
నగర అరణ్యంలో తప్పిపోయి అయోమయంగా తిరుగుతోంది ఒక ఆవు దూడ. దాడి చేయడానికి కుక్కలు కాచుకొని కూర్చున్నాయి. ఈ దృశ్యాన్ని కారులో నుంచి చూసిన ఒక మహిళ కారు దిగింది. ఆ దూడను కారులో తన ఇంటికి తీసుకువెళ్లింది. దూడకు స్నానం చేయించి మేత పెట్టించింది.
‘ఈ దూడ మాదే’ అని ఎవరూ ఇంకా రాలేదుగానీ నెటిజనులు మాత్రం ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. ‘రోడ్డు మీద మనిషి చావుబతుకుల మధ్య ఉంటే కూడా ఆఫీసుకు టైమ్ అవుతుంది అంటూ పరుగులు తీసే జనాలు ఉన్న ఈ రోజుల్లో మీరు చేసిన మంచి పని మమ్మల్ని కదిలించింది’ అంటూ నెటిజనులు ఆమెను ఆకాశానికెత్తుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment