cow calf
-
రామ్ లక్ష్మణ్.. హ్యాపీ బర్త్ డే
కవలలుగా పుట్టిన రామ్ లక్ష్మణ్ లకు ఆ గ్రామంలో గురువారం మొదటి పుట్టిన రోజు (Birthday) వేడుక ఘనంగా జరిపారు. చప్పట్ల మధ్య పెద్ద కేక్ కట్ చేసి తినిపించారు. బంధుమిత్ర సపరివారంగా ఆ చిన్నారులను ఆశీర్వదించి, చివరిగా విందారగించారు. ఈ హడావుడి చూసి ఇదేదో చిన్న పిల్లల జన్మదిన వేడుక అనుకుంటున్నారేమో! ఇదంతా ఓ కుటుంబం సొంత బిడ్డల్లా సాకుతున్న దూడల జన్మదిన వేడుక. కాకినాడ జిల్లా (Kakinada District) ప్రత్తిపాడు మండలం చినశంకర్లపూడి గ్రామంలోని మిరియాల వెంకట్రాజు ఇల్లు ఈ వేడుకకు వేదిక అయ్యింది. వెంకట్రాజుకు చెందిన ఆవు (Cow) ఏడాది కిందట సరిగ్గా ఇదే తేదీన రెండు కవల దూడలకు జన్మనిచ్చింది. వాటికి రామ్, లక్ష్మణ్ (Ram Laxman) అని పేర్లు పెట్టారు. అవి పుట్టి ఏడాది పూర్తి కావడంతో ఘనంగా జన్మదిన వేడుక జరిపారు. – ప్రత్తిపాడుకిలో మీటరు మేర డోలీ మోత గిరిజన ప్రాంతంలో గర్భిణులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. సరైన రహదారి సౌకర్యం లేక గిరి బిడ్డలు నానా అవస్థలు పడుతున్నారు. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయతీ చెరువువీధి గ్రామానికి చెందిన కిల్లో వనితకు గురువారం ఉదయం 9 గంటల సమయంలో పురిటి నొప్పులు మొదలయ్యాయి. గ్రామానికి కిలోమీటరు వరకు రహదారి సౌకర్యం లేదు. ఎటువంటి వాహనాలు రాలేని పరిస్థితి. దీంతో చేసేదేమీ లేక వనిత భర్త మోహన్‌రావు, కుటుంబ సభ్యుల సహాయంతో డోలీ కట్టి రహదారి సౌకర్యం ఉన్న బొడ్డగొంది గ్రామానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించారు. వైద్యాధికారి సంతోష్, సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా చెరువువీధి గ్రామస్తులు మాట్లాడుతూ.. గతంలో తమ గ్రామానికి రహదారి ఉండేదని, భూ సమస్య కారణంగా ఒక వ్యక్తి మధ్యలో పెద్ద గొయ్యి తవ్వేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. రహదారి సమస్య పరిష్కరించాలని అధికారులను ఎన్నిసార్లు కోరినా ఫలితంలేకుండాపోతోందని వాపోయారు. – ముంచంగిపుట్టుచివరి మజిలీలో ‘దారి’ చిక్కులుతిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలం, జింగిలిపాళెం దళితవాడకు చెందిన వెంకటేశ్ (34) మృతి చెందడంతో గురువారం ఆయన అంతిమ యాత్రకు చిక్కులు ఎదురయ్యాయి. రోడ్డు ప్రమాదంలో వెంకటేశ్ మృతి చెందడంతో బంధువులు పాడె ఎత్తుకుని శ్మశానానికి బయల్దేరారు. అయితే దారి లేకపోవడంతో నానా అగచాట్లు పడుతూ పంట పొలాల గట్లు మీద నడుచుకుంటూ శ్మశాన వాటికకు చేరుకున్నారు. దీంతో ప్రశాంతంగా జరగాల్సిన అంత్యక్రియలు అవస్థల మధ్య జరగడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. – రేణిగుంటవిశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో రెండు ఎద్దులు అధిపత్యం కోసం పోరాడాయి. వీటి మధ్య జరిగిన పోరును స్థానికులు ఆసక్తిగా గమనించారు. ఓ దశలో ఇవి వారివైపునకు రాగా... స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. – సాక్షి ఫోటోగ్రాఫర్, విశాఖపట్నం ఒకవైపు పెట్రోలింగ్‌కు వాహనాలు లేవని చెబుతున్న పోలీసులు..చిన్న మరమ్మతులైన వాటినీ రిపేర్ చేయించకుండా మూలన పడేస్తున్నారు. దానికి ఈ చిత్రమే నిదర్శనం. విశాఖలోని మద్దిలపాలెం అవుట్‌పోస్ట్ వద్ద మరమ్మతులకు గురైన పోలీస్ పెట్రోలింగ్ బైక్‌ను నెలల తరబడి ఇలాగే వదిలేయడం విమర్శలకు తావిస్తోంది. – సాక్షి ఫోటోగ్రాఫర్, విశాఖపట్నం ఇది తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద టీటీడీ ఏర్పాటు చేసిన ప్రసాదం కౌంటర్. లడ్డూలు లేకపోవడంతో ఇలా నో స్టాక్ బోర్డును టీటీడీ ఏర్పాటు చేసింది. దీంతో అక్కడికి వచ్చిన భక్తులు లడ్డు ప్రసాదం దొరక్క నిరాశతో వెనుదిరిగారు. – సాక్షి ఫోటోగ్రాఫర్, తిరుపతిచదవండి: సర్పమా.. మేఘమా! -
పుంగనూరు గిత్త దూడ ఎత్తు 16 అంగుళాలు
కాకినాడ జిల్లా, కరప మండలం జెడ్. భావారం గ్రామంలో పుంగనూరు జాతి గిత్త దూడ 16 అంగుళాల ఎత్తుతో జన్మించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది మరీ పొట్టిగా ఉండటంతో గ్రామంలోని రైతులు వింతగా చూస్తున్నారు. పుంగనూరు ఆవు బుధవారం ఉదయం ఈ దూడకు జన్మనిచ్చిందని ఆ గ్రామానికి చెందిన రైతు కంచెర్ల నాగేశ్వరరావు తెలిపారు. ఈ దూడ 16 అంగుళాల ఎత్తు, 36 అంగుళాల పొడవు, 4 కిలోల బరువు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. – కరపరైతులకు ‘జల’గండంవరుసగా కురుస్తున్న వర్షాలకు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు గ్రామ రైతులకు కష్టాలు తప్పడం లేదు. వీరి పంట భూములు బాహుదానదికి అవతల ఉండటంతో ఏటా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు రోజులుగా కురిసిన వర్షాలకు బాహుదా గెడ్డలోకి నీరు చేరడంతో కోత కోసిన ధాన్యం ఓవులను ఇంటికి తెచ్చేందుకు రైతులు పీకల్లోతు నీటిలోకి దిగాల్సి వచ్చింది. ప్రభుత్వం మినీ వంతెన నిర్మిస్తేనే ‘జలగండం’ తప్పుతుందని అన్నదాతలు చెబుతున్నారు. – ఇచ్ఛాపురం రూరల్‘మా రోడ్డు చూడండి..’తమ రోడ్డు దుస్థితిని చూడాలంటూ విజయనగరం జిల్లా వంగర మండలం భాగెంపేట యువకులు రోడ్డుకోసం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అరసాడ జంక్షన్ నుంచి భాగెంపేట వరకు అధ్వానంగా ఉన్న రోడ్డును డ్రోన్ కెమెరాలో బుధవారం చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నీలయ్యవలస, భాగెంపేట, పటువర్ధనం, శ్రీహరిపురం, దేవకివాడ ఆర్అండ్ఆర్ కాలనీ గ్రామాలకు ఈ గోతులమయమైన రోడ్డే గతని, అధికారులు సమస్యపై స్పందించి రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. రోడ్డు అధ్వానంగా ఉండడంతో బస్సు సర్వీసును నిలిపివేశారని, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించకుంటే నిరసన తెలుపుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. – వంగరచదవండి: బంతీ.. చామంతీ.. ముద్దాడుకున్నాయిలే..! -
దయా హృదయం
నగర అరణ్యంలో తప్పిపోయి అయోమయంగా తిరుగుతోంది ఒక ఆవు దూడ. దాడి చేయడానికి కుక్కలు కాచుకొని కూర్చున్నాయి. ఈ దృశ్యాన్ని కారులో నుంచి చూసిన ఒక మహిళ కారు దిగింది. ఆ దూడను కారులో తన ఇంటికి తీసుకువెళ్లింది. దూడకు స్నానం చేయించి మేత పెట్టించింది. ‘ఈ దూడ మాదే’ అని ఎవరూ ఇంకా రాలేదుగానీ నెటిజనులు మాత్రం ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. ‘రోడ్డు మీద మనిషి చావుబతుకుల మధ్య ఉంటే కూడా ఆఫీసుకు టైమ్ అవుతుంది అంటూ పరుగులు తీసే జనాలు ఉన్న ఈ రోజుల్లో మీరు చేసిన మంచి పని మమ్మల్ని కదిలించింది’ అంటూ నెటిజనులు ఆమెను ఆకాశానికెత్తుతున్నారు. -
అందాల పోటీల్లో కేశనపల్లి గిత్తకు ప్రథమ స్థానం
మలికిపురం: రాష్ట్ర స్థాయిలో జరిగిన అందాల పోటీలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి గ్రామం అడబాల లక్ష్మీనారాయణ (నాని)కి చెందిన పుంగనూరు గిత్త ప్రథమ స్థానం పొందింది. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా పెదతాడేపల్లిలో జరిగిన ఈ పోటీలలో ఈ గిత్తకు రూ.30 వేల బహుమతి లభించింది. మంత్రి కొట్టు సత్యనారాయణ, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోసేన్‌రాజు, ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు చేతుల మీదుగా లక్ష్మీనారాయణ బహుమతి అందుకున్నారు. దేశీయ గోజాతి సంవర్ధక అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. ఎత్తు 13 అంగుళాలు.. పొడవు 19 అంగుళాలు మలికిపురం మండలంలోని పడమటిపాలెం గ్రామంలో సోమవారం అరుదైన పుంగనూరు గిత్త దూడ జన్మించింది. పెద్దిరెడ్డి సత్యనారాయణ మూర్తికి చెందిన పుంగనూరు ఆవుకు ఈ దూడ జన్మించింది. దీని ఎత్తు 13 అంగుళాలు, పొడవు 19 అంగుళాలు ఉంది. పుంగనూరు దూడలన్నీ సాదారణంగా ఇదే సైజులో జన్మిస్తాయి. (క్లిక్ చేయండి: మండ పీతకు మంచి డిమాండ్.. 4 లక్షల ఆదాయం!) -
ఆశ్చర్యం.. ఆవు లేగ దూడ కాళ్లకు 14 డెక్కలు
కుంటాల: నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని దౌనెల్లి సతీశ్‌కు చెందిన ఆవుకు గురువారం రాత్రి లేగ దూడ జన్మించింది. దూడకు ముందటి కాళ్లకు నాలుగుకు బదులు ఆరు డెక్కలు, వెనుక కాళ్లకు నాలుగుకు బదులు ఎనిమిది డెక్కలు ఉన్నాయి. దీంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని దూడను పరిశీలించారు. సెల్ఫోన్లో ఫొటోలు తీసుకున్నారు. జన్యు లోపంతోనే లేగ దూడ 14 డెక్కలతో జన్మించిందని పశువైద్యాధికారి ప్రకాశ్ తెలిపారు. (క్లిక్ చేయండి: గేటు పడింది.. గుండె ఆగింది) -
మగదూడ పుడితే రూ.500 వెనక్కి ఇస్తారు!
ఆవులు, గేదెల్లో ఏ దూడలు కావాలని కోరుకుంటారు... సహజంగా ఎవరైనా పెయ్య దూడలు (ఆడ) కావాలని ఆకాంక్షిస్తారు. కృత్రిమ గర్భధారణ సూదులు వేస్తున్నా.. పుట్టేది ఆడదూడా.. మగదూడా అనేది తెలియని పరిస్థితి. ఇక నుంచి పాడి అభివృద్ధికి ఆడదూడలే పుట్టించుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లింగ నిర్ధారణ వీర్యం (సార్టెడ్ సెక్స్ సెమన్) ద్వారా 95 శాతం పెయ్య దూడలను అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది. కర్నూలు (అగ్రికల్చర్): పెయ్య దూడల జననం ద్వారా పాల దిగుబడిని, రైతు ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు. లింగనిర్ధారణ వీర్యం సాంకేతికతను కృత్రిమ గర్భధారణ ద్వారా రైతులకు అందుబాటులో ఉంచడం, పాడి పరిశ్రమను మరింత అభివృద్ది చేసేందుకు దోహదపడుతోంది. నేడు విద్యావంతులైన నిరుద్యోగులు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అటువంటి వారికి ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఏడాది జిల్లాలో 5,000 పశువులకు లింగనిర్ధారణ వీర్యంతో కృత్రిమ గర్భధారణ సూది వేసి పెయ్య దూడలు అభివృద్ధి చేయాలని పశుసంవర్ధక శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిని రైతుల్లోకి తీసుకెళ్లి సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. సబ్సిడీపై కృత్రిమ గర్భధారణ వీర్యం లింగనిర్ధారణ వీర్యాన్ని పూణే, అహమ్మదాబాద్ల్లోని వెటర్నరీ రీసెర్చ్ కేంద్రాల్లో అధిక పాలసార ఉన్న ఆంబోతుల నుంచి సేకరించారు. ఆడదూడలే పుట్టే విధంగా లింగనిర్ధారణ వీర్యాన్ని వృద్ధి చేశారు. రెండేళ్ల క్రితం జెర్సీ, హెచ్ఎఫ్ ఆవుల్లో ఈ ప్రయోగం చేశారు. 200 ఆవులకు ఇటువంటి వీర్యంతో కృత్రిమ గర్భధారణ సూదులు వేయగా 52 దూడలు పుట్టాయి. ఇందులో 47 పెయ్యదూడలు ఉండటం విశేషం. తాజాగా మరింత సాంకేతికతతో అభివృద్ధి చేసిన లింగనిర్ధారణ వీర్యంతో ముర్రా గేదెలతో పాటు జెర్సీ, ఆవు జాతులైన గిర్, సాహివాల్, హెచ్ఎఫ్ ఆవులకు కృత్రిమ గర్భధారణ సూదులు వేస్తారు. ఒక డోసు పూర్తి ధర రూ.700 ఉండగా... కేంద్రం రూ.450 సబ్సిడీ ఇస్తుంది. రైతు రూ.250 చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది ఉమ్మడి కర్నూలు జిల్లాలో 5,000 పశువులకు సార్టెడ్ సెక్స్ సెమన్ ద్వారా సూదులు వేసే విధంగా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు. 95 శాతం ఆడదూడలే పుట్టే అవకాశం లింగనిర్ధారణ వీర్యం ద్వారా 95 శాతంపైగా పెయ్యదూడలే పుట్టే అవకాశం ఉంది. ఒక ఆవు లేదా గేదెకు మూడు డోసుల వరకు ఇచ్చే అవకాశం ఉంది. ఆవులు, గేదెలు ఎదకు రావడాన్ని గుర్తించి ఈ వీర్యంతో కృత్రిమ గర్భధారణ సూదులు వేయించాలి. ఎదకు వచ్చిన 12 గంటల నుంచి 24 గంటలలోపు సూదులు వేయించాల్సి ఉంది. మొదటి డోసు వేసినపుడు చూడికట్టకపోతే రెండవసారి వేయంచవచ్చు. అపుడు కూడా చూడికట్టకపోతే మూడవ డోసు వేయించవచ్చు. ప్రతి డోసుకు రైతు సబ్సిడీ పోను రూ.250 చెల్లించాల్సి ఉంది. మూడు డోసులు వేసినా చూడికట్టకపోతే రూ.500 రైతుకు వెనక్కి ఇస్తారు. మూడు డోసుల సార్టెడ్ సెక్స్ సెమన్‌తో కృత్రిమ గర్భధారణ చేసినా మగదూడ పుడితే రూ.500 వెనక్కి ఇస్తారు. ఈ సెమన్ ప్రధాన లక్ష్యం పెయ్యదూడల అభివృద్ధి. ఈ కార్యక్రమాన్ని గోపాలమిత్రలు అమలు చేస్తారు. సార్టెడ్ సెక్స్ సెమన్‌తో సూది వేస్తే రూ.100 ప్రోత్సాహకం ఇస్తారు. మొదటి డోసుతోనే చూడి కడితే రూ.150, రెండవ డోసుతో చూడి కడితే రూ.100 ప్రోత్సాహక బహుమతి ఇస్తారు. పెద్ద ఎత్తున అమలు చేస్తున్నాం లింగనిర్ధారణ వీర్యంతో ఒంగోలు జాతి మినహా మిగిలిన అన్ని ఆవు, గేదె జాతి పశువులకు కృత్రిమ గర్భధారణ చేయవచ్చు. దీని ద్వారా 90 నుంచి 95 శాతం వరకు ఆడదూడలే పుట్టే అవకాశం ఉంది. పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తోంది. – రాజశేఖర్, కార్యనిర్వహణాధికారి, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ, కర్నూలు -
ఈ ఆవు దూడ ఎంత లక్కీ అంటే..
పలమనేరు: పెద్దపంజాణి మండలం గోనుమాకులపల్లెలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీపీ విజ యభాస్కర్రెడ్డికి చెందిన ఓ దూడకు శుక్రవారం పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. విజయభాస్కర్‌రెడ్డి ఇంట్లో పుంగనూరు జాతి ఆవు ఏడాది క్రితం ఓ దూడను ఈనింది. ఆ దూడపై ఎనలేని మమకారం ఆయన ఎనలేని మమకారం పెంచుకున్నారు. శుక్రవారం దూడ జన్మదినోత్సం సందర్భంగా దానికి తానే స్వయంగా సాన్నం చేయించి, అలంకరించి, కేక్ కట్ చేశారు. గ్రామస్తులు సైతం ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. చదవండి: ఆ ఫేస్బుక్ పేజీని నడిపిస్తుంది లోకేశే.. డీజీపీకి ఫిర్యాదు Organic Coffee: ‘మన్యం’ కాఫీ.. రైతు హ్యాపీ -
ఆవు దూడపై అత్యాచారం
సాక్షి, హైదరాబాద్ : మూగ జీవిపై అఘాయిత్యానికి పాల్పడి జైలు పాలయ్యాడో కామాంధుడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంజయ్ వర్మ అనే వ్యక్తి ఎల్బీనగర్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ఓ ఆవు దూడపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సరూర్ నగర్ పోలీసులు సంజయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడ్ని రిమాండ్‌కు తరలించారు. -
అమ్ము, పూర్విక.. ఓ మంచి నాన్న
తమ ఇంట ఉన్న ఆవు..దూడకు జన్మనివ్వడంతో ఓ చిట్టితల్లి దాని సంరక్షణ చూసుకుంటూ అనుబంధం పెంచుకుంది. అయితే పాల ఆదాయం తగ్గిపోతోందని ఆ చిట్టితల్లి తండ్రి ఆ దూడను ఓ కసాయికి అమ్మేశాడు. ఎంతగా ఏడ్చి మొత్తుకున్నా తండ్రి నిర్దయగా వ్యవహరించడంతో ఆ చిట్టితల్లి పొగిలి..పొగిలి ఏడ్చింది. అయినా తండ్రి కరకగపోవడంతో అన్నపానీయాలు ముట్టకుండా గాంధీగిరితో నిరసన వ్యక్తం చేసింది. దీంతో ఊరంతా కదిలి ఆ ఇంటి ముందు వాలింది. తలో మాట అనడంతో ఇక లాభం లేదని ఆ చిట్టితల్లి తండ్రి కసాయి వద్దకు పరుగులు తీశాడు. దూడతో చిట్టితల్లి ముందు ప్రత్యక్షమయ్యాడు. అంతే..ఆ చిట్టితల్లి కళ్లల్లో వెలుగులు! గ్రామస్తుల మోముల్లో నవ్వులు!! సాక్షి, పలమనేరు : మండలంలోని పెంగరగుంటకు చెందిన నారాయణప్ప పాడి ఆవులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కుమార్తె గ్రామ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి, చిన్నకుమార్తె పూర్విక 3వ తరగతి చదువుతున్నారు. ఇంట ఉన్న రెండు ఆవుల్లో ఒక ఆవు 5 నెలల క్రితం ఓ లేగదూడకు జన్మనిచ్చింది. రెండు పూటలా కలిపి ఈ ఆవు 14 లీటర్ల పాలిచ్చేది. ఈ పాలను నారాయణప్ప ఒక ప్రైవేటు డెయిరీకి పోసేవాడు. ఇక దూడ పుట్టినప్పటి నుంచి పూర్వికకు దానితోటే లోకం. స్కూలుకు వెళ్లి వస్తే సాయంత్రం నుంచి దానితోనే ముచ్చట్లు. గడ్డి పెట్టడం, నీళ్లు పట్టడం..ఆడుకోవడం చేసేది. ఇలా దానితో అనుబంధం బాగా పెంచుకుంది. దీనికితోడు మూడో తరగతి తెలుగు వాచకంలోని ‘పెంపుడు జంతువులు’ పాఠం ప్రభావం కూడా ఆ చిట్టితల్లిపై పడింది. పెంపుడు జంతువులు కూడా కుటుంబ సభ్యులతో సమానమని, పెంపుడు జంతువుల్లో ఆవు–దూడ గురించి కూడా టీచర్ చెప్పి ఉండడంతో దూడ కూడా తమ కుటుంబంలో ఒకదానిగా పూర్విక భావించింది. దానికో ముద్దు పేరు కూడా పెట్టుకుంది ‘అమ్ము’ అని! ఇక పాడి ఆవు రెండు పూటలా కలిపి 14 లీటర్ల పాలు ఇచ్చేది. ఉదయం, సాయంత్రం రెండేసి లీటర్ల చొప్పున దూడ తాగేస్తుండడంతో పాల ఆదాయం పడిపోతోందని నారాయణప్ప భావించాడు. దీనిని అమ్మేస్తే నెలకు మూడు వేల రూపాయల వరకు పాల ఆదాయం నష్టపోయే పరిస్థితి ఉండదని తలచాడు. అనుకున్నదే తడవుగా 5 నెలల వయసున్న దూడను పలమనేరులోని ఓ కసాయి అమ్మేయడంతో అతనొచ్చి దూడను పట్టుకుపోతుంటే పూర్విక అడ్డుకుంది. అమ్మును అమ్మడానికి వీల్లేదంటూ గొడవ చేసింది. అవేవీ పట్టించుకోకుండా ఆ చిట్టితల్లి తండ్రి ఉదయం 9 గంటల సమయంలో కసాయికి అప్పగించడంతో దానిని పట్టుకుపోయాడు. దీంతో కడుపు మండిన ఆ చిన్నారి ఉదయం నుంచి అన్నం తినకుండా ఏడవడం మొదలు పెట్టింది. ఎవరూ సముదాయించినా ఏడుపు మానలేదు. దీంతో ఊరి జనం కూడా ఇంటి ముందు గుమిగూడారు. ఓవైపు కన్నకూతురి ఏడుపు, మరోవైపు దూడ కనిపించక ఆవు దీనంగా అరుస్తుండడంతో ఆ చిన్నారి తల్లి లక్ష్మి మనసు కరిగింది. బిడ్డ కోసం దూడను తీసుకురమ్మంటూ భర్తను ప్రాధేయపడింది. ఇక గ్రామస్తులు కూడా హితోక్తులు పలకడంతో నారాయణప్ప ఇక లాభం లేదని పలమనేరుకు వెళ్లాడు. సాయంత్రం 4.30 గంటలకు లగేజి ఆటోలో తెచ్చిన దూడతో ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు. అంతే! ‘అమ్మూ...అని గట్టిగా అరుస్తూ పూర్విక దాని దగ్గరకు పరుగులు తీసింది. గ్రామస్తులు కూడా ‘అబ్బా! ఈ చిన్నపిల్లకు దూడ అంటే ఎంతిష్టమో..ఎంత ప్రేమో. భలే గట్టిది..మొత్తానికి సోమవారం టౌనులో పండక్కి దూడ కోతకు కాకుండా కాపాడింది’’ అని మెచ్చుకుంటూ గ్రామస్తులు వెనుదిరిగారు. ‘అమ్ము’ను భారమనుకుంటే ఎవరికైనా ఇచ్చేద్దామంటూ స్థానిక అంజనాద్రి ఆలయం వద్దనున్న గోసంరక్షణా కేంద్రానికి తండ్రిని తీసుకెళ్లి పూర్విక తనే అప్పగించింది. నేను అప్పుడప్పుడూ వస్తాననంటూ దూడకు టాటా చెబుతూ సంతోషంగా ఇంటికి చేరింది. -
అద్భుతం.. రెండు కాళ్ల ఆవు
-
లేగ దూడే నా భర్త..!
కంబోడియాకు చెందిన 74 ఏళ్ల కిమ్ హాంగ్ ఇటీవల వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ఎందుకంటే ఆమె ఒక ఆవు దూడను ఇంట్లో మనిషిలా చూసుకోవడమే! ఆ మాత్రం దానికేనా అంటే మాత్రం అక్కడే ఉంది అసలు విషయం.. ఈగ సినిమాలో నాని చనిపోయి ఎలాగైతే ఈగగా మళ్లీ పుడుతాడో అచ్చం అలాగే చనిపోయిన తన భర్త కూడా దూడ రూపంలో జన్మించాడని కిమ్ ప్రగాఢంగా నమ్ముతోంది. గతేడాది ఆమె భర్త మరణించాడు. అయితే కిమ్ మాత్రం తన భర్త తిరిగి వస్తాడని చనిపోయినప్పటి నుంచి బలంగా విశ్వసిస్తోంది. ఆ విశ్వాసంతోటే ఇటీవల మార్చిలో జన్మించిన లేగ దూడ తన భర్తేనంటూ వాదిస్తోంది. దానికి పలు కారణాలు కూడా చెబుతోంది. తన భర్త బతికున్నప్పుడు ఎలా ఉండేవాడో అచ్చం ఆ దూడ కూడా అలాగే చేస్తోందని అంటోంది. తన బంధువులను గుర్తించి ప్రేమగా చేతులు నాకడం, ఇంట్లోనే ఎక్కు వ సమయం గడపడం, ఆఖరికి రాత్రి సమయంలో తనతో, తన పిల్లలతో అదే బెడ్‌పై నిద్రించడం లాం టివి చేస్తోందని చెబు తోంది. తానొక సారి దూడ వద్ద కు వెళ్లినప్పుడు తన భర్త ఆత్మ వచ్చి మాట్లాడిం దని చెబుతోంది. దూడ కూడా మనుషుల్లాగే ప్రవర్తిస్తోందట. కిమ్ భర్తకు ఎంతో ఇష్టమైన దిండు, బెడ్‌పైనే అది నిద్రపోతుందట. ఈ దూడ కోసం కిమ్ ఓ గదిని సిద్ధం చేసి, పూలతో అలంకరించింది. అయితే తాను బతికున్నంత వరకు తన భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగినా సాధారణ మనుషుల్లాగే ఘనంగా అంతిమ సంస్కారాలు జరిపించి తన భర్తను సాగనంపుతానని కిమ్ అంటోంది. ఏంటో ఎవరి నమ్మకాలు వారివి! -
మనిషి రూపంలో దూడ.. విష్ణు మూర్తేనంటూ..
-
మనిషి రూపంలో దూడ.. విష్ణు మూర్తేనంటూ..
చూడటానికి మనిషి ముఖంలా కనిపిస్తున్న ఆకారంతో జన్మించిన ఆవు దూడకు ఓ గ్రామ ప్రజలు పూజలు చేస్తున్నారు. హిందూవులు గోవును ఆరాధిస్తారన్న విషయం తెలిసిందే. అచ్చూ మనిషిలాగే ఉండే చెవులు, ముక్కు, కళ్లతో ఉన్న దూడకు ఓ ఆవు జన్మనిచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటు చేసుకుంది. మనిషి పోలికలతో ఆవు దూడ జన్మించిన విషయం గ్రామంలో అగ్నిలా వ్యాపించింది. దీంతో జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకుని దూడను చూసేందుకు ఎగబడ్డారు. భూమి మీద పడి గంట కూడా గడవక ముందే ఆ లేగ దూడ మరణించింది. ఆరెంజ్ కలర్ దుప్పటిపై లేగ దూడ కళేబరాన్ని ఉంచి దండలు వేసి పూజలు చేశారు. చనిపోయిన దూడను చూడాటానికి వచ్చిన వారిలో ఓ వ్యక్తి విష్ణువే దూడ రూపంలో జన్మించాడని అన్నాడు. దేవుడి ఆశీస్సులు తీసుకునేందుకే తాను ఇక్కడికి వచ్చానని చెప్పాడు. కాగా, మనిషి పోలీకలతో దూడ జన్మించడంపై మాట్లాడిన తల్లి ఆవు యజమాని రాజా మిశ్రా.. తమ కొట్టంలో ఈ ఘటన జరగడం ఆ దేవుడి మాపై ఉందనడానికి నిదర్శనమని అన్నాడు. మూడు రోజుల్లో మరణించిన దూడకు అంత్యక్రియలు పూర్తి చేస్తామని చెప్పాడు. త్వరలో దూడకు ఓ గుడి కూడా కట్టిస్తామని తెలిపాడు. దేవుడి ఎంచుకున్న ఈ రూపం చాలా మందిలో భక్తి భావాన్ని మరింత పెంపొందించిందని అన్నాడు. కాగా, ఈ ఘటనపై స్పందించిన జంతు నిపుణులు దాని చుట్టూ అల్లుతున్నవి మూఢ నమ్మకాలని కొట్టిపారేశారు.