హెలికాప్టర్ కూలి ఆరుగురి దుర్మరణం
మాస్కో: రష్యాలో హెలికాప్టర్ కూలిన ఘటనలో ఆరుగురు మరణించారు. శనివారం రష్యాలోని ఖబరోవ్స్ ప్రాంతంలో హెలికాప్టర్ కూలినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో పది మంది ప్రాణాలతో బయటపడినట్టు సమాచారం. హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని అధికారులు గుర్తించారు.