neighbours
-
బక్రీద్ వేళ మేకలను ఇంటికి తెచ్చాడని.. అపార్ట్‌మెంట్‌వాసుల ఆందోళన..
ముంబయి: బక్రీద్ పండగ వేళ మేకలను అపార్ట్‌మెంట్‌కు తీసుకురావడంపై నిర్వాసితులు నిరసన చేపట్టారు. ముంబయిలోని భయందర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మేకలను అపార్ట్‌మెంట్‌కు తీసుకురాకూడదని స్థానికులు ఆందోళన నిర్వహించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. బక్రీద్ పండగ వేళ ఎవరూ మేకలను అపార్ట్‌మెంట్‌కు తీసుకురాకూడదని రెసిడెన్షియల్ సొసైటీ నిర్ణయించింది. దీంతో బిల్డర్ కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అందరికీ విన్నవించారు. కానీ అపార్ట్మెంట్లో ఓ వ్యక్తి మేకను ఇంటికి తీసుకువచ్చాడు. దీంతో అపార్ట్మెంట్ వాసులు ఆందోళన నిర్వహించారు. మేకలను ఇంట్లోకి తీసుకురావద్దు.. అపార్ట్మెంట్లో మేకలను వధించవద్దని నినాదాలు చేపట్టారు. Uproar over goats in Mumbai Housing Society. (@pankajcreates)#Mumbai #News #ITVideo #FirstUp pic.twitter.com/ScHHzMsRIz — IndiaToday (@IndiaToday) June 28, 2023 దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. బక్రీద్ పండగకు ఒక రోజు ముందు మేకలను ఇంట్లో ఉంచుకుంటారని.. అపార్ట్మెంట్లో వధించబోరని పోలీసులు తెలిపారు. చివరికి మేకలను అపార్ట్మెంట్లో నుంచి బయటకు పంపడంతో అంతా సద్దుమణిగింది. ఇదీ చదవండి: వేలాది పక్షుల మృతి.. పురుగు మందులే కారణం? -
కొడుకు కళ్లఎదుటే కన్న తల్లిపై కుక్కల దాడి..సాయం కోసం వెళ్లేలోపే..
కుక్కలకు ఆహారం పెట్టేందుకు అని కొడుకుని తీసుకుని వెళ్లింది ఓ మహిళ. ఊహించని రీతిలో ఒక్కసారిగా ఆ కుక్కలు ఆమెపై దాడి చేయడం ప్రారంభించాయి. భయంతో బిక్కుబిక్కుమంటూ బయటకు వచ్చిన ఆమె కొడుకు సాయం కోసం సోదరడుకి ఫోన్ చేసేందుకు యత్నించాడు. కానీ ఆమె అప్పటికే అతడి తల్లి ఆ కుక్కుల దాడిలో చనిపోయింది. ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..పెన్సిల్వేనియాకు చెందిన 38 ఏళ్ల మహిళ, తన పొరుగింటి వారి రెండు పెద్ద కుక్కులకు ఆహారం పెట్టేందుకు వెళ్లింది. నిజానికి పక్కంటి వారు ఊరులో లేకపోవడంతో వాటి బాగోగోలు ఆమెకు అప్పచెప్పడంతో వాటి ఆలనపాలన చూస్తోంది. ఎప్పటిలానే ఆ రోజు కూడా ఆమె తన చిన్న కొడుకుని తోడుగా తీసుకుని వాటికి ఆహారం పెట్టేందుకు వెళ్లింది. ఏమైందో ఏమో ఒక్కసారిగా ఆమెపై కుక్కలు దాడి చేశాయి. దీంతో అతడు తన తల్లిన రక్షించుకునేందుకు బయటకు వచ్చి తన అన్నకు కాల్ చేసే యత్నం చేశాడు. కానీ ఆమె అప్పటికే ఆ కుక్కల దాడిలో మరణించింది ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ఆ కుక్కలను అదుపు చేసి బాధితురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బహుశా ఆ కుక్కలు ఈ ఇరువురిపై దాడి చేసేందకు యత్నించి ఉండొచ్చు, ఆమె తన కొడుకుని కాపాడే ప్రయత్నంలో ఆ కుక్కల దాడిలో బలై ఉండొచ్చని భావిస్తున్నారు. దీని గురించి తెలుసుకున్న ఆ కుక్కల యజమాని తాను ఇంకా షాక్‌లోనే ఉన్నానని, నాకు చనిపోవాలనిపిస్తుందంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. (చదవండి: 28 ఏళ్లకే తొమ్మిది మందికి జన్మనిచ్చిన మహిళ..వీడియో వైరల్) -
'కుక్క' అన్న పిలుపు విషయమై తలెత్తిన వివాదం..చివరికి..
చిన్న మాట పట్టింపు కాస్త చివరికి హత్యకు దారితీయడం బాధకరం. వారి మధ్య ఉన్న వివాదం పెద్దది కూడా కాదు. కేవలం తమ ఇగోతో ప్రస్టేజ్‌లకు పోయి చంపుకునేంత వరకు వెళ్లి చివరికి కటకటాల పాలవ్వు తున్నారు. అచ్చం అలాంటి ఘటనే తమిళనాడులోని దిండుగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..తమిళనాడులోని ఉలగంపట్టియార్‌కొట్టంలె నిర్మలా ఫాతిమా రాణి, ఆమె కుమారులు డానియల్, విన్సెంట్‌తో కలిసి ఉంటోంది. వీళ్లకు ఓ పెంపుడు కుక్కడ ఉంది. అయితే వాళ్ల పొరుగింట్లో ఉండే రాయప్పన్(62).. దానిని పేరుతో కాకుండా కుక్క అని సంభోధిస్తూ వస్తున్నాడు. ఇది నచ్చక పలుమార్లు రాయప్పన్ హెచ్చరించారు ఫాతిమా కుటుంబ సభ్యులు. అయినప్పటికీ రాయప్పన్ అలానే పిలుస్తుండేవాడు. ఈ క్రమంలో.. ఒక రోజు పొలంలోని నీళ్ల పంపు ఆపేయమని రామప్పన్ తన కొడుకు కెల్విన్‌కి చెప్పాడు. దీంతో అతను వెళ్లేందుకు సిద్ధమవ్వగా.. ఆ పొలం పరిసరాల్లో కుక్కు ఉంటుందని అందువల్ల కర్రను కూడా తీసుకుని వెళ్లమని చెబుతుండగా.. ఆ మాట విన్న డానియల్ కోపంతో నా పెంపుడు కుక్కను ‘కుక్క’ అంటావా అంటూ దూకుడుగా మీదకు వచ్చాడు.ఆ తర్వాత రాయప్పన్ ఛాతిపై బలంగా ఒక పంచ్ విసిరాడు. దీంతో అక్కడికక్కడే రామప్ప కుప్పకూలిపోయి చనిపోయాడు. ఈ హఠాత్పరిణామనికి భయంతో డేనియల్ అతని కుటుంబంతో సహా పరారయ్యాడు. బాధితుడు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందుతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత పోలీసులు తీవ్రంగా గాలించి.. నిర్మలా రాణి తోసహా ఆమె కుమారులను పట్టుకుని అరెస్టు చేశారు. (చదవండి: ఎయిర్ ఇండియా మూత్ర విసర్జన ఘటన: వెలుగులోకి కీలక ఈమెయిల్స్) -
‘దొంగ’ పిల్లి.. ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. రోజుకు ఐదారు..
న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నగర శివార్లలో నివపించే గిన్నీ, డేవిడ్ దంపతులు పెంచుకుంటున్న ఐదేళ్ల నల్లపిల్లి ఇది. పేరు.. కీత్. దీని ‘దొంగ’బుద్ధితో ఇరుగుపొరుగు వారికి భలే చిక్కొచ్చిపడింది. అర్ధరాత్రులు నిశ్శబ్దంగా చుట్టుపక్కల వాళ్ల ఇళ్లలోకి జొరబడటం... కంటపడ్డ వస్తువులను పట్టుకొచ్చేయడం దీనికి అలవాటు. బూట్లు, స్విమ్ సూట్లు, గ్లౌజ్‌లు, మహిళల లోదుస్తులు, ఓ పోలీసు అధికారి షర్టు, ఈల్ చేపలు... ఇలా చాలానే యజమానుల ఇంటికి తెచ్చేస్తోంది. మూడేళ్లుగా దీనికి ఈ అలవాటున్నా... ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. రోజుకు ఐదారు వస్తువులను కొట్టుకొస్తోంది. ఇటీవల గంజాయి పీల్చే హుక్కా లాంటి ఓ గాజు పరికరం, తెల్లటి పొడితో నిండిన చిన్న బ్యాగును పట్టుకొచ్చేసింది. దాంతో దీని ఘనకార్యాలు పోలీసులకూ తెలిశాయి. అవి ఎక్కుడునుంచి తెచ్చిందో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసోళ్లు. ఎంతైనా ఐదేళ్ల నుంచి పెంచుకుంటున్న పెంపుడు పిల్లి కాబట్టి గిన్నీ, డేవిడ్‌లు దీన్ని కట్టడి చేయలేక... ఇరుగుపొరుగుతో ఇబ్బందులు రాకూడదని ఓ ఆలోచన చేశారు. తమ ఇంటి ఆవరణలో ఓ ప్లాస్టిక్ బుట్ట పెట్టి... కీత్ ఎత్తుకొచ్చేస్తున్న వస్తువులను అందులో ఉంచుతున్నారు. ఇరుగుపొరుగు తమ ఇంట్లో బూట్లు, ఇతర ఏదైనా వస్తువులు కనపడకపోతే ఇక్కడికొచ్చి... బుట్టలో వెతికి పట్టుకుపోతున్నారు. ఇదీ ఈ దొంగపిల్లి కథ. -
పక్కింటి వారి వేధింపులు.. ఆటోడ్రైవర్ ఆత్మహత్య
సాక్షి, మందమర్రిరూరల్(ఆదిలాబాద్): పట్టణంలోని పాటచెట్టు ప్రాంతానికి చెందిన కాదాసి సమ్మయ్య (49) అనే ఆటోడ్రైవర్ మంగళవారం మందమర్రి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పక్కన ఉన్న వారితో జరిగిన గొడవ కారణంగా మనస్తాపం చెంది, తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్ సంపత్ తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా.. పక్కింటి వారి వేధింపులతోనే సమ్మయ్య ఆత్మహత్య చేసుకున్నాడని, మంగళవారం రాత్రి మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ధర్నాకు దిగారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ ప్రమోద్‌రావు బాధిత కుటుంబంతో మాట్లాడారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి, న్యాయం చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పురుగుల మందు తాగి యువకుడు.. సిర్పూర్(యూ)(ఆసిఫాబాద్): మండలంలోని మహగాం గ్రామ పంచాయతీ పరిధిలో గల అలిగూడకు చెందిన మంగం వెంకట్రావ్ (23) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. అప్పులు పెరిగిపోవడం, వ్యక్తిగత కారణాలతో సోమవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఉట్నూర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య జారుబాయి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రి వాగు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెల్లడించారు. -
కొడుకును కొడుతున్న దృశ్యాలను .. కూతురుతో తీయించి..
సాక్షి, చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): కుమారుడు అల్లరి చేస్తున్నాడని ఇరుగు పొరుగు వారు చెప్పడంతో సహనం కోల్పోయిన ఓ వ్యక్తి తన ఎనిమిదేళ్ల కొడుకును చితకబాదాడు. ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. తన కుమారుడికి భయం చెబుతున్నానని.. అందరికీ చూపించేందుకు సదరు వ్యక్తి తన కూతురుతోనే కొట్టే దృశ్యాలను వీడియో తీయించి, ఇరుగు పొరుగు వారికి పంపడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లాల్‌దర్వాజాలోని నాగం కాంప్లెక్స్‌లో కర్ణాటక చెందిన అశోక్ ఘంటే భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడి ఎనిమిదేళ్ల కుమారుడు అల్లరి చేస్తున్నాడని ఇరుగు పొరుగు వారు పలుమార్లు చెప్పడంతో శనివారం మధ్యాహ్నం కొడుకును కర్రతో ఇష్టానుసారంగా చితకబాదాడు. వీడియోను చూసిన అతడి భార్య ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
దారుణం: ఇద్దరు మహిళల మధ్య గొడవ ఎంత పనిచేసింది..
సాక్షి, వర్ధన్నపేట(వరంగల్): ఇద్దరు మహిళలు గొడవపడుతుండగా.. ఆపడానికి వెళ్లిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన వర్ధన్నపేట పట్టణ పరిధి డీసీ తండా శివారు నీలగిరి తండాలో చోటుచేసుకుంది. వర్ధన్నపేట ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. నీలగిరి తండాకు చెందిన బానోతు కిషన్(50) కొంత కాలంగా అనారో గ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కిష న్ భార్య దుభిలి ఇంటి పక్కనే ఉన్న బానోతు గమిలీతో గురువారం గొడవ పడింది. ఈ క్రమంలో గొడవను ఆపేందుకు వెళ్లిన కిషన్‌ను గమిలీ నెట్టడంతో ప్రమాదవశాత్తు కింద పడ్డా డు. అతడిని వరంగల్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి భార్య దుభిలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పక్కింటివాళ్లతో గొడవ.. 12వ అంతస్తు నుంచి దూకిన మహిళ
ముంబై: అసలే భర్తను కోల్పోయి బాధలో ఉంది. ఏడేళ్ల కుమారుడిని ఒంటరిగా ఎలా పెంచాలా అని భయపడుతుంది. ఈ సమయంలో మద్దతుగా నిలవాల్సిన ఇరుగుపొరుగు వారు.. ఆమెను ఇబ్బందులకు గురి చేయసాగారు. దాంతో డిప్రెషన్‌కు గురైన బాధితురాలు కొడుకుతో కలిసి 12వ అంతస్తు మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ముంబై, చండీవాలి అపార్ట్మెంట్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. చండీవాలి అపార్ట్మెంట్లో నివసిస్తున్న ట్రెంచిల్ అనే మహిళ భర్త కొద్ది రోజుల క్రితం కోవిడ్ వల్ల మరణించాడు. ఈ క్రమంలో ట్రెంచిల్ తన ఏడేళ్ల కుమారుడితో కలిసి ఒంటరిగా నివస్తుంది. భర్తను కోల్పోయిన బాధ నుంచి ఇంకా తేరుకోలేదు. ఈ సమయంలో మద్దతుగా ఉండాల్సిన ఇరుగుపొరుగు వారు ఆమెతో గొడవకు దిగారు. ట్రెంచిల్ కుమారుడు గొడవ చేస్తూ.. తమను ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించారు. అప్పటికే విషాదంలో ఉన్న ట్రెంచిల్ వారి మాటలతో మరింత బాధపడింది. డిప్రెషన్‌కు గురయ్యింది. ఈ క్రమంలో సోమవారం ఆమె, ఏడేళ్ల కుమారుడితో కలిసి తాను ఉంటున్న అపార్టమెంట్‌లోని 12వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పొరుగింట్లో ఉండే వ్యక్తి తనను సతాయిస్తున్నాడని.. ప్రతి దానికి తనతో గొడవపడుతున్నాడని.. అతడి వేధింపులు తట్టుకోలేకే ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నాని ఆరోపిస్తూ సూసైడ్ నోట్ రాసి పెట్టింది. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. దానిలో ఉన్న దాని ప్రకారం ట్రెంచిల్ పొరుగింటి వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చదవండి: పీటర్ పాన్ సిండ్రోమ్: అత్యాచార నిందితుడికి బెయిల్ -
ఆ జంటకు కాలనీవాసులే కళ్లయ్యారు
సాక్షి, బంజారాహిల్స్ (హైదరాబాద్): ఆ జంటకు కాలనీవాసులే కళ్లయ్యారు.. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు.. మేం నడిపిస్తాం.. మీరు నడవండంటూ ఏడడుగులు నడిపించారు.. కళ్లు లేని వారంటే సమాజంలో చిన్న చూపుందనేది నాటిమాట.. కానీ నేటి సమాజానిది పెద్దచూపు.. ఆ కాలనీవాసులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల ముందు చూపు, పెద్ద మనసుతో కళ్లు లేని జంట పెళ్లిని కనులపండువగా నిర్వహించారు. పుట్టుకతోనే కళ్లులేని వారిని చేరదీసి వారిని పెంచి, పెద్ద చేసి చదివించి వారికి నచ్చిన రంగాల్లో శిక్షణ ఇప్పించి ఓ ఇంటివారిని చేస్తే అంతకు మించిన తృప్తి, ఆనందం ఇంకేముంటుంది చెప్పండి.. శ్రీనగర్‌కాలనీలోని కేశవనగర్ సరస్వతి విద్యామందిర్‌లో ఆకాశమంత పందిరిలో వేద మంత్రాల సాక్షిగా, కాలనీవాసుల ఆనందోత్సాహాల మధ్య ఆదివారం ఉదయం ఓ అంధ జంట ఒక్కటయ్యారు.. చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్ చేతులమీదుగా జరిగిన ఈ వివాహానికి స్థానిక కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. చదవండి: గన్నీ బ్యాగులో మృతదేహం.. ఇంకా మిస్టరీలే! ► నిఖిల్, రాణి ఇద్దరూ పుట్టుకతోనే కళ్లు లేని వారు.. వారిని ఇట్రాయిడ్ అనే సంస్థ చేరదీసి ఇంటర్ వరకు చదివించింది. వీరికి వ్రిశాంక ఫైన్ ఆర్ట్స్ సంస్థ మ్యూజిక్‌లో, పాటలు పాడటంలో శిక్షణనిచ్చారు. నిఖిల్ సింగర్‌గా స్థిరపడ్డాడు. రాణి డిగ్రీ వరకు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతోంది. ► ఇద్దరూ చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో ఒకే కాలేజీలో చదువుకుంటూ ఒకరిని ఒకరు ఇష్టపడటంతో పాటు పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించారు. ఇదే విషయాన్ని ఇట్రాయిడ్ సంస్థ ఫౌండర్ మధుకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ► వెంటనే వ్రిశాంక ఫైన్ ఆర్ట్స్ సంస్థ బంగారు లక్ష్మణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీరిద్దరిని ఆదివారం రోజు ఒక్కటి చేశారు. వీరి పెళ్లి కేశవ్‌నగర్ కాలనీవాసులతో పాటు చాలామంది రకరకాలుగా సహాయ సహకారాలు అందించారని వ్రిశాంక ఫైన్ ఆర్ట్స్ సంస్థ ఫౌండర్ బంగారు కవిత తెలిపారు. ► పెళ్లి కోసం సుమారు రూ.4 లక్షల వరకు ఖర్చు చేసినట్లు వారు తెలిపారు. అంధుల పెళ్లి విషయాన్ని తెలుసుకొని తానే స్వయంగా వచ్చినట్లు చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ తెలిపారు. ► మ కాలనీలో జరుగుతున్న వివాహం గురించి తెలుసుకున్న ఆ కాలనీవాసులు తమ ఇంట్లో వారి వివాహంలో చేసినట్లుగా పెళ్లిలో కోలాహలంగా గడిపారు. వివాహం తర్వాత వారికి సహకారం అందిస్తామని భరోసానిచ్చారు. -
ఎంత అదృష్టవంతులో.. రూ.55 కోట్లు కలిసొచ్చింది
బెర్లిన్: లాటరీ తగిలి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిన వారి గురించి విన్నాం.. విలువైన వజ్రాలు, సంపద దొరికి ధనవంతులు అయిన వారిని చూశాం. కానీ వారసులు లేకుండా మరణించడంతో ఆ సంపద మొత్తం ఇరుగుపొరుగు వారికి కలిసివచ్చి కోటీశ్వరులు అయిన వారి గురించి ఎప్పుడైనా విన్నారా లేదు కదా. కానీ ఈ సంఘటన వాస్తవంగా చోటు చేసుకుంది. ఆ వివరాలు.. మధ్య జర్మనీకి చెందిన రెడెట్ వెడెల్ తన భర్త ఆల్ఫ్రెడ్ వెడెల్తో కలిసి 1975 నుంచి హెస్సీ ప్రాంతంలో నివసిస్తుంది. ఈ క్రమంలో 2014లో ఆల్ఫ్రేడ్ మరణించాడు. ఆ తర్వాత గతేడాది డిసెంబర్లో రెడెట్ కూడా మరణించింది. ఈ దంపతుల పేరు మీద భారీగా బ్యాంక్ బాలెన్స్, విలువైన షేర్లు, వస్తువులు ఉన్నాయి. అయితే వీటన్నింటికి వారసురాలిగా రెడెట్ తన చెల్లిని నియమించింది. కానీ దురదృష్టం కొద్ది ఆమె కూడా మరణించింది. (చదవండి: ఉద్యోగులకు బంపర్ బోనస్.. అయితే..) దాంతో రెడెట్ ఆస్తికి వారసులు ఎవరూ లేకుండా పోయారు. ఇదే కాక వైపర్ఫెల్డెన్లో రెడెట్కి చెందిన ఓ ఇంటిని స్థానిక మున్సిపాలిటీ వారసత్వంగా పొందింది. కానీ ఆ బిల్డింగ్, దాని చుట్టు పరిసరాలను నిర్వహించడం కష్టంగా మారడంతో మున్సిపాలిటీ తన వారసత్వాన్ని వదిలేసుకుంది. ఈ క్రమంలో మొత్తం 7.5 మిలియన్ అమెరికన్ డాలర్ల సంపదకు(55,34,89,125 రూపాయలు) వారసులు ఎవరు లేకుండా పోయారు. దాంతో స్థానిక మున్సిపాలిటీ ఆ సంపదను ఇరుగుపొరుగు వారికి వారసత్వంగా ఇచ్చింది. ప్రస్తుతం దీన్ని వారు "కమ్యూనిటీ సౌకర్యాలు, మౌలిక సదుపాయాల" అభివృద్ధి కోసం వినియోగిస్తున్నారు. -
పొరుగింటామెను అరెస్ట్ చేయండి: రియా
ముంబై: తనపై తప్పుడు ఆరోపణలు చేసి కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన పొరుగింటావిడ డింపుల్ తవానిపై చర్యలు తీసుకోవాలని రియా చక్రవర్తి సీబీఐకిలేఖ రాసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య విషయంలో రియా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు అంటే జూన్ 13న రియాను తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి సుశాంత్ వచ్చాడని డింపుల్ ఒక మీడియాతో చెప్పారు. అయితే ఆమె సీబీఐ విచారణలో నేను వారిని చూడలేదని ఎవరో చెబితే విన్నానని వెల్లడించారు. దీంతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసును తప్పుదోవ పట్టించడానికి చూసిన డింపుల్‌పై చర్యలు తీసుకోవాలని రియా సీబీఐని లేఖ ద్వారా కోరింది. మీడియా తన టీర్పీల కోసం తనను అపకీర్తి పాలు చేస్తోంది లేఖలో పేర్కొంది. ఇక సుశాంత్ కేసులో రియాను సీబీఐ సెప్టెంబర్‌లో అదుపులోకి తీసుకుంది. ఆమెకు అక్టోబర్7 వతేదీన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో అదుపులోకి తీసుకున్న రియా తమ్ముడు షోవిక్‌కు మాత్రం ఇంకా కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. ఇక రియా తరుపు న్యాయవ్యాది ఈ కేసులో మీడియా ముందు తప్పుడు ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల పేర్లు సీబీఐ ముందు ఉంచుతామని తెలిపారు. చదవండి: సుశాంత్ కేసు ఇంకెన్నాళ్లు..? -
మన ఊరి సంతోష్.. ఇంతపెద్ద నేరం చేశాడా?
ధర్మారం (పెద్దపల్లి) : నకిలీ వేలిముద్రల తయారీ పెద్దపల్లి జిల్లాలో కలకలం సృష్టించింది. జిల్లాలోని ధర్మారం మండల కేంద్రానికి చెందిన పాత సంతోష్ కుమార్ (38) చిన్న వయస్సులోనే వ్యాపారం చేస్తూ లాభాలు ఆర్జించేందుకు వక్రమార్గం ఎంచుకున్నాడు. తాను చేస్తున్న పని దేశద్రోహానికి పాల్పడుతున్నట్లు గుర్తించలేని ఆయన.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అక్రమ సంపాదన కోసం ఆధార్‌కార్డులో వేలిముద్రను సైతం మార్చి సిమ్‌కార్డులను విక్రయించడం సంచలనం రేకెత్తించింది. అతి సామాన్యుడిగా కనిపించే సంతోష్.. ఇంతపెద్ద నేరం చేశాడా అని స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ధర్మారం గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ ఏడవ తరగతి వరకు ధర్మారంలోనే చదువుకున్నాడు. 8వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు కరీంనగర్లో చదివాడు. అనంతరం ఇంజనీరింగ్ చదవాలని ప్రవేశపరీక్ష రాశాడు. ఇతర రాష్ట్రాల్లో సీటు రావడంతో మధ్యలోనే చదువు మానేసి వ్యాపారంలో దిగాడు. అప్పటికే తండ్రి గౌరయ్య చేస్తున్న అడ్తి వ్యాపారానికి సహకరించే సంతోష్ ధర్మారం శివారులో రెండు ఎకరాల వ్యవసాయ భూమిని లీజుకు తీసుకుని ఈముపక్షుల పెంపకం చేశాడు. ఇందులో దివాలా తీశాడు. చివరికి తన షెటర్‌లోనే ధనలక్ష్మి కమ్యూనికేషన్ పేరుతో వొడాఫోన్ ప్రీపెయిడ్ కనెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఎక్కువ కనెక్షన్స్ విక్రయిస్తే కమీషన్ ఎక్కువగా ఇస్తామని కంపెనీ టార్గెట్ పెట్టింది. దీంతో సంతోష్ ధర్మారం, వెల్గటూర్ కళాశాలలు, పాఠశాలల్లో సిమ్‌కార్డులు విక్రయించాడు. ఈ క్రమంలో బంధువులు, మిత్రుల ఆధార్ కార్డులను తీసుకునేవాడు. చివరికి ఆధార్‌కార్డులు లభించకపోవడంతో నకిలీ వేలిముద్రలకు పాల్పడినట్లు సమాచారం. చిన్నప్పటి నుంచే ప్రతి విషయంలో వివాదాస్పదంగా వ్యవహరించేవాడని మిత్రులు అంటుంటారు. కాగా.. సిమ్‌కార్డుల టార్గెట్ చేరేందుకు ఇతరుల వేలిముద్రలను తయారీ చేయటం పట్ల స్థానికులు నివ్వెరపోతున్నారు. -
మనస్తాపంతో యువతి ఆత్మహత్య
సాక్షి, నాగులుప్పలపాడు : తనపై అత్యాచారం యత్నం చేయడమే కాక నిందితుల బంధువులు కూడా సూటిపోటి మాటలు అనడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం ఉప్పుగుండూరులో చోటు చేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్న మద్దిపాడు ఎస్సై రాజేష్ సమాచారం మేరకు ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన లచ్చంశెట్టి వెంకటేశ్వర్లుకు నవ్య (20)తో 4 ఏళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి ఉప్పుగుండూరు గ్రామంలోనే నివాసం ఉంటున్నారు. అయితే ఈ నెల 1వ తేదీన తన ఇంటి సమీపంలోని సంగు వెంకటప్రసాద్, సాయి, మహేష్ అనే యువకులు నవ్య ఒక్కతే ఉన్న సమయంలో ప్రవేశించి అత్యాచార ప్రయత్నం చేశారు. ప్రతిఘటించిన ఆమె ఆ యువకులపై నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆ ముగ్గురు యువకుల తల్లులు గంగు పద్మ, భూదిరి పద్మ, అనమర్లపూడి సరోజినితో పాటు వారి బంధువులు సంగు వెంకటరత్నం, సైదులు, లక్ష్మీ అనే వారు నవ్య ఇంటిపైకి వచ్చి తీవ్రమైన పదజాలంతో దూషణ చేస్తున్నారు. తన పట్ల అవమానకరంగా ప్రచారం చేస్తున్నారని మనస్తాపం చెందిన నవ్య మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. తన మరణానికి కారకులైన వారి పై సూసైడ్ లేఖ రాసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఒంగోలు రిమ్స్‌కు తరలించగా మృతి చెందినట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై లైంగికదాడి
సాక్షి, పోలవరం రూరల్ : పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలోని గాజుల గొంది గ్రామంలో ఐదేళ్ల బాలికపై లైంగికదాడి జరిగింది. అదే గ్రామానికి చెందిన యువకుడు నేరం శేఖర్ బాలికకు మాయమాటలు చెప్పి అకృత్యానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి, పోలీసుల కథనం ప్రకారం.. గాజులగొందిలో ఆదివారం బాలిక ఆడుకుంటుండగా నేరం శేఖర్ బాలికకు లడ్డూలు ఇచ్చి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఏడుస్తూ వస్తుండగా తల్లి, చుట్టుపక్కలవారు ఎందుకు ఏమైందని ప్రశ్నించారు. చిన్నారి చెప్పక పోవడంతో లడ్డూ ఎక్కడిది, ఎవరిచ్చారని బాలికను అడగ్గా, శేఖర్ మావయ్య ఇచ్చాడని చెప్పింది. బాలికను పరిశీలించగా కాళ్ల వద్ద రక్తం కారడాన్ని గుర్తించారు. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్తులకు అనుమానం వచ్చి చిన్నారిని హుటాహుటిన పోలవరం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చారు. డాక్టర్లు జి.సుధాకర్, అక్కమాంబలు చిన్నారికి వైద్యపరీక్షలు నిర్వహించి లైంగిక దాడికి గురైనట్లు వెల్లడించారు. ఆస్పత్రికి డీఎస్పీ ఏటీవీ రవికుమార్, పోలవరం సీఐ ఎం.రమేష్‌బాబు, ఎస్సై కె.శ్రీహరిరావు చేరుకుని బాలికను పరిశీలించి వైద్యాధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. కాగా, బాలికను మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. -
ఇరుగమ్మ పొరుగమ్మ.. సంగతేంటమ్మా?
విషయం చదివిన తర్వాత షాక్ అవుతారేమో. కొంచెం కూల్ వాటర్ తాగి, ప్రశాంతంగా చదవండి. చెప్పబోయే విషయం అలాంటిది మరి. అసలు విషయం ఏంటంటే... 21 కోట్ల రూపాయలతో ఇల్లు కొనుక్కున్నారు అభిషేక్ బచ్చన్–ఐశ్వర్యా రాయ్. 21 కోట్లా? అని షాక్ అయ్యారు కదా. ఐశ్వర్యవంతులు ఇల్లంటే మజాకానా? అన్నేసి కోట్లు పోసి కొంటారు మరి. ముంబైలోని బాంద్రా– కుర్లా కాంప్లెక్స్‌లో ఈ జోడీ ఒక అపార్ట్మెంట్ తీసుకున్నారు. 2015లోనే ఈ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. 5500 చదరపు అడుగుల ఈ అపార్ట్మెంట్లో చదరపు అడుగు 38 వేలు అట. ఇక ఇంటీరియర్ డెకరేషన్ అయితే కళ్లు చెదిరేలా ఉంటుందట. ముంబైకి చెందిన ఫేమస్ ఇంటీరియర్ డిజైనర్స్ ‘తలటి పంతకీ అసోసియేట్స్’ (టి.పి.ఎ)తో చాలా లావిష్‌గా డిజైన్ చేయించుకున్నట్లు సమాచారం. మరి.. కొత్తింట్లోకి ఎప్పుడు షిఫ్ట్ అవుతారో చూడాలి. వీళ్ల పక్కింట్లో ఉండబోయేది ఎవరో తెలుసా? సోనమ్ కపూర్. ఈవిడగారి ఇంటి రేటు 35 కోట్లు అట. సరే.. కోట్లున్నాయి కాబట్టి కొన్నారు. అంతా బాగానే ఉంది. అయితే ఐష్‌కీ సోనమ్‌కీ పెద్దగా పడదు. ఓసారి ‘ఆంటీ’ అని ఐశ్వర్యను సోనమ్ పిలిచినందుకు ఐష్ ఫీలైపోయారు. అలాగే, కాన్స్ చిత్రోత్సవాల్లో ఇద్దరూ పాల్గొంటారు కాబట్టి, పోటీ ఫుల్‌గా ఉంది. మరి.. ఇరుగుపొరుగు కాబోతున్న ఈ ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటారో.. ఫ్రెండ్లీగా ఉంటారో చూడాలి. ఏం జరిగినా న్యూసే కదా. -
హీరోయిన్‌పై పొరుగువారి మండిపాటు
లాస్ ఏంజిల్స్: బ్రాడ్పీట్తో తెగదెంపులు చేసుకున్న హాలీవుడ్ హీరోయిన్ ఎంజెలీనా జోలీ ఇటీవల ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. లాస్ ఏంజిల్స్‌లోని లాస్ ఫెలిజ్ ఏరియాలో 25 మిలియన్ డాలర్లను వెచ్చించి మరీ ఆ ఇంటిని ఎంజెలీనా ముచ్చటపడి తీసుకుంది. వారం రోజుల కిందటే తన ఆరుగురు పిల్లలతో కలిసి ఎంజెలీనా ఆ ఇంటిలోకి వెళ్లింది. అయితే.. లాస్ ఫెలిజ్లోని పొరుగువారు మాత్రం ఎంజిలీనాపై మండిపడుతున్నారు. ఇంతకు ముందు ప్రశాంతంగా ఉన్న తమ ప్రైవేట్ ఎస్టేట్ కాస్తా హీరోయిన్ రాకతో గందరగోళంగా మారిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏంజిలీనా వచ్చిన దగ్గర నుంచి ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పెరిగిపోయిందని వాపోతున్నారు. అసలు అక్కడ ఎంజెలీనా ఇల్లు తీసుకోవడం ఏమాత్రం సరికాదని ఇరుగుపొరుగువారు అభిప్రాయపడుతున్నారు. ఇతర సెలబ్రిటీలు సైతం ఆ ప్రాంతంలో ఉంటున్నా.. ఎంజిలీనాపై ఉన్న ఎక్కువ అటెన్షన్ సమస్యలకు కారణమౌతున్నట్లు తెలుస్తోంది. -
పొరుగింటివారు తిట్టారని..
హైదరాబాద్ : ఇంటి పక్కవారు అకారణంగా తిట్టారని మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. హయత్‌నగర్ మండలం కొత్తగూడలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుజాత(21)కు ఆదివారం పొరుగింటివారితో గొడవ జరిగింది. ఈ సందర్భంగా వారు అనవసరంగా దుర్భాషలాడారంటూ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆస్పత్రికి తరలిస్తుండగానే ఆమె చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జుకర్ బర్గ్ పై ఇరుగు పొరుగుల ఆగ్రహం..!
ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు... బిలియనీర్ మార్క్ జుకర్ బర్గ్ పై ఇరుగు పొరుగులు విరుచుకు పడుతున్నారు. ఆయన చట్టవిరుద్ధంగా పార్కింగ్ ను వాడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతిపెద్ద కార్లను ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసి, కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బంది కలుగజేస్తున్నారంటూ వారు రాసిన లేఖ ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపుతోంది. శాన్ ఫ్రాన్సిస్కో లో నివసిస్తున్న ముఫ్ఫై ఏళ్ళ వ్యాపారవేత్త, ప్రపంచ ధనికుల్లో ఒకరైన మార్క్ జుకర్ బర్గ్ ఇప్పుడు స్థానికుల ఆగ్రహానికి గురౌతున్నారు. లిబర్టీ హిల్ కమ్యూనిటీలోని ఆయన ఇంటికి దగ్గరగా నివసిస్తున్న కొందరు.. జుకర్ వాహనాల పార్కింగ్ తీరును తప్పుబడుతున్నారు. ఆయన సెక్యూరిటీ సిబ్బంది... ఎప్పుడూ దారికి అడ్డంగా, చట్ట విరుద్ధంగా అతి పెద్ద రెండు సిల్వర్ కార్లను నిలిపి అత్యంత సమస్యను తెచ్చి పెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. రాంగ్ పార్కింగ్ తో తెచ్చిపెడుతున్న సమస్యను నగర రవాణా ఏజెన్సీకి, జుకర్ బర్గ్ ఇంటి భద్రతా మేనేజర్ టిప్ వెన్జెల్ కు ఫిర్యాదు చేశారు. అంతేకాక ఆయన లగ్జరీ హోమ్ కు సుదీర్ఘ కాలంపాటు పునరుద్ధరణ ప్రక్రియ చేపట్టడం కూడ కాలనీవాసులకు తలనొప్పిగా మారిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. జుకర్ బర్గ్ చాలాకాలంపాటు తమ ఇంటి నిర్మాణం కొనసాగించడంతో తీవ్రమైన శబ్దం, చెత్తతోపాటు, వీధుల్లో స్థలాన్ని ఆక్రమించడం స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని, ఇప్పటికే పౌరులుగా తాము సాధ్యమైనంత ఓపిక పట్టామని, చివరికి తమకిదో పరీక్షగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వీధిని ఆక్రమిస్తున్న ఆ రెండు ఎస్ యూ వీ (స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్) కార్లను తగిన పార్కింగ్ స్థలంలో ఉంచాలని వారు డిమాండ్ చేశారు. డాలర్స్ పార్క్ కు దగ్గరలోని జిల్లాలో ఆయనకు ఇంతకుముందే రాంగ్ పార్కింగ్ సమస్య వచ్చిందని, ఇప్పుడు అది స్ట్రీట్ పార్కింగ్ కు పాకిందని అంటున్నారు. జుకర్ బర్గ్ చట్ట విరుద్ధంగా పార్కింగ్ ఆక్రమణలకు పాల్పడుతున్నారని, ఇంతకు ముందుకూడ ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సమస్యకు పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
నమ్మించి దోచేసిన కుటుంబం
రాజాం (శ్రీకాకుళం): ఇంటి పక్కన వారే కదా అని నమ్మితే.. ఇంట్లోని డబ్బు, బంగారు ఆభరణాలను కొట్టేసి పరారైంది ఓ కిలాడీ కుటుంబం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రాజాం నగర పంచాయతీ పరిధిలోని కొండంపేటలో రుంకు వాసుదేవరావు.. భార్య పద్మశ్రీ, ఇద్దరు పిల్లలతో అద్దెకు ఉంటున్నారు. వారి పక్కనే మూడు నెలల క్రితం షేక్ అబీబుల్లా, భార్య లతీఫాలు తమ ఇద్దరు కుమార్తెలతో అద్దెకు దిగారు. వచ్చిన కొద్ది కాలంలోనే వారి మధ్య స్నేహం కుదిరింది.ఈ క్రమంలో పద్మశ్రీ ఇంట్లో ఉన్న సుమారు 25తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ.2.5లక్షల నగదు సమాచారాన్ని అబీబుల్లా, లతీఫా తెలుసుకున్నారు. కాగా ఎప్పటిలానే శుక్రవారం సాయంత్రం కూడా వారితో కలివిడిగా ఉండి, రాత్రి 10 గంటల అనంతరం వాసుదేవరావు, పద్మశ్రీ మిద్దెపైకి వెళ్లి నిద్రిస్తుండగా... వారి ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు పట్టుకుని అబీబుల్లా కుటుంబం ఆటోలో పరారయ్యారు. శనివారం ఉదయం నిద్రలేచిన వాసుదేవరావు, పద్మశ్రీ జరిగిన విషయాన్ని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.