పెన్: క్లబ్బులో మంటలు వ్యాపించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కాంబోడియాలో సోమవారం చోటుచేసుకుంది. ఇక్కడ ఉన్న స్టార్ నైట్ క్లబ్బులోని కారావోకె అనే గదిలో విద్యుదాఘాతం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగి అందులో ఉన్నవారిని చుట్టేశాయని పోలీసులు తెలిపారు. వాటిని తప్పించుకునే క్రమంలో గందరగోళం ఏర్పడిందని, ప్రాణనష్టం చోటుచేసుకుందని తెలిపారు. చనిపోయిన ఐదుగురిలో ఒక మహిళ కూడా ఉంది.