సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం అంత ఈజీ కాదు. చాన్స్‌ల కోసం ఏళ్లుగా ఎదురుచూసే వాళ్లు చాలానే ఉంటారు. బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లకి మాత్రం ఫస్ట్ చాన్స్ ఈజీగా వచ్చేస్తుంది. కానీ వచ్చిన అవకాశం వినియోగించుకోకుంటే..వాళ్లను కూడా పట్టించుకోరు. వారసత్వంగా వచ్చి.. వెనక్కి వెళ్లిన నటులు చాలా మందే ఉన్నారు.
మరికొంతమందికి మాత్రం ఎన్ని ఫ్లాపులు వచ్చిన అవకాశాలు వస్తునే ఉంటాయి. వరుస సినిమాలు తీస్తూ కోట్ల ఆస్తులను కూడబెడుతుంటారు. అలాంటి వారిలో అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) ఒక్కరు. ఆయన సీనీ కెరీర్‌లో అత్యధిక ఫ్లాపులే ఉంటాయి. కానీ ఆస్తుల విషయంలో మాత్రం స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గలేదు. నేడు(ఫిబ్రవరి 5) అభిషేక్ బచ్చన్ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన ఆస్తులపై ఓ లుక్కేద్దాం.
విశాలవంతమైన విల్లాలు
అభిషేక్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 280 కోట్లకు పైగా ఉంటుందట. ఇందులో ఎక్కువగా సొంతంగా సంపాదించుకున్నదే అట. తండ్రి వారసత్వంగా వచ్చే ఆస్తులు కలిపిస్తే..ఇది ఇంకా ఎక్కువగానే ఉంటుంది. సినిమాలపై వస్తే డబ్బును ఎక్కువగా ముంబైలోని బాంద్రా ప్రాంతంలో పెట్టుబడిగా పెట్టాడట. అలాగే దుబాయ్‌లో ఓ విలాసవంతమైన విల్లా కొనుగోలు చేశాడు. అభిషేక్ దుబాయ్ వెళ్ళినప్పుడు ఇక్కడే ఉంటాడు. దీని ధర 16 కోట్ల రూపాయలు. ‘బాంద్రా-కుర్లా’ కాంప్లెక్స్, 5 BHK అపార్ట్‌మెంట్‌తో సహా అనేక ప్రదేశాలలో పెట్టుబడులు పెట్టారు. ఈ హీరోకి క్రీడలంటే ప్రత్యేక ఆసక్తి. అందుకే జైపూర్ పింక్ పార్టనర్స్ (ప్రో కబడ్డీ), చెన్నైయిన్ FC (ఫుట్‌బాల్) పెట్టుబడి పెట్టారు.
లగ్జరీ కార్లు
అభిషేక్ దగ్గర రోల్స్ రాయిస్ ఫాంటమ్, బెంట్లీ కాంటినెంటల్ జీటీ(3.29 కోట్లు), ఆడి ఏ8ఎల్, మెర్సిడెస్-బెంజ్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130X లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్‌పై కూడా భారీగా డబ్బు పెట్టాడల. ముంబైలో పలు చోట్ల ఓపెన్ ఫ్లాట్లు కూడా కొనుగోలు చేశారట. మొత్తంగా అభిషేక్ ఆస్తులు 280 కోట్లకు పైనే ఉంటుందట. అయితే భార్య ఐశ్వర్య రాయ్(Aishwarya Rai)తో పోలీస్తే మాత్రం అభిషేక్ ఆస్తులు విలువ చాలా తక్కువేనట. ఐశ్వర్య మొత్తం ఆస్తుల విలువ రూ.776 కోట్ల వరకు ఉంటుందట.
నటనకు ప్రశంసలు కానీ..
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్.. కెరీర్‌లో ఎక్కువగా ఫ్లాపులనే చవి చూశడు. ఆయన తొలి సినిమా రెఫ్యూజీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ సంపాదించుకుంది. అయితే నటన పరంగా మాత్రం అభిషేక్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత అభిషేక్ నటించిన 8 సినిమాలు వరుసగా ఫ్లాపులు అయ్యాయి. అయినా కూడా అభిషేక్‌ని చాన్స్‌లు వచ్చాయి. ధూమ్ సినిమాతో అభిషేక్‌కి తొలి బ్లాక్ బస్టర్ దక్కింది. బంటీ ఔర్ బబ్లీ మూవీతో సోలో హీరోగా హిట్ కొట్టాడు. ఆ తర్వాత మళ్లీ ఫ్యాపులు వచ్చాయి. ధూమ్ 3, హ్యాపీ న్యూ ఇయర్, ఐ వాంట్ టు టాక్ వంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఆయన గులాబ్ జామున్, డ్యాన్సింగ్ డాడ్‌తో పాటు ధూమ్ 4 చిత్రాల్లో నటిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment