబ్ల్యూడ బ్ల్యూ.ఐ-లెండ్.ఇన్’ను ఆసియాలో అత్యుత్తమ పది ప్రత్యామ్నాయ ఫైనాన్స్/ఫిన్‌టెక్ కంపెనీల్లో ఒకటిగా ఆసియన్ బ్యాంకర్స్ కాన్ఫరెన్స్ (ఏబీసీ) ఎంపిక చేసింది. భారత్ నుంచి కేవలం ఐ-లెండ్‌కు మాత్రమే వియత్నాంలోని హనోయిలో మే 11 నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఏబీసీ సమిట్‌లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. ‘ఈ ఎంపిక ఐ-లెండ్ పొందిన అంతర్జాతీయ గుర్తింపునకు ప్రతీక. దేశంలో అగ్రశ్రేణి ఫిన్‌టెక్ కంపెనీగా ఐ-లెండ్ ఎదిగింది. సదస్సులో భారత దేశపు పీ2పీ రంగ సామర్థ్యాన్ని అంతర్జాతీయ ఇన్వెస్టింగ్ కమ్యూనిటీలకు వివరిస్తాం’ అని ఐ-లెండ్ డెరైక్టర్ శంకర్ వద్దాడి తెలిపారు. పీ2పీ కంపెనీలు.. ఆయా వ్యక్తులు పరస్పరం ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా రుణం ఇవ్వడాన్ని/ తీసుకోవడాన్ని అనుమతిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement