అడవుల్లో జంతువుల మధ్య పెరిగిన మనుషుల గురించి కథకథలుగా విన్నాం. అంతెందుకు కొన్ని జంతువులు పసిపిల్లలను ఎత్తుకు పోయి పెంచడంతో వాళ్లు ఆయా జంతువుల్లానే ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. అందుకు సంబంధించిన టార్జాన్, మోగ్లీ వంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యియి కూడా. నిజజీవితంలో అలాంటి వాళ్లను చూసి ఉండటం కాదుకదా! విని ఉండం కూడా. ఇప్పుడూ చెప్పబోయే మహిళ రియల్ లైఫ్ మోగ్లీ లేదా టార్జాన్ అనొచ్చు. పైగా ఇప్పటికీ ఆమెలో ఆ జంతు లక్షణాలు పోలేదు. ఆ టార్జాన్ విమెన్ గాథ వింటే..మనసు కకలావికలం అయ్యిపోతుంది. లోకంలో ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారా? అనిపిస్తుంది.
ఉక్రెయిన్ చెందిన ఆక్సానా మలయా అనే 40 ఏళ్ల మహిళ బాల్యంలో కుక్కల మధ్యే పెరిగింది. వాటిలానే ఉండటం, తినడం, మొరగడం వంటివన్నీ చేసింది. ఎంతలా అంటే ఆమె 'మానవ కుక్కేమో'! అని అనిపించేలా ఉండేది ఆమె ప్రవర్తన. మలయా తల్లిదండ్రులు మధ్యానికి బానిసలయ్యి ఆమె పసిపాపగా ఉన్నప్పటి నుంచి ఆమె బాగోలు సరిగా చూడలేదు. సరిగ్గా మూడేళ్ల వయసులో తల్లిదండ్రుల నుంచి దక్కాల్సిన ప్రేమానురాగాలకి నోచుకోకపోగా ఆమె ఆలనా పాలనాని గాలోకి వదిలేసి అత్యంత హేయంగా ప్రవర్తించేవారు. ఒక రోజు గజగజలాడే చలిలో ఆమెను బయటే వదిలేసి మద్యం మత్తులో తలుపులు వేసుకుని ఇంటి లోపలికి వెళ్లిపోయారు.
ఆ కటిక చలిలో వణికిపోతూ ఏం చేయాలో దిక్కు తోచక అక్కడే ఉన్న పెంపుడు కుక్కల బోనులో తలదాచుకుంది. ఇక అక్కడే నిద్రపోయింది. వాటితోనే ఉండేది. అవేలా తింటున్నాయి అలానే తినడం, మొరగడం వంటివి చేయడం చేసింది. అంటే ఇక్కడ తల్లిదండ్రులు కూతురు ఏమయ్యిందనేది గాలికి వదిలేశారు. కనీసం ఎక్కడుందన్న ఆరా కానీ ఏమీలేదు. కొన్ని రోజులకు ఆ ఇద్దరు తల్లిదండ్రులు ఎవరీ దారి వారు చూసుకుని వెళ్లిపోయారు. దీంతో ఆ చిన్నారి అలా 9 ఏళ్లు వచ్చే వరకు ఆ కుక్కలే లోకంగా పెరిగింది. ఆ కుక్కలు ఆ చిన్నారికి ఆత్మీయులుగా మారిపోయాయి. ఆ చిన్నారితో ఓ తోటి కుక్క మాదిరిగా స్నేహంగా మెలిగేవి ఆ కుక్కలు. ఇదంతా గమనించిన ఇరుగపొరుగు ఆ కుక్కల బోను నుంచి ఆ చిన్నారిని తీద్దామనుకున్నా ఆ కుక్కలు ఊరుకునేవి కావు.
పోనీ ఆ అమ్మాయితో సంభాషిద్దామన్నా ఆమె కుక్కలానే మొరుగుతూ సమాధానమివ్వడంతో వారంతా గందరగోళానికి గురయ్యేవారు. ఇక లాభం లేదనుకుని స్థానికులు ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. ఇక ఉక్రెయిన్ అధికారులు రంగంలోకి దిగి ఆమెను కాపాడేందుకు యత్నించగా..అక్కడ ఉండే కుక్కల దండు అందుకు ఒప్పుకోలేదు. అవన్నీ ఒక్కసారిగా అధికారులపై విరుచుకుపడ్డాయి. దీంతో వాటికి ఆహారాన్ని ఎరగా చూపి వాటి దృష్టి మరల్చి ఆ చిన్నారిని రక్షించారు. వెంటనే ఆమె ఉక్రెయిన్ ఫోస్టర్ హోమ్‌కి తరలించారు. అక్కడ ఆ చిన్నారి రెండు కాళ్లపై నడవడం, సంభాషించడం నేర్చుకుంది. అయితే ఆమె కుక్కల మధ్య ఊహ తెలిసినప్పటి నుంచి పెరగడంతో ఆమెలో కుక్కలాంటి లక్షణాలు చాలా వరకు పోలేకపోవడం గమనార్హం.
ఆమె మానసిక స్థితి ఆరేళ్ల పాపలా ఉందని వైద్యుల తేల్చి చెప్పారు. ఆమె ఎప్పటికీ చదవలేదని తేల్చి చెప్పారు మానసిక వైద్యులు లిన్ ఫ్రై. ఎందుకంటే ఐదేళ్ల లోపు భాష నేర్చుకోకపోతే చదవడం అనేది కష్టమవుతుందని అన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సరిగ్గా 2000 సంవత్సరంలో తన తల్లిదండ్రులను కలుసుకుంది మలయా. బహుశా అప్పటికీ ఆ నిర్లక్షపూరిత తల్లిదండ్రులకు కూతురు గుర్తోచ్చింది కాబోలు. విధి కలిపిందో లేక ఆ తల్లిదండ్రులకు జ‍్క్షానోదయం అయ్యిందో గానీ మళ్లీ ఆ కుటుంబ అంతా ఒక్కచోటకు చేరింది. ఇలాంటి దిగ్భాంతికర ఘటనలకు సంబంధించిన వంద కేసుల్లో సదరు చిన్నారి ఆక్సానా మలయా కేసు ఒకటని అధికారులు చెబుతున్నారు.
(చదవండి: రష్యా డాన్స్ ఇంత అందంగా ఉంటుందా?)
Comments
Please login to add a commentAdd a comment