నాంపెన్: కంబోడియా పుర్సత్ ప్రావిన్స్లో మంగళవారం ఆర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు - ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మరణించారు. మరో 19 మంది గాయపడ్డారు. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారి బుధవారం వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడు మాత్రం అక్కడికక్కడే మరణించగా... మరో నలుగురు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు అయితే గాయపడిన క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అలాగే ఈ ప్రమాదంలో బస్సు, ట్రక్కు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు.
బస్సు - ట్రక్కు ఢీ: ఐదుగురు మృతి
Published Wed, Jan 20 2016 9:14 AM | Last Updated on Thu, Apr 4 2019 5:24 PM
Advertisement
Advertisement