కుక్కలకు ఆహారం పెట్టేందుకు అని కొడుకుని తీసుకుని వెళ్లింది ఓ మహిళ. ఊహించని రీతిలో ఒక్కసారిగా ఆ కుక్కలు ఆమెపై దాడి చేయడం ప్రారంభించాయి. భయంతో బిక్కుబిక్కుమంటూ బయటకు వచ్చిన ఆమె కొడుకు సాయం కోసం సోదరడుకి ఫోన్ చేసేందుకు యత్నించాడు. కానీ ఆమె అప్పటికే అతడి తల్లి ఆ కుక్కుల దాడిలో చనిపోయింది. ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే..పెన్సిల్వేనియాకు చెందిన 38 ఏళ్ల మహిళ, తన పొరుగింటి వారి రెండు పెద్ద కుక్కులకు ఆహారం పెట్టేందుకు వెళ్లింది. నిజానికి పక్కంటి వారు ఊరులో లేకపోవడంతో వాటి బాగోగోలు ఆమెకు అప్పచెప్పడంతో వాటి ఆలనపాలన చూస్తోంది. ఎప్పటిలానే ఆ రోజు కూడా ఆమె తన చిన్న కొడుకుని తోడుగా తీసుకుని వాటికి ఆహారం పెట్టేందుకు వెళ్లింది. ఏమైందో ఏమో ఒక్కసారిగా ఆమెపై కుక్కలు దాడి చేశాయి. దీంతో అతడు తన తల్లిన రక్షించుకునేందుకు బయటకు వచ్చి తన అన్నకు కాల్ చేసే యత్నం చేశాడు.
కానీ ఆమె అప్పటికే ఆ కుక్కల దాడిలో మరణించింది ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ఆ కుక్కలను అదుపు చేసి బాధితురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బహుశా ఆ కుక్కలు ఈ ఇరువురిపై దాడి చేసేందకు యత్నించి ఉండొచ్చు, ఆమె తన కొడుకుని కాపాడే ప్రయత్నంలో ఆ కుక్కల దాడిలో బలై ఉండొచ్చని భావిస్తున్నారు. దీని గురించి తెలుసుకున్న ఆ కుక్కల యజమాని తాను ఇంకా షాక్‌లోనే ఉన్నానని, నాకు చనిపోవాలనిపిస్తుందంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.
(చదవండి: 28 ఏళ్లకే తొమ్మిది మందికి జన్మనిచ్చిన మహిళ..వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment