infront of
-
దారుణం: చిన్నారి ఏడుస్తున్నా.. తండ్రిపై కర్రలతో.. వీడియో వైరల్..
చంఢీగర్: పంజాబ్‌లో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ వక్తిపై కొందరు యువకులు కర్రలతో దాడి చేశారు. బాధితుని చేతిలో చిన్న కుమారుడు ఉన్నాడనే విచక్షణ కూడా లేకుండా కర్రలతో చితకబాదారు. పక్కనే ఉన్న కుర్రాడు ఏడుస్తున్నా కనికరం లేకుండా బాధితునిపై దాడి చేశారు. ఈ ఘటన పంజాబ్‌లోని మాన్సాలో జరిగింది. ఉదయం సమయంలో బాధితుడు తన పిల్లాడ్ని స్కూల్ వద్ద దింపడానికి బైక్‌పై వచ్చాడు. పాఠశాల వద్ద అలా ఆపాడో లేదో.. అప్పటికే వెంబడించిన కొంతమంది యువకులు అతనిపై దాడి చేశారు. కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు. బాధితుడు తిరుగుబాటు చేయకుండా ఓ వ్యక్తి.. అతన్ని బిగ్గరగా పట్టుకున్నాడు. మిగిలిన వ్యక్తులు దాడి చేశారు. పక్కనే ఉన్న బాధితుని కుమారుడు ఏడుస్తున్నా.. నిందితులు పాశవికంగా కొట్టారు. Visuals from Mansa where due to personal rivalry, six people broke both legs of a person who had come to drop his son off at school. They had a previous dispute as well, and earlier also an FIR under section 307 has been registered against them. pic.twitter.com/JEohspw5P8 — Gagandeep Singh (@Gagan4344) August 10, 2023 నిందితులు దాడి చేస్తున్నా పక్కనే ఉన్న అందరూ చూస్తున్నారు తప్పా.. వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. నిందితులు వెళ్లిపోయాక ఓ మహిళ.. బాధితున్ని లేపి ఆస్పత్రికి తరలించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: పంజాబ్‌లో దారుణం.. ఇంట్లో చెప్పకుండా వెళ్లిందన్న కోపంలో ఓ తండ్రి ఘాతుకం -
కొడుకు కళ్లఎదుటే కన్న తల్లిపై కుక్కల దాడి..సాయం కోసం వెళ్లేలోపే..
కుక్కలకు ఆహారం పెట్టేందుకు అని కొడుకుని తీసుకుని వెళ్లింది ఓ మహిళ. ఊహించని రీతిలో ఒక్కసారిగా ఆ కుక్కలు ఆమెపై దాడి చేయడం ప్రారంభించాయి. భయంతో బిక్కుబిక్కుమంటూ బయటకు వచ్చిన ఆమె కొడుకు సాయం కోసం సోదరడుకి ఫోన్ చేసేందుకు యత్నించాడు. కానీ ఆమె అప్పటికే అతడి తల్లి ఆ కుక్కుల దాడిలో చనిపోయింది. ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..పెన్సిల్వేనియాకు చెందిన 38 ఏళ్ల మహిళ, తన పొరుగింటి వారి రెండు పెద్ద కుక్కులకు ఆహారం పెట్టేందుకు వెళ్లింది. నిజానికి పక్కంటి వారు ఊరులో లేకపోవడంతో వాటి బాగోగోలు ఆమెకు అప్పచెప్పడంతో వాటి ఆలనపాలన చూస్తోంది. ఎప్పటిలానే ఆ రోజు కూడా ఆమె తన చిన్న కొడుకుని తోడుగా తీసుకుని వాటికి ఆహారం పెట్టేందుకు వెళ్లింది. ఏమైందో ఏమో ఒక్కసారిగా ఆమెపై కుక్కలు దాడి చేశాయి. దీంతో అతడు తన తల్లిన రక్షించుకునేందుకు బయటకు వచ్చి తన అన్నకు కాల్ చేసే యత్నం చేశాడు. కానీ ఆమె అప్పటికే ఆ కుక్కల దాడిలో మరణించింది ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ఆ కుక్కలను అదుపు చేసి బాధితురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బహుశా ఆ కుక్కలు ఈ ఇరువురిపై దాడి చేసేందకు యత్నించి ఉండొచ్చు, ఆమె తన కొడుకుని కాపాడే ప్రయత్నంలో ఆ కుక్కల దాడిలో బలై ఉండొచ్చని భావిస్తున్నారు. దీని గురించి తెలుసుకున్న ఆ కుక్కల యజమాని తాను ఇంకా షాక్‌లోనే ఉన్నానని, నాకు చనిపోవాలనిపిస్తుందంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. (చదవండి: 28 ఏళ్లకే తొమ్మిది మందికి జన్మనిచ్చిన మహిళ..వీడియో వైరల్) -
ఆంధ్రా ఉద్యోగులూ.. గోబ్యాక్
రామగుండం : స్థానిక విద్యుత్ కేంద్రాలలో పనిచేస్తున్న ఆంధ్రా ప్రాంత ఉద్యోగులను స్వస్థలాలకు పంపించి అక్కడి తెలంగాణ ఉద్యోగులను సత్వరమే రిలీవ్ చేయాలని కోరుతూ శుక్రవారం స్థానిక బీ థర్మల్ జెన్కో కేంద్రం ఎదుట ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు గడుస్తున్నా.. కొన్ని విద్యుత్ కేంద్రాలలో ఇంకా ఆంధ్ర ప్రాంత ఉద్యోగుల పెత్తనమే కొనసాగుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర చర్చలు జరిపి స్థానికత ఆధారంగా ఉద్యోగులను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇంజినీర్ల సంఘం (టీఎస్‌పీఈఏ) ప్రతినిధులు డి.శంకరయ్య, కిష్టయ్య, చంద్రశేఖర్, కిషన్, రామ్‌కిషోర్, రాజేశ్వర్, ఖాజా, చైతన్య, కిరణ్‡కుమార్, పల్లవి, స్వాతి, స్పందన, అనిల్, శ్రద్ధానంద్, మధుశ్రీ తదితరులు పాల్గొన్నారు.