లేగ దూడే నా భర్త..! | Cow calf is her husband | Sakshi
Sakshi News home page

లేగ దూడే నా భర్త..!

Jul 23 2017 1:46 AM | Updated on Sep 5 2017 4:38 PM

లేగ దూడే నా భర్త..!

లేగ దూడే నా భర్త..!

కంబోడియాకు చెందిన 74 ఏళ్ల కిమ్‌ హాంగ్‌ ఇటీవల వార్తల్లో ప్రముఖంగా నిలిచారు.

కంబోడియాకు చెందిన 74 ఏళ్ల కిమ్‌ హాంగ్‌ ఇటీవల వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ఎందుకంటే ఆమె ఒక ఆవు దూడను ఇంట్లో మనిషిలా చూసుకోవడమే! ఆ మాత్రం దానికేనా అంటే మాత్రం అక్కడే ఉంది అసలు విషయం.. ఈగ సినిమాలో నాని చనిపోయి ఎలాగైతే ఈగగా మళ్లీ పుడుతాడో అచ్చం అలాగే చనిపోయిన తన భర్త కూడా దూడ రూపంలో జన్మించాడని కిమ్‌ ప్రగాఢంగా నమ్ముతోంది. గతేడాది ఆమె భర్త మరణించాడు. అయితే కిమ్‌ మాత్రం తన భర్త తిరిగి వస్తాడని చనిపోయినప్పటి నుంచి బలంగా విశ్వసిస్తోంది. ఆ విశ్వాసంతోటే ఇటీవల మార్చిలో జన్మించిన లేగ దూడ తన భర్తేనంటూ వాదిస్తోంది.

దానికి పలు కారణాలు కూడా చెబుతోంది. తన భర్త బతికున్నప్పుడు ఎలా ఉండేవాడో అచ్చం ఆ దూడ కూడా అలాగే చేస్తోందని అంటోంది. తన బంధువులను గుర్తించి ప్రేమగా చేతులు నాకడం, ఇంట్లోనే ఎక్కు వ సమయం గడపడం, ఆఖరికి రాత్రి సమయంలో తనతో, తన పిల్లలతో అదే బెడ్‌పై నిద్రించడం లాం టివి చేస్తోందని చెబు తోంది. తానొక సారి దూడ వద్ద కు వెళ్లినప్పుడు తన భర్త ఆత్మ వచ్చి మాట్లాడిం దని చెబుతోంది. దూడ కూడా మనుషుల్లాగే ప్రవర్తిస్తోందట. కిమ్‌ భర్తకు ఎంతో ఇష్టమైన దిండు, బెడ్‌పైనే అది నిద్రపోతుందట. ఈ దూడ కోసం కిమ్‌ ఓ గదిని సిద్ధం చేసి, పూలతో అలంకరించింది. అయితే తాను బతికున్నంత వరకు తన భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగినా సాధారణ మనుషుల్లాగే ఘనంగా అంతిమ సంస్కారాలు జరిపించి తన భర్తను సాగనంపుతానని కిమ్‌ అంటోంది. ఏంటో ఎవరి నమ్మకాలు వారివి! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement