ఇరుగమ్మ పొరుగమ్మ.. సంగతేంటమ్మా? | Aishwarya Rai and Abhishek Bachchan are moving next to Sonam Kapoor in this 21-crore apartment | Sakshi
Sakshi News home page

ఇరుగమ్మ పొరుగమ్మ.. సంగతేంటమ్మా?

Published Sun, Jan 7 2018 12:43 AM | Last Updated on Thu, Oct 4 2018 4:27 PM

Aishwarya Rai and Abhishek Bachchan are moving next to Sonam Kapoor in this 21-crore apartment - Sakshi

‌ఐశ్వర్యా రాయ్‌, సోనమ్‌ కపూర్

విషయం చదివిన తర్వాత షాక్‌ అవుతారేమో. కొంచెం కూల్‌ వాటర్‌ తాగి, ప్రశాంతంగా చదవండి. చెప్పబోయే విషయం అలాంటిది మరి. అసలు విషయం ఏంటంటే... 21 కోట్ల రూపాయలతో ఇల్లు కొనుక్కున్నారు అభిషేక్‌ బచ్చన్‌–ఐశ్వర్యా రాయ్‌. 21 కోట్లా? అని షాక్‌ అయ్యారు కదా. ఐశ్వర్యవంతులు ఇల్లంటే మజాకానా? అన్నేసి కోట్లు పోసి కొంటారు మరి. ముంబైలోని బాంద్రా– కుర్లా కాంప్లెక్స్‌లో ఈ జోడీ ఒక అపార్ట్‌మెంట్‌ తీసుకున్నారు. 2015లోనే ఈ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. 5500 చదరపు అడుగుల ఈ అపార్ట్‌మెంట్‌లో చదరపు అడుగు 38 వేలు అట. ఇక ఇంటీరియర్‌ డెకరేషన్‌ అయితే కళ్లు చెదిరేలా ఉంటుందట.

ముంబైకి చెందిన ఫేమస్‌ ఇంటీరియర్‌ డిజైనర్స్‌ ‘తలటి పంతకీ అసోసియేట్స్‌’ (టి.పి.ఎ)తో చాలా లావిష్‌గా డిజైన్‌ చేయించుకున్నట్లు సమాచారం. మరి.. కొత్తింట్లోకి ఎప్పుడు షిఫ్ట్‌ అవుతారో చూడాలి. వీళ్ల పక్కింట్లో ఉండబోయేది ఎవరో తెలుసా? సోనమ్‌ కపూర్‌. ఈవిడగారి ఇంటి రేటు 35 కోట్లు అట. సరే.. కోట్లున్నాయి కాబట్టి కొన్నారు. అంతా బాగానే ఉంది. అయితే ఐష్‌కీ సోనమ్‌కీ పెద్దగా పడదు. ఓసారి ‘ఆంటీ’ అని ఐశ్వర్యను సోనమ్‌ పిలిచినందుకు ఐష్‌ ఫీలైపోయారు. అలాగే, కాన్స్‌ చిత్రోత్సవాల్లో ఇద్దరూ పాల్గొంటారు కాబట్టి, పోటీ ఫుల్‌గా ఉంది. మరి.. ఇరుగుపొరుగు కాబోతున్న ఈ ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటారో.. ఫ్రెండ్లీగా ఉంటారో చూడాలి. ఏం జరిగినా న్యూసే కదా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement