ఎలుకకు అత్యంత అరుదైన గౌరవం | Rat Awarded PDSA Animal Bravery Award | Sakshi
Sakshi News home page

ఎలుకకు అత్యంత అరుదైన గౌరవం

Published Fri, Sep 25 2020 8:49 PM | Last Updated on Fri, Sep 25 2020 8:55 PM

Rat Awarded PDSA Animal Bravery Award - Sakshi

అనిమల్‌ హీరో మగావా

కంబోడియా : ఓ ఎలుకకు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. బ్రిటీష్‌ ఛారిటీ అందజేస్తున్న ‘‘పీడీఎస్‌ఏ’’ అనిమల్‌ బ్రేవరీ(జంతువులకు సంబంధించిన అవార్డుల్లో గొప్పది) అవార్డును సొంతం చేసుకుంది. కంబోడియాలోని భూముల్లో దుండగులు పాతిపెట్టిన లాండ్‌మైన్స్‌ను కనిపెట్టడంలో ప్రతిభ కనపరిచినందుకు గానూ మగావా అనే ఆఫ్రికన్‌ ఎలుకకు ఈ గౌరవ పురష్కారం లభించింది. దాదాపు ఏడేళ్ల కాలంలో 39 లాండ్‌మైన్లను, 28 ఇతర పేలుడు పదార్థాలను మగావా కనుగొంది. ( ఊహించని ట్విస్ట్‌తో‌ మైండ్‌బ్లాక్‌ ఖాయం )

పీడీఎస్‌ఏ గోల్డ్‌ మెడల్తో మగావా
‘‘ప్రాణాలను రక్షించటంలో తెగువ’’ చూపినందుకు గానూ బంగారు పతకంతో సత్కరించారు. ఎలుక జాతిలో పీడీఎస్‌ఏ గోల్డ్‌ మెడల్‌ అందుకున్న మొదటిది మగావా కావటం విశేషం. మగావా ఓ బెల్జియం ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో లాండ్‌మైన్లను కనుగొనటంలో శిక్షణ తీసుకుంది. అంతేకాకుండా విజయవంతమైన ఎలుకగా కీర్తి పొందింది. (వావ్‌.. ఎంత క్యూట్‌గా ఉందో..! )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement