కాంబోడియా రాజధాని నగరం నామ్ ఫెన్ శివార్లలో ఓ సైనిక హెలికాప్టర్ కూలిపోవడంతో ఐదుగురు మరణించారు, మరొకరు గాయపడ్డారు.
కాంబోడియా రాజధాని నగరం నామ్ ఫెన్ శివార్లలో ఓ సైనిక హెలికాప్టర్ కూలిపోవడంతో ఐదుగురు మరణించారు, మరొకరు గాయపడ్డారు. డాంగ్కోర్ జిల్లాలో ఈ ప్రమాదం సంభవించినట్లు సైనికాధికారులు తెలిపారని సిన్హువా వార్తాసంస్థ పేర్కొంది.
ప్రమాదం జరిగే సమయానికి హెలికాప్టర్లో కాంబోడియా వైమానిక దళానికి చెందిన ఐదుగురు ట్రైనీలున్నారు. ప్రమాదానికి కారణం ఏంటో, ఎలా సంభవించిందోనన్న విషయాన్ని ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. కూలిపోయిన హెలికాప్టర్ చైనాకు చెందిన జడ్-9 యుటిలిటీ తరహాదని అధికారులు తెలిపారు.