ఆటపై ఇష్టం.. గెలవాలన్న పట్టుదల ఉంటేనే ఛాంపియన్స్‌గా నిలుస్తారని అంటారు. అంతిమంగా ఆటలో ఒకరే ఛాంపియన్ కావొచ్చు..ఒకవేళ లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైనా చివరి వరకు పోటీలో ఉండాలని కోరుకుంటారు కొందరు. ఆ కొందరి నుంచి పుట్టిందే కంబోడియాకు చెందిన అథ్లెట్ బౌ సామ్నాంగ్.
ఓటమి ఖరారైనా జోరు వర్షంలోనూ సామ్నాంగ్ తన పరుగును ఆపలేదు. 5000 మీటర్ల రేసును వర్షంలోనే పూర్తి చేసి ఆటపై తనకున్న మక్కువను చూపించింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా లక్ష్యం దిశగా సాగి గెలవాలన్న తన పట్టుదలను పరిచయం చేసింది. తోటి అథ్లెట్లు పక్కకు తప్పుకున్నా తాను మాత్రం లక్ష్యాన్ని వీడలేదు. అందుకే రేసులో గెలిచిన అథ్లెట్ కంటే బౌ సామ్నాంగ్‌కు ఎక్కువ పేరొచ్చింది.
22 నిమిషాల 52 సెకన్లలో రేసు పూర్తి చేసిన అనంతరం సామ్నాంగ్ ఎమోషనల్ అయింది. దేశ జాతీయ జెండాతో అక్కడున్న వారికి అభివాదం చేసింది. జోరు వర్షంలోనూ తన పరుగుకు మద్దతిచ్చిన అభిమానులకు కృతజ‍్క్షతలు తెలిపింది. రేసులో బౌ సామ్నాంగ్ ఓడినా అభిమానుల మనసులను మాత్రం గెలుచుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో బౌ సామ్నాంగ్ పేరు ట్రెండింగ్‌లో ఉంది.
కంబోడియా రాజధాని నమ్ పెన్ నగరంలో జరిగిన సౌత్‌ఈస్ట్ ఏషియన్ గేమ్స్‌లో ఈ అద్బుతం చోటుచేసుకుంది. సోమవారం జరిగిన 5000 మీటర్ల రేసులో వియత్నాంకు చెందిన గుయన్ తి వోనా విజేతగా నిలిచింది. ఇక రేసు అనంతరం కంబోడియా ప్రధాని హున్ సన్.. బౌ సామ్నాంగ్ అంకితభావానికి ముచ్చటపడి 10వేల డాలర్లను రివార్డుగా ఇవ్వడం విశేషం.
బౌ సామ్నాంగ్‌ను ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోసీ) ఆకాశానికెత్తింది. రేసు ఓడిపోయి ఉండొచ్చు.. తన అంకితభావంతో విజేతను మించిపోయింది అంటూ క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం బౌ సామ్నాంగ్ రేసుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Even if you're in last place. 🏃
— The Olympic Games (@Olympics) May 9, 2023
Even if the weather is terrible. 🌧️
Even if it feels like you can't do it. 🚫
𝙉𝙚𝙫𝙚𝙧 𝙜𝙞𝙫𝙚 𝙪𝙥 💪
Nothing was going to stop Cambodia's Bou Samnang 🇰🇭 from finishing the women's 5,000 metre race at the #SEAGames. pic.twitter.com/iVMxwqVrFQ
Comments
Please login to add a commentAdd a comment