ముంబయి: బక్రీద్ పండగ వేళ మేకలను అపార్ట్‌మెంట్‌కు తీసుకురావడంపై నిర్వాసితులు నిరసన చేపట్టారు. ముంబయిలోని భయందర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మేకలను అపార్ట్‌మెంట్‌కు తీసుకురాకూడదని స్థానికులు ఆందోళన నిర్వహించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు.
బక్రీద్ పండగ వేళ ఎవరూ మేకలను అపార్ట్‌మెంట్‌కు తీసుకురాకూడదని రెసిడెన్షియల్ సొసైటీ నిర్ణయించింది. దీంతో బిల్డర్ కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అందరికీ విన్నవించారు. కానీ అపార్ట్‌మెంట్‌లో ఓ వ్యక్తి మేకను ఇంటికి తీసుకువచ్చాడు. దీంతో అపార్ట్‌మెంట్ వాసులు ఆందోళన నిర్వహించారు. మేకలను ఇంట్లోకి తీసుకురావద్దు.. అపార్ట్‌మెంట్‌లో మేకలను వధించవద్దని నినాదాలు చేపట్టారు.
Uproar over goats in Mumbai Housing Society.
— IndiaToday (@IndiaToday) June 28, 2023
(@pankajcreates)#Mumbai #News #ITVideo #FirstUp pic.twitter.com/ScHHzMsRIz
దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. బక్రీద్ పండగకు ఒక రోజు ముందు మేకలను ఇంట్లో ఉంచుకుంటారని.. అపార్ట్‌మెంట్‌లో వధించబోరని పోలీసులు తెలిపారు. చివరికి మేకలను అపార్ట్‌మెంట్‌లో నుంచి బయటకు పంపడంతో అంతా సద్దుమణిగింది.
ఇదీ చదవండి: వేలాది పక్షుల మృతి.. పురుగు మందులే కారణం?
Comments
Please login to add a commentAdd a comment