అందాల ఐశ్వర్యం ఐశ్వర్య రాయ్ లుక్‌పై మరోసారి విమర్శలు చెలరేగాయి. తాజాగా దుబాయ్‌లో జరిగిన గ్లోబల్ ఉమెన్స్ ఫోరమ్‌లో ఐశ్వర్య ప్రసంగించింది. ఈ సందర్బంగా ఆమె ధరించిన రాయల్ బ్లూ గౌను ధరించింది. ఈ ఔట్‌ఫిట్‌లో ఎలిగెంట్ లుక్‌తో, ఆల్ టైం ఫేవరెట్ ఓపెన్ హెయిర్, ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నప్పటికీ, కొంతమంది అభిమానులు, నెటిజనులను మాత్రం తీవ్రంగా నిరాశపర్చింది.
గ్లోబల్ ఉమెన్స్ ఫోరమ్ ఈవెంట్‌లో పలువురు ప్రముఖ మహిళలతో కలిసి ఐశ్వర్య వేదికను పంచుకున్నారు. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన కోచర్ లెహంగా,నేవీ బ్లూ లాంగ్ ట్రైలింగ్ జాకెట్‌లో ఆమె మెరిసిపోయింది. అయితే ‘అదేమి స్టైల్...మాంత్రికుడి దుస్తుల్లా ఉన్నాయంటూ’ డిజైనర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందాల రాణిని రోజు రోజుకు మరింత ముసలిదానిలా తయారు చేస్తున్నారు అంటూ వాపోయారు. ప్రెగ్నెన్సీ అప్పటినుంచి ఆమె స్టైలింగ్‌లో చాలా మార్పు లొచ్చాయనీ, మరీ ఓల్డ్ లుక్ కనిపిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కొంపదీసి ఈ డ్రెస్‌ను జయాబచ్చన్ డిజైన్ చేసిందా అంటూ ఫన్నీగా కమెంట్ చేశారు.
మరోవైపు బాలీవుడ్ క్యూట్ కపుల్ ఐశ్వర్య, అభిషేక్ విడాకుల వ్యవహారం మీడియాలో తరచుగా కథనాలు వెలుడుతున్న నేపథ్యంలో ఈ ఈవెంట్లో స్క్రీన్ పైన ఐశ్వర్యరాయ్ పక్కన ఇంటిపేరు ‘బచ్చన్’ను తొలగించడం కూడా చర్చకు దారి తీసింది. ‘బచ్చన్’ పేరు లేదు అంటే విడాకులు ఖాయమేనా? లేక పొరబాటున జరిగిందా అనే సందేహంలో అభిమానులు పడిపోయారు.
మరికొందరు నెటిజన్లు ఐశ్వర్య చాలా అందంగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. మహిళల సాధికారతపై ఆమె చేసిన ప్రసంగానికి ఫిదా అయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో ఐశ్వర్యరాయ్ ఒక యువ అభిమానితో పోజులివ్వడం విశేషంగా నిలిచింది. కాగా ఈ ఏడాది సెప్టెంబరులో జిగిన ఫ్యాషన్ వీక్‌లో రెడ్ గౌనుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు స్టైలింగ్‌లోని లోపాలపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment